ప్రతిష్టాపన చేయనున్న దేవత మూర్తుల విగ్రహాలను ఆలయం వద్దకు చేర్చిన ఆలయ కమిటీ
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన కాకతీయుల కాలం నాటి శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా రామాలయంలో కార్తీక మాసంలో నిర్వహించనున్న గణపతి శివలింగ నవగ్రహ అష్ట బలిపీఠ ప్రతిష్టాపన మహోత్సవం లో భాగంగా శుక్రవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టాపన చేయనున్న దేవత మూర్తుల విగ్రహాలను ఆలయంలోకి చేర్చడం జరిగింది అదేవిధంగా ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ కార్తీక మాసంలో నిర్వహించను న్న ప్రతిష్టాపన మహోత్సవానికి సంబంధించిన దేవతా మూర్తుల విగ్రహాలను ఆలయ వద్దకు చేర్చడం జరిగింది ఆలయంలో ప్రతిష్టాపన చేయనున్న శివలింగాన్ని ఎంతో ప్రసిద్ధిగాంచిన కాశి క్షేత్రం నందు నర్మద నదిలోతయారైన శివలింగాన్ని ఆలయం వద్దకు చేర్చడం జరిగింది అదేవిధంగా ప్రతిష్టాపన కార్యక్రమం ఎంతో వైభవోపేతంగా నిర్వహించబోనున్నట్లు తెలిపారు ప్రతిష్టాపనలో భాగంగా గ్రామంలోని ప్రజలందరూ కూడా వారి ఆడబిడ్డలను పిలుచుకొని వారికి చేరాసారతో ఒక పండగలాగా జరుపుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండారి శంకర్ మూల శ్రీనివాస్ గౌడ్ బటిక స్వామి మాదాసు అర్జున్ పాండవుల భద్రయ్య దైవాల భద్రయ్య బూర రాజగోపాల్ ఉయ్యాల బిక్షపతి రామస్వామి గోరంట్ల రాజయ్య మోటపోతుల రాజన్న గౌడ్ తదితర భక్తులు పాల్గొన్నారు