ఎంపీడీవోను మర్యాదపూర్వకంగా కలిసిన పిఆర్టియు ఎస్ సభ్యులు.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
నల్లబెల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జె శుభ నివాస్ ను మండల పిఆర్టియు టీఎస్ అధ్యక్షుడు ఉడుత రాజేందర్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎంపీడీవోను శాలువాతో సన్మానం చేసి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బానోతు కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పురం బద్రీనాథ్, రవీందర్, జిల్లా కార్యదర్శి శనిగరం శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడు కందకట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
