సిటీ స్కాన్ యంత్రం ఏర్పాటు చేయండి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ..

సిటీ స్కాన్ యంత్రం ఏర్పాటు చేయండి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ పరికరం ఏర్పాటుకు చేపట్టిన పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు సమయానుకూలంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిటీ స్కాన్ పరికరం ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు పనుల్లో ఆలస్యం లేకుండా, సంబంధిత ఇంజినీరింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సిటీ స్కాన్ యంత్రం ఏర్పాటుతో ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆసుపత్రి పర్యవేక్షకులు డా నవీన్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కుటుంబానికి 20వేల కుట్టు మిషన్ సహాయం.

కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ ఆమెరికా ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన ముంజల సుజాత కుటుంబానికి 20వేల రూపాయల ఖరీదు గల కుట్టు మిషన్ సహాయం
——————
KANA ప్రతినిధులకు తెలంగాణ గౌడ సంఘం తరఫున అభినందనలు ధన్యవాదాలు
——————-
వర్దన్నపేట (నేటిదాత్రి):

 

 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట నల్లబెల్లి గ్రామానికి ముంజల సుజాత భర్త అనిల్ వయసు 30 సంవత్సరాలు భర్త అనిల్ ప్రమాదవశాత్తు తాటి చెట్టు మీదనుండి కిందపడి హాస్పిటల్ తీసుకువెళ్లగా చనిపోవడం జరిగింది. సుజాత అతి చిన్న వయసులో భర్త ను కోల్పోయి ఇద్దరు పిల్లలతో నిరాశ్రయురాలుగా జీవనం గడుపుతున్నది. పేదరికంలో ఉన్నారని వీరికి సంబంధించిన వివరాలు తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్టాపురం ఏకాంతం గౌడ్ మరియు జనగామ జిల్లా అధ్యక్షులు గడ్డం రాజు గౌడ్ గారి ద్వారా విషయం తెలుసుకున్న. కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా టెస్ట్ సభ్యులు వెంటనే వారి కుటుంబానికి రూ.20 వేల ఖరీదు గల కుట్టు మిషన్ మరియు గార్మెంట్స్ ను సాయం చేశారు ఈరోజు గడ్డం రాజు గౌడ్, మరియు పట్టాపురం ఏకాంత గౌడ్ KANA స్థానిక వాలంటీర్లు నాతి గణేష్ వారి సహకారంతో అందజేశారు. ముందుకి వచ్చి సహాయం చేసినందుకు KANA కానా సంస్థని తెలంగాణ గౌడ సంఘం ప్రతినిధులు మరియు నల్లవెల్లి గ్రామ గౌడ సంఘం తరపున కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర నల్లబెల్లి గ్రామం మాజీ సర్పంచ్ ముత్యం సంపత్ గౌడ్ గౌడ సంఘం గిరగాని యాదగిరి గౌడ్ ముత్యం పాపయ్య అంబాల సంపత్ గౌడ్ అంబాల యాకన్నా బొమ్మెర రాజు గౌడ్ బొమ్మెర ఎల్లగౌడ్ ముత్యం అనిల్ సంఘ సభ్యులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version