దళిత రత్న గ్రహీత రత్నంకు ఘన సన్మానం

దళిత రత్న అవార్డు గ్రహీత రత్నం కు ఘనసన్మానం.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండల కేంద్రానికి చెందిన పరికిరత్నం కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జన్మదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ రవీంద్ర భారతిలో సమాజ సేవకులైన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న అవార్డులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం సామాజి క ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్న పరికి రత్నంకు రాష్ట్ర ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ కనకరాజు, ఇటుక రాజ్ కుమార్ చేతుల మీదుగా దళిత రత్నఅవార్డు తీసుకోవడం చాలా సంతోషకరమని డిటి ఎఫ్ మండల అధ్యక్షుడు కందుల గోవర్ధన్ అన్నారు. ఈ మేరకు దళిత విద్యావంతుల వేదిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అవార్డు గ్రహీత ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక ఉద్యమాల కార్యక్రమాలలో ఎంతోమందికి చేయూతనిస్తూ గత 30 సంవత్సరాలు నుండి సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్న రత్నంకు అరుదైన గౌరవం దక్కడం శుభసూచకమని. రాష్ట్ర స్థాయి లోనే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని అవార్డులు సాధించి మండలానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని తనకంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించాలని. ఉన్నత విద్యలు అభ్యసించినటువంటి సామాజిక సేవ దృక్పథం కలిగినటువంటి సమాజ సేవకులు నిత్యం సమాజానికి సేవలు అందించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య, విహెచ్పీఎస్ మండల అధ్యక్షుడు పులి రమేష్ గౌడ్, ఉప సర్పంచ్ బొట్ల దయాకర్ మాదిగ, రాజశేఖర్, సిహెచ్ ఆరోగ్యం తదితరులు పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్ ఆసుపత్రిలో అంబేద్కర్ జయంతి వేడుకలు…

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో 135 వ అంబేద్కర్ జయంతి సందర్భంగా హాస్పిటల్ సిబ్బందికి చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు

నేటి దాత్రి నాగర్ కర్నూల్ జిల్లా

డాక్టర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అంబేద్కర్ కు నివాళులర్పించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రూపు దిద్దిన మహానీయుడని సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చీరస్వర్ణీయమని పేర్కొన్నారు
డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హాస్పిటల్ స్టాప్ కు చీరల పంపిణీ ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర వైస్ చైర్మన్ బాదం రమేష్ మున్సిపల్ కౌన్సిలర్ టౌన్ ప్రెసిడెంట్ రాజు హాస్పిటల్ డాక్టర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు

అంబేద్కర్ అందరికీ సమాన హక్కులు కల్పించాడు…

అంబేద్కర్ అందరికీ సమాన హక్కులు కల్పించాడు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

దేశంలోనే ప్రజలందరికీ కులాలకు మతాలకు అతీతంగా రిజర్వేషన్లను హక్కులను కల్పించిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్నారు ఏప్రిల్ 14 మంగళవారం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల సందర్భంగా భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ హాజరయ్యారు అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మహోన్నత వ్యక్తి దేశ ప్రజల అందరికీ పౌర హక్కులు ఓటు హక్కును కల్పించిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుటకు, పౌరులందరికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, భావప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలతో కూడిన-స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను, అంతస్తులోను, అవకాశములోను – సమానత్వాన్ని చేకూర్చుటకు, అందరిలో వ్యక్తి గౌరవాన్ని, దేశ ఐక్యమత్యం, అఖండతను, తప్పక తీసుకొచ్చే-సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టా పూర్వకంగా తీర్మానించుకుని, రాజ్యాంగ పరిషత్ 1949వ సంవత్సరం నవంబరు 26వ తేదిన ఆమోదింపబడి, చట్టబద్దం కల్పించారు ఆ మహానీయులకు కృతజ్ఞతలు
42వ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికను సవరించడం జరిగింది. “సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రరాజ్యం”
దేశ ఐకమత్యం”కు బదులు “దేశ ఐక్యత-అఖండత”గా మార్చడం జరిగింది.
అని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు గౌడ్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇందిరా భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాసు ప్రజా సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

యాదగిరిగుట్ట లో ఘనంగా బాబా సాహెబ్ జయంతి వేడుకలు…

యాదగిరిగుట్ట లో ఘనంగా బాబా సాహెబ్ జయంతి వేడుకలు

#ఘనమైన నివాళులర్పించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట నేటి ధాత్రి:

యాదగిరిగుట్ట పట్టణంలోని బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అంబేద్కర్ విగ్రహానికి పులామాల వేసి ఘనంగా నివాళులర్పించారు..ఆ తర్వాత రోడ్డు భద్రత లో భాగంగా అవగహన కల్పించడం కోసం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ..బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయానికి మార్గదర్శిగా, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్.చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, విద్యను ఆయుధంగా తీసుకుని ప్రపంచ స్థాయి విద్యను అభ్యసించి, భారతదేశానికి గొప్ప దిశానిర్దేశం చేశారు.
ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించేలా రాజ్యాంగాన్ని రూపొందించడం ఆయన గొప్ప కృషి.సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు, కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం ఎన్నటికీ మరువలేనిది.
“విద్య పొందండి,సంఘటితమవండి, పోరాడండి” అనే ఆయన సందేశం నేటి యువతకు మార్గదర్శకం.
ప్రభుత్వం కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదలు, దళితులు, బీసీల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా కృషి కొనసాగుతోంది.యువత అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని చదువులో ముందుండి, సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలి. సమానత్వం, సోదరభావం, న్యాయం అనే విలువలను మన జీవితంలో ఆచరించాలి.చివరగా, మనమందరం కలిసి అంబేద్కర్ ఆశయాలను పాటిస్తూ సమానత్వ సమాజాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉండాలి అని తెలిపారు. ఈ క్రమంలో యాదగిరిగుట్ట పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్, ట్రాఫిక్ పోలీస్ సిఐలు, ఎస్ఐలు పోలీస్ అధికారులు, మున్సిపల్ చైర్మన్ వాణి భరత్ గౌడ్, బోడ రాధ సురేష్ నేత, కాంగ్రెస్ నాయకులు, పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ లో ఏప్రిల్ 17, 18 న జరుగు దళిత హక్కుల పోరాట..

వరంగల్ లో ఏప్రిల్ 17, 18 న జరుగు దళిత హక్కుల పోరాట సమితి డి హెచ్ పి ఎస్ రాష్ట్ర 2వ మహాసభలను జయప్రదం చేయండి.

బెల్లంపల్లి నేటిధాత్రి :

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో డి హెచ్ పి ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్ అధ్యక్షతన రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డి హెచ్ పి ఎస్ జిల్లా కార్యదర్శి దేవి పోచన్న మాట్లాడుతూ
ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ దళిత బంధు స్థానంలో దళితులకు అంబేద్కర్ అభయ హస్తం పేరున 12 లక్షల రూపాయ లు ఇస్తామని దళితులను దగా చేసిందని దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నా
దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ, బిజెపి ప్రభుత్వం ఏర్పడిన నుండి దళితుల పైన విపరీతంగా దాడులు అత్యాచారాలు పెరిగాయని బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి అంబేడ్కర్ ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రాజ్యాంగబద్ధమైన సంస్థలను తన గుప్పిట్లోకి తెచ్చుకుని, ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తోంది. రిజర్వేషన్ల అమలులో జాప్యం చేస్తూ, పరోక్షంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కింది మతోన్మాద రాజకీయాలతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తోంది. మనువాద భావజాలాన్ని రుద్దడం ద్వారా సమాజాన్ని విడగొట్టే కుట్రలు చేస్తోంది. కార్పొరేట్ సేవలో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, కేవలం కొద్దిమంది కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే బిజెపి పనిచేస్తోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగంతో సామాన్యుడు అల్లాడుతుంటే, సంపద అంతా కొద్దిమంది చేతుల్లోకి వెళ్లేలా చేస్తూ సామాజిక అసమానతలను పెంచుతోంది. తక్షణమే కుల గణన చేపట్టి జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలి.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపి, రిజర్వేషన్లను పటిష్టంగా అమలు చేయాలి.
ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి
దళితులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలి.
సామాజిక న్యాయం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మా పోరాటం కొనసాగుతుంది. అన్ని సామాజిక శక్తులు ఏకమై ఈ నియంతృత్వ పోరాటాన్ని తిప్పికొట్టాలని పిలుపునిస్తున్నాము. డి హెచ్ పీ ఎస్ రాష్ట్ర మహా సభలు ఏప్రిల్ 17 ,18 వరంగల్లో జరగనున్నాయి. ఈ మహాసభల్లో దళితుల అభివృద్ధి దళితులపై జరుగుతున్న దాడులు అసమాన తలపై సమగ్రమైన చర్చ జరిపి భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించుకొని ఈ మహాసభల్లో ప్రజా పోరాటాలకు సన్నద్ధమవుతామని ప్రజలకు పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఆడెపు రాజమౌళి సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి, బొంతల లక్ష్మీనారాయణ మండల కార్యదర్శి, చిప్ప నరసయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా సమితి సభ్యులు డిఆర్ శ్రీధర్, గుండా చంద్ర మాణిక్యం, రత్నం రాజం, మేకల రాజేశం, కొంకుల రాజేష్ ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు, గోమాస గంగారం డి హెచ్ పి ఎస్ జిల్లా సమితి సభ్యులు, బొల్లం సోనీ ఎన్ ఎఫ్ ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు, నాయకులు గుండా శంకర్ గుండా ప్రశాంత్ ప్రదీప్ రాజేందర్ కిరణ్ లాల్ తదితర నాయకులు పాల్గొన్నారు.

దళితుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు-అశోక్….

దళితుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు-అశోక్

కరీంనగర్, నేటిధాత్రి:

దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్పిఎస్ జగిత్యాల జిల్లా రెండో మహాసభలో ఏఐడిఆర్ఎమ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్నా అట్టడుగు వర్గాలైన దళితులు అభ్యున్నతి కోసం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు నేటికీ దళితులకు దరిచేరడం లేదు. భారత రాజ్యాంగం ప్రతి మనిషికి ఓటు హక్కు కల్పించడం జరిగినది, తరతరాలుగా అణిచివేత, అంటరానితనం, వివక్ష, దోపిడి పీడనాల కింద నలిగిపోతున్న వర్గాలు దళితులు అభివృద్ధి లక్ష్యంగా దేశవ్యాప్తంగా దళిత సామాజిక న్యాయం కోసం విద్య, వైద్య, వ్యాపారాలని రద్దు చేయాలని, ఉపాధి అవకాశాల కోశం దేశ సంపదలో దళితుల వాటా కోసం సమర శంఖం పూరించడానికి 2026 ఏప్రిల్ 17,18న వరంగల్ లో జరిగే రాష్ట్ర రెండో మహాసభలకు జగిత్యాల జిల్లా నుండి అధిక సంఖ్యలో ప్రతినిధులు హాజరుకావాలని కోరారు. అనంతరం డిహెచ్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ దళితులను ఆర్థికంగా ఆర్థికంగా రాజకీయ సామాజిక హక్కుల పరిరక్షణ కోసం, కుల వివక్షత కుల నిర్మూలన కోసం ఎస్సీ సబ్ ప్లాన్ ను అమలు చేయాలని నిధులు కేటాయించాలని స్వయం ఉపాధి పథకాలను అమలు చేయాలని కోరారు. ఈసందర్బంగా రెండో మహాసభలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా మునుగూరి హనుమంతు, ప్రధాన కార్యదర్శిగా ఇరుగురాల భూమేశ్వర్, ఉపాధ్యక్షులుగా సురేష్, సహాయ కార్యదర్శిగా ప్రవీణ్, కోశాధికారిగా రాజయ్య, చిలుముల మైసయ్య, జుట్టు శేఖర్, మచ్చ అంజయ్య, గుండు నారాయణ, మునుగురి గంగనర్సయ్య, తాటికొండ నరేందర్, మోదుగుపెల్లి మల్లయ్య, బొమ్మన పురుషోత్తం, మల్లార్పు నర్షయ్యలను ఎన్నుకోవడం జరిగింది. మరో పదమూడు మందిని కార్యవర్గ కౌన్సిల్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

సబ్సిడీ రుణాల గడువు పెంచాలని డిమాండ్

సబ్సిడీ రుణాల గడువును పెంచాలి

తెలంగాణ మాదిగ జర్నలిస్టులఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెపాక భాస్కర్

పరకాల,నేటిధాత్రి

 

రాష్ట్ర వ్యాప్తంగాఎస్సీ కులస్తులకు జీవనోపాధి కల్పించి వారి అభివృద్ధి చెందుటకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను అందించుటకు ఈనెల 24 వరకు ఉన్న గడువును అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకు పొడిగించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్టులఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెపాక భాస్కర్ అన్నారు.వ్యాపారానికి సంబంధించిన యూనిట్లను కూడా ప్రవేశపెట్టి ఎక్కువ యూనిట్లను పెంచాలని దరఖాస్తు చేయడానికి కులము,ఆదాయం సర్టిఫికెట్లు తప్పనిసరి కాబట్టి రెండు రోజులు సెలవులు ఉండడం వలన రెవెన్యూ కార్యాలయం నుండి సర్టిఫికెట్లు అందక చాలామంది కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేయలేకపోయారని రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్ ఆలోచన చేసి గడువు తేదీని పొడగించాలని కోరారు.

బడ్జెట్లో అంకెలు పెరిగితే దళితులకు ఒరిగేదేముంది..

బడ్జెట్లో అంకెలు పెరిగితే దళితులకు ఒరిగేదేముంది?

సబ్ ప్లాన్ కేటాయింపులు ఫుల్..ఖర్చులు నిల్

కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్కూరు శ్రీధర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 9వసారి ప్రవేశపెట్టిన 2026- 27సం. 53 47,315 కోట్లబడ్జెట్ ప్రవేశ పెట్టింది. దేశంలో 20 శాతం ఉన్న దళితులకు సబ్ ప్లాన్ కింద 1,96,400 కోట్ల రూపాయల కేటాయించింది. కేటాయింపులు పెంచడం ద్వారా దళితులకు ఒరిగేదేముందని వాటి ని ఖర్చు చేయడంలో జరుగుతున్న నిర్లక్ష్యం వల్ల దళితులకు మరింత అన్యాయం జరుగుతుందని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్కూరు శ్రీధర్
అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటాయించింది.102 శాఖల ద్వారా కేటాయింపులు చేసిందని,ప్రధానంగా 2025 26 బడ్జెట్ను పోలిస్తే చూస్తే బడ్జెట్ 13,611 కోట్లు కాగా, సబ్ ప్లాన్ కింద 1,68,478 కోట్లు, అంబరిల్లా బడ్జెట్ 9540 కోట్లు కేటాయించారని చెప్పారు సుమారు 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినప్పటికీ అవి ఒకచోట పెట్టి ఫూల్ చేసి నోడల్ ఆఫీసర్ కేటాయించి ఖర్చు చేయకపోవడం వల్ల దళితుల ప్రత్యక్ష ప్రయోజనాల కోసం ఖర్చు చేయడం లేదని విమర్శించారు వివిధ శాఖల ద్వారా ఖర్చుపెట్టినప్పటికీ ప్రత్యేకంగా దళితులకు ఖర్చు చేయకపోవడంతో వారి సంక్షేమం కుంటుపడుతుందన్నారు దళితులలో 70శాతం కనీస మౌలిక సౌకర్యాలకు నోచుకోవడం లేదని పేర్కొన్నారు 60 శాతం మంది దళితులు సరైన దుస్తులు పౌష్టికాహారం కు నోచుకోవడం లేదన్నారు దళితుల జనాభా 20 నుంచి 25 శాతానికి పెరుగుతున్నప్పటికీ బడ్జెట్ మాత్రం 16% దగ్గరే ఆగిందన్నారు.జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయింపులు లేవ న్నారు గ్రామీణ ప్రాంతాలలో వలసలు పెరిగి పట్టణాలకు వలసలు
వస్తున్న అత్యధికులలో దళితులు ఉన్నారని చెప్పారు పట్టణాలలో వారికి సరైన నివాసం లేదన్నారు. ఆర్థికంగా అత్యంత బలహీనంగా సామాజికంగా అణిచివేతకు గురవుతున్న దాడులపై బిజెపి 12 ఏళ్ల పాలనలో దళితులపై మరిన్ని దాడులు పెరిగాయన్నారు గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తూ విబిజీ రాంజీ బిల్లు తీసుకురావడం ద్వారా దళితుల నోటికాడబుక్క లాగేసిందాన్నారు గతంలో 90% బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం భరించే దాని స్థానంలో ఇప్పుడు రాష్ట్రాల మీదికి వదిలేసి 60 శాతానికి కేంద్రం తగ్గించుకొని 40 శాతం రాష్ట్రాల పైన భారంమోపుతుందన్నారు 125 రోజుల పని దినాలు పెంచుతామన్న ప్రభుత్వం సుమారు 1.50 000 కోట్ల రూపాయల కేటాయించాలన్నారు.
ఆ చట్టం ప్రారంభ దినాలలో 1,18 000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం నేడు దానిని తగ్గించిందన్నారు
బడ్జెట్ కేటాయింపులలో పెంచుతున్నట్లు ప్రకటిస్తున్న ప్రభుత్వం వాటిని ఖర్చు చేయడంలో చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదన్నారు మూడు విభాగాల ద్వారా దళితులకు కేటాయింపులు చేస్తున్న ప్రభుత్వం సబ్ ప్లాన్ కింద కేంద్రమే ఒక నోడల్ ఆఫీసర్ ను అపాయింట్ చేసి 102 శాఖల ద్వారా విడివిడిగా కాకుండా ఒకేచోట ఫూల్ చేసి దళితుల ప్రత్యక్ష ప్రయోజనాల కోసం ఖర్చు అయ్యే విధంగా ప్రత్యేక కృషి కొనసాగించాలన్నారు ప్రధానమంత్రి దళితుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రతి మూడు నెలలకోసారి ఈ బడ్జెట్ పై సమీక్ష చేయాలన్నారు అంకెల్లో పెంచడం తప్ప ఆచరణలో ఖర్చు చేయకపోవడం వల్ల దళితులకు ఒరిగేది ఏమి ఉండదు అన్నారు.

ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు తహసిల్దార్ కి వినతి పత్రం…

ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు తహసిల్దార్ కి వినతి పత్రం

పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు ప్రభుత్వ స్థలం కేటాయించాలని పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ సోమవారం జైపూర్ తహసిల్దార్ వనజా రెడ్డికి వినతిపత్రం అందించారు.పౌనూర్ గ్రామంలో 500 పైగా ఎస్సి కమ్యూనిటీకి చెందిన వాళ్లు నివసిస్తున్నారు వారికి కమ్యూనిటీ హాల్ లేక అనేక ఇబ్బందికు గురవుతున్నట్టు పేర్కొన్నారు.ఎస్సీ కమిటీ హాల్ నిర్మాణం చేపట్టడం వల్ల దళిత వర్గాల యువత,మహిళలు,సామాజిక కార్యక్రమాలు నిర్వహించినందుకు తగిన సదుపాయాలు లభిస్తాయని ఇలాంటి కమిటీ హాల్ దళితుల అభివృద్ధికి సామాజికంగా ముందుకు వెళ్లడానికి సహాయపడతాయని అన్నారు.తహసిల్దార్ వనజా రెడ్డి వెంటనే స్పందించి స్థలం కేటాయించే విధంగా కృషి చేయాలని కోరారు.

అంబేద్కర్ నేషనల్ అవార్డుకు కిరణ్ ఎంపిక…

అంబేద్కర్ నేషనల్ అవార్డుకు కిరణ్ ఎంపిక.

చిట్యాల, నేటిదాత్రి :

 

స్పూర్తి సర్వీసెస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్.

చిట్యాల మండల కేంద్రానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం మండల సీనియర్ నాయకులు గురుకుంట్ల కిరణ్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపికైనట్లు స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జీవోస్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్ తెలిపారు. చిట్యాల మండల అంబేద్కర్ యువజన సంఘంలో గత 15 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ , భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళుచూ మరియు మహనీయుల కార్యక్రమాలను నిర్వహిస్తూ మృతుల కుటుంబాలను , పరామర్శించి సహాయ సహకారాలు అందించాడని, దళితులపై, మహిళలపై జరుగుతున్న సంఘటనలను ఖండిస్తూ వారికి అండగా నిలబడ్డారని , సామాజిక సేవ కార్యక్రమాలు అనేకం చేశాడని అన్నారు . అతను చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందని డాక్టర్ రమేష్ చెప్పారు. అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపికైన గురుకుంట్ల కిరణ్ కు నవంబర్ 5న సిటీ కల్చరల్ సెంటర్ ఆడిటోరియం ఆర్టిసి క్రాస్ రోడ్ ముషీరాబాద్ వివేక నగర్ కవాడిగూడ హైదరాబాద్* లో ఈ అవార్డు అందించడం జరుగుతుందని తెలిపారు. కిరణ్ మట్లాడుతూ నాకు ఈ అవార్డు ఎంపిక చేసిన డాక్టర్ ఆకుల రమేష్ గారికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version