ఓసీ త్రీ మట్టిని ఉంచితంగా అందించాలి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-54-2.wav?_=1

ఓసీ త్రీ మట్టిని ఉంచితంగా అందించాలి

బీజేపీ మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు

ఎంపీడీవోకు వినతి పత్రం అందజేత

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఓసీ త్రీ మట్టిని ఉంచితంగా అందించాలి బీజేపీ మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఎల్ భాస్కర్ కు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గణపురం మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో అర్హులైన లబ్దిదారులు ఇండ్లు నిర్మించుకుంటున్నారు. అయితే గృహ నిర్మాణంకు మట్టి తప్పనిసరి అవసరం ఏర్పడుతుంది, కానీ ఆయా గ్రామ పంచాయతీల్లో మట్టి లభ్యత లేకపోవడం, ఉన్న ప్రాంతంలో మట్టి తీసేందుకు ఇరిగేషన్, రెవెన్యూ శాఖ నుండి అనుమతి లేకపోవడంతో ఇంటి నిర్మాణ లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని 17 గ్రామపంచాయితీల్లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి లబ్ధిదారులకు ఆయా గ్రామ పరిధిలో మట్టి లభ్యత లేదనందున సింగరేణి ఓసీ త్రీ మట్టిని సింగరేణి అధికారులతో మాట్లాడి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇప్పించాలని ఎంపీడీవోను కోరారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సోమా దామోదర్, దుగ్గిశెట్టి పున్ పాల్గొన్నారు

పేదల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-64-1.wav?_=2

“పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి”

ఊర్కొండలో రేషన్ కార్డుల పంపిణీ.

రూ.12 లక్షలతో అంగన్వాడి భవనాలు మంజూరు.

ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి.

జడ్చర్ల నేటి ధాత్రి

రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యంమనీ జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. ఊర్కొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే ప్రసంగించారు. “మా ప్రభుత్వానికి పేదల సంక్షేమమే ప్రథమ కర్తవ్యం. అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నాం. రేషన్ కార్డు కేవలం ఒక పత్రం కాదు, ఇది పేద కుటుంబానికి భరోసా, భవిష్యత్తుకు ఆర్థిక బలం.

MLA Janampally Anirudh Reddy.

పేదల ఆకలి తీర్చడమే కాకుండా, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో ఇది కీలకం” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డూ మంజూరు చేయలేదని విమర్శిస్తూ, అర్హులు ఎన్నో ఏళ్లు ఎదురు చూసినా.. దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తుచేశారు. కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులందరికీ న్యాయం జరుగుతోందని తెలిపారు. “మా పాలనలో ఎవరూ ఆకలితో ఉండరని, ప్రతి అర్హుడికి సకాలంలో ప్రభుత్వం అందించే లబ్ధి చేరుస్తాం” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఊర్కొండ మండలానికి 163 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం, 1619 పాత రేషన్ కార్డుల్లో ఆడిషన్స్ పూర్తయ్యాయని వివరించారు. ఇప్పటికే గుడిగానిపల్లి, మాదారం గ్రామాలకు రూ.12 లక్షల నిధులతో అంగన్వాడి భవనాలు మంజూరు అయ్యావని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

కొత్త రేషన్ కార్డు పంపిణీ చేసిన పీ నరసింహారెడ్డి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-15-8.wav?_=3

కొత్త రేషన్ కార్డు పంపిణీ చేసిన పీ నరసింహారెడ్డి,

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మండలం శకాపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి. నరసింహారెడ్డి పాల్గొన్నారు.అట్టి సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం అర్హులందరికీ రేషన్ కార్డులు పంపిణీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానానికి లోబడి నిలబెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. బలహీన వర్గాలకు ఏ స్కీమ్ వచ్చిన దానికి బేస్ రేషన్ కార్డు అవసరం ఉంటుందని ఇందిరమ్మ ఇండ్లు గాని గృహానికి ఉచిత కరెంటు గాని రాజీవ్ యువ శక్తి గాని సబ్సిడీ గ్యాస్ గాని ప్రతి ఒక్క దానికి అర్హులు తెల్ల రేషన్ కార్డు దారులే అని అన్నారు. గత ప్రభుత్వం గత పది సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు కూడా బీదలకు ఇవ్వలేదన్నారు. రేషన్ కార్డుదారులందరికీ ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున ఉచిత సన్న బియ్యం అందిస్తుందన్నారు.
గత ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఇచ్చిన దొడ్డు బియ్యం తినేవారు కాదని అమ్ముకునేవారని అలా రీసైకిల్ అయి అదే బియ్యం మళ్లీమళ్లీ వచ్చి పోయేదని కానీ ఇప్పుడు సన్న బియ్యం ప్రతి ఒక్క లబ్ధిదారుడు దాన్ని తింటున్నారని అన్నారు.
ప్రజలకు అవసరమయ్యే బియ్యాన్ని పండించేందుకు రైతులకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తున్నందున రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారన్నారు.మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం 200 యూనిట్ల వరకు పేదలకు కరెంట్ రైతులకు రుణమాఫీ అదేవిధంగా సంవత్సరానికి ఎకరాకు 12 వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం ఇస్తుందన్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు రైతులకు వ్యవసాయానికి ఉచిత కరెంటును ఇచ్చిందని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు బీదవాళ్ల ఇండ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంటును ఇస్తుందన్నారు.ఇంకా మూడున్నర సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని మిగతా సంక్షేమ పథకాలన్నీ కూడా ఇట్టి కాలంలో పూర్తి చేస్తుందని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు.కార్యక్రమంలో మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ అక్బర్ హుస్సేన్ సి డి సి డైరెక్టర్ జి మల్లారెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ ఇమాం పటేల్ మాజీ ఎంపిటిసి ఎస్ నరసింహులు మాజీ సర్పంచ్ ప్రతినిధి చెన్నారెడ్డి పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామ నాయకులు చేస్మోదిన్
ఆరిఫుద్దీన్ షేక్ అలీ కుర్షిడ్ బయ్ నారాయణ గౌడ్ సైఫుద్దీన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-55.wav?_=4

ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్)

◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

◆:- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారీ నివాసంలో ఆదివారం సాయంత్రం జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన 11 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్( సీఎంఆర్ఎఫ్ ) చెక్కులను తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా యన్.గిరిధర్ రెడ్డి ,డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ఈ పథకం ద్వారా మరిన్ని వ్యాధులకు ఉచిత చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు.ఈ సహాయ నిధి చెక్కుల మంజూరు కై కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారికి,సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి గారికీ,డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గార్లకు చెక్కులు పొందిన లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రాంలింగా రెడ్డి,సిడిసి చైర్మన్ ముబీన్,మండల అధ్యక్షులు నర్సింహారెడ్డి,మాజీ యం.పి.పిలు గుండారెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్, మాజీ సోసైటి చైర్మన్ ధనసిరి.మల్లికార్జున్ రెడ్డి,మైనార్టీ సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,మాజీ జెడ్పీటీసీలు,మాజీ యం.పి.టి.సిలు,మాజీ కౌన్సిలర్లు,మాజీ సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,లబ్దిదారులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మా ఇల్ల పట్టాలు ఇప్పించండి – పైడిగుమ్మల్ గ్రామస్థులు ఆవేదన

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T114101.810-1.wav?_=5

 

మా ఇల్ల పట్టాలు ఇప్పించండి – పైడిగుమ్మల్ గ్రామస్థులు ఆవేదన

◆-ముపై ఏళ్ల నుండి పట్ట సర్టిఫికెట్ తన వద్దే పెట్టుకున్న మాజీ సర్పంచ్

◆-ఎవరైనా ఏదైనా చేసుకోండి అంటున్న వైనం…!

◆-తన సన్నీ హిత వర్గాలకు ఇళ్ల ఖాళీ స్థలాలు కేటాయించి…..స్థానిక సంస్థ ఎన్నీకలో ఓటు బ్యాంకు పెంచుకునే వైనం..

◆:- …సహించిదే లేదంటున్నా గ్రామస్థులు…

 

 

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పైడిగుమ్మల్ గ్రామం లో సంచలనం రేపుతున్న వ్యవహారం.ఆ గ్రామస్థులు మాట్లాడుతూ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన ఇల్ల స్థలాలు పట్టా పేపర్ స్ మాజీ సర్పంచ్ వద్దే ఉంచుకొని తన ఇష్ట రాజ్యాంగ వ్యాహరిస్తున్నారు.గ్రామానికి సంభందించిన కాటిలో స్థలం సర్వే నెంబర్ 5,6,7 గల మొత్తం 2.11గుంటల ప్రభుత్వం భూమి అప్పటి ప్రభుత్వం (కాంగ్రెస్ )30 సంవత్సరాల క్రితం ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించింది.అయితే అప్పుడున్న సర్పంచ్ మా గ్రామ సర్పంచ్ చే కదా అని నమ్మీ తమ సర్టిఫికెట్ స్ ఖాళీ స్థలాలు మ్యాప్ అప్పగించారు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మంజురు అవ్వడం తో తమ సర్టిఫికెట్ ఇల్ల స్థలాలు కేటాయించాలని అప్పటి గ్రామ సర్పంచ్ బి.మొల్లయ్య అడుగగా వారు వారి అనుచరులకు ఆ స్థలాలను కేటాయించి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓటు బ్యాంకు పెంచుకొనే ఆలోచన తో నిజమైన లబ్బిదారుల కు బెదిరింపుల కు పాల్పడుతున్నాడు గడిచిన సంవత్సరం కిందట ఇంటి స్థలం కలిగిన లబ్ధిదారులు వద్ద రూపాయలు 1000.చొప్పున ఒక్కరి వద్ద వసూలు చేసి, మీ స్థలాలను మీకు పంచుతాను అని వారికి తో చెప్పీ డబ్బులు వసూలు చేసాడు ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్లు మంజురు అవ్వడం తో ఇల్ల స్థలం కలిగిన మాజీ సర్పంచ్ ను అడుగగా నేను పంచను అని అంటున్నాడు.దీనిని దృష్టిలో పెట్టుకొని వెంటనే గ్రామ పెద్దలు యువకులు సంబంధిత మండల అధికారికి వినతి పత్రం అందజేసి ఎవరూ స్థలాలను వారికి కేటాయించాలని కోరరు తహసీల్దార్ స్పందించి
వెంటనే ఆ స్థలాల పై ఎన్కెవ్వరి చేయించి నిజమైన అర్హులకు కేటాయిస్తాం అన్నారు.
ఈ కార్యక్రమంలో పైడిగుమ్మల్ మాజీ ఎంపీటీసీ జ్ఞనరత్నం అంబెడ్కర్ యువజన సంఘం అధ్యక్షులు చీమల.ప్రశాంత్ తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం గ్రామ కార్యదర్శి కాడి కరుణాకర్ గ్రామ యువకులు ప్రేమ సంపత్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మోహన్ చీమల ప్రేమ్ కుమార్ రమేష్ అనిల్ నాగేష్ దానమ్మ అంతమ్మ రుతమ్మ తదితరులు పాల్గొన్నారు.

గోపాలపురంలో ఇందిరమ్మ ఇండ్ల పత్రాల పంపిణీ…

ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇండ్ల మంజూరి పత్రాలు అందజేత.

చిట్యాల, నేటి ధాత్రి :

చిట్యాల మండలంలోనీ గోపాలపురం గ్రామంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవి మరియు గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమక్షంలో ఇదిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు అందచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూల శంకర్ గౌడ్, భూపాలపల్లి జిల్లా సేవదల్ అధ్యక్షులు ఏకు రవీందర్, గ్రామ కమిటీ అధ్యక్షులు నీలం కుమారస్వామి, పార్టీ సీనియర్ నాయకులు గన్నారపు సదయ్య, మాజి గ్రామ కమిటీ అధ్యక్షులు గోవిందుల భద్రయ్య, బత్తిని సదయ్య, గోవిందుల శంకరయ్య, చళ్ళ కుమార్, అంబాల రవి, గూడెపు చిన్ని, సంపెల్లి రాజు, చెవుల రమేష్, మరియు ఇతర పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-14T144552.380.wav?_=6

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన

◆:- శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన 8 మంది లబ్ధిదారులకు చెక్కులను గాను ₹2,25,000 విలువ గల చెక్కులను క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు అందజేయడం జరిగింది.

లబ్ధిదారుల వివరాలు:-

చిన్న హైదరాబాద్ కి చెందిన శారు బాయి మేఘవత్ ₹.21,000 గడి వీదికి చెందిన రైనగారి రాజ రత్నం ₹.12,000 పాండు రంగా స్ట్రీట్ కి చెందిన అమీనా సుల్తానా ₹.12,000 రంజోల్ కి చెందిన మోషప్ప ₹.60,000 & బ్యాగారి స్వప్న ₹.30,000 రచ్చన్నపేట్ కి చెందిన తర్లపల్లి ధనలక్మి ₹.39,000 & కమలాకర్ ₹.18,000 రాం నగర్ కి చెందిన దశరథ్ ₹.33,000
ఈ కార్యక్రమంలో మాజి మున్సిపల్ చైర్మన్ తంజీమ్ ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహియుద్దీన్ ,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,సత్యం, బరూర్ దత్తాత్రి,గణేష్,చంద్రయ్య ,దీపక్ ,అశోక్ రెడ్డి ,
తదితరులు పాల్గొన్నారు.ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి ,బిఆర్ఎస్ నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి దాత్రి…

తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీ గ్రామానికి చెందిన వారికి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. సందర్భంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ షోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్. మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల.ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఇందిరమ్మ కాలనీ గ్రామానికి చెందిన గాలి పెళ్లి బాలకృష్ణ కి..(40000). వేల రూపాయల సీఎంఆర్ఎఫ్. చెక్కుని లబ్ధిదారులకు స్థానిక. కాంగ్రెస్ పార్టీ నాయకుల. ఆధ్వర్యంలో అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందుకు సహకరించిన. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. శ్రీ ఏ నుముల. రేవంత్ రెడ్డికి. రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కి. ప్రభుత్వ . వీప్ . వేములవాడ శాసనసభ్యులు. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు. శ్రీ ఆది శ్రీనివాస్ కి. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి. కాంగ్రెస్ పార్టీ తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కి. ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంపెల్లి శ్యామ్. బల్ల లక్ష్మీపతి. కంది గట్ల సదానందం. బై రీ. వేణు. జంగంపల్లి భాగ్యలక్ష్మి. ముందటి శారద. కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

వివాహ వేడుకకు హాజరైన మోకుదెబ్బ రమేష్ గౌడ్

వివాహ వేడుకకు హాజరైన మోకుదెబ్బ రమేష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేటలోని రామకృష్ణ జూనియర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాచర్ల రమేష్ గౌడ్ మరదలు రాజుపేట గ్రామం కీ.శే.కోతి స్వామి-అరుణ గౌడ్ దంపతుల కూతురు రచన -అబిలాష్ గౌడ్ ల వివాహం సత్యం ఫంక్షన్ హల్ లో బుధవారం జరిగింది.ఈ వివాహ వేడుకకు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై నూతన వాదూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ డివిజన్ అధ్యక్షులు, మల్లంపల్లి గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి కందుల శ్రీనివాస్ గౌడ్, రాజుపేట గౌడ సంఘం అధ్యక్షులు గొల్లపల్లి సురేష్ గౌడ్,కోతి వెంకటేశ్వర్లు గౌడ్,నర్సంపేట గౌడ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్ కక్కెర్ల అశోక్ గౌడ్, మల్లంపల్లి గౌడ సంఘం మాజీ అధ్యక్షులు కక్కేర్ల రాజు గౌడ్,కక్కేర్ల రాజు గౌడ్, మాజీ కోశాధికారి కక్కేర్ల కుమారస్వామి గౌడ్, కక్కేర్ల రాములు గౌడ్ తదితరులు హాజరైనారు.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..

తంగళ్ళపల్లి. నేటి దాత్రి..

ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రజా ఆరోగ్య పరిరక్షణ కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత. అని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మునిగల. రాజు. మాట్లాడుతూ. సారంపల్లి గ్రామంలో. వంగరి సుమలత. భర్త శ్రీనివాస్. వారికి 32,500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును.

గ్రామ శాఖ అధ్యక్షుడు. గుగ్గిల రాములు గౌడ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని. ఈ సందర్భంగా తెలియజేస్తూ చెక్కులు రావడానికి కృషిచేసిన. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి. సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్ కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో. మానవ హక్కుల విభాగం జిల్లా ఉపాధ్యక్షులు గుగ్గిళ్ల భరత్ గౌడ్. కోలా గంగారాం. కూనవేణి. వినోద్. గుగ్గిల అభిషేక్. సాయిరాం. మహేష్. సంజయ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఇందిర ఇండ్లకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోభూ పూజ…

ఇందిర ఇండ్లకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోభూ పూజ…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో ఇందిర మహిళలకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ . ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఆశయం దిశగా. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన. అందిస్తూ. అర్హులకు . లబ్ధిదారులకు.అండగా ఉండి ప్రభుత్వం. ఇందిరమ్మ. ఇండ్లు మంజూరైన. మహిళలకు. భూమి పూజ చేయడం జరిగిందని. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్.పూజా కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల గ్రామ ప్రజల ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిజమైన పేద ప్రజలకు. అనేక సంక్షేమ పథకాలు. అందిస్తూ వారికి అండగా ఉంటున్నారని ఇందిరమ్మ ఇల్లా నిర్మాణాలకు ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని. లబ్ధిదారులు. అందరూ . వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నామని అలాగే. ఆరోగ్యారంటీలే. కాకుండా. అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా మా ప్రభుత్వంలో ప్రజా పాలన కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందిరమ్మ ఇండ్ల. అవకాశం కల్పిస్తూ. పేదవారి . కాంగ్రెస్ పెద్దలు. అధికారులకు పెద్దలకు ఎంతో కృషి చేస్తున్నారని వారందరికీ పేరుపేరునా లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు.తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ తో పాటు. వ్యవసాయ.మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు. నేరెళ్ల నర్సింగ్ గౌడ్. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. లింగాల భూపతి. సత్తు శ్రీనివాస్ రెడ్డి. మునిగిల రాజు. గుగ్గిల భరత్ గౌడ్. గ్రామ శాఖ అధ్యక్షులు కోలా శంకర్. ఆనందం. ఎల్లయ్య. శ్రీను. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఇందిరమ్మ ఇల్లు భూమి ముగ్గేసిన కార్యదర్శి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-1-3.wav?_=7

ఇందిరమ్మ ఇల్లు భూమి ముగ్గేసిన కార్యదర్శి

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రంలో బంగ్లా గడ్డ పంచాయతీ పరిధిలోని కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గ్రామపెద్దలు భూమిపూజ చేశారు. ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్దిదారులకు కొలతలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు లబ్దిదారుల అకౌంట్లలో జమచేస్తుందని అన్నారు. ఇండ్లు మంజూరు అయిన లబ్దిదారులు ఇండ్ల నిర్మాణం పనులను ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వీరేశం పటేల్ మొహమ్మద్ అష్రఫ్ అలీ ఇస్మాయిల్ సాబ్ మొహమ్మద్ బషీర్ మొహమ్మద్ గౌసుద్దీన్, తదితరులు పాల్గొన్నారు

దిగ్వాల్లో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-33.wav?_=8

దిగ్వాల్లో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ మండలంలోని దిగ్వాల్ గ్రామంలో ప్రజపాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. పేదవారికి సొంత ఇంటి కల నెరవేర్చడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని ఆత్మ కమిటీ చైర్మన్ పట్లోళ్ల రామలింగా రెడ్డి గురువారం అన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. భూమి పూజలో పాల్గొని పనులు ప్రారంభించారు.

బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల తనిఖీలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-05T134426.549-1.wav?_=9

బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల తనిఖీలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

బస్వాపూర్ గ్రామంలో. ఇందిరమ్మ ఇండ్లతీరుపై. హారా తీసిన స్థానిక ఎంపీడీవో. ఈ సందర్భంగా మాట్లాడుతూ. తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల వాడవాడలా ఇండ్లు తిరుగుతూప్రభుత్వ ఆదేశానుసారం. విడతలవారీగా తొందరగా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రజలకు కేటాయించిన ఇండ్లకు సంబంధించిన దానిని లబ్ధిదారులు తొందరగా పనులు పూర్తి చేసుకొని ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని ఈ సందర్భంగా. స్థానిక. తంగళ్ళపల్లి. ఎంపీడీవో లక్ష్మీనారాయణ లబ్ధిదారులను వారు చేస్తున్న పనులు త్వరగా ముగించుకొని. ప్రభుత్వం అందించే. రుణాలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎగుర్ల.ప్రశాంత్. దేవరాజ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ గ్రామ లబ్ధిదారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ఈనెల 13న డబుల్ బెడ్ రూం ఇళ్ల అప్పగింత.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-05T131449.698.wav?_=10

ఈనెల 13న డబుల్ బెడ్ రూం ఇళ్ల అప్పగింత.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని హోతి (కె)లో నిర్మించిన 660 డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంభందించిన తాళాలను ఈనెల 13న లబ్ధిదారులకు అప్పగించనున్నట్లు జహీరాబాద్ తహశీల్దార్ దశరథ్ తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కావున లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే…!

కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే… మడమ తిప్పదు

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మొదటి విడత లక్ష మంజూరు

డి సి సి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలం సప్పిడి గుట్ట గ్రామపంచాయతీ కి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద 6 గురు లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లను మంజూరు చేయగా 4 గురు లబ్ధిదారులు బానోతు నీలా, సపావట్. కౌంసల్య, బానోతు రజిత, తేజావత్ కాంతమ్మ లు బేస్మెంటు బెడ్ నిర్మాణం పూర్తి అయి వారి ఎకౌంట్లో మనిషికి లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద జమ చేయడం జరిగింది. జమ అయిన లక్ష రూపాయలకు సంబంధించిన వారి ఎకౌంట్ స్టేట్ మెంటును లబ్ధిదారులకు ఇస్తూ విషయాన్ని చెప్పిన కేసముద్రం సింగిల్ విండో వైస్ చైర్మన్ అంబటి మహేందర్ రెడ్డి, గ్రామ కార్యదర్శి వి .వినయ్ కుమార్, ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల. రేవంత్ రెడ్డికి, మహబూబాబాద్,శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ , లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోఇందిరమ్మ కమిటీ సభ్యులు బానోత్ బద్రు నాయక్,బానోత్ వాలు, రవీందర్, లచ్చిరాం, లాలు, సుమన్ పాల్గొన్నారు.

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన లబ్ధిదారులకు..

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన లబ్ధిదారులకు

◆:- శాసనసభ్యులు శ్రీ కోనింటీ మాణిక్ రావు

◆:- డీసీఎంస్ చైర్మన్ శివకుమార్

◆:- మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 6 మంది లబ్ధిదారులకు 12 చెక్కులను గాను ₹5,11,000 విలువ గల చెక్కులను *క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు డీసీఎంస్ చైర్మన్ శివకుమార్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం .గార్లతో కలిసి అందజేయడం జరిగింది.లబ్ధిదారుల వివరాలు:-ఝరాసంగం గ్రామానికి చెందిన సాయంలా లక్షికాంత్ గారికి ₹.60,000, బేగరి లక్ష్మయ్య గారికి ₹.33,000 వనంపల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల మహాదేవ్ గారికి ₹.22,500, & ₹.37,500 మచ్నూర్ గ్రామానికి చెందిన టంటం దశ్రత్ గారికి ₹.17,000 నర్సాపూర్ గ్రామానికి చెందిన భూత్నపిల్లి సిద్దన్న గారికి ₹.33,000 & ₹.12,500
ఈదులపల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల వీరేంద్ర గారికి ₹.60,000 కృష్ణ పూర్ గ్రామానికి చెందిన ఎండి ఇస్మాయిల్ గారికి ₹.60,000 ప్యారవం గ్రామానికి చెందిన బి వెంకటేశం గారికి ₹.60,000 కుప్పనగర్ గ్రామానికి చెందిన గడ్డబాది మైబూబ్ అలీ గారికి ₹.60,000
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నారాయణ, మాజీ కేతకీ ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్, మాజీ సర్పంచ్ లు బస్వరాజ్ పటేల్, శ్రీనివాస్ రెడ్డి, కిషన్,అమిత్ కుమార్, ప్రభు పటేల్, నాయకులు శశి వర్ధన్ రెడ్డి, సంతు పటేల్, నాగన్న, మూసాపటెల్, అసిఫ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు *ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి , డీసీఎంస్ చైర్మన్ శివకుమార్ గారికి,మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం గారికి బిఆర్ఎస్ నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు ..

కేసముద్రం లోఇందిరమ్మ లబ్ధిదారుల సంబరాలు..

కేసముద్రం లోఇందిరమ్మ లబ్ధిదారుల సంబరాలు

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ కేసముద్రం విలేజ్ కి చెందిన వెన్ను పార్వతి రాంబాబు కి ఇందిరమ్మ ఇల్లు బిల్లు మొదటి విడత లక్ష రూపాయలు వచ్చిన సందర్భంగా లబ్ధిదారులైన వెన్ను పార్వతీ రాంబాబులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లబ్ధిదారుల ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ కు కృతజ్ఞతలు చెప్పుతూ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మిఠాయి పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు కేసముద్రం కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కత్తెరసాల శ్రీనివాస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కీర్తి సురేందర్ మండల ఓబీసీ ప్రెసిడెంట్ చిట్ల సంపత్ మండల ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర రమేష్ గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్ల రవి ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సొసకండ్ల సుభాష్ రెడ్డి మాజీ వార్డ్ మెంబర్ గుండు లక్ష్మీనారాయణ బోళ్ల కట్టయ్య పెండ్యాల లక్ష్మణ్ గుబ రాజు జీలకర్ర బాబు కీర్తి వేణు తదితరులు పాల్గొన్నారు ఇందిరమ్మ ఇంటి బిల్లు మొదటిసారి రావడంపై మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి కి మరియు మున్సిపల్ సిబ్బంది ప్రభాకర్ రోమన్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు పంపిణీ.

తాట్లవాయి. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు పంపిణీ. . .

రాయికల్, జూలై 16, నేటి ధాత్రి. . .

రాయికల్ మండలంలోని తట్లవాయి. గ్రామపంచాయతీ ఆవరణలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలోప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కోసరి మహేష్ చెట్లపల్లి రాజు కెల్లెటి స్వాతి కొండవేని లక్ష్మి బద్ది శ్రీనివాస్ మాజీ ఉపసర్పంచ్ ఆకుల మల్లేశం పంచాయతీ కార్యదర్శి బాణావతి తిరుమల్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఈ తిరుమల కారోబార్ మహిపాల్ లబ్ధిదారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి.

లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) చెక్కులు పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి;

జహీరాబాద్ టౌన్ : పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారీ నివాసంలో శనివారం జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులు
న్యాల్కల్ మండలం సంగమేశ్వర్ -న్యాల్కల్
(₹55,000/-) నర్సింహులు- కాకిజన్వాడ
(₹24,000/-) అశ్విని – హద్నూర్
(₹60,000/-) మాణిక్ – కాకిజన్వాడ
(₹60,000/-)మొత్తం ₹ 199,000 /- విలువగల సీఎం రిలీఫ్ ఫండ్(CMRF) చెక్కులను ఆయన స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అందజేశారు ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ఈ పథకం ద్వారా మరిన్ని వ్యాధులకు ఉచిత చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు.ఈ కార్యక్రమo లో అశ్విన్ పాటిల్,రాజేంద్ర,జగన్నాథ్ రెడ్డి,వేంకట్ రెడ్డి,వెంకట్, సందీప్,ఫయీమ్, ఇస్మాయిల్,సందీప్ రెడ్డి, సునీల్ రెడ్డి మరియు లబ్దిదారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version