దళిత రత్న గ్రహీత రత్నంకు ఘన సన్మానం

దళిత రత్న అవార్డు గ్రహీత రత్నం కు ఘనసన్మానం.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండల కేంద్రానికి చెందిన పరికిరత్నం కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జన్మదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ రవీంద్ర భారతిలో సమాజ సేవకులైన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న అవార్డులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం సామాజి క ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్న పరికి రత్నంకు రాష్ట్ర ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ కనకరాజు, ఇటుక రాజ్ కుమార్ చేతుల మీదుగా దళిత రత్నఅవార్డు తీసుకోవడం చాలా సంతోషకరమని డిటి ఎఫ్ మండల అధ్యక్షుడు కందుల గోవర్ధన్ అన్నారు. ఈ మేరకు దళిత విద్యావంతుల వేదిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అవార్డు గ్రహీత ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక ఉద్యమాల కార్యక్రమాలలో ఎంతోమందికి చేయూతనిస్తూ గత 30 సంవత్సరాలు నుండి సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్న రత్నంకు అరుదైన గౌరవం దక్కడం శుభసూచకమని. రాష్ట్ర స్థాయి లోనే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని అవార్డులు సాధించి మండలానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని తనకంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించాలని. ఉన్నత విద్యలు అభ్యసించినటువంటి సామాజిక సేవ దృక్పథం కలిగినటువంటి సమాజ సేవకులు నిత్యం సమాజానికి సేవలు అందించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య, విహెచ్పీఎస్ మండల అధ్యక్షుడు పులి రమేష్ గౌడ్, ఉప సర్పంచ్ బొట్ల దయాకర్ మాదిగ, రాజశేఖర్, సిహెచ్ ఆరోగ్యం తదితరులు పాల్గొన్నారు.

కలమడుగు తిరుపతికి దళిత రత్న అవార్డు

దళిత రత్న అవార్డు ప్రధానం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన డా”.బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా
రవీంద్ర భారతి లో జరిగిన కార్యక్రమంలో గోసంగి కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి కలమడుగు తిరుపతి

రాయికల్ ఏప్రిల్ 15. నేటి ధాత్రి :

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న అవార్డు ప్రధానం చేయడం జరిగింది డా “బి ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సావ కమిటీ వైస్ ఛైర్మన్ 57 ఉప కులాల రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం చేతుల మీదుగా దళిత రత్న అవార్డు అందచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మల్లెల సాయి చరణ్ . రాష్ట్రఉపాధ్యక్షులు ఔషధం రవీందర్ .
పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి కలమడుగు తిరుపతి మాట్లాడుతూ నేను చేసిన సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న అవార్డు ఇవ్వడం చాలా సంతోషం గా ఉందని రాబోయే రోజుల్లో కూడా మరెన్నో సేవకార్యక్రమాలు చేసి మరిన్ని మన్ననలను పొందుతానాని తెలియజేశారు.
అలాగే అవార్డు రావడానికి కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షులు మల్లెల సాయి చరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.జై భీమ్

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version