మనుషులపై ఆవులు దాడి చేస్తున్నది తిరుపతిలో కాదు.

మనుషులపై ఆవులు దాడి చేస్తున్నది తిరుపతిలో కాదు..

*కమిషనర్ ఎన్.మౌర్య..

తిరుపతి(నేటి ధాత్రి) జూన్ 27:

మనుషులపై ఆవులు దాడి చేస్తున్నట్లు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నది తిరుపతిలో కాదని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ వ్యక్తిపై ఆవు దాడి చేస్తున్నట్లు శుక్రవారం ఉదయం నుండి సోషల్ మీడియాలో ప్రసారం అవుతోందని తెలిపారు.
ఈ వీడియోపై వివరాలు సేకరించగా మహారాష్ట్ర లోని నాసిక్ లో జరిగిందని తెలిసింది. సోషల్ మీడియాలో తిరుపతి నీ ట్యాగ్ చేయడంతో ఇలా.ప్రసారం అవుతోందని తెలిపారు. నగరపాలక సంస్థ వెటర్నరీ డాక్టర్ నాగేంద్ర ఆధ్వర్యంలో అనునిత్యం నగరంలో తిరుగుతూ ఆవులు, కుక్కలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దని కమిషనర్ ఆ ప్రకటనలో తెలిపారు..

విద్యుత్ షాక్ తో 3 ఆవుల మృతి.

విద్యుత్ షాక్ తో 3 ఆవుల మృతి

భూపాలపల్లి నేటిధాత్రి:

 

భూపాలపల్లి రూరల్ మండలం శ్యాంనగర్ గ్రామం లో ఇంచర్ల. కోటయ్య చెందిన 2 ఎడ్లు, 1ఆవు కౌటం.కమలాకర్ చెందిన 1 ఆవు కరెంట్ షాక్ కు గురిఐ మృతి చెందినవి. వీటి విలువ మూడు లక్షల వరకు ఉందని వీరి కుటుంబాలను ఆదుకోవాలని గ్రామమాజీ సర్పంచ్ తిరుపతిరావు, గ్రామకాంగ్రెస్ నాయకులు ఓరుగంటి బాబురావు కోరారు.

గోవధ చేసే వారిని కఠినంగా శిక్షించాలి.

గోవధ చేసే వారిని కఠినంగా శిక్షించాలి.

భాజపా మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్.

నల్లబెల్లి నేటి ధాత్రి:

బక్రీద్ పండుగ పురస్కరించుకొని గోవధ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య కు మండల పరిధిలో గోమాత హత్యలు చేస్తే చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మండల పార్టీ తరఫున వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ గౌడ్ మాట్లాడుతూ మండల పరిధిలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి గో అక్రమ రవాణాలను నివారించాల్సిందిగా అదేవిధంగా గోమాత హత్యలను అరికట్టే విధంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు, కోశాధికారి మురికి మనోహర్, నాయకులు వల్లే పర్వతాలు, కొండ్లె రమేష్, కౌడగాని రాజేందర్, తిమ్మాపురం శివ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version