ముచ్చింతలలో ఇందిరమ్మ ఇండ్ల ప్రోసీడింగ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే జి ఎం ఆర్ వనపర్తి నేటిదాత్రి .
దేవర్ కద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల కు ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కురుమూర్తి దేవస్థానము చైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు
నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని జైపూర్ మండలం గంగిపల్లి,షెట్ పల్లి గ్రామాలలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ,గృహ నిర్మాణ శాఖ ఏ.ఈ. కాంసాని లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుపేదలకు అందించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం నిర్దేశిత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని,బేస్ మెంట్,లెంటల్,స్లాబ్ స్థాయిల వారీగా పూర్తి అయిన పనులకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాలలో బిల్లులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుందని,ఈ అవకాశాన్ని వినియోగించుకుని లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలిపారు. అనంతరం మండలంలోని వేలాల గ్రామంలో గల ఇసుక రీచ్ ప్రాంతాన్ని పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఇసుకను తీయాలని,ఇందిరమ్మ పథకంలో ఇండ్ల నిర్మాణాలకు, జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు ముందుగా ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు.ఇసుక అక్రమ రవాణా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని,నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపనులు శాసనసభ్యులు చొరవతో మండలంలో ముమ్మరంగా సాగుతోందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు అన్నారు.అనంతరం మండల పరిధిలోని వెల్లంపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇండ్లను పరిశీలించి నిర్మాణం పూర్తి చేసిన వరకు డబ్బులు ఖాతాలో జమ అయునవా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.ఇసుక,ఇటుక,కంకర మొదలగు సామాగ్రి విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే తమకు తెలుపాలని ఈ నెల చివరి వరకు సాదరమైనంత ఎక్కువ మొత్తం గృహ ప్రవేశాలు చేయాలని సూచించారు. మండలంలోని 10 గ్రామాలలో శాసనసభ్యులు 285 కెటాయించగా ఇప్పటి వరకు వివిద దశలలో పనులు పూర్తి చేసిన 169 లబ్ధిదారులకు వారి ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు తెలిపారు.పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
చందుర్తి మండలం లోని లింగంపేట గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు లింగంపేట కాంగ్రెస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పంపిణీ చేయడం జరిగింది. వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శీనన్న సహకారంతో చెక్కులు మంజూరు చేయడం జరిగింది. కొత్తపెళ్లి లావణ్య, గుడిసె రాములు, బండారు నరసవ్వ, మేకల పవిత్ర, యన్నం భవాని లబ్ధిదారులకు మొత్తం రూపాయలు 1,92,500 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఏనుగుల కృష్ణ, ఇందూరి రాజు, బండారి శేఖర్, తర్రే గణేష్, ఇరుమల్ల నాగరాజు, గుడిసె నర్సయ్య, ఈగ రాజేశం, మేకల వెంకటేశం, పాశం లక్ష్మీనారాయణ, కొత్తపెళ్లి రామచంద్రం, శేఖర్, భూమయ్య, గుంట మనోజ్, శ్రీనివాస్, లింగాల ప్రభాకర్, తర్రే లక్ష్మీ రాజం, బుర్ర సురేష్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం టిపిసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు మెట్ పల్లి సెప్టెంబర్ 27 నేటి దాత్రి
పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు అన్నారు ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయనిధి కి సంబంధించిన 3 లక్షల 25వేల గల చెక్కులను శనివారం వారి నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు ప్రజాభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి సహాయనిధితో ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి సీఎం సహాయనిధి ద్వారా అందజేయడం జరుగుతుందని అని అన్నారు ఈ కార్యక్రమంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్,తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ సేల్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి,మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోదీన్ పాషా,టీపీసీసీ ఫిషర్మెన్ష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ,మాజీ ఉప సర్పంచ్ సల్ల సునీల్, టిపిసిసి సోషల్ మీడియా కన్వీనర్ కట్ట మనోజ్,మాజీ ఎంపిటిసి సిగారపు అశోక్,కల్లెడ గంగాధర్,సమీర్ సర్కార్,నల్లపు పోతూరాజు శ్రీకాంత్ సీఎం సహాయనిధి లబ్ధిదారులు ,కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
ప్రజాభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయం సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు మల్లాపూర్ సెప్టెంబర్ 27 నేటిదాత్రి
ప్రజాభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి సహాయనిధితో ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆదుకుంటుందని టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మొగిలిపేట గ్రామం లో మల్లాపూర్ మండలం కి చెందిన ముఖ్యమంత్రి సహాయనిధి కి సంబంధించిన 9 లక్షల 25 వేల విలువగల 17 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్,కిసాన్ కాంగ్రెస్ సేల్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి,టీపీసీసీ ఫిషర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ,రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి,మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా,మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గంధం రాజేశం,మల్లాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మల రాజు, జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి గజ్జి రమేష్,మండల ఫిషర్మాన్ అధ్యక్షుడు రొడ్డ రాజు,మాజీ ఉప సర్పంచ్ ఎన్నెడ్ల రాములు,మొగిలపేట విడిసి చైర్మన్ వంగ శ్రీనివాస్,మాజీ విడిసి చైర్మన్ మహబూబ్ ఖాన్, మసుల చిన్నయ్య,మిట్టపల్లి మహేష్, ఎండి సల్మాన్,సుద్దాల సతీష్, దేవ రవి,కల్లెడ గంగాధర్,ఎండి జాఫర్,సింగరపు అశోక్,ఇప్పపెల్లి గణేష్,గోపిడి నరేష్, ఎట్టేం మల్లేశ్,పోతు గోపి,సమీర్ సర్కార్,నల్లపు పోతరాజు శ్రీకాంత్,కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి( సి ఎం ఆర్ ఎఫ్ )
◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ : పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ యన్.గిరిధర్ రెడ్డి నివాసంలో బుధవారం జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన 19 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్( సి ఎం ఆర్ ఎఫ్ ) చెక్కులను తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అందజేశారు. -:లబ్ధిదారులు:- రాజు మైకలి-47,500/- ఎండీ సోహైల్ షా-25,000/- అబ్దుల్ నబీ-27,000/- కళ్యాణ్ ఉమాదేవి-60,000/- దామావతి-60,000/- వోతి శ్రీనివాస్-29,500/- ఎస్ మహేష్ కుమార్-60,000/- దోమల రమేష్-60,000/- పర్వీన్ బేగం-35,000/- చౌహాన్ రవీందర్-50,000/- బేగరి దశరథ్-50,000/- బి.నవాబ్ మియా-24,000/- ఎండీ షాబుద్దీన్-60,000/- ఎదిగి దత్త గౌడ్-30,000/- ఎన్ అశ్వని-30,500/- ఎన్ అశ్వని-30,500/- పవార్ రేణుకా బాయి-20,000/- మంగలి సురేష్-60,000/- తలారి బిక్షపతి-55,000/- మొత్తం = 1,053,500/- ఈ సందర్భంగా యన్.గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ఈ పథకం ద్వారా మరిన్ని వ్యాధులకు ఉచిత చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు.ఈ సహాయ నిధి చెక్కుల మంజూరు కై కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారికి,సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి చెక్కులు పొందిన లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రాంలింగా రెడ్డి,సిడిసి చైర్మన్ ముబీన్,మండల అధ్యక్షులు నర్సింహారెడ్డి,మాజీ వైస్ యం.పి.పి వి.రాములు,డిసిసి ఉపాధ్యక్షుడు ముల్తాని,మైనార్టీ సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భీమయ్య నర్సింహారెడ్డి,ప్రతాప్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి,కిరణ్ గౌడ్ జగదీశ్వర్ రెడ్డి మల్లికార్జున్ నర్సింహులు ఇమామ్ పటేల్,హన్మంత్ రెడ్డి బర్కత్ మరియు కౌన్సిలర్లు మాజీ సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లబ్దిదారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రేపు అనగా మంగళవారం నాడు మండలంలోని బట్టుపల్లి గ్రామపంచాయతీ రైతు వేదికలో మన అభిమాని నాయకులు జనహృదయనేత పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం కలదు కావున మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, పత్రిక మిత్రులు అభిమానులు సకాలంలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.
తెలంగాణ: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఆధార్ వివరాల్లో తప్పులు ఉంటే త్వరగా సరిచేయాలని జిల్లా కలెక్టర్లను హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ ఆదేశించారు. లబ్ధిదారులకు ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (APBS) ద్వారా నగదు చెల్లింపులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే లబ్ధిదారుల్లో దాదాపు 30 శాతం మంది ఆధార్ రికార్డుల్లో తప్పులు ఉండటంతో వివరాలు సరిపోలడం లేదని అధికారులు గుర్తించారు. దీని వల్ల పేమెంట్స్ నిలిచిపోయే ఛాన్స్ ఉండటంతో ఆధార్లో తప్పుల సవరణ వెంటనే చేపట్టాలని పేర్కొన్నారు.
కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన హనుమంతరావు పటేల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కుప్పా నగర్ గ్రామంలో ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం పంపిణిలో రాష్ట్ర ప్రభుత్వానిదే పెద్ద వాటా అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ అన్నారు. గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు కొత్త రేషన్ పంపిణి చేసిన సందర్భంగా మాట్లాడారు. గత పాలకులు 10సంవత్సరాల పాటు రేషన్ కార్డు లు ఇవ్వక పోవడం తో పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించడం మంచి పరిణామం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హాయంలో కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడం సంతోషంగా ఉందన్నారు.కార్డుల పంపిణి ప్రక్రియ నిరంతరాయంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి రాజ్ కుమార్ స్వామి రాఘవేంద్ర కృష్ణ ప్రకాష్ రవి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు,
జహీరాబాద్: ఝరాసంగం మండలంలోని బొప్పనపల్లి గ్రామంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. బుధవారము గ్రామ పంచాయతీలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ షకీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రేషన్ కార్డులను అందజేస్తుందన్నారు. ఆధార్కార్డుతో పాటు రేషన్ కార్డు ముఖ్యమన్నారు. ప్రభుత్వ పథకాలకు అర్హులు కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ది శ్రీనివాస్ రెడ్డి అమృత్ బాలయ్య బసిరెడ్డి ప్రవీణ్ డీలర్ సత్తార్ తదితరులు లబ్ధి దారులు పాల్గొన్నారు
◆:- బేస్మిట్ లెవెల్ కే రెండు లక్షలు దాటుతున్న పరిస్థితి!
◆:- నేటికీ అందని ఉచిత ఇసుక!
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటే సొంత ఇంటి కల నెరవేరడం ఖాయమని, అవసరమైతే లబ్దిదారుడిపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తామని ఎన్నికల ముందు చెప్పిన మాటలు ప్రచారాలకే పరిమితమవుతున్నాయనే ఆరోపణలు మండల వ్యాప్తంగా విస్తారంగా వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులు ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం అందిస్తామన్న ఉచిత ఇసుక అందలేదు. మండలానికి 583 ఇందిరమ్మ గృహాలు మంజూరు కాగా ఇప్పటి వరకు 380 ఇండ్ల పనులు ప్రారంభమైనాయి.
Indiramma Beneficiaries
పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలు
విస్తారంగా కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల ఓవైపు ఇసుక, మరోవైపు కంకర, సిమెంట్, స్టీల్ ధరలు మూడింతలు పెరగడంతో ఇందిరమ్మ లబ్దిదారులు ఆర్ధిక భారంతో సతమతమవుతున్నారు. దీంతో ఇండ్ల నిర్మాణ పనులలో వేగం తగ్గింది. ప్రభుత్వం ఇందిరమ్మ లబ్దిదారులకు ఉచిత ఇసుక పంపిణీ చేస్తామని చెప్పినా నేటి వరకు అందలేదు. కనీసం ఇసుకైనా ఉచితంగా అందితే కొంతమేర భారం తగ్గుతుందని లబ్దిదారులు వాపోతున్నారు. మరో వైపు ఉన్నత అధికారుల నుంచి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని లబ్దిదారులకు ఒత్తిళ్లు రావడంతో ఎం చేయాలో తోచని పరిస్థితులు నెలకొంటున్నాయని వాపోతున్నారు. ఒకానొక దశలో అధికారులు లబ్దిదారులకు చేతులు జోడించి తమకు పైనుంచి వస్తున్న ఒత్తిళ్లను అర్ధం చేసుకోవాలని వేడుకొంటున్నారు. లేనిపక్షంలో బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్న పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంటున్నారు. దీంతో లబ్దిదారులు ఏం చేయలేక పెరిగిన ధరలతో అనుకున్న అంచనా కంటే అధికంగా ఖర్చులు అవుతున్నాయని ఏం చేయాలో అర్ధం కావడంలేదని అధికారులకు లబ్దిదారులు మొరపెట్టుకుంటున్నారు.
ఉచిత ఇసుక సరఫరా అయ్యేనా !
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తామని తెలిపినా ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమై రెండు నెలలు గడిచినా నేటికీ ఆ ప్రక్రియ ప్రారంభమే కాలేదని లబ్దిదారులు వాపోతున్నారు. ఉచిత ఇసుక సరఫరా అనేది మండల స్థాయిలో తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో ఒక పాయింట్ని ఏర్పాటు చేసి అక్కడి నుండి మండలంలోని వివిధ గ్రామాలకు సరఫరా చేయాలని ఉన్నత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆ ప్రక్రియ నేటికీ ప్రారంభం కాకపోవడంతో లబ్దిదారులు నిరాశ చెందుతున్నారు. దీంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రశ్నార్ధకంగా మారాయి. కొందరు లబ్దిదారులు మొదటి బిల్లుతో బేస్మెంట్ వరకు పనులు చేసి నిలిపివేస్తే, మరికొందరు పిల్లర్లను నిర్మించి పనులను అక్కడే నిలుపుదల చేసిన పరిస్థితులు నెలకొన్నాయి.
త్వరలో ఉచిత ఇసుక అందజేస్తాం
-ఎంపీడీఓ, మంజుల, ఝరాసంగం
ఇందిరమ్మ అబ్దిదారులకు త్వరలో ఉచిత ఇసుక అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శుల నుండి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ వివరాలు సేకరించాం. దీని ప్రకారం ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒక్కొక్క ఇందిరమ్మ ఇంటికి 40 టన్నుల ఉచిత ఇసుక అందిచే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం.
కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
అధికారం చేపట్టిన 18 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలను అమలుచేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ అన్నారు. సోమవారము స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామానికి చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డ్ ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. హనుమంతరావు పటేల్ మాట్లాడుతూ..గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తున్నామన్నారు. కొత్తగా పెళ్లయిన వాళ్లు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి రేషన్ కార్డులు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పశు వైద్యాధికారి హర్షవర్ధన్ రెడ్డి గ్రామ కార్యదర్శి వీరన్న పటేల్ మల్లయ్య స్వామి సంగన్న పటేల్, మల్లికార్జున పాటిల్, అష్రఫ్ అలీ, లియకత్ అలీ, రాజేందర్ సింగ్, డీలర్ సంగన్న, నర్సింలు, యూత్ కాంగ్రెస్ నాయకులు ఫక్రోద్దిన్, అనిల్, కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
న్యాల్కల్ మండలంలోని హద్నూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులు ఆసక్తిగా పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు. గ్రామానికి మంజూరైన 58 ఇండ్లలో ఇప్పటివరకు 46 మంది లబ్దిదారులు బేస్మెంట్ స్థాయిని పూర్తి చేశారు. ఈ దశలో పనులు పూర్తి చేసిన ప్రతి లబ్దిదారుడికి ఒక్కొక్కరికి రూ.1,00,000 చొప్పున వారి ఖాతాలలో జమ చేసినట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి ధనరాజ్ వివరించారుసోమవారం ఆయన నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు నరేష్, రమేష్, శుకూర్ మియా తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలో మాతృ వందన యోజన పథకం అమలు చేయాలి
బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం పేద ప్రజలకు ఎంతో మేలు చేసే కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాష్ట్రంలో మాతృ వందన యోజన పథకం అమలు చేయాలని బిజెపి మండల శాఖ అధ్యక్షుడు ఊర నవీన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడం లేదన్నారు. గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదేవిధంగా కొనసాగిందని ప్రస్తుత ప్రభుత్వం అదే బాటలో నడుస్తుందన్నారు. దారిద్ర రేఖకు దిగువన ఉండే మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో మాతృ వందన యోజన పథకం ప్రవేశపెట్టిందని ఆ పథకం వల్ల గర్భిణీ స్త్రీలకు రెండు విడతల్లో అంగన్వాడి కేంద్రాల ద్వారా సుమారు 5000 రూపాయలు వారికి అందించే అవకాశం ఉంటుందని నవీన్ రావు అన్నారు. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల 12 సంవత్సరాల పాటు నిరుపేద కుటుంబాల మహిళలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వ పథకాలను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులను నర్సంపేట పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవికుమార్ లబ్దిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో నర్సంపేట పట్టణానికి చెందిన 23, 24, వార్డుల్లో నూతనంగా మంజూరైన నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో 23వ వార్డు అధ్యక్షులు పెద్దపల్లి శ్రీనివాస్, 24వ వార్డు కోల చరణ్ రాజ్ గౌడ్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, వార్డు ఆఫీసర్లు మౌనిక, తరుణ్, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాగేల్లి సారంగం గౌడ్, వార్డు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జానకమ్మ, సరోజన, మోహన్, బైరగోని రవి, మొగిలిచర్ల రాజు, తదితరులు పాల్గొన్నారు
ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకు 2004 నుంచి అమలు చేస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేసి 1972 పెన్షన్ రూల్స్ ప్రకారం పాత పెన్షన్ ను మళ్ళీ అమలు చేయాలనే డిమాండ్ చేస్తూ.తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు,,,ప్రభుత్వ కార్యాలయాల్లో బోజన విరామ సమయాల్లో నల్ల బ్యాడ్జీ లు ధరించి నిరసన తెలిపారు…ఈ సందర్భంగా మండల పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాల పొట్టిపల్లీ తో పటు అనేక పాఠశాలలు,,,ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపాధ్యాయ, ఉద్యోగులు,, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెల్పారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు Y. అమృత్,శంకర్ ,ప్రసన్న లక్ష్మి. నారాయణ,,కృష్ణ తదితరులు పాల్గొన్నారు,
మొగుడంపల్లి మండలం జాంగార్ బోలీతండాలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చలపతిరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడి, మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే పూర్తి చేసుకున్న పనులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మహేశ్, పంచాయతీ కార్య దర్శి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ గతంలో డబుల్ బెడ్ రూమ్ ల పట్టాలు అందజేసి విచారణ పేరుతో 132 లబ్ధిదారులకు తాళాలు అందజేయకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బి. ఆర్.ఎస్ పార్టీ నాయకులు నామరవికిరణ్ బండి మోహన్ ఆరోపించారు. ఆగస్టు 14 నాడు ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ జరిగిన సభలో స్థానిక శాసనసభ్యులు మాణిక్ రావు విజ్ఞప్తి మేరకు పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ రెవెన్యూ అధికారులు వారం రోజులలో తాళాలు ఇస్తామని గతంలో మాట ఇవ్వడం జరిగింది. వారు చెప్పి వారం రోజుల సమయం నిన్నటితో పూర్తయింది ఇట్టి విషయమై ఈరోజు లబ్దిదారులతో కలిసి స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ వద్ద లబ్ధిదారులకు తాళాలు వెంటనే ఇవ్వాలని ఆందోళన చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ నాయకుడు నామ రవి కిరణ్ మాట్లాడుతూ లబ్ధిదారులకు వెంటనే తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు, విచారణ పేరుతో కాలయాపన చేయడం సరైనది కాదు అన్నారు గతంలో ఉన్న ప్రభుత్వ హయాంలో దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్ పట్టాలు అందజేస్తే, కనీసం వారిపై కనికరం లేకుండా తాళాలు అందించకుండా వారికి ఇబ్బందులను గురి చేయడం సరైన పద్ధతి కాదు అన్నారు ఇట్టి విషయమై డిప్యూటీ తాసిల్దార్ ఇంకొక వారం రోజులు తప్పనిసరిగా లబ్దిదారులకు తాళాలు అందజేస్తామని చెప్పారు వారం రోజుల్లో తాళాలు తీయని యెడల లబ్ధిదారులు నేరుగా వారికి గతంలో కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు స్వాధీనం చేసుకుంటారని హెచ్చరించడం జరిగింది కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు శివప్ప, నాయకులు గణేష్ చంద్రయ్య విద్యార్థి విభాగం నాయకుడు రాకేష్ లబ్ధిదారులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి సంబంధించిన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల, రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీష్ (తాజా మాజీ ఎంపీపీ) రామడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎనబై నాలుగు కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల నలభై వేల ఐదువందల విలువైన చెక్కులు అందించారు. ఈసందర్భంగా హరీష్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి అండగా సీఎం రేవంత్ రెడ్డి నిలిచారని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలి పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిండి సత్యం, మాజీ సర్పంచ్ కొల రమేష్, మాజీ మండల అధ్యక్షులు బొమ్మరవేని తిరుపతి, రాజమల్లయ్య,బాల గౌడ్, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, కృష్ణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనుపురం పరుశురాం గౌడ్ చంద్రారెడ్డి,నరేందర్ రెడ్డి, డైరెక్టర్ స్వామి, రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్, కనకయ్య, అంజయ్య, రాజేశం, మల్లేశం, బాపురాజు, మధు, రాంరెడ్డి, మనీష్, తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.