గ్రామ పంచాయతీ కార్యాలయం లో అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు….

గ్రామ పంచాయతీ కార్యాలయం లో అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు.

కోదాడ, నేటి ధాత్రి:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను మంగళవారం కోదాడ మండలం తొగర్రాయి గ్రామ గ్రామపంచాయతీ కార్యాలయం నందు గ్రామ సర్పంచ్ లిక్కీ గురవమ్మ వెంకటయ్య, ఉపసర్పంచ్ ఉమామహేశ్వరి శీను లు బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మనదేశంలో పుట్టడం మన అందరి అదృష్టం అన్నారు. ప్రపంచంలోని మహనీయుల జాబితాలో అగ్రగణన్యుడుగా అంబేద్కర్ ఉన్నారన్నారు. అంబేద్కర్ ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా సమ సమాజ స్థాపనకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కులాలకు అతీతంగా మహనీయులను స్మరించుకోవాలని అది మనందరి బాధ్యతనీ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అవినాష్, వార్డ్ నెంబర్ పులి సంధ్య, నాగమ్మ వీరయ్య , నరేష్, దేవాలయం కమిటీ చైర్ పర్సన్ సరస్వతి మదన్ మోహన్, ఎస్సి సెల్ అధ్యక్షులు పులి సులోచన రావు, వెంకయ్య, మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు, ఆదం నాగరాజు, ఏడుకొండలు, సునీత, గ్రామపంచాయతీ సిబ్బంది యువకులు మహిళలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు:

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు:

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రం లోని కూడలి వద్ద భూపాల పల్లి అభివృద్ధి ప్రదాత మాజీ శాసనసభ్యులు గండ్ర వెంక టరమణారెడ్డి, వరంగల్ జిల్లా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశాలమేరకు మం డల అధ్యక్షులు గంగుల మనో హర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మె తుకు తిరుపతి రెడ్డి ఆధ్వర్యం లోఅంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళుల ర్పించారు.

ఈ కార్య క్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, వార్డ్ మెంబర్లు, గ్రామశాఖఅధ్యక్షులు, ఉపా ధ్యక్షులు, ప్రధాన కార్యద ర్శులు,కోశాధికారులు, యూ త్ నాయకులు, సోషల్ మీడి యా కోఆర్డినేటర్లు, వివిధ సంఘాల అధ్యక్షులు, రైతు బంధు సమితి నాయకులు, మాజీ ఎంపీటీసీలు,బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, మ హిళా కార్యకర్తలు పాల్గొన్నా రు.

శ్రీ వరవర రంగనాయక భాష నిలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

శ్రీ వరవర రంగనాయక భాష నిలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

కోదాడ, నేటి ధాత్రి:

 

మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను శనివారం కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామ వరవర రంగనాయక భాషా నిలయం గ్రంథాలయం నందు జ్యోతిరావు పూలే చిత్రపటాన్ని పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. జ్యోతి రావు పూలే చేసిన సామాజిక సేవలకు గుర్తింపుగా 1888లో మహాత్మా అనే బిరుదు లభించింది. బడుగు బలహీన వర్గాల మహిళల కోసం ఆయన చేసిన సేవలు శిరస్మరణీయమైనవి.కుల వ్యవస్థ నిర్మూలన, అంటరానితనం తొలగింపు స్త్రీ విద్య, మహిళా సాధికారత కోసం తన భార్య సావిత్రిబాయి పూలే తో కలిసి 1848 లో పూణేలో బాలికల కోసం మొదట పాఠశాలను స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య, ఇర్ల శ్రీనివాస్ రెడ్డి,వట్టికూటి గురవయ్య, మాజీ సర్పంచ్, పాపి శెట్టి సత్యం పిఎసిఎస్ మాజీ చైర్మన్, కామిశెట్టి నరసింహారావు, మాజీ దేవాలయం చైర్మన్, జాబిశెట్టి నాగప్రసాద్ గ్రామ శాఖ అధ్యక్షులు,బండి చిన్న కోటయ్య, గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు 9వ వార్డు మెంబర్, కాసాని శ్రీను, ఇర్ల గోపిరెడ్డి, పోశంఎర్ర కొండలు, ఇర్ల నర్సిరెడ్డి, సంపటం శ్రీనివాసరావు, మార్గం రామచందర్రావు,పొట్టా గాంధీ, అమరబోయిన రవి,దాట్ల సైదాచారి, భూక్యా హీరమ్. కుక్కడపు గోపయ్య,బొర్రా కొండలు, పోశం గాంధీ, పోశం వెంకటయ్య, గూడపు వెంకటేశ్వర్లు,దండాల పద్మావతి, కత్తి మాధవి,బంక వరలక్ష్మి, పిడమర్తి రజిని, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version