భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు.

భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క భారతీయుడు ముందుకు సాగాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చిట్యాల తిరుపతిరెడ్డి అన్నారు. మంగళవారం అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోతు చరణ్ సింగ్ ఆధ్వర్యంలో జరగగా తిరుపతి రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఉన్న విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప మహనీయుడు. ఆయన దేశానికి యువతకు స్ఫూర్తిగా నిలిచి వారి గుండెల్లో గూడు కట్టుకున్న మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. ఆయన ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోతు రమేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇస్తారు శేఖర్ గౌడ్, వైనాల అశోక్, నాయకులు కదురూ కట్టయ్య, ఎర్రబెల్లి రఘుపతిరావు, జిల్లా మునిందర్, జెట్టి రామ్మూర్తి, పురుషోత్తం సురేష్, సంపత్ రెడ్డి, బత్తిని మహేష్, రఘుపతి, జంగిలి మోహన్, వెంగళ దాసు రమేష్, వల్లే పైడి, చిట్యాల ఉపేందర్ రెడ్డి, ఎరుకలి రవీందర్, విఎఫ్ జి చైర్మన్ శ్రీనివాస్, సర్పంచులు భూక్య భాస్కర్, సిద్ధ సంతోష్, పోషాలు, మాసంపల్లి అఖిల్, శివకోటి, బోళ్ల సర్వేశం, గాజర్ల రాజు, కొలిపాక రఘుపతి, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version