మద్యం టెండర్లలో గౌడులకు 25% వాటా కావాలి..

మద్యంటెండర్లో గౌడులకు 25 శాతం వాటా ఇవ్వాలి

మోకుదెబ్బ రమేష్ గౌడ్ డిమాండ్..

నర్సంపేట,నేటిధాత్రి:

కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మద్యం టెండర్లలో గౌడ కులస్తులకు 25 శాతం వాటా ఇవ్వాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ డిమాండ్ చేశారు.పట్టణంలో బుదవారం మోకుదెబ్బ జిల్లా కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం గౌడ కులస్తులకు మద్యం దుఖాణాలలో 15 శాతం మాత్రమే కెటాయించడం జరిగిందన్నారు. కామారెడ్డిలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మేనిపెస్టోలో గౌడ కులస్తులకు మద్యం దుఃఖణాల కేటాయింపులో 25 శాతం ఇస్తామని వాగ్దానం చేసిందన్నారు.
కామారెడ్డి డిక్లరేషన్ లో గౌడ్స్ కు ఇచ్చిన హామీని ప్రకారంగా 25 శాతం వాటా డిక్లరేషన్ విస్మరించడం సరికాదన్నారు.మధ్యం టెండర్లలో 3 లక్షలు కాకుండా 2 లక్షలకు కుదించాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని రమేష్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. రెండేళ్లుగా తాటిచెట్ల పైనుంచి పడి చనిపోయిన, గాయపడిన 7 వందల మంది గీత కార్మికులకు పెండింగ్ లో 7 కోట్ల రూపాయల ఎక్స్ గ్రేషియా వెంటనే చెల్లించాలని తెలిపారు. జనగామ జిల్లా కు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని, 50 యేండ్లు నిండిన ప్రతి గీత కార్మికుడికి ఫెక్షన్ మంజూరు చేయాలని రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు.

మోకుదెబ్బ జిల్లా ప్రచార కార్యదర్శి గా శ్యామ్ సుందర్ గౌడ్

దుగ్గొండి మండలం లక్ష్మిపురం గ్రామానికి చెందిన బొమ్మగాని శ్యామ్ సుందర్ గౌడ్ ను మోకుదెబ్బ హన్మకొండ జిల్లా ప్రచార కార్యదర్శిగా నియమించినట్లు మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ తెలిపారు. గత రెండేళ్లుగా శ్యామ్ కుమార్ గౌడ్ గౌడ కులస్తులకు చేస్తున్న సేవలను గుర్తించి ఈ పదవిలో నియమించినట్లు రమేష్ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర కార్యదర్శి మద్దెల సాంబయ్య గౌడ్, హన్మకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు తోటకూరి రాందాస్ గౌడ్, గోపగాని వెంకట్ గౌడ్, జిల్లా సలహాదారులు రామగోని సుధాకర్ గౌడ్,జిల్లా కార్యదర్శి బోడిగే మల్లేశంగౌడ్,మేరుగు మల్లేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version