స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని.!

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని సాధించాలి.

బిజెపిరాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తి రెడ్డి.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనీ చిట్యాల మండలంలో జుకల్ గ్రామంలోని బిఎన్ అర్ ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి స్థానిక సంస్థ ల ఎన్నికల కార్యాశాల నిర్వహించడం జరిగింది ,ఈ సమావేశంనీ కి ముఖ్య అతిథులుగా ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు జిల్లా ప్రబారి గల్ల సత్యనారాయణ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల బలం ఉన్న పార్టీ బీజేపీ. వారి కష్టం ఎప్పుడూ మర్చిపోము.మోడీ సర్కార్ మూడు నెలల రేషన్ బియ్యం ఇచ్చింది – రైతులకు బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ మోసం చేసింది.దేశంలో మతం పేరుమీద ఓట్లు అడిగిన పార్టీ కాంగ్రెస్. రాహుల్ గాంధీ ఎవ్వరు ఎంత ఉంటే అన్ని పదవులు ఇవ్వాలని అంటున్నారు.”
రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఎంత మంది బీసీలు ఉన్నారు? కుల గణన ప్రకారం కనీసం 8 మంత్రిత్వ పదవులు రావాలి.”
మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదని బీఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు – ఆ రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాం. కాని కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు.”ఏ రాజ్యాంగం ప్రకారం మైనార్టీలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు”ప్రపంచవ్యాప్తంగా 26 దేశాలు ప్రధాని మోడీకి అత్యుత్తమ పురస్కారాలు ఇచ్చాయి.గ్రామాల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించండి” అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు నాగపురి రాజమౌళి గౌడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్న గారు చదువు రామచంద్రారెడ్డి గారు పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నే మొగిలి రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ రాయరాకుల మొగిలి రాష్ట్ర నాయకులు బట్టు రవి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల గణపతి అసెంబ్లీ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి చిట్యాల మండల అధ్యక్షులు బుర్ర వెంకటేశు గౌడ్ మరియు రాష్ట్ర జిల్లా మండల నాయకులు వివిధ మోర్చా జిల్లా అధ్యక్షులు వివిధ మండలాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు స్థానిక సంస్థల ప్రబారీలు కన్వీనర్లు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .

కేటీఆర్ తీరు మార్చుకోకుంటే బుద్ధి చెబుతాం

కేటీఆర్ తీరు మార్చుకోకుంటే బుద్ధి చెబుతాం

టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ ఫైర్

“నేటిధాత్రి”, హైదరాబాద్.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అవమానకర రీతిలో మాట్లాడటాన్ని సహించబోమని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ భాష దివాళాకోరుతనంతో ఉన్నదని, భాష మార్చుకోవాలని, లేకుంటే సరైన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
తెలంగాణ ప్రజలకు కేటీఆర్ కుటుంబం లెక్కలేనన్ని వాగ్దానాలు చేసి, ఏ ఒక్కటీ సరిగా నెరవేర్చలేదని బండి దుయ్యబట్టారు. ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టిన కేటీఆర్ కుటుంబం తెలంగాణ వనరులను వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నదని, ప్రజలను నిండా ముంచిందని విమర్శించారు. తెలంగాణ అమర వీరుల త్యాగాలకు ద్రోహం చేసిన కేటీఆర్ కుటుంబం… తెలంగాణ ప్రజల కలలను, ఆశలను వమ్ము చేసిందని బండి స్పష్టం చేశారు. పదేళ్లు అధికారాన్ని అనుభవించిన కేటీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదని బండి అన్నారు.

 

కేటీఆర్ కుటుంబం అవినీతి వల్లనే ఇవాళా తెలంగాణ రాష్ట్ర ఖజానా పూర్తిగా దివాళా తీసిందని బండి సుధాకర్ అన్నారు. ఇదే సమయంలో దివాళా తీసిన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రమంగా పట్టాలెక్కిస్తూ, ప్రగతి వైపు నడిపిస్తున్నారని, ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని బంఢి సుధాకర్ గౌడ్ ప్రశంసించారు.

 

ప్రజలు పూర్తిగా ఛీత్కరించినా కేటీఆర్ కు బుద్ధి రాలేదని, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటూ, ప్రజలను మభ్య పెడుతున్నారని బండి సుధాకర్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు పోలీసు వ్యవస్థను వాడుకున్న కేటీఆర్, ఇవాళ అదే పోలీసులను బెదిరిస్తున్నాడని విమర్శించారు.

 

కేటీఆర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని సుధాకర్ గౌడ్ హెచ్చరించారు. ఇప్పటికైనా కేటీఆర్ తాను చేసిన తప్పుడు వ్యాఖ్యలను ఉప సంహరించుకొని క్షమాపణలు చెప్పాలని, లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని బండి సుధాకర్ గౌడ్ హెచ్చరించారు.

ఎమ్మెల్యే ఇఫ్తార్ విందులు ఎలా ఇస్తారు.

ఎమ్మెల్యే ఇఫ్తార్ విందులు ఎలా ఇస్తారు

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి

వర్ధన్నపేట మార్చ్ 24(నేటిదాత్రి).

 

గుడి కడితే బిచ్చగాళ్ళు తయారవుతారు అని మాట్లాడి హిందూ మతాన్ని అగౌరవ పరిచిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఈరోజు ఒక మతాన్ని గౌరవిస్తూ మరో మతాన్ని వ్యతిరేకించడం చాలా విడ్డూరంగా ఉందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుని విమర్శించారు.

ఒక మతం కి చెందిన ఓట్లను ప్రామాణికంగా తీసుకొని వాళ్లని మాత్రమే ఓటర్లుగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా మార్చుకుంటూ మిగతా మతాలను కులాలను పట్టించుకోకుండా వారికోసం విందులు ఏర్పాటు చేసి ప్రభుత్వ ధనాన్ని వాడుకొని విందులు ఇవ్వడం వల్ల వారి స్వలాభాన్ని మాత్రమే చూసుకుంటున్నారు తప్ప మిగతా మతాల వారిని మిగతా కులాల వారిని నియోజకవర్గ ప్రజలుగా వారి ఓటర్లుగా భావించడం లేదని కుందూరు మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మరియు ఎమ్మెల్యే గారిని విమర్శించారు.

నియోజకవర్గంలో ఎన్నో కులాలు మతాలు ఉన్న వారందరినీ కలుపుకొని పోకుండా కేవలం ఒక వర్గాన్ని వారి ఓటర్లుగా సృష్టించుకోవడం విడ్డూరంగా ఉందని మహేందర్ రెడ్డి అన్నారు.

గ్రామాల్లో కులాల వారిగా వారి వారి కులదేవతలను మొక్కుకుంటూ ఎన్నో పండుగలు జరుపుకుంటున్న వారి కోసం విందులు ఏర్పాటు చేసిన సందర్భాలు లేవు కానీ ఒక వర్గం కోసం ఎంపీ గారు ఎమ్మెల్యే గారు విందులు ఏర్పాటు విందులు ఇవ్వడం వారి ఓటు బ్యాంకు రాజకీయానికి నిదర్శనం అని కుందూరు మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.

ఇప్పటికైనా మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీ చేసే మోసాలను గమనించి వారికి చేస్తున్న అన్యాయాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థానిక సంస్థల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని వారికి విజ్ఞప్తి చేశారు.

నియోజకవర్గంలోని హిందూ బంధువులంతా ఒకటై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ధ్యేయంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మహేందర్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.

ఓటమిని ఒప్పుకోలేని కాంగ్రెస్

ఓటమిని ఒప్పుకోలేని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట నేటిదాత్రి : 

ఉమ్మడి మెదక్ – నిజామాబాద్ – అదిలాబాద్ – కరీంనగర్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు షాక్ లో నుండి తీరుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు తప్ప ఇప్పటికి ఓటమి నీ అంగీకరించలేకపోతున్నారని మహేందర్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక విఫలమయ్యారని అందుకే ఉపాధ్యాయులు మేధావులు పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించి ఆ పార్టీకి గట్టి బుద్ధి చెప్పారని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. 2025 బడ్జెట్లో 12 లక్షల రూపాయల వరకు కూడా ఇన్కమ్ టాక్స్ నుండి మధ్యతరగతి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉపశమనం కలిగించారని దానిని ఉపాధ్యాయ మేధావులు పట్టబద్రులు అంగీకరించి భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు పలికారని అలాగే కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ కోసం మరియు ఉత్తర తెలంగాణ కోసం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పసుపు బోర్డు మరియు మామునూరు ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసి తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గుర్తించారని మహేందర్ రెడ్డి పత్రికా మిత్రుల సమావేశంలో అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెడలు వంచే విధంగా ప్రజలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికి భారతీయ జనతా పార్టీని పెద్ద ఎత్తున గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని మహేందర్ రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ పార్టీతో చీకటి ఒప్పందాలు కాంగ్రెస్ పార్టీ చేసుకుంటుంది తప్ప అటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు అవసరం ఉండదని పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు నిరంతరం పార్టీ అభివృద్ధి కోసం పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారని తమ పార్టీ లో పార్టీ కోసం నిరంతరం కష్టపడే నాయకులు మాత్రమే ఉంటారని అమ్ముడు పోయే నాయకులు కార్యకర్తలు ఉండరని పార్టీ అభివృద్ధి కోసం పార్టీ గెలుపు కోసం పనిచేసే కార్యకర్తలు మాత్రమే ఉంటారని మహేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు మానుకోకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి గట్టిగా తమ సత్తా ఏంటో నిరూపించి చూపిస్తామని మహేందర్ రెడ్డి తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version