అజంత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్…

అజంత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం బస్వరాజుపల్లి గ్రామంలో అజంతా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు బిపి, షుగర్,గుండె పరీక్ష,కంటీ పరీక్ష చేయించి అర్హులు అయిన వారికి కళ్ళజోడు ఇవ్వడం జరిగింది.దానికి గెస్ట్ గా గణపురం స్టేషన్ ఎస్సై రేఖ అశోక్ , సర్పంచ్ సునీత- శ్రీనివాస్ గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు మిట్టపెల్లి అరవింద్ మాట్లాడుతూ ఆరోగ్యంలేని మనిషి జీవితంలో ఏదీ సాదించలేడు, మనకు రోగం బారిన పడితే తప్ప ఆరోగ్యం గురించి ఆలోచన రాదు, దాని కోసం ఎల్లవేళలా గ్రామ ప్రజలు బాగుండాలి అని ఈ నిర్ణయం అజంతా యూత్ తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అజంతా యూత్ అసోసియేషన్ ఉప అధ్యక్షులు చిన్న కుమార్, కోశాధికారి కుక్కమూడి నవీన్, ప్రధాన కార్యదర్శి మట్టెవాడ హరీష్, కార్యదర్శి మిట్టపెల్లి అశోక్, ప్రచార కార్యదర్శి కన్నూరి రంజిత్, సలహాదారులు కుర్రి రాజు,కుక్కమూడి అశోక్,కుక్కమూడి కుమార్ , రమేష్, కళ్యాణ్, నవీన్, నరేష్,సాయి, మహేష్, గణేష్,గ్రామ పెద్దలు, ఉపసర్పంచ్, వార్దుమెంబెర్స్, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

బోర్ స్టాటర్ రిపేర్ చేయించిన వార్డ్ మెంబర్ మధుకర్..

బోర్ స్టాటర్ రిపేర్ చేయించిన వార్డ్ మెంబర్ మధుకర్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం బస్వారాజుపల్లి గ్రామంలో రెండోవాడు కాలనీలో రెండురోజులుగా బోరు స్టాటర్ బాక్స్ కాలిపోయీ నీళ్ళకి ఇబ్బంది పడుతుంటే రెండో వార్డ్ సభ్యుడు బానోత్ మధుకరన్నా వెంటనే స్పందించి సొంత ఖర్చులతో కొత్త స్టాటర్ ఫిట్టింగ్ చేయించటం జరిగింది వార్డ్ నెంబర్ మధుకర్ కు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

నూతన సర్పంచ్ దంపతులకు సన్మానం…

నూతన సర్పంచ్ దంపతులకు సన్మానం

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం బస్వ రాజు పల్లి సర్పంచిగా గెలుపొందిన చింతకుంట్ల సునీత శ్రీనివాసులను మున్నూరు కాపు సంఘం నాయకులు శాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయండి ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అల్లం బాబు జిల్లా ప్రధాన కార్యదర్శి గండు రమేష్ ఉపాధ్యక్షులు గాజే శ్రీనివాస్ జంగిలి రవీందర్ ప్రధాన కార్యదర్శి సైన్ల శ్రీనివాస్ కోశాధికారి చింతకుంట్ల రాజు జంగిలి మల్లయ్య తదితరులుపాల్గొన్నారుe  

సింగరేణి ఆఫీసర్స్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అజంతా యూత్…

సింగరేణి ఆఫీసర్స్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అజంతా యూత్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం బస్వరాజుపల్లి గ్రామం అజంతా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి మేనేజర్, ప్రాజెక్టు ఆఫీసర్ నీ మర్యాద పూర్వకంగా కలిసి గ్రామంలో ఉన్న సమ్యసల గురించి మాట్లాడుతూ ఎల్లవేళలా గ్రామ అభివృద్ధిలో సింగరేణి యాజమాన్యం కలిసి గ్రామాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా తోడ్పడాలి అని అజంతా యూత్ అధ్యక్షుడు మిట్టపెల్లి అరవింద్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో యూత్ వైస్ ప్రెసిడెంట్ కుక్కమూడి చిన్న కుమార్, ప్రధాన కార్యదర్శి మట్టెవాడ హరీష్, కోశాధికారి కుక్కమూడి నవీన్, కార్యదర్శి మిట్టపెల్లి అశోక్, నవీన్,నరేష్, తిరుపతి, యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version