పెద్దమ్మ కాలనీ సమస్యలను పరిష్కరించాలి…

పెద్దమ్మ కాలనీ సమస్యలను పరిష్కరించాలి :

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మండల కార్యదర్శి డి.జి.నరేందర్ ప్రసాద్ * శామీర్ పేట్ పెద్దమ్మ కాలనిలో సిపిఐ నాయకుల పర్యటన మేడ్చల్

జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

పెద్దమ్మ కాలనీలో ప్రజా సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మండల కార్యదర్శి డి.జి.నరేందర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా శామీర్ పేట్ మండలంలోని పెద్దమ్మ కాలనీలో బుధవారం సిపిఐ నేతలు ప్రజా సమస్యలపై పర్యటించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు అయినటువంటి మంచినీటి సరఫరా, వీధి దీపాలు, భూగర్భ మురికి నీటి పారుదల సౌకర్యం, బస్తీలోని రోడ్లు నిర్వహణ సక్రమంగా లేకపోవడం, నిత్యవసర వాడకానికి బోరు మోటరు మరమ్మత్తులు, ఇంటి నంబర్ల గుర్తింపు లేకపోవడం, చిన్నపిల్లలకు అంగన్వాడి కేంద్రంలోని నిర్వహణ కుగాను ప్రభుత్వ భవనం లేకపోవడం, ప్రభుత్వ వైద్యం సౌకర్యం మొదలగు సమస్యల పైన పెద్దమ్మ కాలనీవాసులు తీవ్ర ఆవేదన, అసంతృప్తి, దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. గత 25 సంవత్సరాలుగా కాలనీ ఏర్పడిన నాటి నుండి ఇంకా కూడా కనీస సౌకర్యాలు లేవని సర్పంచులను, వార్డు మెంబర్లను, స్థానిక ఎమ్మెల్యేను కూడా విన్నవించుకున్నామని, అయినా సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే లాగా ఉందన్నారు. ఎండాకాలం ఆరంభం అవుతున్న మార్చిలో త్రాగునీటి సమస్య, వాడుకోవడానికి బస్తీ నల్ల ద్వారా మూడు రోజులకు ఒకసారి కేవలం 50 లీటర్లు, 15 నిమిషాలు మాత్రమే వస్తున్నాయని, ఇంటింటికి నల్ల కనెక్షన్ ను ఇచ్చి, సమస్య ను గుర్తించి తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కీసర డిప్యూటీ కమిషనర్ వసంత రెడ్డి జిహెచ్ఎంసి 300వ వార్డు, శామీర్ పేట్ డివిజన్లోని, పెద్దమ్మ కాలనీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విన్నపాన్ని తెలియజేస్తామని సమస్య పరిష్కరించే వరకు పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దమ్మ కాలనీ పార్టీ నాయకురాలు మనమ్మ, జీవన్ ప్రధాన్, స్థానికులు జక్క్యాభి, సమీనా, కొప్పు స్వాతి, తూర్పాటి అంజమ్మ, పర్ధం మంగ, తూర్పాటి జ్యోతి, స్థానిక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఉపసర్పంచ్ ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు

ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఉపసర్పంచ్.

చిట్యాల, నేటిదాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని చిట్యాల గ్రామ పంచాయతీ వెంకట్రావుపల్లి (c) ప్రాదమిక పాఠశాలలో సర్పంచి తౌటం లక్ష్మి ఆదేశానుసారం పాఠశాలను తనిఖీ చేసిన ఉపసర్పంచి బుర్ర వెంకటేష్ గౌడ్ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు మౌలిక సదుపాయాల గూర్చి అడిగి తెలుసుకోవడం జరిగింది కార్యక్రమంలో వార్డు సభ్యులు జెట్టి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇండిపెండెంట్ సర్పంచ్ వార్డ్ అభ్యర్థి గా చుక్క శిరీష..

ఇండిపెండెంట్ సర్పంచ్ వార్డ్ అభ్యర్థి గా చుక్క శిరీష

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని కౌకొండ గ్రామంలో సర్పంచ్ 2 వ వార్డు మెంబర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా చుక్క శిరీష పోటీ చేస్తున్నారు. వార్డు అభివృద్ధి,ప్రజల సమస్యల పరిష్కారం, పారదర్శక సేవలే తన ప్రధాన లక్ష్యాలు అని ఆమె తెలిపారు.వార్డు ప్రజలకు మాటలతో కాక, పనులతో నిలబడే నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. చుక్క శిరీష మాట్లాడుతూ కౌకొండ వార్డులో ఇంకా పరిష్కారంకాని అనేక సమస్యలు ఉన్నాయి.బస్సు సర్వీస్,తాగునీరు,రోడ్లు, శుభ్రత,స్ట్రీట్‌లైట్లు,డ్రైనేజ్ వంటి ప్రాథమిక సదుపాయాల మెరుగుదలకు నేను ముందుండి పోరాడతా. ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే, మీలో ప్రతి ఒక్కరి ఇంటి సమస్యను నా ఇంటి సమస్యగా భావించి పని చేస్తా అని అన్నారు.పార్టీల వాగ్దానాలు కాక,ప్రజల మధ్యే ఉండి వారి మాట విని పనిచేయడం తన ధ్యేయమని శిరీష పేర్కొన్నారు.స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డా నా గ్రామ ప్రజలే నాబలం మీ నమ్మకం మీ ఆశీర్వాదమే నా విజయం.అభివృద్ధి కోసం ఒక సారి అవకాశం ఇవ్వండి సేవలో వెనుకాడను అని గ్రామ వార్డు ప్రజలను ఉద్దేశించి చుక్క శిరీష స్పష్టం చేశారు.

*సదరం’ పరీక్షల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించండి..

*’సదరం’ పరీక్షల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించండి..

*కమిషనర్ ఎన్. మౌర్య..

తిరుపతి(నేటి ధాత్రి)అక్టోబర్
09:

 

సదరం ధ్రువ పత్రాల కొరకు నిర్వహించే పరీక్షలను పారదర్శకంగా ప్రభుత్వ నిబంధలను పాటిస్తూ నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య వైద్యులకు సూచించారు. వికలత్వం యొక్క శాతాన్ని నిర్దారిస్తూ రుయాసుపత్రి లో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను గురువారం ఉదయం కమిషనర్ తనిఖీ చేశారు. ఏ విధంగా పరీక్షలు చేస్తారు, రోజూ ఎంతమందికి పరీక్షలు నిర్వహిస్తున్నారనే విషయాలను రుయా వైద్యులు కమీషనరకు వివరించారు. చెవి, ముక్కు, ఎముకలు, మానసిక రోగులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ వైద్యులు అందించే సదరం ధ్రువ పత్రాల మేరకు వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇందులో ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు పారదర్శకంగా పరీక్షలు చేయాలాని వైద్యులకు సూచించారు. పరీక్షల కొరకు వచ్ఛే వారికి తాగునీరు, నీడ తదితర మౌళిక వసతులు కల్పించాలని తెలిపారు. రోజుకి వందమందికి పరీక్షలు చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రాధ, ఆర్ ఎం ఓ డాక్టర్ హరికృష్ణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, పలువురు వైద్యులు ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version