* సమాజానికి మంచి సందేశాన్ని అందించిన లఘు చిత్రం
-అద్భుతంగా నటించి.. సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చిన రమేష్ ను శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న మిట్టపల్లి బృందం
-నేనే సర్పంచ్ లఘు చిత్రం డైరెక్టర్ ను అభినందిస్తున్న పాటల రచయితలు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
సమాజంలో ప్రస్తుతం సర్పంచ్ పాత్ర ఏ విధంగా ఉంటుంది..ఏ విధంగా ఉండాలనేది ప్రజలకు చూపించాలనే లఘు చిత్రమే నేనే సర్పంచ్ ఈ చిత్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన క్యాతరాజు రమేష్ నటించి..సమాజానికి మంచి సందేశాన్ని అందించడంతో..మిట్టపల్లి మిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షులు పుల్ల సతీష్ కుమార్ మంగళవారం మొగుళ్లపల్లి-ముల్కలపల్లి గ్రామాల మధ్యన గల శ్రీ సమ్మక్క-సారలమ్మ దేవాలయ ప్రాంగణంలో క్యాతరాజు రమేష్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం సమాజంలో ప్రజల ఓటు విలువను ప్రజలకు తెలియజేస్తూ..ప్రజలకు సర్పంచ్ ఏ విధంగా పనులు చేయాలి..ప్రజలు ఏ విధంగా సర్పంచ్ తో పనులు చేయించుకోవాలి. ప్రజలకు అధికారులు ఏ విధంగా జవాబుదారితనంగా ఉండాలో పూసగుచ్చినట్లు ఈ లఘు చిత్రాన్ని చిత్రీకరించారు. దీంతో పలువురు వారిని అభినందించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మంగళపల్లి సుదర్శన్ ను అభినందిస్తూ..ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. పలువురి ప్రశంసలు పొందిన నేనే సర్పంచ్ అనే లఘు చిత్రంతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా లఘు చిత్రాలు మరెన్నో తీయాలని మంగళపల్లి సుదర్శన్ ను కోరినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాటల రచయితలు కల్లపెల్లి సతీష్, శ్రీపతి రాము, గాయకులు కాసర్ల రాజేష్, డప్పు సత్తి తదితరులు పాల్గొన్నారు.
