ప్రొఫెసర్ నవీన్ కుమార్ జన్మదినం సందర్భంగా స్టడీ మెటీరియల్ పంపిణీ
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ పోషకులు, గోశాల నిర్మాణ, నిర్వహణ దాతలు జగిత్యాల వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ జన్మదినం సందర్భంగా ఆల్ ఇన్ వన్, మోడల్ పేపర్లను పదవ తరగతి విద్యార్థినిలకు శుక్రవారం అందజేశారు. మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిలకు పరిరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షులు మామిండ్ల మల్లికార్జున్ గౌడ్, బాలికలవసతి గృహం మేట్రిన్ జి మాధవి చేతుల మీదుగా రూ.5 వేల విలువైన స్టడీ మెటీరియల్ ను అందజేశారు. గత 20 సంవత్సరాలుగా ఆలయ అభివృద్ధిలో తన వంతు సహాయ సహకారాలు అందజేస్తున్న ప్రొఫెసర్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ జన్మదిన వేడుకలు విద్యార్థి నిల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పరిరక్షణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
