నూతన సర్పంచిని సన్మానించిన జిల్లా అధ్యక్షుడు.

నూతన సర్పంచిని సన్మానించిన జిల్లా అధ్యక్షుడు

మెర సంఘం జిల్లా అధ్యక్షుడు మామిడి శెట్టి రవీందర్

గణపురం, నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రంలో నూతన సర్పంచి కట్కూరి రాధిక శ్రీనివాస్ ఉప సర్పంచ్ ఓరుగంటి కృష్ణ వార్డ్ మెంబర్ అనిల్ ఎన్నికైన సందర్భంగా గణపురం మండల అధ్యక్షుడు వ్యవసాయ శాఖ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ గణపురం మాజీ మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండి చోటే మియా సర్పంచులకు దూడపాక శోభాశంకర్ నారగాని దేవేందర్ గౌడ్ వడ్లకొండ నారాయణ గౌడ్ వీరికి మేర సంఘం జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి రవీందర్ శాలువలు కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు గణపురం సర్పంచి కట్కూరి రాధిక శ్రీనివాస్ మాట్లాడుతూ మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించినందుకు ధన్యవాదములు తెలియజేశారు వీరితో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాయకపు రఘుపతి పోశాల మహేష్ గౌడ్ జానీ ముస్లిం సోదరులు పాల్గొన్నారు

నూతన సర్పంచి కట్కూరి రాధిక శ్రీనివాస్ సన్మానం..

నూతన సర్పంచి కట్కూరి రాధిక శ్రీనివాస్ సన్మానం

మాజీ సర్పంచ్ దూడపాక శోభ శంకర్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో ఎర్రమ్మ గడ్డ కాలనీలో నూతనంగా సర్పంచి కటుకూరి రాధిక శ్రీనివాసుల ను ఘనంగా సన్మానించిన మాజీ సర్పంచి దూడపాక శోభ శంకర్ మహిళా సంఘం గ్రూపు గెలుపొందిన సర్పంచ్ కి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు సర్పంచ్ మాట్లాడుతూ సర్పంచ్ గా మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించినందుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు

జి విగ్నేష్ కు అండగా నిలిచిన ఉపాధ్యాయులు, విద్యార్థులు..

జి విగ్నేష్ కు అండగా నిలిచిన ఉపాధ్యాయులు, విద్యార్థులు

రూ.11,116 వేల ఆర్థిక సాయం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రానికి చెందిన ఇంటర్ సెకండియర్ బైపిసి విద్యార్థి గుర్రం విగ్నేష్ గత నెలలో పీఎం శ్రీ మోడల్ పాఠశాల ప్రాంగణంలో జరిగిన క్రీడల్లో గాయపడగా అతనికి పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు అండగా నిలిచారు. మంగళవారం విద్యార్థి ఇంటికి వెళ్లి రూ.11,116 వేల ఆర్థిక సాయం అందజేశారు. విద్యార్థికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పి.ఎం శ్రీ మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ తిరుపతి,
టి.రజిత
డాక్టర్ కె శ్రీ సుధ
ఎస్ శంకర్
సిహెచ్ మహేష్
.బి.రమేష్
ఎండి మసూద్ పాషా పి ఈ టి మమత జి వేణు
విద్యార్థులు
హెడ్ బాయ్ జస్వంత్
హెడ్ గర్ల్ సింధూజ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.

“అబాకస్ స్టేట్‌కు ఎంపికైన కృతిక శ్రీ”

అబాకస్ స్టేట్ లెవెల్ కు ఎంజీఎం హైస్కూల్ విద్యార్థిని ఎంపిక

భూపాలపల్లి నేటిధాత్రి

 

గణపురం (ము). ప్రఖ్యాత ఎన్జీవో సంస్థ విశ్వం ఎడ్యుటెక్ అబాకస్ అండ్ వేదిక్ మాథ్స్ వారు అంకగణిత సమస్యలను క్యాలిక్యులేటర్, కంప్యూటర్ వంటి పరికరాలు లేకుండా అవలీలగా సాధించడానికి అబాకస్ అనే పూసల చట్రం ద్వారా విద్యార్థులకు నిత్యజీవితంలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చూపించడానికి ప్రతి ఏటా మండల, జోనల్, రాష్ట్రస్థాయిలో అబాకస్ పోటీలు నిర్వహిస్తారు. అందులో భాగంగా ఆదివారం పరకాల సి,హెచ్,స్ గ్రౌండ్ యందు జరిగిన జోనల్ లెవెల్ అబాకస్ కాంపిటీషన్లో ఎంజీఎం హైస్కూల్ విద్యార్థిని పి.క్రుతిక శ్రీ (ఐదవ తరగతి) పాల్గొని మొదటి బహుమతి సాధించి స్టేట్ లెవెల్ కు ఎంపికయ్యారు,ఈ సందర్భంగా కరస్పాండెంట్ గ్యాదంగి సతీష్ పాఠశాల డైరెక్టర్లు గ్యాదంగి తిరుపతి, గ్యాదంగి రమాదేవి, సిలువేరు శ్రీనివాస్,ప్రిన్సిపల్ మధుకర్ తో పాటు మిగతా ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు

కార్తీక దీపోత్సవానికి నూనె వితరణ…

కార్తీక దీపోత్సవానికి నూనె వితరణ

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో నవంబర్ 5న కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో నిర్వహించే కార్తీక దీపోత్సవానికి గణపురం మండల కేంద్రానికి చెందిన రౌతు కిషోర్ స్వర్ణలత దంపతులు నూనె క్యాన్లను అందజేశారు. వారి కుటుంబ సభ్యులకు శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వేడుకుంటున్నాం

కోట గుళ్ళు గోశాల గోమాతలకు దాన బస్తాల వితరణ…

కోట గుళ్ళు గోశాల గోమాతలకు దాన బస్తాల వితరణ

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ గోశాల గోమాతలకు గణపురం మండల కేంద్రానికి చెందిన సూర్యదేవర స్రవంతి, కార్తీక్ దంపతుల కుమారుడు ఆరవ్ సాయి జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం దాన బస్తాలను అందజేశారు. జన్మదిన సందర్భంగా వారు స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు. గోశాల గోమాతలకు దాన బస్తాలను అందజేసిన కార్తీక్ స్రవంతి దంపతులకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఆరవ్ సాయి కి కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది.

విద్యార్థిని విద్యార్థులకు ఓపెన్ హౌస్ ఎస్ ఐ రేఖ అశోక్…

విద్యార్థిని విద్యార్థులకు ఓపెన్ హౌస్ ఎస్ ఐ రేఖ అశోక్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం ఎస్ఐ రేఖ అశోక్ విద్యార్థులతో పోలీస్ స్టేషన్ నందు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించడం అయినది ఇందులో ప్రధానంగా పిటిషన్ మేనేజ్మెంట్ గురించి ఎఫ్ ఆర్ రిజిస్ట్రేషన్ గురించి డైల్ 100 గురించి, డ్రగ్స్ నిర్మూలన గురించి సైబర్ క్రైమ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం అయినది అదేవిధంగా పోలీస్ స్టేషన్ నందు ఉన్న సెట్ ఏ విధంగా పనిచేస్తుందో అనేది వారికి ప్రాక్టికల్ గా చూపించడమైనది

సింగరేణి ఆఫీసర్స్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అజంతా యూత్…

సింగరేణి ఆఫీసర్స్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అజంతా యూత్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం బస్వరాజుపల్లి గ్రామం అజంతా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి మేనేజర్, ప్రాజెక్టు ఆఫీసర్ నీ మర్యాద పూర్వకంగా కలిసి గ్రామంలో ఉన్న సమ్యసల గురించి మాట్లాడుతూ ఎల్లవేళలా గ్రామ అభివృద్ధిలో సింగరేణి యాజమాన్యం కలిసి గ్రామాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా తోడ్పడాలి అని అజంతా యూత్ అధ్యక్షుడు మిట్టపెల్లి అరవింద్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో యూత్ వైస్ ప్రెసిడెంట్ కుక్కమూడి చిన్న కుమార్, ప్రధాన కార్యదర్శి మట్టెవాడ హరీష్, కోశాధికారి కుక్కమూడి నవీన్, కార్యదర్శి మిట్టపెల్లి అశోక్, నవీన్,నరేష్, తిరుపతి, యూత్ సభ్యులు పాల్గొన్నారు.

ఇసుక లారీ లోడింగ్ దగ్గర అదనంగా డబ్బులు వసూలు…

ఇసుక లారీ లోడింగ్ దగ్గర అదనంగా డబ్బులు వసూలు

బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు ఊరా నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురం భారతీయ జనాతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి జిల్లా అధ్యక్షులు ఏడునుతుల నిశిదర్ రెడ్డి ఆదేశానుసరం జయశంకర్ జిల్లా లోని ఇసుక క్వారీ ల వద్ద ఇసుక లోడింగ్ కీ వెళ్లిన లారీలా దగ్గర అదనముగా డబ్బులు వసూలు చేస్తున్నారు టి ఎం ఎస్ డిసి వారు 14 టైర్ల లారీ కీ 32 టన్నులకు డబ్బులు తీసుకోని లోడింగ్ దగ్గర మాత్రం 30 టన్నులు మాత్రమే ఇసుక నింపుతున్నారు దీని వలన నేరుగా వినియోగ దారుని మీద సుమారుగా ఒక్క లారీ కీ పది వేళ రూపాయలు అధిక భారం పడుతుంది అలాగే గత ప్రభుత్వం జయశంకర్ జిల్లా ను స్థానిక జిల్లాగా గుర్తించి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో స్పెషల్ అలాట్మెంట్ చేసేది కానీ ఇప్పటి ప్రభుత్వం స్థానికతను తుంగలో తొక్కి స్థానిక వినియోగదారుల మీద స్థానిక లారీ ఓనర్ల మీద ఉక్కు పాదం మోపుతుంది కావున పై అంశాలపై టీజీఎండిసి ఎండీ తో చర్చించి వినియోగదారులపై అధిక భారం పడకుండా చర్యలు తీసుకోవాలి అని స్థానిక జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వినతిపత్రం మీద సానుకూలంగా స్పందించిన కలెక్టర్ తక్షణమే చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ని ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమం లో జిల్లా కోశాధికారి ఎర్రబెల్ల

దేవాలయంలో విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం…

దేవాలయంలో విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలంలో వచ్చేనెల నవంబర్ తేదీలో 13 14 15 16 జరగనున్న ప్రతిష్టాపన మహోత్సవం ప్రఖ్యాతిగాంచిన కాకతీయుల కాలం నాటి శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయంలో రాబోయే కార్తీక మాసంలో జరగనున్న గణపతి శివలింగ నవగ్రహ అష్ట బలిపీఠ ప్రతిష్టాపన కొరకు తమ వంతుగా గణపురం మండల కేంద్రానికి చెందిన మాదాసు సురేష్ దంపతులు 5000 రూ ఆలయ కమిటీ చైర్మన్ తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ కి రూ నగదుగా ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు ఇవ్వడం జరిగింది ఆలయ కమిటీ సభ్యులు బండారు శంకర్ మూలా శ్రీనివాస్ గౌడ్ భటిక స్వామి బూర రాజగోపాల్ గౌడ్ మాదాసు మొగిలి గౌడ్ మాదాసు అర్జున గౌడు ఉయ్యాల బిక్షపతి గౌడ్ దయ్యాలభద్రయ్య పాండవుల భద్రయ్య మోటపోతుల రాజన్న గౌడ్ గోరంటల రాజన్న గుప్త పాల్గొన్నారు

రాజన్నల కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సిరికొండ జన్మదిన వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-13T142325.297.wav?_=1

 

రాజన్నల కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సిరికొండ జన్మదిన వేడుకలు

భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ,శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామంలో రాజన్నల కుల సంఘం మేకల మండి వద్ద వర్షంలో సైతం కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్ భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా,స్పీకర్ గా భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లారని,రానున్న రోజుల్లో మళ్ళీ భూపాలపల్లి ఎమ్మెల్యేగా సిరికొండ మధుసూదనా చారిని గెలిపించుకుంటామని రాజన్నల కులస్తులు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలిపారు.ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి పల్లె గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లారెడ్డి,మొగిలి శీను,రాయగట్టయ్య,కొమురయ్య,రాజయ్య,మల్లయ్య,అంజయ్య,జన్నే సుమన్,ఎడ్ల విద్వత్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరణించిన కుటుంబాలను పరామర్శించిన ఊర నవీన్

మరణించిన కుటుంబాలను పరామర్శించిన ఊర నవీన్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల బీజేపీ అధ్యక్షులు ఊర నవీన్ రావు ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో వివిధ కారణాలతో మరణించినటువంటి కుటుంబాలు కొండాపూర్ గ్రామం లో మామిడి మల్లయ్య నగరంపల్లి గ్రామంలో మేకల శైలేందర్ పెద్ది సునీత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం చేస్తూ కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎన్ ఎఫ్ బి స్కీమ్ కు అప్లికేషన్ పెట్టుకొని ఆ కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం పొందాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు డాకూరి కృష్ణారెడ్డి బూత్ అధ్యక్షులు భూక్య హరిలాల్ మండల సీనియర్ నాయకులు గొర్రె రవి మామిడాల మల్లన్న ఇనుగాల మొగిలి తదితరులు పాల్గొన్నారు

ప్రతిష్టాపన చేయనున్న దేవత మూర్తుల విగ్రహాలను ఆలయం వద్దకు చేర్చిన ఆలయ కమిటీ…

ప్రతిష్టాపన చేయనున్న దేవత మూర్తుల విగ్రహాలను ఆలయం వద్దకు చేర్చిన ఆలయ కమిటీ

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన కాకతీయుల కాలం నాటి శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా రామాలయంలో కార్తీక మాసంలో నిర్వహించనున్న గణపతి శివలింగ నవగ్రహ అష్ట బలిపీఠ ప్రతిష్టాపన మహోత్సవం లో భాగంగా శుక్రవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టాపన చేయనున్న దేవత మూర్తుల విగ్రహాలను ఆలయంలోకి చేర్చడం జరిగింది అదేవిధంగా ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ కార్తీక మాసంలో నిర్వహించను న్న ప్రతిష్టాపన మహోత్సవానికి సంబంధించిన దేవతా మూర్తుల విగ్రహాలను ఆలయ వద్దకు చేర్చడం జరిగింది ఆలయంలో ప్రతిష్టాపన చేయనున్న శివలింగాన్ని ఎంతో ప్రసిద్ధిగాంచిన కాశి క్షేత్రం నందు నర్మద నదిలోతయారైన శివలింగాన్ని ఆలయం వద్దకు చేర్చడం జరిగింది అదేవిధంగా ప్రతిష్టాపన కార్యక్రమం ఎంతో వైభవోపేతంగా నిర్వహించబోనున్నట్లు తెలిపారు ప్రతిష్టాపనలో భాగంగా గ్రామంలోని ప్రజలందరూ కూడా వారి ఆడబిడ్డలను పిలుచుకొని వారికి చేరాసారతో ఒక పండగలాగా జరుపుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండారి శంకర్ మూల శ్రీనివాస్ గౌడ్ బటిక స్వామి మాదాసు అర్జున్ పాండవుల భద్రయ్య దైవాల భద్రయ్య బూర రాజగోపాల్ ఉయ్యాల బిక్షపతి రామస్వామి గోరంట్ల రాజయ్య మోటపోతుల రాజన్న గౌడ్ తదితర భక్తులు పాల్గొన్నారు

ప్రొఫెసర్ నవీన్ కుమార్ జన్మదినం సందర్భంగా స్టడీ మెటీరియల్ పంపిణీ…

ప్రొఫెసర్ నవీన్ కుమార్ జన్మదినం సందర్భంగా స్టడీ మెటీరియల్ పంపిణీ

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ పోషకులు, గోశాల నిర్మాణ, నిర్వహణ దాతలు జగిత్యాల వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ జన్మదినం సందర్భంగా ఆల్ ఇన్ వన్, మోడల్ పేపర్లను పదవ తరగతి విద్యార్థినిలకు శుక్రవారం అందజేశారు. మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిలకు పరిరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షులు మామిండ్ల మల్లికార్జున్ గౌడ్, బాలికలవసతి గృహం మేట్రిన్ జి మాధవి చేతుల మీదుగా రూ.5 వేల విలువైన స్టడీ మెటీరియల్ ను అందజేశారు. గత 20 సంవత్సరాలుగా ఆలయ అభివృద్ధిలో తన వంతు సహాయ సహకారాలు అందజేస్తున్న ప్రొఫెసర్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ జన్మదిన వేడుకలు విద్యార్థి నిల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పరిరక్షణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కెటిపిపి విద్యుత్ ఉద్యోగ సంఘాల నిరసన

కెటిపిపి విద్యుత్ ఉద్యోగ సంఘాల నిరసన

గణపురం నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పై దాడికి యత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కెటిపిపి ప్రధాన ముఖద్వారం అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ఎస్సీ & ఎస్టీ విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ఈ దాడి దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో చీకటి రోజని, భారత రాజ్యాంగం, ప్రజాస్వా మ్యంపై జరిగిన దాడిగానే భావిస్తున్నామని దాడికి పాల్పడిన వారికీ తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు సనతన దర్మం పిచ్చి ఎంత ముదిరింది అంటె దళితుడు ఐన సుప్రీంకోర్టులో సిజేఐ గవాయ్‌పై బూటు విసిరె స్థాయికి చేరింది.ఈ చర్యను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లు అందరు తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్పీ & ఎస్టీ జెఎసి నాయకులు తదితరులు పాల్గొన్నారు

దళిత బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన కేసీఆర్

దళిత బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన కేసీఆర్

గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్

గణపురం నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

గణపురం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని డోకా మాటలు చెప్పింది కేసీఆర్
తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి డోకా చేసింది కేసీఆర్
దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని డోకా చేసింది టిఆర్ఎస్ పార్టీ
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తానని డోకా చేసింది టిఆర్ఎస్ పార్టీ
తెలంగాణలో ఒక్క డీఎస్సీ వేయకుండా నిరుద్యోగులను డోఖ చేశారు
10సంవత్సరాల నుండి రేషన్ కార్డు లేకుండా డోకా చేసింది కెసిఆర్
తెలంగాణ ఇస్తే ఇలాంటి అధికార అనుభవించకుండా చేసింది రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటా అని చెప్పి డోకా చేసింది కేసీఆర్
మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల చేసిన ఘనత మీది కెసిఆర్ అమరుల కుటుంబాలను ఉద్యమ కళాకారులను డోకా చేసింది మీరు
మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసింది మీరు
బీసీ రిజర్వేషన్లను 34% నుండి 23% దానికి పడగొట్టింది మీరు ధరణి పేరుతో రైతులను ఇబ్బంది పెట్టి భూములను ఆక్రమణకు గురి చేశారు
యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని డోకా చేసిన మీరు కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదని, రాబోయే స్థానిక ఎలక్షన్లలో ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా రేపాక రాజేందర్ మాట్లాడారు
ఈ కార్యక్రమంలో గణపురం మండలంలోని కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు

కోట గుళ్ళ లో ప్రొఫెసర్ దంపతుల పూజలు…

కోట గుళ్ళ లో ప్రొఫెసర్ దంపతుల పూజలు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో బుధవారం జగిత్యాల వైద్య కళాశాల ప్రొఫెసర్ కోడూరు నవీన్ కుమార్ సుమతి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో దుర్గ దేవి శరన్నవరాత్రోత్సవాలు…

శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో దుర్గ దేవి శరన్నవరాత్రోత్సవాలు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలోని ధర్మారావుపేట శివాలయం వేదికగా శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో అశ్విజ మాసం శుక్లపక్షం బహుళ పాడ్యమి సోమవారం రోజునా దుర్గమతాను ప్రతిష్టించి పూజ కార్యక్రమాలకు అంకురార్పణ జరిగింది అని సేవ సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు. నవ దుర్గ వైభవంలొ భాగంగా మొదటి రోజు లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చిందని పూజ కార్యక్రమంలొ గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొనగా అర్చకులు లంక కిషన్ శర్మ వచ్చిన భక్తులకు సంకల్పం చెప్పి తీర్థ ప్రసాదాలు ఇచ్చి అమ్మవారి తరుపున ఆశీర్వాదం ఇచ్చారు. ఈ కార్యక్రమంలొ సేవ సమితి సభ్యులు ఆకుల రవీందర్ వాలా నర్సింగరావు దూలం శంకర్ బెనికి రాజు సింగం రాజవిరు పూజారి కుమారస్వామి పనికెల శివకృష్ణ రత్నం మొగిలి పాలకుర్తి సాంబయ్య ఎల్లంకి రమేష్ గందే ప్రకాష్ తదితరులు పాల్గొన్నారని తెలిపారు.

అందరికీ బతుకమ్మ పండుగ అయితే రైతులకు యూరియా బస్తాల పండుగ…

అందరికీ బతుకమ్మ పండుగ అయితే రైతులకు యూరియా బస్తాల పండుగ

బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మోతే కర్ణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం రాష్ట్రం మొత్తంలో ఆడబిడ్డల పండుగ బతుకమ్మ రంగుల హరివిల్లులా మెరవగా రైతు ఇంట్లో మాత్రం నిశ్శబ్దం మబ్బులా అలుముకుని ఉందని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి తీవ్ర వేదన వ్యక్తం చేశారు.
గత పది సంవత్సరాల పాలనలో రైతు ఒక్కసారైనా యూరియా కోసం సొసైటీల ఎదుట క్యూలో నిలబడలేదని గర్వంగా చెప్పుకున్న రోజులు ఇవేనా? ఇక ఇప్పుడు పరిస్థితి చూస్తే రాత్రి ఒకటి మూడు గంటలకు రైతు కడుపు మంటలు ఆపుకోలేని స్థితిలో ఎరువుల బస్తా కోసం కాచుకొని కూర్చోవాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది అని ఆయన ప్రశ్నించారు.
రైతు చెమటతో పాలు పిండే గడ్డిపండు వంటి భూమి ఎరువుల కోసం తహతహలాడుతున్న ఈ దృశ్యం చూసి పల్లెల గుండెల్లో రక్తం ఉడికిపోతోంది. ఇంకో రెండు మూడు నెలల్లో కోతకు వచ్చే పంట యూరియా లేక వాడిపోతుందేమోనన్న భయం రైతు కళ్లలో నిద్రను దోచేస్తోంది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక బతుకమ్మ పూలు వర్ణరంజితంగా విరబూస్తున్నా రైతు హృదయంలో మాత్రం కన్నీటి బిందువులే తొణుకుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ పాటల్లో ఆనందం వినిపిస్తోంది కానీ రైతు ఊపిరిలో మాత్రం ఒకటే అనాధ విలపన యూరియా యూరియా అని కరుణాకర్ రెడ్డి హృదయ పూర్వకంగా వ్యాఖ్యానించారు

రాజేందర్ కు ఉత్తమ మండల అధ్యక్షుడిగా సన్మానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-22T130032.005.wav?_=2

 

రాజేందర్ కు ఉత్తమ మండల అధ్యక్షుడిగా సన్మానం

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం 49వ వార్షికోత్సవం ఉమ్మడి వరంగల్ జిల్లా
తేదీ 21/09/2025 రోజున ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ మాంకాల యాదగిరి అధ్యక్షతన ముఖ్యఅతిథిగా డాక్టర్ మధు పాక ఎల్లయ్య రాగా ప్రపంచ మేధావి భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి జై భీమ్ నినాదాలతో నీలిరంగు జెండాను ఎగురవేసి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు భారీ ర్యాలీ తీసి ఘనంగా నిర్వహించడం జరిగింది అంబేద్కర్ ఆశయ సాధనకు పే బ్యాక్ ది సొసైటీ నినాదంతో అంబేద్కర్ వాదాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లి రాజ్యాంగంలో రాసిన హక్కులను రిజర్వేషన్లను మహిళా హక్కులను కార్మిక ఉద్యోగ హక్కులను తెలుపుతూ అంబేద్కర్ సంఘాలను అంబేద్కర్ వాదానికి కృషి చేస్తున్న జయశంకర్ భూపాలపల్లి గణపురం మండలం అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ శాలువాతో సన్మానించి ఉత్తమ మండల అధ్యక్షుడిగా ప్రశంస పత్రాన్ని అందించడం జరిగింది రాజేందర్ మాట్లాడుతూ నాకు ఈ అవార్డు అందించిన రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బొమ్మల అంబేద్కర్ సలహాదారులు డీబీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రైతు రమేష్ కుమార్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య సీనియర్ నాయకులు కొమ్ముల సురేందర్ పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version