మండలంలోని ముదిగుంట గ్రామంలో పేద ప్రజలకు ఉచితంగా అందే పథకాలను కొంతమంది కాంగ్రెస్ నాయకులు పేద ప్రజల వద్ద నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వినికిడి. గ్రామంలోని తోటి కాంగ్రెస్ నాయకులను సంప్రదించగా విషయం వెలుగులోకి వచ్చింది.ఎవరైతే పార్టీ పేరు చెప్పుకొని అక్రమాలకు పాల్పడుతూ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారో వారిని గుర్తించి మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకువెళ్లి అక్రమాలకు పాల్పడిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి చర్యలు తీసుకునేలా చూస్తామని అన్నారు.
*ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్యకళాశాలల్లో వసతుల పట్ల నివేదిక*
రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
ప్రభుత్వ వైద్యశాల, వైద్య కళాశాల, నర్సంపేట ఆసుపత్రులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన డాక్టర్ సంగీత సత్యనారాయణ
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు వైద్య విద్య కళాశాలలకు ఎన్ఎంసి నిబంధనల మేరకు సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, తెలంగాణ ప్రభుత్వం నియమించిన కేఎంసి,నర్సంపేట,జనగామ వైద్య కళాశాలల పర్యవేక్షణ కమిటీ ఛైర్పర్సన్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు.శనివారం నర్సంపేట మెడికల్ కళాశాలలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కళాశాల పిన్సిపాల్ ,కోఆర్డినేటర్ డాక్టర్ మోహన్ దాస్, వివిధ విభాగాధిపతులు, అనుబంధ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ లతో ఆస్పత్రి వసతుల కల్పనకు కావలసిన వివిధ అంశాలపై కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ముందుగా నర్సంపేట మెడికల్ కళాశాలలో బోధన, బోధనేతర, ల్యాబ్, సిబ్బంది, కావాల్సిన వసతులపై సమీక్షించారు.
వైద్య విద్యార్థినుల వసతి గృహాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి అందుకు గురించిన వివరాలను ప్రిన్సిపల్ డాక్టర్ మోహనదాస్ ను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు.
అనంతరం జిఎమ్సి నర్సంపేటలో ఉన్న ఆసుపత్రిలోని పలు విభాగాలను జిల్లా కలెక్టర్, వైద్యాధికారులతో కలిసి కమిషనర్ సందర్శించి అక్కడున్న వనరులు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
ఆస్పత్రిని సందర్శించి ఓపి విభాగం, ఆరోగ్యశ్రీ, సందర్శించి ఆయా వార్డుల వివరాలు, ఓపి సేవలు, రిఫరల్స్, ఫాలో అప్, ఇతర సేవల గురించి, వైద్యులు సిబ్బంది, తదితర వివరాలను వైద్యాధికారులను కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు.
ఈ సమీక్ష సమావేశంలో వివిధ విభాగాల్లో వనరుల కొరత, యూజీ మెడికల్ ఎడ్యుకేషన్ ఎన్ఎంసి నిబంధన ప్రకారం ఉండాల్సిన, సమకూర్చాల్సిన సౌకర్యాల గురించి కూలంకషంగా చర్చించారు.
Dr. Sangeetha Satyanarayana
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు, సౌకర్యాల గురించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు.
కావలసిన పరికరాలు, డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది మరియు ఇతర వివరాలు కమిషనర్ వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నర్సంపేట వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ సాంబశివరావు, టీజీఎంఐడిసి ఈఈ ప్రసాద్, జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. కిషన్ , వైస్ పిన్సిపాల్ డాక్టర్ లక్ష్మినారాయణ, డాక్టర్ శ్రీదేవి , పలు విభాగాల అదిపథులు,బోధన, బోధనేతర, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల మండలంలో వివిధ గ్రామాలలో వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బిజెపి జిల్లా అధ్యక్షులు ఏ డు నూతల నిశీధర్ రెడ్డి ,నవాబ్ పేట గ్రామానికి చెందిన మహమ్మద్ హకీం గత మూడు రోజుల క్రితం ఆక్సిడెంట్ లో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అనంతరం నవాబ్ పేట గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు బిల్ల సత్యనారాయణ రెడ్డి కి ఆక్సిడెంట్ జరగగా వారిని పరామర్శించడం జరిగింది అదేవిధంగా కైలా పూర్ గ్రామానికి చెందిన సకినాల కుమారస్వామి ఆక్సిడెంట్ లో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది అదేవిధంగా చిట్యాల మండల కేంద్రానికి చెందిన అల్లం ఐలయ్య గత పది రోజుల క్రితం మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు బిజెపి బూత్ అధ్యక్షుడు పందుల రాకేష్ గారు నానమ్మ పందుల రామక్క వారం రోజుల క్రితం మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించినారు, ఆయన వెంట వరంగల్ పార్లమెంట్ లింగంపల్లి లింగంపల్లి ప్రసాద్ రావు బిజెపి చిట్యాల మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ బిజెపి సీనియర్ నాయకులు మండల రాఘవరెడ్డి సుద్దాల వెంకటరాజ వీరు అనుప మహేష్ గో పగాని రాజు లక్ష్మణ్ శ్రీ పెళ్లి సతీష్ చింతల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ప్రధాని పివి జయంతి వేడుకలు జమ్మికుంట: నేటిధాత్రి
ఈరోజు మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దేశిని కోటి మాట్లాడుతూ మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు గారి జయంతి వేడుకలను జమ్మికుంట పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మన మన ప్రాంతానికి చెందిన వ్యక్తి ప్రధానమంత్రి అయి దేశ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశ అభివృద్ధి చేశారు 13 భాషలు స్పష్టంగా మాట్లాడే ఏకైక వ్యక్తి మన మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు గారు అని చెప్పక తప్పదు తన ఆశ సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మారపల్లి బిక్షపతి. పిట్టల శ్వేత రమేష్.శ్రీపతి నరేష్. మార్కెట్ డైరెక్టర్ గడ్డం దీక్షిత్ .దేవస్థాన డైరెక్టర్ మర్రి రామిరెడ్డి. మాజీ amc డైరెక్టర్ ఎండి సలీం పాషా. మహిళా కాంగ్రెస్ నాయకులు తోట స్వప్న .పిడుగు భాగ్యలక్ష్మి. పూదరి శివ. మైస మహేందర్. ముద్దమల్ల రవి. పంజాల అజయ్. శ్రీ పాల్. కిరణ్. శ్రీను. ప్రవీణ్. రాజు. సురేష్ తదితరులు పాల్గొన్నారు
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఘన స్వాగతం పలికిన సుజిత్ రావు
మెట్ పల్లి జూన్ 28 నేటిదాత్రి
కోరుట్ల నియోజవర్గానికి మొట్టమొదటిసారిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ మైనార్టీ,వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి ఘన స్వాగతం పలికిన టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు
ఈ కార్యక్రమంలో మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్,తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ సేల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి,మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఖుతుబ్భుదిన్ పాషా,రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి,మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి, ఏఎంసి డైరెక్టర్,కోరుట్ల నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అందే భవిత రాణి, పాషా,నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చెన్న మమత,నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ ఉప అధ్యక్షురాలు మైస లక్ష్మీ,నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యురాలు అందే లలిత,మహిళ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యురాలు చిప్ప సుభద్ర,కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోడిమ్యాల దీపక్ రాజ్,మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గంధం రాజేశం,మల్లాపూర్ మండల ఫిషర్మాన్ అధ్యక్షులు రోడ్డ రాజు, ఇబ్రహీంపట్నం మండల సేవాదళ్ అధ్యక్షులు గూడా సొల్లు ,ముత్యం రెడ్డి,మల్లాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మల రాజు,ఇబ్రహీంపట్నం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నల్లూరి సాగర్,కోరుట్ల మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కుంటాల వికాస్,కాంగ్రెస్ నాయకులు వెంకటగిరి,కల్లెడ గంగాధర్ మామిడి ,రాజశేఖర్ రెడ్డి ఇప్పపెల్లి గణేష్,మొగలి రాజేందర్ గోపిడి నరేశ్, మిట్ట పెల్లి మహేష్, మసూల చిన్నయ్య,బైండ్ల శ్రీకాంత్,పిట్టల వెంకటేష్ ,కోరే రాజ్ కుమార్, ముద్దం ప్రశాంత్,మజ్జు,వేల్పుల దాస్,కనుక దినేశ్,రెబ్బాస్ మల్లేష్ రమేష్,దాస్,బద్దం సుధాకర్ రెడ్డి, ఉప్పులుటి రమేశ్,బద్దం ఎల్లా రెడ్డి,పన్నాల జీవన్ రెడ్డి, నల్లపోతురాజు శ్రీకాంత్, జాకీర్,జగన్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు , మహిళా కాంగ్రెస్ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాదులోని గాంధీభవన్లో ఈరోజు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన వివరణ లేఖ.
హైదరాబాద్ నేటిధాత్రి:
2007లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యవహారాన్ని నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాకు అప్పగించారు.
నాటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకట్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంకు సంబంధించి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టగా వరంగల్ వ్యవహారాలు మొత్తం నేనే పర్యవేక్షించడం జరిగింది.
వరంగల్ జిల్లా నుంచి ఎక్కువ మంది దళితులు, గిరిజనులకు అవకాశం దక్కాలని, ఈ జిల్లాలో ఎక్కువ మందికి పునర్విభజనలో ఆయా వర్గాలకే నేను సీట్లు కేటాయించాను. ఎందుకంటే, అట్టడుగువర్గాలకే న్యాయం జరగాలన్నది నా సిద్ధాంతం. నేను నా రాజకీయ పంథాను ప్రారంభించిందే నిమ్న వర్గాలకు న్యాయం చేయాలని.
వరంగల్ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ స్థానాలు నిమ్నవర్గాలకు కేటాయించడంలో నాడు నాదే కీలక పాత్ర.
వరంగల్ పార్లమెంట్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లోని ఒక దాన్ని ఎస్సీ, మరొక దాన్ని ఎస్టీ చేసి దళిత, గిరిజనులకు ప్రత్యేక అవకాశం కల్పించేలా చేసిన.
కాగా, ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే ఏ జిల్లాలో లేని విధంగా ఒక జిల్లాలో రెండు స్థానాలు రిజర్వు కావడం కేవలం వరంగల్ లో మాత్రమే సాధ్యం అయింది. అందు కోసం నేను తీవ్రంగా కృషి చేశాను.
సామాజిక న్యాయం చేయాలన్న నా ప్రయత్నంలో భాగంగా… ఈ ప్రక్రియతో తాను సీటును కోల్పోయానని… అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి…. అందుకు నేనే(కొండా మురళీయే) కారణమని చెబుతూ రాజకీయాల్లోంచి బయటికి వెళ్ళిన పరిస్థితి ఉన్నది.
అయితే, నేడు ఆయన అల్లుడు అయిన మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి, వరంగల్ జిల్లా ఇంఛార్జీ మంత్రిగా ఉండి నా సతీమణి శ్రీమతి కొండా సురేఖ మీద కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. అదే కోపంతో ఆయన ఉన్నట్టు తాజా పరిణామాలు చూస్తుంటే నిశితంగా అర్థం అవుతున్నది.
వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, లోకల్ ఎమ్మెల్సీ బస్వారాజు సారయ్యను వెంట పెట్టుకొని మా వరంగల్ ఈస్టు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అయినా, మేము వారికి ఎక్కడా ఇబ్బందులు చేయలేదు.
ఇదే బస్వరాజు సారయ్య, మా వరంగల్ ఈస్టు నియోజకవర్గంలో నా సతీమణి కొండా సురేఖ మీద 2014లో 40 వేల ఓట్లతో ఓడిపోయారు.
ఎమ్మెల్సీ బస్వారాజు సారయ్య, రామసహాయం సురేందర్ రెడ్డి గారికి ప్రధాన శిష్యుడు అనే విషయం అందరికీ తెలిసిందే.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాస్ లీడర్ గా ఉన్న మేము దాదాపు ప్రతి ఎన్నికల్లో గెలిచి నిలుచున్నాము.
ఇక ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి మహబూబాబాద్ కు చెందిన నాయకులు. ఆయన గతంలో కొండా సురేఖ మీద పోటీ చేస్తే, ఆ ఎన్నికల్లో కొండా సురేఖకు ఘనమైన మెజారిటీ వచ్చింది. కానీ, నరేందర్ రెడ్డికి కేవలం 2 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఇక డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఈరోజు వరకు ఒక్క ఎలక్షన్ కూడా గెలవలేదు. ఆమె మా వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి మేము(నేను నా సతీమణి) వచ్చేటప్పుడు 26 మంది కార్పొరేటర్లు వచ్చారు. ఇదీ వరంగల్ లో కొండా మురళి, కొండా సురేఖ దంపతుల పవర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పుడు నేను రాజీనామా చేసి వచ్చిన. అది నా నిబద్ధత. కొంతమంది లీడర్ల మాదిరి పార్టీ మారినా… పదవిలో కొనసాగలేదు. భారతదేశంలోనే ఏకగ్రీవంగా గెల్సిన ఏకైక ఎమ్మెల్సీని. ఈ విషయం అందరికీ తెలిసిందే.
ఇక నన్ను ఎవరు పిలిచి ఈ విషయాలు చెప్పమని అడగలేదు. మన పీసీసీ ప్రెసిడెంట్, బీసీ బిడ్డ మహేష్ కుమార్ గారి మీద అభిమానంతో నేనే వచ్చి పార్టీకి వివరించాలని అనుకున్నాను. అందుకే, స్వయంగా వచ్చి తెలియజేయడం జరిగింది.
వర్ధన్నపేట – కేఆర్ నాగరాజు
ఈ నియోజకవర్గంలో మా ప్రభావం స్పష్టంగా ఉంటుంది.
ఈ నియోజకవర్గంలో మాకు రాజకీయంగా, వ్యక్తిగతంగా చాలా మంది అభిమానులు ఉన్నారు.
వాస్తవానికి ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కాక మునుపు… ఎర్రబెల్లి దయాకర్ రావు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేవారు.
ఎర్రబెల్లి దయాకర్ రావు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ చేస్తున్న అరాచకాలకు అడ్డు నిలిచి పోరాడినందుకు మాకు ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
అయితే, ప్రస్తుత ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎవరు ఎటు రమ్మంటే అటు వెళ్తారు. ఆయనకు ప్రత్యేకంగా వర్గాలు అంటూ ఏమీ లేవు. రేపు మేము ఏదైనా ప్రోగ్రాంకు రమ్మని పిలిచినా వచ్చి వెళతారు. మాతో కూడా ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి.
భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ
ఒకానొక సందర్భంలో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి నన్ను (కొండా మురళీ) నిలుచోవాలని అక్కడి ప్రజల నుంచే విజ్ఞప్తులు పెద్ద ఎత్తున వచ్చాయి.
కానీ, ఎన్నికల సమయంలో అప్పటికే నా సతీమణి కొండా సురేఖ వరంగల్ ఈస్టు నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో మా కుటుంబం నుంచే రెండో నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇష్టం లేక చేయలేదు.
ఈ నియోజకవర్గంతో నాకు (కొండా మురళికి) చాలా మంచి పట్టు ఉన్నదని సర్వత్రా తెలిసిందే.
గతంలో మదుసూదనాచారి గెలుపు కోసం తీవ్రంగా నేను కృషి చేశాను.
వాస్తవానికి గండ్ర సత్యనారాయణ గతంలో టీడీపీ నుంచి వచ్చారు. అయినా నేను సపోర్టు చేసినం. ఆ సమయంలో మా సపోర్టును ఆయన అడిగారు. మేము కూడా పార్టీ గెలుపు కోసం మనస్ఫూర్తిగా పని చేశాము.
అయితే, ఈయన ప్రస్తుతం మా మీదకు వ్యతిరేకంగా ఇతర నాయకులతో కలవడం శోచనీయం.
అయితే, ఈయనతో కూడా మాకు మంచి సంబంధాలే ఉన్నాయి.
ములుగు సీతక్క
మంత్రి సీతక్క గారితో మాకు ఎప్పుడూ ఎటువంటి ఇబ్బంది లేదు. ఆమె పని ఆమె చేసుకుంటూ పోతున్నారు. అయితే, కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి కొండా సురేఖకు…. మంత్రి సీతక్క కు గ్యాప్ వచ్చిందని, కావాలని కొన్ని పేపర్లలో వార్తలు రాయిస్తున్నారు. సోషల్ మీడియాలో పెయిడ్ ప్రచారం చేస్తున్నారు.
పరకాల రేవూరి ప్రకాశ్ రెడ్డి
ఈ నియోజకవర్గం పూర్తిగా మాదే (కొండా సురేఖ, కొండా మురళి దంపతులదే). గతంలో ఇదే నియోజకవర్గం నుంచి నా భార్య కొండా సురేఖ మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. మంత్రిగా కొనసాగిన విషయంలో అందరికీ తెలిసిందే.
ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ప్రతి మండలంలో కొండా మురళి, కొండా సురేఖకు ఎంతోమంది అభిమానులు, కార్యకర్తలున్నారు. ఇది జగమెరిగిన సత్యం.
ఎన్నికల సమయంలో కూడా రేవూరి ప్రకాశ్ రెడ్డి మా మద్దతు అడిగారు. మేము నిస్వార్ధంగా ఆయనకు సపోర్టు చేసినం. మా మద్దతుతోనే గెలిచారు.
ఈరోజు ఆయన కూడా మాకు వ్యతిరేకంగా గుడుపుఠాణి కట్టి రాజకీయాలు చేస్తున్నారు. ఇది చాలా దారుణం.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి సంబంధించిన క్రషర్స్ లో అక్రమాలు జరుగుతున్నాయని మేము చెప్పి ఆపిస్తే… వాళ్ళు వేరే బ్రోకర్స్ ద్వారా వచ్చి రేవూరి ప్రకాశ్ రెడ్డికి కొంత ముట్టజెప్పి వాటిని ఓపెన్ చేయిస్తున్నారు. వీటి ద్వారానే బీఆర్ఎస్ నేతలకు… ఇతర నియోజకవర్గంలోనే నేతలకు పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయి. దీనివల్ల బీఆర్ఎస్ ఆర్థికంగా బలపడుతున్నది. ఇది కాంగ్రెస్ కి నష్టం. ఇది జిల్లాలో అందరికి తెలిసిందే. అయినా ఎవరు నోరు మెదపరు.
ఇక పరకాలలో నా ఊరు ఉన్నది. గతంలో అక్కడికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్పీ రావాలంటే రాలేకపోయేవారు. వెహికల్ దిగి నడిచి వచ్చిన దుస్థితి ఉంది కూడా. బీఆర్ఎస్ పదేండ్ల హయాంలో కూడా మా గ్రామానికి అప్పటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా వచ్చే సాహసం చేయలేదు. కానీ, ఇటీవల ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఇష్టారీతిన మాట్లాడి వచ్చారు. రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శించారు.
ఆయన మాటలతో అక్కడ లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు ఎదురైతే ఎవరిది బాధ్యత?
వరంగల్ వెస్ట్ – నాయిని రాజేందర్ రెడ్డి
నాయిని రాజేందర్ ఈ రోజు చాలా పెద్ద పెద్ద మాటలు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ, ఎన్నికల ముందు వచ్చి మా (కొండా దంపతుల) మద్దతు అడిగారు. అప్పటి ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను ఎన్నికల కదనరంగంలో తట్టుకోవాలంటే తనకి మా మద్దతు కావాలని ప్రాధేయ పడ్డారు. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీతో వరంగల్ తూర్పులో తిరుగుతున్నారు.
వరంగల్ ఈస్టులో ఎలక్ట్రిసిటీ అధికారులకు పోస్టింగులు ఇప్పించుకుంటున్నారు మా ప్రమేయం లేకుండానే, ముఖ్యంగా రెడ్డి అధికారులకు పోస్టింగ్లు ఇచ్చుకుంటున్నారు.
తనకి సంబంధం లేని మా నియోజకవర్గంలో పోస్టింగులు ఇచ్చుకోవడం ఏంటి?
ఎంజీఎంలో ఆకస్మిక తనిఖీ చేపట్టి…. మాకు సమాచారం లేకుండా మా అధికార పరిధిలోకి చొచ్చుకురావడం సహేతుకం కాదు కదా.
జనగామ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాతో బాగానే ఉంటున్నరు.
స్టేషన్ ఘనపూర్: కడియం శ్రీహరి బీఆర్ఎస్ ను ముంచి మన పార్టీలోకి వచ్చిండు. స్థానిక కాంగ్రెస్ ఇంఛార్జీ ఇందిరకు చుక్కలు చూపిస్తున్నడు. ఆమె వర్గీయులను కూడా టార్చర్ చేస్తున్నడు. 200 నుంచి 300 మంది కడియం వేధింపులు తట్టుకోలేక నాకు చెప్పినా… నేను ఆయన నియోజకవర్గంలో ఇన్వాల్ కావడం లేదు. కానీ, జిల్లాలో ఏం చేస్తున్నాడో యావత్ రాష్ట్రమంతా తెలుస్తున్నది.
పాలకుర్తి యశశ్వినీ రెడ్డి:
ఈమె యాంటీ దయాకర్ రావు వర్గమే. నేను ఎన్నికల సమయంలో ఆమెకు బాగా సపోర్టు చేసిన. అన్ని విధాలుగా అండగా నిలిచిన. నన్ను ఇక్కడి నుంచి నిలబడాలని చాలామంది చెప్పినా… నిలబడకుండా వారికే మద్దతు ఇచ్చి గెలిపించినం.
డోర్నకల్: రాంచంద్రనాయక్: ఈ నియోజకవర్గంలో మనకు పెద్దగా పట్టు లేదు. కానీ, ఏజెన్సీ ఏరియా, నక్సలైట్ ప్రభావిత ప్రాంతంలో నాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగు ఉన్నది. నేను కూడా అక్కడి వారు ఎవరు వచ్చినా వారి పనులు చేయడం జరుగుతున్నది.
మహబూబాబాద్: ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వేం నరేందర్ రెడ్డి కేవలం ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే గెలిచారు. ఒక దఫా వేం నరేందర్ రెడ్డి, కొండా సురేఖ మీద కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే… ఆయనకు కేవలం 2 వేల ఓట్లు వచ్చాయి. డిలిమిటేషన్లో ఆయన సీటు ఎగిరిపోయిందని… అందుకు నేనే కారణమని నాపై కోపంతో ఉన్నట్టు ఉన్నారు వేం నరేందర్ రెడ్డి.
— రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిశీలన • ఎమ్మార్వో శ్రీనివాస్
నిజాంపేట: నేటి ధాత్రి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ మెరకు నిజాంపేట లో స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల సమస్యల పరిశీలన ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. ఆగస్టు 15 వరకు దరఖాస్తుల సమస్యలను పరిశీలించడం జరుగుతుందన్నారు.
గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శనివారం ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా గణపురం మండల కేంద్రంలోని గాంధీనగర్ వాస్తవ్యులు ఎలిగేటి సంధ్యారాణి మురళి ఆర్టిసి డ్రైవర్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించి పూజ అనంతరం ఆలయానికి 5,000 రూపాయలతో నక్షత్ర హారతిని ఇతర పూజ సామాగ్రిని ఆలయానికి అందజేశారు పూజ అనంతరం ఆలయ అర్చకులు మురళి సంధ్యారాణి దంపతులకు తీర్థప్రసాదాలు ఆశీర్వచనాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ కమిటీ సభ్యులు మూల శ్రీనివాస్ గౌడ్ బండారు శంకర్ బటిక స్వామి మాదాసు అర్జున్ బూర రాజగోపాల్ మాదాసు మొగిలి పాండవుల భద్రయ్య దయ్యాల భద్రయ్య ఉయ్యాల బిక్షపతి తదితర సభ్యులు భక్తులు పాల్గొన్నారు
కామ్రేడ్ గాజర్ల రవి గణేష్ సంస్మరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేలు జీఎస్సార్, రేవూరి
భూపాలపల్లి నేటిధాత్రి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కింటుకూరు మారేడుమిల్లి అడవీ ప్రాంతంలో ఈనెల 18వ తేదీ ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, 2004 శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. కాగా, వారి సంస్మరణ సభ శనివారం గాజర్ల స్వగ్రామం వెలిశాలలో జరుగుతుంది. ఈ సంస్మరణ సభలో భూపాలపల్లి, పరకాల ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, రేవూరి ప్రకాష్ రెడ్డి లు పాల్గొన్నారు. గాజర్ల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యేలిద్దరూ పరామర్శ తెలిపారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. సామాన్య కుటుంబంలో జన్మించిన గాజర్ల రవి యువకుడిగా ఉన్న రోజుల్లోనే బడుగు, బలహీన వర్గాల పేద ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేసి, అడవి బాట పట్టి సుమారు 33 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపి ఎన్కౌంటర్లో మృతి చెందారు. కాగా, వారి స్వగ్రామం వెలిశాలలో జరుగుతున్న సంస్మరణ సభకు పెద్ద సంఖ్యలో గాజర్ల అభిమానులు, సానుభూతిపరులు, ప్రజా సంఘాల నేతలు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో , పాల్గొన్నారు
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ కమిషనర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం, మున్సిపాలిటీ కమిషనర్ గా సుభాష్ నూతనంగా బాధ్యతలు చేపట్టారు.సందర్భంగా శనివారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులు మరియు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటామని మున్సిపాలిటీ కమిషనర్ డి. సుభాష్ రావు దేఖ్ తెలిపారు.
◆ మున్సిపల్ కమిషనర్‌గా డి.సజ్జష్ రావు దేశ్ ముఖ్ నియమితులైనందుకు స్వాగతించిన బిఆర్ఎస్ నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా డి.సజ్జష్ రావు దేశ్ ముఖ్ బాధ్యతలు స్వీకరించారు. జహీరాబాద్ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు అలీ అలీమ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అహ్మద్ ముహమ్మద్ కాలనీ ముహమ్మద్ సలీమ్, ప్రధాన కార్యదర్శి, ఆయనను అభినందించారు మరియు జహీరాబాద్ కమిషనర్‌గా నియమితులైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులు మరియు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటామని మునిసిపాలిటీ కమిషనర్ డి. సుభాష్ రావు దేఖ్ తెలిపారు. ప్రజలు తమ సమస్యల కోసం తనను సంప్రదించవచ్చు. ఈ సందర్భంగా ముహమ్మద్ సలీం సద్దాం హుస్సేన్ షేక్ ఖలీద్ పాషా అబూ యూసఫ్ రిజ్వాన్ మరియు ఇతరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి ఎంపికైన ప్రాథమిక పాఠశాల రెజింతల్ ప్రధానోపాధ్యాయురాలు సఫియా సుల్తానా
జహీరాబాద్ నేటి ధాత్రి:
జాతీయ స్థాయి న్యూఢిల్లీలో 15 రోజుల పాటు జరిగే సి.సి.ఆర్.టి. కార్యక్రమానికి ఎంపికైన ప్రాథమిక పాఠశాల రెజింతల్ ప్రధానోపాధ్యాయురాలు సఫియా సుల్తానా బెస్ట్ ప్రాక్టీసెస్‌లో భాగంగా, జూన్ నెలలో జరిగిన రాష్ట్ర స్థాయి మండల విద్యాధికారుల సమావేశంలో అన్ని జిల్లాల నుండి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసిన 110 మంది ఉపాధ్యాయులు తమ వినూత్న విద్యా విధానాలను ప్రదర్శించారు. ఈ సమావేశం ఎస్ సి ఈ ఆర్ టి ఆధ్వర్యంలో ఎంసీఆర్ హెచ్ ఆర్ డి, హైదరాబాద్ లో నిర్వహించబడింది.ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ఉపాధ్యాయుల ప్రదర్శనలను గమనించి జాతీయ స్థాయిలో 15 రోజుల సీసీ ఆర్ టి (Centre for Cultural Resources and Training) శిక్షణకు ఎంపిక చేశారు. దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లా నుండి రేజింతల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సఫియా సుల్తానా ఎంపిక అయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాథమిక పాఠశాలలకి చెందిన 10 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు.
ఇతర జిల్లాల ఎంపికల వివరాలు ఇలా ఉన్నాయి:
జగిత్యాల జిల్లా – 2
ములుగు జిల్లా – 2
మెదక్ జిల్లా – 1
వికారాబాద్ జిల్లా – 1
మంచిర్యాల జిల్లా – 1
యాదాద్రి జిల్లా – 1
నిర్మల్ జిల్లా – 1
సంగారెడ్డి జిల్లా – 1 ( సఫియా సుల్తానా ) ఈ ఎంపికకు సంబంధించి ఎస్ సి ఈ ఆర్ టి డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గారి నుండి సఫియా సుల్తానా దానికి సంబంధించిన ఉత్తర్వులు నిన్న అందుకున్నారు. ఈ సందర్భంగా డీఈవో సంగారెడ్డి సఫియా సుల్తానా గారిని ప్రత్యేకంగా అభినందించారు.
బాల కార్మిక వ్యవస్థను రూపుమాపుదాం ఆపరేషన్ ముస్కాన్-11కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం
చిన్న పిల్లలతో వెట్టిచాకిరి చెపిస్తే క్రిమినల్ కేసులు తప్పవు.
జిల్లా ఎస్పీమహేష్ బి. గితే ఐ.పీ.ఎస్
సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి):
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం జులై 01 నుండి 31తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-11కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ అధికారులకు ఆదేశించారు. ఆపరేషన్ ముస్కాన్-11కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున వివిధ శాఖల అధికారులతో జిల్లా పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈసందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ….ఆపరేషన్ స్మైల్ -11లో పాలుపంచుకొంటున్న ప్రతి ఒక్క అధికారి సమన్వయంతో పక్కా ప్రణాళిక రుపొందించుకోని బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేలా విధులు నిర్వహించాలన్నారు.
ప్రతీ ఒక్కరి జీవితంలో బాల్యం అమూల్యమైనదని దానిని అనుభవించటం ప్రతీ పౌరుని హక్కు అని,క్షణికావేషంలో పిల్లలు తొందరపాటులో చిన్న చిన్న విషయాలకే తల్లి దండ్రులను విడిచి ఇంటికి దూరంగా ఉంటున్నారని,ఇట్టి అవకాశాన్ని ఆసరాగా తీసుకొని కొందరు వారిని ప్రమాదకర పనుల్లో వారితో పనులు చేయిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారని అలాంటి వారిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలిపారు.
సిరిసిల్ల,వేములవాడ డివిజన్ స్థాయిలో ఒక ఎస్.ఐ మహిళా పోలీస్ అధికారి, నలుగురు సిబ్బంది, వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో ఏర్పాటు చేసిన రెండు టీమ్స్ జిల్లాలో పిల్లలతో పనిచేసే అవకాశాలు ఉన్న పలు పరిశ్రమలు,హోటల్స్,వ్యాపార సముదాయాలు, గోదాములు,మెకానిక్ షాపులు,హోటల్స్, ఇటుక బట్టిలు తదితర ప్రాంతాల్లో వ్యూహాత్మక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. స్కూల్స్ కు వెళ్లకుండా వివిధ కారణాల వల్ల డ్రాపౌట్ అయిన పిల్లల తల్లి దండ్రులకు నచ్చ చెప్పి తిరిగి వారిని పాఠశాలకు పంపే ఏర్పాటు చేసి వారికి కొత్త జీవితాన్ని ఇవ్వాలన్నారు. ఎక్కడైనా బాల కార్మికుల కనిపిస్తే పోలీస్ వారికి సమాచారం తెలపాలని విజ్ఞప్తి చేశారు.18సంవత్సరాల లోపు పిల్లలతో పని చేయుస్తున్న వారిపై 2024 సంవత్సరంలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ లో 21 మందిపై క్రిమినల్ కేసులు,ఈ సంవత్సరం జనవరిలో నిర్వహించిన అపరేషన్ స్మైల్ కార్యక్రమంలో 08 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని ఈసందర్భంగా గుర్తు చేశారు.ఈసమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,సిరిసిల్ల ఆర్.డి.ఓ వెంకటేశ్వర్లు, dwo లక్ష్మీరాజాం,drdo శేషాద్రి, సి.ఐ లు నటేష్,నాగేశ్వరరావు,అసిస్టెంట్ లేబర్ అధికారి నజీర్ హమ్మద్, మెడికల్ &హెల్త్ నుండి డాక్టర్ నయుమ్ జహా, విద్య శాఖ నుండి కోర్దినేటర్ సతీష్ కుమార్,షీ టీం ఏ.ఏఎస్.ఐ ప్రమీల,పోలీస్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లయన్స్ క్లబ్ ఆఫ్ గోపాలరావుపేట వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగినది. అధ్యక్షులుగా రాంపల్లి శ్రీనివాస్ కార్యదర్శిగా పాకాల మోహన్, కోశాధికారిగా గొడుగు అంజయ్యలను ఎన్నుకున్న అనంతరం ప్రమాణస్వీకారం చేశారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మోర బద్రేషం, రీజియన్ చైర్మన్ కొల్లూరి జితేందర్, జోన్ చైర్మన్ కర్ర ప్రభాకర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ మైక్రో కాబినెట్ మెంబెర్ గోలి మధుసూదన్ రెడ్డి, ప్రోగ్రాం చైర్మన్ కర్ర శ్యాంసుందర్ రెడ్డి, కోచైర్మన్ కొడిమ్యాల వెంకటరమణ, రీజియన్ సెక్రెటరీ యం.మల్లేశం, డైరెక్టర్స్ కర్ర రాజిరెడ్డి, ముదుగంటి రాజిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, చాడ దామోదర్ రెడ్డి, కోట్ల మల్లేశం, మచ్చ గంగయ్య, మోర కేత, శారద, కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మాజీ ప్రభుత్వ విప్, మాజీ చెన్నూర్ శాసనసభ్యులు నల్లాల ఓదెలు ని పరామర్శించిన మాజీ సిర్పూర్ శాసనసభ్యులు శ్రీ కోనేరు కోనప్ప హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నేడు మాజీ చెన్నూర్ శాసనసభ్యులు నల్లాల ఓదెలు ని కలిసి ఆరోగ్య స్థితి ని తెలుసుకున్నారు. కొంత కాలంగా అనారోగ్యం తో ఇబ్బందిపడుతు ఇటీవలే కోలుకున్న నల్లాల ఓదెలు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ను గెలిపించండి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్
రామడుగు నేటిధాత్రి:
భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ వెంకట్రావుపల్లి శక్తి కేంద్రం ఇంఛార్జి బద్ధం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మీపూర్ గ్రామంలో వికసిత భారత్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ లు హాజరై మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్రమోదీ బీజేపీ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విఫలం అయిందని, రెండున్నర సంవత్సరాలు పూర్తి కాకముందే కాంగ్రెస్ పాలనను ప్రజలు చీకొడుతున్నారన్నారు. తెలంగాణలో త్వరలో జరుగబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. తెలంగాణ వచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమేనని వారు జోస్యం చెప్పారు. బీజేపీ పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, బూత్ కమిటీ అధ్యక్షులు గుర్రం శ్రీనివాస్ గౌడ్, దైవల తిరుపతి గౌడ్, మడికంటి శేఖర్, యువ మోర్చా మండల అధికార ప్రతినిధి వంచ మనోజ్, మల్లయ్య, గోపు అనంత రెడ్డి, నాయకులు, ప్రజలు, తదితరులు హాజరయ్యారు.
మందమర్రిలో 14 మంది డిపెండెంట్లకు నియామక పత్రాల పంపిణీ – సింగరేణి భవిష్యత్తు కోసం కృషి చేస్తానన్న మంత్రి డా. వివేక్ వెంకటస్వామి గారు ఈరోజు మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా జీఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మైనింగ్ మరియు కార్మిక శాఖ మంత్రి గౌరవ డా. వివేక్ వెంకటస్వామి గారు, 14 మంది బొగ్గుగని కార్మికుల డిపెండెంట్లకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు
ఈ కార్యక్రమంలో మందమర్రి ఏరియా జీఎం శ్రీ దేవేందర్ , ఏఐటీయూసీ అధ్యక్షుడు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ:
Singareni
“బొగ్గుగని కార్మికులంటే మా కాకా డా. వెంకటస్వామి కి అమితమైన ప్రేమ ఉండేది. ఆయన కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్న సమయంలో, నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థ మూసివేయకుండా అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు తో చర్చించి, ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్లు రుణం ఇప్పించి సంస్థను ఆదుకున్నారు. లక్షలాది కార్మిక కుటుంబాలకు బాసటగా నిలిచారు.”
Singareni
“ఈరోజు సింగరేణి సంస్థ లాభాల బాటలోకి రావడానికి, కార్మికుల క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం ప్రధాన కారణం. తెలంగాణలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిని కాపాడుకోవడం మనందరి బాధ్యత.”
“గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, సంస్థ అభివృద్ధికి తగిన ప్రయత్నం జరగలేదు. కేవలం నిధుల వాడకానికే పరిమితమైంది. ఇకపై కొత్త గనులు, కొత్త ఉద్యోగ అవకాశాలు తీసుకురావడంపై దృష్టి పెడతాం. కేంద్ర ప్రభుత్వం చేపట్టే టెండర్లలో సింగరేణి సంస్థ నేరుగా పాల్గొనగలిగే విధంగా చర్యలు తీసుకుంటాం.”
Singareni
ఈ కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న కుటుంబాలు మంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగావకాశం వారి జీవితాలకు మేలు చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి జయంతి వేడుకలు…
మందమర్రి నేటి ధాత్రి:
*కార్మిక మరియు గనుల శాఖ మంత్రివర్యులు చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలు మందమర్రి మార్కెట్ సంజయ్ గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదట యూత్ కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.యూత్ కాంగ్రెస్ నాయకులు చెన్నూరు నియోజక యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నేరటి వెంకటేష్,రాయబారపు కిరణ్,చిప్పకుర్తి శశిధర్ మాట్లాడుతూ పీవీ నరసింహారావు భారతరత్న అవార్డు గ్రహీత, తొలి తెలుగు ప్రధాని తెలంగాణ నుండి కూడా మొట్టమొదటి ప్రధాని మంత్రి అని బహుభాషా కోవిదుడు అని కొనియాడారు. ఆ మహనీయుని కి ఇదే ఘన నివాళి అని తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు రమేష్,చోటు,సూరజ్ కిరణ్,సతీష్,బాచి,చింటూ,శంకర్, రాజ్ కుమార్,రాజేష్,రాజు పాల్గొన్నారు.*
డీఈవో సంగారెడ్డి వెంకటేశ్వర్లు గారి నుండి ఉత్తర్వులు అందుకుంటూ…
జహీరాబాద్ నేటి ధాత్రి:
జాతీయ స్థాయి న్యూఢిల్లీలో 15 రోజుల పాటు జరిగే సి.సి.ఆర్.టి. కార్యక్రమానికి ఎంపికైన ప్రాథమిక పాఠశాల రెజింతల్ ప్రధానోపాధ్యాయురాలు సఫియా సుల్తానా బెస్ట్ ప్రాక్టీసెస్‌లో భాగంగా, జూన్ నెలలో జరిగిన రాష్ట్ర స్థాయి మండల విద్యాధికారుల సమావేశంలో అన్ని జిల్లాల నుండి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసిన 110 మంది ఉపాధ్యాయులు తమ వినూత్న విద్యా విధానాలను ప్రదర్శించారు. ఈ సమావేశం ఎస్ సి ఈ ఆర్ టి ఆధ్వర్యంలో ఎంసీఆర్ హెచ్ ఆర్ డి, హైదరాబాద్ లో నిర్వహించబడింది.ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ఉపాధ్యాయుల ప్రదర్శనలను గమనించి జాతీయ స్థాయిలో 15 రోజుల సీసీ ఆర్ టి (Centre for Cultural Resources and Training) శిక్షణకు ఎంపిక చేశారు. దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లా నుండి రేజింతల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సఫియా సుల్తానా గారు ఎంపిక అయ్యారు . తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాథమిక పాఠశాలలకి చెందిన 10 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు.
ఇతర జిల్లాల ఎంపికల వివరాలు ఇలా ఉన్నాయి:
జగిత్యాల జిల్లా – 2
ములుగు జిల్లా – 2
మెదక్ జిల్లా – 1
వికారాబాద్ జిల్లా – 1
మంచిర్యాల జిల్లా – 1
యాదాద్రి జిల్లా – 1
నిర్మల్ జిల్లా – 1
సంగారెడ్డి జిల్లా – 1 ( సఫియా సుల్తానా )
ఈ ఎంపికకు సంబంధించి ఎస్ సి ఈ ఆర్ టి డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి. వెంకటేశ్వర్లు గారి నుండి.సఫియా సుల్తానా దానికి సంబంధించిన ఉత్తర్వులు నిన్న అందుకున్నారు. ఈ సందర్భంగా డీఈవో సంగారెడ్డి సఫియా సుల్తానా గారిని ప్రత్యేకంగా అభినందించారు.
అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి.
చిట్యాల, నేటిధాత్రి :
భూపాలపల్లి మండలం: గూడాడుపల్లి గ్రామానికి చెందిన దాసరపు శ్రీజ (14) చిన్నతనంలోనే శ్రీజ ను వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది అప్పటినుండి వాళ్ళ నాన్న మానసికంగా కృంగిపోయి తాగుడుకు బానిస అయ్యాడు అప్పటినుండి శ్రీజను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోవడంతో స్కూల్ బంద్ చేసి వేరే ఊరిలో ఒకరి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తూ ఉండిపోయింది శ్రీజ పరిస్థితిని చూసి గూడాడుపల్లికి చెందిన చంద్రగిరి శ్రీకాంత్ అనే యువకుడు ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ వారికి విషయం చెప్పడంతో వెంటనే స్పందించిన
ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి గారు ఆ చిన్నారి దగ్గరికి వెళ్లి శ్రీజ పరిస్థితి తెలుసుకొని వెంటనే ఆ చిన్నారికి బట్టలు, బుక్స్ పెన్నులు, మిగతా సామాను కొనిచ్చి, చిట్యాల కస్తూర్బా హాస్టల్ లో జాయిన్ చేయించడం జరిగింది అలాగే శ్రీజ పూర్తి బాధ్యతలు మేమే చూసుకుంటామని శ్రీజ పై చదువులకు కూడా సహాయక సహకారాలు అందిస్తామని భవిష్యత్తులో ఆమెతల్లి వదిలేసి చదువు మానేసిన చిన్నారికి చేయూత.
అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి.
గూడాడుపల్లి గ్రామానికి చెందిన దాసరపు శ్రీజ (14) చిన్నతనంలోనే శ్రీజ ను వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది అప్పటినుండి వాళ్ళ నాన్న మానసికంగా కృంగిపోయి తాగుడుకు బానిస అయ్యాడు అప్పటినుండి శ్రీజను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోవడంతో స్కూల్ బంద్ చేసి వేరే ఊరిలో ఒకరి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తూ ఉండిపోయింది శ్రీజ పరిస్థితిని చూసి గూడాడుపల్లికి చెందిన.
చంద్రగిరి శ్రీకాంత్ అనే యువకుడు ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ వారికి విషయం చెప్పడంతో వెంటనే స్పందించిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి గారు ఆ చిన్నారి దగ్గరికి వెళ్లి శ్రీజ పరిస్థితి తెలుసుకొని వెంటనే ఆ చిన్నారికి బట్టలు, బుక్స్ పెన్నులు, మిగతా సామాను కొనిచ్చి, చిట్యాల కస్తూర్బా హాస్టల్ లో జాయిన్ చేయించడం జరిగింది
అలాగే శ్రీజ పూర్తి బాధ్యతలు మేమే చూసుకుంటామని శ్రీజ పై చదువులకు కూడా సహాయక సహకారాలు అందిస్తామని భవిష్యత్తులో ఆమె పెళ్లి కూడా మేమే చేస్తామని చైర్మన్ అయిలి మారుతి గారు తెలియజేశారు అలాగే శ్రీజ పరిస్థితి గురించి తెలియజేసిన.
చంద్రగిరి శ్రీకాంత్ గారిని చైర్మన్ అయిలి మారుతి గారు ప్రత్యేకంగా అభినందించారు ఇలాగా ఇంకా ఎవరైనా ఉంటే మా ఫౌండేషన్ వారికి ఫోన్ చేసి తెలపమని తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చిట్యాల మండల ఇంచార్జ్ లౌడియ రాజునాయక్, దుగ్యాల స్వామి తదితర సభ్యులు పాల్గొన్నారు.
పెళ్లి కూడా మేమే చేస్తామని చైర్మన్ అయిలి మారుతి గారు తెలియజేశారు అలాగే శ్రీజ పరిస్థితి గురించి తెలియజేసిన చంద్రగిరి శ్రీకాంత్ గారిని చైర్మన్ అయిలి మారుతి గారు ప్రత్యేకంగా అభినందించారు ఇలాగా ఇంకా ఎవరైనా ఉంటే మా ఫౌండేషన్ వారికి ఫోన్ చేసి తెలపమని తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చిట్యాల మండల ఇంచార్జ్ లౌడియ రాజునాయక్, దుగ్యాల స్వామి తదితర సభ్యులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.