అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేయాలి….

అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేయాలి

* దళిత మిత్ర యువజన సంఘం ఇంచార్జ్ శివగాళ్ల విజయ్ కుమార్

నేటిధాత్రి, చేవెళ్ళ :

అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేయాలి అని దళిత మిత్ర యువజన సంఘం ఇంచార్జ్ శివగాళ్ల విజయ్ కుమార్ అన్నారు. అల్లావాడ గ్రామంలో దళిత మిత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దళిత మిత్ర యువజన సంఘం ఇంచార్జ్ శివగాళ్ల విజయ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళిలు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఒక్క వర్గానికి పరిమితం కాదని ఆయన ఆశయం దేశంలో ఉన్న అన్నివర్గాల వారికీ సమాన హక్కులు, సమసమాజ స్థాపనే అని పేర్కొన్నారు. దేశంలో అన్నివర్గాల ప్రజలకు ఆయన సేవలు దక్కాయని అన్నారు.
అంబేద్కర్ తెచ్చిన రిజర్వేషన్ విధానంతో దళిత పీడిత ప్రజల జీవితాల్లో జ్యోతులు వెలిగాయని ఉత్గటించారు. అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బి. సంజీవ, వైస్ ప్రెసిడెంట్ పి. ప్రవీణ్, జనరల్ సెక్రటరీ బి. రవితేజ, జాయింట్ సెక్రటరీ బి. శ్రీశైలం, కోశాధికారి జె. శివ కుమార్, ఎక్స్కూటివ్ మెంబెర్ బి. ప్రవీణ్, ఎక్స్కూటివ్ మెంబెర్ జె. శివ కుమార్
సలహాదరులు జె. శివ కుమార్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కొండపర్తిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు…

కొండపర్తిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

నేటిధాత్రి – అయినవోలు

 

అయినవోలు మండలం కొండపర్తి గ్రామంలో స్థానిక ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక 10వ వార్డు సభ్యులు కట్కూరి రాజు మాదిగ కుల సంఘం అధ్యక్షులు కట్కూరి రహీం హాజరై అంబేద్కర్ జీవిత చరిత్ర, సమాజానికి చేసిన సేవలను వివరించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి గ్రామస్తులకు స్వీట్లు పంచిపెట్టారు.
కార్యక్రమంలో ఆదర్శ యూత్ గౌరవ సలహాదారు కట్కూరి రమేష్, గౌరవ అధ్యక్షులు కట్కూరి రాజు (జాతీయ అంబేద్కర్ అవార్డు గ్రహీత), మాజీ అధ్యక్షులు కట్కూరి వంశీ (అజయ్), మాదాసి సతీష్, కుల సంఘం ఉపాధ్యక్షులు మాదాసు సునీల్, కోశాధికారి గద్దల సుమన్, గద్దల ప్రభాకర్, బొజ్జ చిరంజీవి, కట్కూరి శోభన్, మాదాసు భాగ్య, ఎంఆర్‌పీఎస్ అధ్యక్షులు కట్కూరి విష్ణు, యూత్ సభ్యులు కట్కూరి సృజన్, పోలేపాక రాజేష్, కట్కూరి చెక్రి, ప్రభాస్, సూర్యతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version