మహిళల గోరింటాకు సంబరాలు..
నేటిదాత్రి కమలాపూర్ (హనుమకొండ)
ఆర్యవైశ్య మహాసభ హనుమకొండ జిల్లా కమిటీ, జిల్లా మహిళా కమిటీ,వాసవి క్లబ్ హన్మకొండ సంయుక్త ఆధ్వర్యంలో హనుమకొండ పబ్లిక్ గార్డెన్ వద్ద గల టిటిడి కళ్యాణ మండపంలో జరిగిన “ఆషాఢ గోరింటాకు సంబరాలు”కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వైశ్య సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొని వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమమూలో పాల్గొన్న
మహిళా సోదరమణులు సామూహికంగా ఒకరి చేతికి ఒకరు మైదాకు పెట్టుకుని ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమ ప్రారంభ సూచకంగా మహిళలు వైశ్యుల కులదేవత, ఆరాధ్య దైవం, వాసవి మాత చిత్రపటానికి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మహిళలు తంబోలా తదితర కాలక్షేప కార్యక్రమాలు నిర్వహించుకుని, గోరింటాకు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలను ఉద్దేశించి హన్మకొండ జిల్లా ఆర్యవైశ్య మహసభ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోట సురేష్, దొడ్డ మోహన్ రావు మాట్లాడుతూ భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జిల్లాలోని మహిళా సోదరీమణులు ఆషాడ మాస గోరింటాకు కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయడం పట్ల సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ముందుకు వచ్చిన జిల్లా మహిళా కమిటీనీ వారు ఈ సందర్భంగా అభినందించారు. భవిష్యత్తులో జిల్లా మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహాసభ జిల్లా అధ్యక్షులు తోట సురేష్, ప్రధాన కార్యదర్శి దొడ్డ మోహన్ రావు, కార్య నిర్వాహక అధ్యక్షుడు వెనిశెట్టి రఘు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుకొనీశెట్టి మునిందర్,చకిలం రాజేశ్వర్ రావు,పబ్బతి నాగభూషణం, ఆవోప హన్మకొండ జిల్లా కోశాధికారి గంప సతీష్ వెలగందుల శ్రీధర్, శ్రీనివాస్,లక్ష్మణ్ కాంత్, జిల్లా మహిళా కమిటీ అధ్యక్షురాలు పడకండి జ్యోతి, ఉపాధ్యక్షురాలు దొడ్డ దేవి, కోశాధికారి అయిత పద్మజ, దోమకుంట్ల వాణి,తోట సంధ్య ,పబ్బతి సునీత,శ్రీరామ్ జయలక్ష్మి,భారతి,అన్నపూర్ణ లతో పాటు సుమారు నూట యాభై మంది మహిళలు పాల్గొన్నారు.