ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
వీణవంక, ( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :
వీణవంక మండల కేంద్రంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా ప్రభుత్వ కార్యాలయంలో జరుపుకున్నారు అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేశారు తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ అంబాటి రజిత జాతీయ జెండా ఆవిష్కరించారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై ఆవుల తిరుపతి మూడు రంగుల జెండాను ఆవిష్కరించారు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీధర్ జెండా ఆవిష్కరించారు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నవాబ్ తాసిల్దార్ నిజాముద్దీన్, అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.