రాజన్నల కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సిరికొండ జన్మదిన వేడుకలు
భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ,శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామంలో రాజన్నల కుల సంఘం మేకల మండి వద్ద వర్షంలో సైతం కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్ భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా,స్పీకర్ గా భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లారని,రానున్న రోజుల్లో మళ్ళీ భూపాలపల్లి ఎమ్మెల్యేగా సిరికొండ మధుసూదనా చారిని గెలిపించుకుంటామని రాజన్నల కులస్తులు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలిపారు.ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి పల్లె గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లారెడ్డి,మొగిలి శీను,రాయగట్టయ్య,కొమురయ్య,రాజయ్య,మల్లయ్య,అంజయ్య,జన్నే సుమన్,ఎడ్ల విద్వత్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
