యాదగిరిగుట్టలో ఘనంగా బిఆర్ అంబేద్కర్ జయంతి
#భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
యాదగిరిగుట్ట నేటిధాత్రి:
భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం యాదగిరిగుట్ట పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఒకటోవ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బోడ రాధ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బోడ రాధ పాల్గొని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ బోడ రాధ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను భారతదేశ చరిత్రలో చిరస్మరణీయ వ్యక్తిత్వంగా, రాజ్యాంగ రూపకర్తగా అభివర్ణించారు. సామాజిక అసమానతలు, వివక్షలకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం ప్రతి భారతీయుడికి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంబేద్కర్ జీవితం ప్రతికూల పరిస్థితులపై మానవ సంకల్పం సాధించిన విజయానికి ప్రతీక అని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
