ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ చిత్తూరు జిల్లా నూతన కమిటీ ఎంపిక..

ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ చిత్తూరు జిల్లా నూతన కమిటీ ఎంపిక

పలమనేరు(నేటి ధాత్రి) జూలై 21:

ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ చిత్తూరు జిల్లా నూతన కమిటీ ను వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు ఆదేశాల మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చింతపల్లి గురు ప్రసాద్, ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్షులుగా పలమనేరుకు చెందిన కత్తి శ్రీనివాసులు అధ్యక్షులు గా కే నాగరాజు విజయకుమార్, ప్రధాన కార్యదర్శిగా కె, శివ కుమార్ కార్యదర్శి వి రమేష్ ట్రెజరర్ శ్రీనివాసులు ఈసీ మెంబర్స్ ఏకనాథ్, పి రమేష్, గిరిబాబు,ఆర్ కృష్ణప్ప, సి మురగయ్య ను ఎంపిక చేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు చింతపల్లి గురు ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా దళితులపై జరుగుతున్న దాడులు, దళితుల హక్కుల పట్ల నిర్లక్ష్య వైఖరి పై పటిష్టమైన అవగాహన కలిగి ఇప్పటికే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని ఈ కమిటీలో ఎంపిక చేయడం జరిగిందని రాబోవు రోజుల్లో చిత్తూరు జిల్లా లో ఎక్కడ దళితులపై దాడులు జరిగిన వారి హక్కులను కలరాల్సిన తక్షణమే ఈ కమిటీ ఆధ్వర్యంలో వారికి న్యాయం చేసే విధంగా ముందుకు వెళుతుందని తెలిపారు అధ్యక్షులుగా ఎన్నికైన కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తూ దళిత వివక్షతను అదేవిధంగా వారి హక్కులను భంగం కలిగించే ఎక్కడైనా సరే ఈ కమిటీ ఆధ్వర్యంలో న్యాయపోరాటం చేస్తామని ఆయన తెలిపారు, అతి త్వరలో పలమనేరు లో భారీగా సభ ఏర్పాటు చేసి దళిత హక్కుల గురించి అవగాహన కల్పించేందుకు కార్యక్రమం చేస్తామని కూడా ఆయన తెలిపారు..

స్పోర్ట్స్ స్కూల్స్ రాష్ట్రస్థాయి క్రీడలకు ఇద్దరు బాలికల ఎంపిక.

స్పోర్ట్స్ స్కూల్స్ రాష్ట్రస్థాయి క్రీడలకు ఇద్దరు బాలికల ఎంపిక

మహాదేవపూర్ జూన్ 28( నేటి ధాత్రి )

 

స్పోర్ట్స్ స్కూల్స్ ప్రవేశం కోసం మహాదేవపూర్ మండలం కుదురుపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొనేందుకు ఎంపికైనట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంపత్ తెలిపారు కుదురుపల్లి కి చెందిన విద్యార్థినిలు జిముడ రహస్య గోగుల అనుష్క ఎంపికయ్యారు జులై ఒకటిన నుండి హైదరాబాద్ హంకి పేటలొ స్పోర్ట్స్ స్కూల్ పోటీలో పాల్గొంటారని ఆయన తెలిపారు మారుమూల గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ పోటీలో పాల్గొనేందుకు ఎంపిక కావడం పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు సతీష్, సంధ్య గ్రామస్తులు తదితరులు అభినందించారు

గౌడ ప్రతిభ పురస్కార్ అవార్డు ఎంపికకు వేముల సాయి చరణ్ గౌడ్.

గౌడ ప్రతిభ పురస్కార్ అవార్డు ఎంపికకు వేముల సాయి చరణ్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన వేముల సునీత-మహేందర్ గౌడ్ దంపతుల కుమారుడు వేముల సాయి చరణ్ గౌడ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదివి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఈ సందర్భంగా గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (గోపా) హన్మకొండ, వరంగల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గౌడ విద్యార్థుల ప్రతిభ పురస్కార్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ అవార్డుకు వేముల సాయి చరణ్ గౌడ్ ఎంపికైనాడు. కాగా ఆదివారం హన్మకొండ హంటర్ రోడ్ లోని గౌడ హాస్టల్ లో నిర్వహించిన గౌడ ప్రతిభా పురస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో గోపా హన్మకొండ జిల్లా అధ్యక్షులు..కాకతీయ యూనివర్సిటీ ఈసీ డాక్టర్ చిర్ర రాజు గౌడ్ దంపతులు, మరియు హన్మకొండ గోపా గౌరవ అధ్యక్షులు..గౌడ ప్రతిభా పురస్కార్ ప్రోగ్రాం కన్వీనర్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ చేతుల మీదుగా నగదు బహుమతితో పాటు, మెమొంటో ఇచ్చి, ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థి సాయి చరణ్ గౌడ్ మాట్లాడారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి, తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయకుండా, పుట్టిన ఊరికి, కన్న తల్లిదండ్రులకు, చదువు నేర్పిన గురువులకు పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చేందుకు కష్టపడి చదువుతానన్నారు.

ఉన్నత ఉద్యోగానికి ఎంపిక..!

‘దూర విద్యలో చదివి.. ఉన్నత ఉద్యోగానికి ఎంపిక’

కల్వకుర్తి /నేటి ధాత్రి

కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన తాళ్ల శివలీల గృహిణిగా ఉంటూ.. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ దూరవిద్యలో డిగ్రీ పూర్తి చదివింది. అనంతరం కల్వకుర్తిలో బీఈడీ పూర్తి చేసింది. భర్త తాళ్ల రాజేందర్ ప్రోత్సాహంతో హైదరాబాదులో ఉంటూ.. శిక్షణ తీసుకొని ప్రిపేర్ అయింది. మూడు రోజుల క్రితం వెలుబడిన హాస్టల్ వెల్ఫేర్ ఫలితాలలో ఉద్యోగం సాధించింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి వరుణ్ గౌడ్ అమెరికాలో ఏం.ఎస్ చదువుతుండగా.. కూతురు పూజిత హైదరాబాదులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. గృహిణిగా ఉంటూ.. ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కావడంతో.. పలువురు అభినందనలు తెలిపారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన ప్రగతి విద్యార్థి.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన ప్రగతి విద్యార్థి

రాయికల్ నేటి ధాత్రి. .

మార్చి 15.జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో శుక్రవారం రోజు నిర్వహించబడిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో రాయికల్ పట్టణ కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాలకు చెందిన పస్తం విష్ణు 100 మీటర్ల పరుగు పందెంలో అద్భుత ప్రతిభను కనబరిచి,ఈనెల 23న హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికయ్యాడు. ఈ సందర్భంగా విష్ణును పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్, కరస్పాండెంట్ జయశ్రీ, అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్, పాఠశాల పి ఈ టి మహేష్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version