ఆధునిక భారతదేశ రూపశిల్పి అంబేద్కర్
* షాబాద్ మండలం మద్దూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన భీమ్ భరత్
* ఇవాళ భారతదేశం ప్రపంచంలో అదిపెద్ద ప్రజా స్వామ్య దేశంగా వర్ధిల్లుతుందంటే అది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ స్ఫూర్తితోనే సాధ్యమవుతున్నది
* కాంగ్రెస్ చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జ్ భీమ్ భరత్
నేటిధాత్రి, చేవెళ్ల :
ఆధునిక భారతదేశ రూపశిల్పి డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ అని చేవెళ్ళ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ అన్నారు.
షాబాద్ మండలంలోని మద్దూరు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాచన్ పల్లి , షాబాద్ మండల కేంద్రం, శేరిగూడ గ్రామాలలో అంబేద్కర్ విగ్రహానికి మండలంలోని సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పూలదండలు వేసి ఘన నివాళిలు అర్పించారు . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణ సభలో భీమ్ భరత్ మాట్లాడుతూ ప్రపంచంలో యుద్ధాలతో సాధించలేనిది, కేవలం జ్ఞానంతో రాజ్యాంగాన్ని సాధించిన మొదటి వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని అన్నారు. అణచివేత, చిన్నచూపునకు గురైనా అంబేద్కర్ ప్రపంచ దేశాలకు వెళ్లి ఎవరూ సాధించలేని ఉన్నత చదువులు చదివి భారతదేశానికి వచ్చి రాజ్యాంగాన్ని రచించి అన్ని వర్గాల మన్ననలు పొందారన్నారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని, నిరంతరం జ్ఞానం కోసం శ్రమిస్తూ తాము తక్కువ కాదనే దృక్పదంలో ఉండాలన్నారు. ఏ వర్గమైనా అంబేద్కర్ జీవిత పాఠాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, ఈ దేశంలో ప్రతి వారికి కావాల్సిన వ్యక్తి అంబేద్కర్ అని, ఒక వర్గం, కులానికి కాదని, అందరి కోసం రాజ్యాంగాన్ని రచించిన మహా మేధావి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీ పి సి సి కార్యదర్శులు రామ్ రెడ్డి , షాబాద్ సర్పంచ్ అశోక్ , మాజీ సర్పంచ్ రవీందర్ ,దామర్ల పల్లీ గ్రామ మాజీ సర్పంచ్ బర్ల యాదయ్య , కొమర బండ గ్రామ అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్, మద్దూరు మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి , సర్పంచ్ రాజు నాయక్ , ఉప సర్పంచ్ రామ్ రెడ్డి , మాజీ సర్పంచ్ శివప్ప , కప్ప సుధాకర్ , కోరని బాలరాజు , రఘు , ప్రభాకర్ రెడ్డి , అంబేద్కర్ యువజన సంగం నాయకులు , కోళ్ల యాదయ్య, మాజీ సర్పంచ్ కోళ్ల సత్తయ్య , సర్పంచ్ శేఖర్ , మిరియాల రమేష్ , ప్రవీణ్ , కృష్ణ , గౌరి , వెంకటయ్య , నర్సింలు , శేరిగూడ సర్పంచ్ లావణ్య చెన్నయ్య, ఉప సర్పంచ్ ప్రభు , చీమల యాదయ్య , అంజయ్య , నర్సింలు , కుమ్మరి రాజేందర్ , సమీర్ , మాజీ సర్పంచ్ దర్శన్ , వెంకటయ్య , ప్రవీణ్ ,నందు ,గ్రామ సభ్యులు, అంబేద్కరిస్టులు నాయకులు కార్యకర్తలు
తదితరులు పాల్గొన్నారు.
