ప్రకృతి నియమాలను నిరంతరం.!

ప్రకృతి నియమాలను నిరంతరం ఆచరించాలి…

వాస్తవికత,శాస్త్రీయత, మానవీయ విలువల ఆధారంగా జీవించాలి…

గుడ్డిగా దేన్ని నమ్మకూడదు…

నిరంతరం పరిశీలించాలి, పరీక్షించాలి, ఫలితాలను సరిచూసుకోవాలి…

మనిషి మానసిక భావనలో దైనందిన జీవితంలో ప్రకృతి ఆధారంగా మార్పు రావాలి…

విశ్వంలో జీవం పుట్టుక, మనుగడకు గాలి,నీరు,భూమి, అగ్ని, ఆకాశం అత్యంత అవసరం…

విశ్వ జంపాల, న్యాయవాది మరియు విశ్వ సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు…

నేటి ధాత్రి -గార్ల:-

మనిషి మానసిక భావనలో,దైనందిన జీవితంలో ప్రకృతి ఆధారంగా మార్పు రావాలని విశ్వ సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు, న్యాయవాది విశ్వ జంపాల అన్నారు.శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రకృతి- పరిరక్షణ విద్యార్థుల పాత్ర, పంచ కారకాలు సృష్టి కి మూలాలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ జంపాల మాట్లాడుతూ,అమానవీయ విలువలతో కూడిన మానవ జీవన సంస్కృతి, నాగరికతలను భూమి,గాలి, నీరు,అగ్ని,ఆకాశం అనే పంచభూతాల సైద్ధాంతిక అవగాహనతో మానవీకరించాలని అన్నారు. విశ్వంలో జీవం పుట్టుక, మనుగడకు గాలి,నీరు, భూమి, అగ్ని,ఆకాశం అత్యంత అవసరం అన్నారు. నేటి నాగరిక మానవులు అనాగరికంగా వ్యవహరిస్తూ ప్రకృతిలోని వనరులను ధ్వంసం చేస్తూ విధ్వంస సంస్కృతికి వారసులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నేటి మానవులలో కొందరు అత్యాశతో కూడిన సంపద, ఆధిపత్యం,అధికారం కోసం సాటి మానవులతో విపరీతమైన ఘర్షణ పడుతున్నారని అన్నారు.

అ శాస్త్రీయతను,శాస్త్రీయతగా ప్రజల చేత నమ్మిస్తూ, సకల జీవరాశులకు,సమస్త ప్రకృతికి వినాశకారిగా మారుతున్నారని అన్నారు. పంచభూతాలే సృష్టి మూలాలు,పంచభూతాలే పదార్థం, పదార్థమే యదార్థం, యదార్థమైనదే ప్రకృతి అని అన్నారు. ప్రకృతి నియమాలను ఉల్లంఘించి, మానవులు సృష్టిస్తున్న విధ్వంసానికి నిరంతరం భారీ మూల్యం చెల్లిస్తున్నారు అని అన్నారు.మానవులు ప్రకృతి సహజ వనరుల పరిరక్షణకు బద్ధులై ఉండాలి,అత్యాశతో కూడిన అనవసర వినియోగం, విధ్వంసానికి పూనుకోవద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో మోటివేషన్ స్పీకర్ వజ్రం నాగేశ్వరరావు,ఎన్ఎస్ఎస్ విభాగం బాధ్యులు వేముల రవీందర్,డాక్టర్ శ్రీనివాస్,జి. సోమన్న, కళాశాల విద్యార్థులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సోషల్‌ మీడియా పోస్టులపై జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘా..

సోషల్‌ మీడియా పోస్టులపై జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘా

శాంతి భద్రతలకు విఘాతం కలిగించేల సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే జైలు శిక్షలు తప్పవు.

జిల్లాలో సోషల్ మీడియా ట్రాకింగ్ సెల్ (SOCIAL MEDIA TRACKING CELL) ఏర్పాటు:జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సామాజిక మాధ్యమాల్లో మతవిద్వేషాలు రెచ్చగొట్టేల,ఒక వర్గాన్ని,పార్టీని టార్గెట్ గా చేసుకొని పోస్టులు పెట్టె వారిపై,శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై,వాస్తవాలను తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు ఫార్వర్డ్ చేసే వారిపై,ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెట్టె వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక మధ్యమల్లో
(ట్విటర్‌,ఫేస్‌బుక్‌,వాట్సాప్‌,ఇతర సోషల్‌ మీడియా..)వచ్చే పోస్టులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజ నిజాలు తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో అట్టి మెసేజ్లను ఫార్వర్డ్ చేయకూడదని,సోషల్ మీడియా పోస్టులపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా ట్రాకింగ్ విభాగం(“SOCIAL MEDIA TRACKING CELL”)ప్రతి పోస్టును నిశితంగా పరిశీలించడం జరుగుతుందని,జిల్లాలో సోషల్ మీడియా విభాగం ద్వారా సోషల్ మీడియా పోస్టులపై 24*7 నిరంతరం పోలీస్ నిఘా ఉంటుందని ఈసందర్భంగా హెచ్చరించారు.
సామాజిక మధ్యమల్లో మతవిద్వేషాలు,ఒక వర్గాన్ని,పార్టీని టార్గెట్ గా,శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులపై,వాస్తవాలను తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు ఫార్వర్డ్ చేసే వారి సమాచారం సోషల్ మీడియా ట్రాకింగ్ సెల్ 8712537826 నంబర్ కి మెసేజ్ రూపంలో పంపగలరు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version