గౌడ వృత్తి దిన దిన గండం ఆగని చావులు
తాండూరు( మంచిర్యాల) నేటి ధాత్రి :
గౌడ కులస్తుల జీవనం రోజు రోజుకు మరి అధ్వనంగా మారుతుంది.ప్రభుత్వం గీతా కార్మికులకు ఇస్తామన్న కాటమయ్య కిట్లు అందక పోవడం వల్ల తరచూ గీత కార్మికులు ప్రమాదల బారిన పడుతున్నమన్నారు.శనివారం ఉదయం బెల్లంపల్లి మండలం లోని మాలా గురుజాల లో పోతుగంటి శంకర్ గౌడ్ అనే గీతా కార్మికుడు ఉదయం చెట్టు ఎక్కి కళ్ళు కిందకి దింపే క్రమంలో కాలుజారి బురదలో పడి మృతి చెందినట్లు తోటి గీతా కార్మికులు తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన గీత కార్మికులకు వెంటనే కాటమయ్య కిట్లు పంపిణీ చేయాలని,చనిపోయిన శంకర్ గౌడ్ కుటుంబానికి 10లక్షల రూపాయల ఎక్స్ క్రేషియా ఇవ్వాలని మోకు దెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి భూసరపు మొండిగౌడ్ డిమాండ్ చేస్తున్నారు.ఈకార్యక్రమంలోమోకు దెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి భూసారపు మొండి గౌడ్,రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి శంకర్ గౌడ్,జిల్లా అధికార ప్రతినిధి పెరు మండ్ల భాస్కర్ గౌడ్,జిల్లా కార్యదర్శి గాజుల రమేష్ గౌడ్,యువ నాయకులు తాళ్లపల్లి సృజన్ గౌడ్ పాల్గొన్నారు.