ఘనంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

ఘనంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

వీణవంక, నేటి దాత్రి:

 

వీణవంక మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది గ్రామ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ గజ్జల మొగిలయ్య గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గజ్జల మొగిలయ్య మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ద్వారా అందించిన రిజర్వేషన్ల ద్వారా ఈరోజు నేను గ్రామ సర్పంచ్‌గా ఎన్నిక కావడం సాధ్యమైంది. కాబట్టి ఆయనకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సమాజంలో సమానత్వం, న్యాయం స్థాపన కోసం ఆయన చూపిన మార్గంలోనే ముందుకు సాగాలి అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ ఆయన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు, నాయకులు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

హోలీ సంబరాల్లో గ్రామస్తుల సమైక్యత అంబరాన్నంటింది..

హోలీ సంబరాల్లో గ్రామస్తుల సమైక్యత అంబరాన్నంటింది!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: గ్రామంలో బుదవారం రంగుల కేళిలో మునిగిపోయింది. అందమైన రంగులమయమైన హోలీ పండుగను గ్రామస్తులు పార్టీలకు,కుల మత భేదాలకు అతీతంగా, ఏకతాటిపై నిలబడి అత్యంత ఉత్సాహంగా,ఘనంగా జరుపుకున్నారు,ఉదయం నుంచే గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది,చిన్నారుల నుండి పెద్దల వరకు, ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రంగుల వేడుకలో భాగమయ్యారు.

ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ,నవ్వులు పంచుకుంటూ గ్రామం మొత్తం ఉల్లాసంగా గడిపారు,చిన్నారులు నీళ్ల రంగులతో ఆటలాడుకుంటే,యువత డప్పుల సప్పుళ్లతో నృత్యాలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మహిళలు ప్రత్యేక వంటకాలు తయారుచేసి పండుగ శోభను మరింత పెంచారు,ఈ వేడుకలు కేవలం వినోదం మాత్రమే కాకుండా,గ్రామస్తుల మధ్య ఉన్న ఐక్యతను, పరస్పర అభిమానాన్ని చాటి చెప్పాయి,ఒక పండుగ అందరినీ ఏకం చేసి,సంతోషాన్ని పంచడం ఎంత గొప్ప విషయమో రుద్రగూడెం హోలీ సంబరాలు నిరూపించాయి. ఈ ఐక్యతా సందేశం అందరినీ ఆకట్టుకుని,మరిన్ని సంవత్సరాలు ఈ పండుగను కలిసి జరుపుకోవాలనే స్ఫూర్తిని నిలిపిందన్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version