మృతి చెందిన కుటుంబానికి ఆటో యూనియన్,ఎస్ఆర్కే…

మృతి చెందిన కుటుంబానికి ఆటో యూనియన్,ఎస్ఆర్కే పాఠశాల యాజమాన్యం ఆర్థిక సహాయం అందజేత..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

ఒకే కుటుంబానికి చెందిన బార్య భర్తలు మృతి చెందిన సంఘటన పట్టణంలో కలిచివేసింది. రామకృష్ణాపూర్ పట్టణం సర్దార్ వల్లభాయ్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ ఎలగందుల లింగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం తొమ్మిదవ రోజు తిథి కర్మ ఉండగా అతని భార్య ఎలగందుల పద్మ తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందడంతో కాలనీవాసులు ద్రిగ్బాంధీ చెందారు. లింగయ్య దంపతులకు పిల్లలు లేకపోవడంతో మృతురాలు పద్మా అక్క కుమారులు బాధ్యతను చేపట్టి దహన సంస్కారాలు చేశారు. పట్టణ ఆటో యూనియన్, ఎస్ఆర్కే పాఠశాల యాజమాన్యం లింగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న లింగయ్య, ఎస్ఆర్కే పాఠశాలలో ఆయాగా విధులు నిర్వహిస్తున్న పద్మ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరణమని పాఠశాల యాజమాన్యం, ఆటో యూనియన్ నాయకులు విచారం వ్యక్తం చేశారు.

ప్రజాభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయం…

ప్రజాభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయం
సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన
టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు
మల్లాపూర్ సెప్టెంబర్ 27 నేటిదాత్రి

ప్రజాభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి సహాయనిధితో ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆదుకుంటుందని టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మొగిలిపేట గ్రామం లో మల్లాపూర్ మండలం కి చెందిన ముఖ్యమంత్రి సహాయనిధి కి సంబంధించిన 9 లక్షల 25 వేల విలువగల 17 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమం లో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్,కిసాన్ కాంగ్రెస్ సేల్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి,టీపీసీసీ ఫిషర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ,రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి,మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా,మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గంధం రాజేశం,మల్లాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మల రాజు, జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి గజ్జి రమేష్,మండల ఫిషర్మాన్ అధ్యక్షుడు రొడ్డ రాజు,మాజీ ఉప సర్పంచ్ ఎన్నెడ్ల రాములు,మొగిలపేట విడిసి చైర్మన్ వంగ శ్రీనివాస్,మాజీ విడిసి చైర్మన్ మహబూబ్ ఖాన్, మసుల చిన్నయ్య,మిట్టపల్లి మహేష్, ఎండి సల్మాన్,సుద్దాల సతీష్, దేవ రవి,కల్లెడ గంగాధర్,ఎండి జాఫర్,సింగరపు అశోక్,ఇప్పపెల్లి గణేష్,గోపిడి నరేష్, ఎట్టేం మల్లేశ్,పోతు గోపి,సమీర్ సర్కార్,నల్లపు పోతరాజు శ్రీకాంత్,కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి కాంటారెడ్డి ఆర్థిక సహాయం…

బాధిత కుటుంబానికి కాంటారెడ్డి ఆర్థిక సహాయం

నిజాంపేట, నేటి ధాత్రి

 

 

మండలం కేంద్రంలోని షౌకత్పల్లి కి చెందిన సుజాత మృతి చెందింది. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ కాంటారెడ్డి తిరుపతిరెడ్డి స్థానిక టిఆర్ఎస్ నేతల ద్వారా బాధిత కుటుంబానికి 5000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ మావురం రాజు,
మాజీ సర్పంచ్ అరుణ్ కుమార్, పత్య నాయక్, రాజు నాయక్ ,రమేష్ , రవీందర్ రెడ్డి, సుర మల్లేశం,రాములు,రాంరెడ్డి, ఐలయ్య, బాల్ రెడ్డి, రాజు నాయక్, నాగిరెడ్డి, దేవుల మహారాజ్, అంతీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version