కోట గుళ్ళు గోశాల గోమాతలకు దాన బస్తాల వితరణ
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ గోశాల గోమాతలకు గణపురం మండల కేంద్రానికి చెందిన సూర్యదేవర స్రవంతి, కార్తీక్ దంపతుల కుమారుడు ఆరవ్ సాయి జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం దాన బస్తాలను అందజేశారు. జన్మదిన సందర్భంగా వారు స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు. గోశాల గోమాతలకు దాన బస్తాలను అందజేసిన కార్తీక్ స్రవంతి దంపతులకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఆరవ్ సాయి కి కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది.
