గద్దర్ చిత్రపటానికి నివాళులర్పించిన..

గద్దర్ చిత్రపటానికి నివాళులర్పించిన
కామ్రేడ్ చంద్రగిరి శంకర్.

భూపాలపల్లి నేటిధాత్రి

హైదరాబాదులో రవీంద్రభారతిలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ మూడో వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఏఐ ఎఫ్ టియు కార్మిక నాయకుడు కామ్రేడ్ చంద్రగిరి శంకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా విప్లవ నాయకుడు గద్దర్ ఆశయాలను నేటి యువత కొనసాగించాలని కామ్రేడ్ చంద్రగిరి శంకర్ అన్నారు. గద్దర్ తన | ఆటపాటలతో సమాజాన్ని చైతన్యపరిచి చివరి శ్వాస వరకు ప్రజల పక్షాన నిలిచి తరతరాలకు ఉద్యమ స్ఫూర్తిని అందించిన పోరాట యోధుడు ప్రజాయుద్ధనౌక గద్దర్ అని అన్నారు ఆయన చేసిన సేవలు మరువలేనివి అని అన్నారు.

కోతుల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-34-1.wav?_=1

కోతుల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

పట్టించుకోని అధికారులు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో కోతుల బెడద మరీ ఎక్కువగా ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నా అధికారులు వినీ విననట్టు ప్రవర్తిస్తున్నారు. అనేకమార్లు అనేకమందిని కోతులు దాడి చేసి గాయపరి చిన సంఘటనలు కోకొల్లలు. గ్రామంలో, మండల పరిధిలో కుక్కల బెడదతోనే తట్టుకోలేక పోతున్న జనానికి కోతుల బెడదతో జనానికి ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ఒంటరిగా వెళుతున్న మనిషి కనబడితే పాపం చేతిలో ఏమైనా ఉంటే గుంజుకొని దాడి చేయడం పరిపాటిగా మారింది. గురువారం ఉద యం ఇంటి ముందు తన పనులు చేసుకుంటుండగా ఒకేసారి 20 నుండి 30 కోతులు ధైనoపెళ్లి సాంబయ్య అని వ్యక్తిపై పడి విపరీతంగా కరిచాయి.

 

అక్కడే ఉన్న మహిళ అరవడంతో చాలా మంది రావడంతో కోతులు అతడిని వదిలి వెళ్లాయి ఎటు చూసినా రక్తమే, అక్కడభయం కర వాతావరణం నెలకొంది తీవ్ర గాయాల పాలైన దైనం పెల్లి సాంబయ్య అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. స్థానికులు వెంటనే 108 కి ఫోన్ చేసి హుటాహుటిన వరంగల్ లోని ఎంజిఎం ఆసుపత్రికి తరలిం చారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తామని హెచ్చరిం చారు.

దిగ్వాల్లో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-33.wav?_=2

దిగ్వాల్లో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ మండలంలోని దిగ్వాల్ గ్రామంలో ప్రజపాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. పేదవారికి సొంత ఇంటి కల నెరవేర్చడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని ఆత్మ కమిటీ చైర్మన్ పట్లోళ్ల రామలింగా రెడ్డి గురువారం అన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. భూమి పూజలో పాల్గొని పనులు ప్రారంభించారు.

మండల్ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు రక్షాబంధన్

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-32-1.wav?_=3

మండల్ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు రక్షాబంధన్

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

మండలంలో కోమటి కొండాపూర్ గ్రామంలో ప్రాథమికొన్నత లో పాఠశాలలో రాఖీ పౌర్ణమి ని పురస్కరించుకొని విద్యార్థినిలు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ముందస్తుగా రాఖీ కడుతూ” నేను, నీకు రక్ష, నీవు,నాకు రక్ష,మనమిద్దరం దేశానికి రక్షా” అంటూ వాగ్దానం చేయడం జరిగింది.ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాఖీ అనగా రక్షణ బంధం అన్నకు గానీ, తమ్మునికి గానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం అని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు సుధారాణి, విశాల్, నర్మద, జ్యోష్ణ, రాణి, లు పాల్గొన్నారు.

ఇంటింటికి బీజేపీ ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షుడు కార్యక్రమం జోరుగా

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-31.wav?_=4

ఇంటింటికి బీజేపీ ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షుడు కార్యక్రమం జోరుగా

వర్దన్నపేట నేటిధాత్రి :

భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాల,కడారి గూడెం గ్రామం పరిధిలోని 227 228 229 బూత్ శక్తి కేంద్రం ఇంచార్జ్ నాంపల్లి కుమార్ ఆధ్వర్యంలో మహా సంపర్క్ అభియాన్ లో భాగంగా “ఇంటింటికి బిజెపి ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షుడు” పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి జడ సతీష్ అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది.
స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని మోసాన్ని నరేంద్ర మోదీ గారి పథకాల గొప్పతనాన్ని నిబద్ధత గల సైనికులుగా పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరింత బలంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు చిక్కొండ రాజు , పింగిలి రాజేందర్ రెడ్డి. జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి పింగిలి సంపత్ రెడ్డి. బూత్ కమిటీ సభ్యులు చిర్రా కిరణ్. వంగాల రాజేందర్ రెడ్డి . పింగిలి ఇంద్రసేనారెడ్డి. సుదర్శన్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.

రామాయంపేటలో కోటి రూపాయల సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-30.wav?_=5

రామాయంపేటలో కోటి రూపాయల సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన..

రామాయంపేట, నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మండల కేంద్రంలోని మూడవ మరియు నాలుగవ వార్డుల్లో రోడ్ల అభివృద్ధి పనులకు రూ. 1 కోటి వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ల పనులను గురువారం నాడు ప్రారంభించారు.ఈ పనులు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.వార్డుల్లో రోడ్ల పరిస్థితి గత కొంతకాలంగా తీవ్రంగా దెబ్బతినిన నేపథ్యంలో ఈ అభివృద్ధి పనులు ప్రజల్లో హర్షాతిరేకాలు నింపాయి.ఈ సందర్భంగా చౌదరి సుప్రభాత రావు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే మా ప్రాధాన్యం.రోడ్డుపనుల ద్వారా ట్రాఫిక్ సౌకర్యం మెరుగవుతుంది.ఇది రామాయంపేట అభివృద్ధిలో మరో ముందడుగు అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సీ.ఐ.టీ.యూ ఆధ్వర్యంలో చేనేత జాతీయ దినోత్సవం

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-29.wav?_=6

సీ.ఐ.టీ.యూ ఆధ్వర్యంలో చేనేత జాతీయ దినోత్సవం

వర్కర్ టూ ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులకు అందించాలి

( త్రిఫ్ట్ ) నేతన్న పొదుపు పథకానికి సంబంధించిన డబ్బులు వెంటనే కార్మికుల ఖాతాలలో జమ చేయాలి

చేనేత – పవర్లూమ్ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేయాలి

కార్మికులందరికీ 6వెయ్యిల రూపాయల పెన్షన్ అమలు చేయాలి

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు ఆగస్టు – 7 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ – CITU ఆధ్వర్యంలో సిరిసిల్ల పాత బస్టాండులోని నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి వర్కర్ టూ ఓనర్ , త్రిఫ్ట్ , మరియు ఇతర డిమాండ్లను పరిష్కరించాలని ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం , అధికారులు చేనేత దినోత్సవం రోజున సంబరాలు జరుపుకోవడానికి పరిమితం కాకుండా చేనేత , పవర్లూమ్ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సిరిసిల్లలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వర్కర్ టూ ఓనర్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే పూర్తి చేసి కార్మికులకు అందించాలని , త్రిఫ్ట్ నేతన్న పొదుపు పథకానికి సంబంధించిన డబ్బులను వెంటనే కార్మికుల ఖాతాలలో జమ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ , వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరిమల్ల సత్యం , ఉడుత రవి , సూరం పద్మ , దాసరి రూప , జిందం కమలాకర్ , బెజుగం సురేష్ , బాస శ్రీధర్ , స్వర్గం శేఖర్ , బింగి సంపత్ , కారంపురి మహేష్ , చింత కింది సుధన్ , దోమల రాము , సందుపట్ల పోచమల్లు , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

భర్త ప్రేమ కాదంది.. బాల్య ప్రేమ రమ్మంది…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-07T154141.018.wav?_=7

భర్త ప్రేమ కాదంది.. బాల్య ప్రేమ రమ్మంది

అత్తగారు పెట్టిన బంగారం.. ప్రియుడికి దాసోహం.

పసి పాపని వదిలి.. ప్రియుడుతో మహిళ జంప్.

కానిస్టేబుల్ ను పెళ్లాడిన యువతి

బంధువులు బతిమిలాడిన.. కనికరం లేని మహిళ.

నేటిధాత్రి

నవ మాసాలు మోసిన కన్న తల్లిదండ్రులు తన కూతురు క్షేమంగా ఉండాలని మంచి సంసార జీవితం గడపాలని.. కలలు కన్నా వారికి నిరాశే మిగిలిన సంఘటన బాలానగర్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి జరిగింది. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. మండలంలోని ఓ తండాకు చెందిన యువకుడితో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని ఓ తాండకు చెందిన యువతితో ఐదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి మూడేళ్ల పాప ఉంది. అయితే ఆ యువతి రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో విద్య నభ్యసించింది. ఆ సమయంలోనే ఆ యువతికి ఓ స్నేహం ఏర్పడింది. స్నేహం కాస్త ప్రేమగా మారింది. అనంతరం ఆమె సొంత ఇంటికి రాగా.. బాలానగర్ మండలంలోని తండాకు చెందిన యువకుడితో పెళ్లి చేశారు. సంసారం జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో.. ఆ మహిళకు గతంలో మహేశ్వరంలో పరిచయమైన యువకుడికి ఇటీవలే పోలీస్ కానిస్టేబుల్ జాబు వచ్చింది. పాత పరిచయం విరబూసిన మల్లె పువ్వుల మళ్లీ చిగురించింది. వారి ప్రేమ కొనసాగుతూ.. వచ్చింది. ఇటీవలే ఆ కానిస్టేబుల్ బెట్టింగ్ గ్యాప్ లో డబ్బులు పోగొట్టుకోగా.. ఈ మహిళను సంప్రదించాడు. ఆమె మెడపై ఉన్న బంగారు నగలను ప్రియుడికి ఇచ్చింది. కుటుంబ సభ్యులు నిలదీయగా అసలు బండారం బయటపడింది. భయంతో కానిస్టేబుల్ తో ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇద్దరు శ్రీశైలంలో ఐదు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. భార్య కనిపించకపోవడంతో భర్త పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

Western Culture Influence.

బుధవారం మహిళను భర్తను పోలీస్ స్టేషన్లో విచారించగా.. తను భర్త దగ్గరకు వెళ్ళనని చెప్పింది. బంధువులు ఆ యువతికి మూడేళ్ల పాప ఉంది. జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చేతులు జోడించి వేడుకున్న మహిళా కనుకరించలేదు. చివరకు కానిస్టేబుల్ వద్దకే వెళ్తానని చెప్పింది. ఎస్ఐ లెనిన్ మహిళకు నచ్చజెప్పిన.. వినకపోవడంతో చేతులెత్తేశారు. పసి బాలిక తల్లి వద్ద ఉండలేక.. తండ్రిని చూస్తూ.. డాడీ.. డాడీ అని ఏడుస్తుంటే.. చూసి బంధువులు పోలీస్ స్టేషన్లో ఉన్న సాధారణ వ్యక్తులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. చిన్న వయస్సులో భవబంధాలకు దూరమై అమాయక చూపులు చూస్తున్న బాలిక ఏమీ తెలియక ఆ పసి గుడ్డు నిచ్చేష్టురాలై ఉండిపోయింది. చివరకు ఆ మహిళ.. బాబాయ్ ఇంటికి వెళ్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ మహిళ చేసిన పని పట్ల తల్లి తీవ్ర మనోవేదనకు గురైంది. తమ ఇంటి పరువు తీస్తుందని తల్లి రోధించింది. నేటి మహిళలు పాచ్యత్య సంస్కృతిని అవలంబిస్తున్నారని కొందరు మహిళలు వికృత చేష్టలతో.. మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని, మహిళలు గౌరవాన్ని కోల్పోతున్నారని స్థానికులు అన్నారు.

ఇందిరమ్మ ఇల్లుతో పేదవాడి సొంత ఇంటి కల నెరవేరింది

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-28.wav?_=8

ఇందిరమ్మ ఇల్లుతో పేదవాడి సొంత ఇంటి కల నెరవేరింది

మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్

పరకాల నేటిధాత్రి

మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో స్థానిక శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి సహకారంతో ఎస్సీ కాలనీలో కోడెపాక లావణ్య నాగరాజు లకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన పరకాల బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు,మాజీ కౌన్సిలర్ మడికొండ.సంపత్ కుమార్.ఈ సందర్బంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేరుతుందని,గత పడుయేండ్లు గా ఎంతో ఆశతో ఎదురుచూసిన పేదోడి కళలను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేదోడి బతుకులు మారుతున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొచ్చు కోమల,బొచ్చు జెమిని, బొమ్మకంటి చంద్రమౌళి,వార్డు పెద్దలు,మహిళలు పాల్గొన్నారు.

ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతి పత్రం

 

ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతి పత్రం

నర్సంపేట,నేటిధాత్రి:

హాస్టల్ బిల్లులు విడుదల చేయాలని ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్డీవో ఉమారాణికి వినతిపత్రం అందజేశారు.
అనంతరం జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ,బీసీ సంక్షేమ హాస్టల్లో గత జనవరి నుండి నేటి వరకు ఎస్సీ ఎస్టీ హాస్టల్ డైట్ బిల్స్, రాలేకపోవడంతో హాస్టల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ హాస్టల్లో ఉండని పరిస్థితి నెలకొందన్నారు.ఎస్సీ ఎస్టీ బీసీ కళాశాల హాస్టల్లో సొంతభవనాలకు లేకపోవడం అరకొర వసతులతో వలన అద్దె భవనంలో మధ్యలో ఉంటూ కాలంవెల్లదీసే పరిస్థితి నెలకొందన్నారు. అధికారులు స్పందించి హాస్టల్ డైట్ బిల్లులు, అద్దె భవనాలకు కిరాయిలు చెల్లించి,హాస్టల్లో ఉన్న నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఆర్డీఓను కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రశాంత్ ,వినయ్, శ్రీకాంత్, రాకేష్, ప్రమోద్, కుమార్, తేజ, వంశీ, తదితరులు పాల్గొన్నారు.

పరిపాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-07T152502.610.wav?_=9

పరిపాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం…

జీవో 76 ప్రకారం ఇండ్ల పట్టాలను పక్కన పెట్టిన ప్రభుత్వం…

హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం…

చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన గాలికి వదిలేసిందని, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు పరచడం లేదని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. గురువారం రామకృష్ణాపూర్ పట్టణంలోని జయశంకర్ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. సూపర్ బజార్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి రామాలయం చౌరస్తాలో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడారు. మందమర్రి పట్టణంలో జయశంకర్ ఏడడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు తరలి వెళుతున్నామని అందులో భాగంగానే రామకృష్ణాపూర్ పట్టణం నుండి ర్యాలీగా వెళ్లడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చడంలేదని దుయ్యబట్టారు. సింగరేణి ప్రాంతంలో జీవో నెంబర్ 76 ప్రకారం వీళ్ళ పట్టాలు గత మా ప్రభుత్వంలో అందించడం జరిగిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టాలు అందించడంలో విఫలమయ్యిందని అన్నారు. హైడ్రా పేరిట పేదల ఇండ్లను కులుస్తుందని ధ్వజమెత్తారు.

Congress government

20 నెలల పరిపాలనలో ప్రజలకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. రానున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.

మోరిల నుంచి రోడ్లపైకి మురికినీరు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-26-1.wav?_=10

మోరిల నుంచి రోడ్లపైకి మురికినీరు..

పట్టించుకోని మున్సిపల్ అధికారులు..

రామాయంపేటలో వింత పరిస్థితి!

రామయంపేట నేటి ధాత్రి (మెదక్)

సాధారణంగా మురికినీరు రోడ్ల నుండి మోరుల (డ్రైనేజీ లైన్ల) వైపు పోవాలి. కానీ రామాయంపేట పట్టణంలో మాత్రం దీనికి విరుద్ధంగా, మోరుల నుంచే మురికినీరు రోడ్లపైకి వస్తుండడం నిజంగా వింత మరియు ఆందోళన కలిగించే విషయం. నిన్నటి వర్షానికి మోరిలు నిండిపోయి మురికినీరు రోడ్ల మీదికి పొంగిపొర్లిన ఘటన ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురిచేసింది.

ఈ మురికినీరు పొంగిపొర్లే ప్రాంతాల్లో ప్రజలు నిత్యవసరాలకు అవసరమైన కూరగాయల మార్కెట్లు ఉండటం గమనార్హం. ఫలితంగా మురికి నీటిలో నానిన పరిస్థితుల్లో ప్రజలు కొనుగోళ్లు చేయాల్సి రావడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం అధికంగా ఉంది. కాలరా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి జల వ్యాధుల ప్రమాదం రాకముందే అప్రమత్తమవాల్సిన అవసరం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక నివాసితుడు ఒద్ది స్వామి మాట్లాడుతూ, “ఇది రామాయంపేటలో సాంప్రదాయ మార్గాలకు విరుద్ధమైన పరిస్థితి. మోరిల నుంచి రోడ్లపైకి నీరు రావడం అంటే డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలమైనట్టు స్పష్టం అవుతోంది. ప్రజలు ఆ మార్గంలో నడవలేక, సిగ్గుపడే స్థితికి వచ్చారు” అని అన్నారు.

ఇకపోతే, డ్రైనేజీ సమస్యతో పాటు రోడ్ల వెడల్పు కూడా ఒక ప్రధాన సమస్యగా మారింది. మున్సిపల్ నిబంధనల ప్రకారం ప్రధాన రహదారుల వెడల్పును పెంచడం, డ్రైనేజీ లైన్లను పునఃసంఘటన చేయడం ద్వారా ఈ సమస్యకు స్థిర పరిష్కారం దొరుకుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజలు రామాయంపేట మున్సిపాలిటీ అధికారులను తక్షణమే స్పందించి, మోరిల పునరుద్ధరణ, రోడ్ల విస్తరణ పనులకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని వర్షాకాలం ముగించేలోగా శుభ్రమైన పరిసరాలను కల్పించాలన్నదే స్థానికుల ఆశ.

రామాయంపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద చెరువుల తలపిస్తున్న రోడ్ల పరిస్థితి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-25.wav?_=11

రామాయంపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద చెరువుల తలపిస్తున్న రోడ్ల పరిస్థితి.. ఇబ్బంది పడుతున్న ప్రజలు..

రామాయంపేట నేటి ధాత్రి
(మెదక్)

రామాయంపేట పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద రోడ్ల పరిస్థితి దయనీయంగా మారింది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రాంత రోడ్లు చెరువులను తలపించే స్థితిలో ఉన్నాయి. వర్షపు నీరు నిలిచిపోయి భారీగా గుంతలు ఏర్పడటంతో రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్, వివాహ సంబంధిత పనుల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

ప్రజల అభిప్రాయాల ప్రకారం, సబ్ రిజిస్టర్ కార్యాలయం అనేది రోజూ వందలాది మంది ప్రజలు సందర్శించే ప్రధాన కార్యాలయం. అయితే అక్కడి రోడ్ల పరిస్థితి మూలంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు నడవడానికే ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. కొంతమంది ప్రజలు పొలిమేరల మధ్య నడిచేలా మారిందని చెబుతున్నారు.

స్థానిక నివాసితుడు ఒద్ది స్వామి మాట్లాడుతూ, “ఇంతటి ప్రధాన కార్యాలయం వద్ద రోడ్ల పరిస్థితి ఇంత దయనీయంగా ఉండటం బాధాకరం. ప్రజల సమస్యను పరిగణనలోకి తీసుకొని అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి” అని అన్నారు.

ఈ నేపథ్యంలో ప్రజలు రామాయంపేట మున్సిపాలిటీ మరియు రోడ్లు & భవనాల శాఖ (R&B) అధికారులను రంగంలోకి దిగి, అక్కడి రోడ్లను సీసీ రోడ్లుగా మార్చాలని, సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాత్కాలికంగా అయినా గుంతలు పూడ్చి ప్రజలకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలంటున్నారు.

సకాలంలో ఆర్టీసీ బస్సులు నడపాలి డీ ఎం కు వినతిపత్రం ఇచ్చిన..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-07T151353.003-1.wav?_=12

సకాలంలో ఆర్టీసీ బస్సులు నడపాలి డీ ఎం కు వినతిపత్రం ఇచ్చిన ఐక్యవేదిక

వనపర్తి నేటిదాత్రి .

ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు వివిధ గ్రామాల నుండి వనపర్తి కి వస్తారని సకాలంలో లో ఆర్టీసీ బస్సులు విధంగా చర్యలు తీసుకోవాలనీ ఆర్టీసీ డిఎంకు వినతిపత్రం అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యర్యములో వినతిపత్రం అందజేశారు
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, వెంకటేశ్వర్లు,కొత్త గొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, కృష్ణయ్య, నాగరాజు రామస్వామి, కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ విద్యార్థులకు అద్భుతమైన అవకాశం!

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-07T150009.898.wav?_=13

తెలంగాణ విద్యార్థులకు అద్భుతమైన అవకాశం! విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (VVM) 2025 కార్యక్రమం
*మహాదేవపూర్ఆగస్టు 7 (నేటిదాత్రి )

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో, యువ మనసులను ప్రోత్సహించడానికి రూపొందించబడిన ఈ ఉత్తేజకరమైన పోటీ, 6 నుంచి 12వ తరగతి విద్యార్థులను ఆన్‌లైన్ పరీక్షలో పాల్గొనమని ఆహ్వానిస్తుంది, ఇది నెలకు ₹2,000 స్కాలర్‌షిప్ మరియు ₹25,000 నగదు బహుమతిని సాధించే అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమం సైన్స్ పట్ల ఆసక్తిని రేకెత్తించడం మరియు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ పోటీ తెలంగాణతో పాటు దేశంలోని మొత్తం విద్యార్థులకు అందుబాటులో ఉంది. జూనియర్ (6-8 తరగతులు) మరియు సీనియర్ (9-12 తరగతులు) విభాగాలుగా విభజించబడి పాఠశాల స్థాయిలో లెవెల్ I అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 వరకు, లెవెల్ II నవంబర్ 19 నుంచి 23 వరకు మరియు రాష్ట్రస్థాయిలో డిసెంబరు చివరి వారంలో పరీక్షలు నిర్వహించబడతాయి.
రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు స్థానాలు పొందిన వారికి వరుసగా ₹5,000, ₹3,000, మరియు ₹2,000 లభిస్తాయి. జాతీయ స్థాయిలో విజేతలకు ₹25,000 నగదు బహుమతి మరియు భాస్కరా స్కాలర్‌షిప్ కింద ఏడాది పాటు నెలకు ₹2,000 అందుతుంది. నగదు బహుమతులతో పాటు, పాల్గొనేవారికి సర్టిఫికెట్లు, మెమెంటోలు మరియు గుర్తింపు పత్రాలు లభిస్తాయి, ఇవి భవిష్యత్తులో రీసెర్చ్ మరియు సైంటిఫిక్ కెరీర్‌లకు మార్గం సుగమం చేస్తాయి.
దరఖాస్తు ప్రక్రియ సులభం. https://www.vvm.org.in వెబ్‌సైట్‌కి వెళ్లి, లాగిన్ అయ్యి, వివరాలు నమోదు చేసి, పరీక్ష రుసుము కేవలం ₹200 మాత్రమే చెల్లించి, సెప్టెంబర్ 30, 2025 లోపు దరఖాస్తు చేసుకోండి.
ఈ పోటీ కేవలం ఒక పరీక్ష కాదు, ఇది మీ భవిష్యత్తును రూపొందించే అద్భుతమైన అవకాశం. సైన్స్‌పై ఆసక్తి ఉన్నవారికి లేదా తమ సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలనుకునేవారికి ఇది సరైన వేదిక.
వివరాలకు భూపాలపల్లి జిల్లా కోఆర్డినేటర్ మడక మధును సంప్రదించగలరు 9440946542

గ్రామపంచాయతీ కార్యదర్శులకు పరిశుద్ధ్యం పట్ల అవగాహన కార్యక్రమం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-07T140053.083.wav?_=14

గ్రామపంచాయతీ కార్యదర్శులకు పరిశుద్ధ్యం పట్ల అవగాహన కార్యక్రమం

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

ఫీవర్ కేసులకు తప్పనిసరిగా డెంగ్యూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి

జిల్లాలో డెంగ్యూ మరణాలు సంభవించకుండా జాగ్రత్తలు పాటించాలి

ప్రతి ఫీవర్ కేసును వైద్య సిబ్బంది ఫాలో అప్ చేయాలి

ఆస్తి పన్ను వసూలు లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలు గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ పట్ల పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ పై ఎం.పి. ఓ., పంచాయతీ కార్యదర్శులు, ఏ.ఎన్.ఎం. లతో రివ్యూ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, డెంగ్యూ, మల్లేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ఫీవర్ కేసులకు తప్పనిసరిగా డెంగ్యూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి గ్రామంలో పారిశుధ్య నిర్వహణ పట్ల అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ సీజనల్ వ్యాధులు వ్యాప్తి అరికట్టాలని అన్నారు. డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతంలో ప్రత్యేకంగా పారిశుధ్య చర్యలు చేపట్టాలని, చుట్టుపక్కల ఇండ్లలో ఫీవర్ సర్వే నిర్వహించాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శి బాధ్యతతో గ్రామంలో పిచ్చి మొక్కల తొలగింపు, నీటి నిల్వ ఉండకుండా చర్యలు, అధికంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయడం వంటి చర్యల చేపట్టాలని అన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని హై రిస్క్ ఏరియాలను గుర్తించి అక్కడ డ్రై డే పకడ్బందీగా జరిగేలా చూడాలని అన్నారు. ప్రతి గ్రామంలో వారానికి రెండు సార్లు మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమం జరగాలని అన్నారు. ఆశా, ఏ.ఎన్.ఎం లు ఇంటింటి సర్వే నిర్వహించి నీటి నిల్వ వల్ల కలిగే నష్టాలు, దోమల తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్ సెంటర్ అధికారులు వారి పరిధిలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణ జరిగేలా చూడాలని అన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, హెల్త్ సబ్ సెంటర్ పరిధిలో అవసరమైన మేర వ్యాధి నిర్ధారణ కిట్లు అందుబాటులో పెట్టాలని అన్నారు. ప్రతి పీ.హెచ్.సి పరిధి లో లక్ష్యాలు నిర్దేశించుకొని నిర్దారణ పరీక్షలు చేయాలని అన్నారు.డెంగ్యూ కేసులను తక్కువ చేసి చూపించే అవసరం లేదని, మనం ఎన్ని డెంగ్యూ కేసులు గుర్తించి వారికి అవసరమైన చికిత్స అందిస్తే అంత బాగా పని చేసినట్లుగా పరిగణిస్తామని కలెక్టర్ తెలిపారు.

District Collector Sandeep Kumar Jha

ఔట్ పేషెంట్ వచ్చే ప్రతి ఫీవర్ కేసు రోగి కు తప్పనిసరిగా డెంగ్యూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. డెంగ్యూ నిర్ధారణ జరిగిన కేసులలో నిర్దేశిత ప్రోటోకాల్ ప్రకారం చికిత్స అందించడం పరిసర ప్రాంతాల పారిశుధ్య పనులు జరిగేలా చూడాలని అన్నారు.
డెంగ్యూ కేసులను రెగ్యులర్ గా ఫాలో అప్ చేయాలని, రక్త కణాలు ఎలా ఉంటున్నాయో పరిశీలించాలని అన్నారు. మన విధులలో చూపెట్టె చిన్న నిర్లక్ష్యం కారణంగా ఒక కుటుంబం సభ్యులను కోల్పోయే ప్రమాదం ఉంటుందని, దయచేసి అధికారులు సిబ్బంది అంతా అప్రమత్తతో విడుదల నిర్వహించాలని అన్నారు.
సిరిసిల్ల , వేములవాడ ఆసుపత్రులకు అధికంగా రోగులు వస్తున్నారంటే క్షేత్ర స్థాయిలో పి.హెచ్.సి పని తీరు సరిగ్గా ఉండటం లేదని అర్థం వస్తుందని అన్నారు. ప్రతి పి.హెచ్.సి వద్ద అవసరమైన మందులు, వ్యాధి నిర్ధారణ కిట్లు 20% బఫర్ స్టాక్ తో అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు.
ప్రతి గ్రామంలో ఆస్తిపన్ను వసూలు లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పని చేయాలని
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా రజిత, సిరిసిల్ల, వేములవాడ ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్ లు పెంచలయ్య, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ద్దీన్, ఎం.పి.ఓ. లు, పంచాయతీ కార్యదర్శులు, ఏ.ఎన్.ఎం. లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

భారత్ బ్రహ్మోస్ క్షిపణి ట్రంప్‌ను భయపెట్టిందా.!

భారత్ బ్రహ్మోస్ క్షిపణి ట్రంప్‌ను భయపెట్టిందా? ఆపరేషన్ సిందూర్‌లో అమెరికా జోక్యానికి కారణమేంటి..

అమెరికా అధ్యక్షుడు భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలను విధించారు. అలాగే భారత ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. పాకిస్థాన్‌లో చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి ఉమ్మడి కార్యచరణను ప్రకటించారు. ఏదో ఒకరోజు భారత్‌కు పాకిస్థాన్ ఆయిల్ అమ్ముతుందని ప్రకటించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవలి కాలంలో భారత్‌పై విద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారు. తన ఆదేశాలను ధిక్కరించి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై సుంకాల దాడికి దిగారు (Trump Tarrifs). భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలను విధించారు. అలాగే భారత ప్రత్యర్థి పాకిస్థాన్‌తో (Pakistan) ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. పాకిస్థాన్‌లో చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి ఉమ్మడి కార్యచరణను ప్రకటించారు. ఏదో ఒకరోజు భారత్‌కు పాకిస్థాన్ ఆయిల్ అమ్ముతుందని ప్రకటించారు.

ఇక, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో ట్రంప్ జోక్యం గురించి తెలిసిందే. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది తానేనని ట్రంప్ పలుసార్లు ప్రకటించుకున్నారు. అయితే తాజాగా అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ (Wall Street Journal) ఆ ఆసక్తికర కథనాన్ని వెల్లడించింది. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను భయపెట్టిందని ఆ పత్రిక పేర్కొంది. పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ తన బ్రహ్మోస్ క్షిపణుల (BrahMos missile)ను ప్రయోగిస్తున్నట్టు వచ్చిన వార్తలు ట్రంప్‌నకు కలవరం కలిగించాయట.

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌పై భారత్ ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణులలో అణ్వాయుధాలను నింపే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు నిర్ధారించాయని ఆ పత్రిక పేర్కొంది. దీంతో వైట్‌హౌస్‌లో తీవ్ర ఆందోళన మొదలైందట. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు వేగవంతమైన, ఉన్నత స్థాయి చర్చలు మొదలయ్యాయట. పరిస్థితి చేయి దాటితే పాక్‌పై భారత్ అణు దాడులు చేయాలనుకుంటుందని, అలాగే పాకిస్థాన్ కూడా తన సొంత అణ్వాయుధ పరికరాన్ని ప్రయోగించాలని నిర్ణయించుకోవచ్చని ట్రంప్ భయపడ్డారని ఆ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

భారతదేశం, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి అణ్వాయుధాలను మోసుకెళ్లగలదని అమెరికా అధికారులు విశ్వసిస్తున్నారని ఆ కథనం పేర్కొంది. అయితే ఆ కథనాన్ని భారత రాయబార కార్యాలయ అధికారులు తోసిపుచ్చినట్టు కూడా ఆ కథనం తెలిపింది. మొదటగా అణుబాంబులను ప్రయోగించకూడదనే నియమాన్ని భారత్ ఉల్లంఘించదని భారత అధికారులు చెప్పినట్టుగా పేర్కొంది. బ్రహ్మోస్ క్షిపణులు కేవలం సాంప్రదాయ ఆయుధ వ్యవస్థలే తప్ప, అణ్వాయుధాలను మోసుకెళ్లలేవని ఎప్పట్నుంచో భారత్ నొక్కి చెబుతోంది.

ఛలో వరంగల్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-07T133044.037.wav?_=15

ఛలో వరంగల్

11 ఆగస్టు 2025న మహా పాదయాత్రను విజయవం తం చేద్దాం

ఉద్యమకారుల ఫోరం హ నుమకొండ జిల్లా అధ్యక్షుడు పొడిశెట్టిగణేష్

శాయంపేట నేటిధాత్రి:

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినమేనిఫెస్టో లో ఉద్యమకారులకు 250 గజాల ఇంటిస్థలము మరియు నెలకు ₹25,000 పెన్షన్ అంద జేస్తామనిహామీ ఇచ్చింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్ని కల హామీలను విస్మరించడమే కాకుండా, తెలంగాణ ఉద్యమ కారుల యోగక్షేమాలను పూర్తి గా నిర్లక్ష్యం చేయడం వల్లఉద్య మకారులలో తీవ్రమైన అసం తృప్తి నెలకొంది.ఈ న్యాయ మైన డిమాండ్లను ప్రభుత్వా నికి తెలియజేయడం కోసం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఇప్పటికే పలుమార్లు మెమొరాండాలు సమర్పించడం, ప్రతి జిల్లాలో నిరసన కార్యక్రమాలు నిర్వ హించడం జరిగింది. అయినా ప్రభుత్వం నుంచి తగిన స్పంద న లేకపోవడంతో, ఉద్యమ కారులు మరింత బలంగా తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు
ఈ నేపథ్యంలో 11 ఆగస్టు 2025 న మహా పాదయాత్రకు పిలుపునిచ్చారు. ఈ పాద యాత్ర హన్మకొండ వేయి స్తంభాల గుడి నుండి ఏకశిలా పార్క్ వరకు ఘనంగా జరుగును.ఈ పాదయాత్రలో తెలంగాణ ఉద్యమ కారులం దరూ పెద్దసంఖ్యలో పాల్గొని మన గళాన్ని, మన నినాదాన్ని ప్రభుత్వం వరకు తీసుకెళ్లా లని, మన హక్కుల కోసం సమైక్యంగా నిలవాలని తెలం గాణ ఉద్యమకుల ఫోరం పిలుపునిచ్చింది.

నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-07T130130.548.wav?_=16

నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

నేటి ధాత్రి చర్ల

చర్ల మండలంలో రైతు వేదిక ఆఫీస్ నందు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొనగా
చర్ల మండలంలోని ప్రజలకు నూతనంగా రేషన్ కార్డులు మంజూరైన అర్హులకు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది

MLA Dr. Tellam Venkat Rao

ఈ కార్యక్రమంలో చర్ల ఎండిఓ ఈదయ్య ఎంపివో వలీ హజ్రత్ సివిల్ సప్లయ్ డిటి రాజులు ఏపిఎం లక్ష్మి దుర్గ చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి భద్రాచలం నియోజకవర్గం టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీమలమర్రి మురళి గుండెపూడి భాస్కరరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలిన లంకరాజు ఇందల రమేష్ బాబు పొట్రూ బ్రహ్మానంద రెడ్డి ఈర్ప వసంత్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ పరుచూరి రవిబాబు కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు మాజీ ప్రజా ప్రతినిధులు యూత్ కాంగ్రెస్ నాయకులు అభిమానులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు

డాక్టర్ దివ్యనయన ఆధ్వర్యంలో ఎర్రబోరు గ్రామంలో వైద్య శిబిరం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-07T125530.505.wav?_=17

డాక్టర్ దివ్యనయన ఆధ్వర్యంలో ఎర్రబోరు గ్రామంలో వైద్య శిబిరం

నేటిధాత్రి చర్ల

చర్ల మండలంలోని సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ఎర్రబోరు గ్రామంలో డాక్టర్ దివ్య నాయన ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు
మరియు పాఠశాలలోని పిల్లలకు వైద్య పరీక్షలు చెయ్యడం జరిగింది
ఈ హెల్త్ క్యాంప్ యందు సాధారణ వ్యాధులకు మందులు ఇవ్వడం జరిగింది
గర్భిణీ స్త్రీలను ప్రతి నెల పరీక్షలు కొరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావాలని గ్రామంలోని ప్రజలకు తెలిపారు సురక్షితమైన సుఖప్రసవం కొరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తప్పకుండా రావలెను అని చెప్పడం జరిగింది
అనంతరం గృహ సందర్శనలు చేసి డ్రై డే కార్యక్రమాలు చెయ్యడం జరిగింది
అలాగే వర్షాకాలం కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని
నీళ్లు నిల్వలేకుండా చూసుకోవలని
దోమ తెరలను వినియోగించుకోవలని
ఎల్లపుడు పరిశుభ్రమైన నీటిని తీసుకోవాలని
నిల్వ ఉన్న నీళ్లలో టేమోపాస్ ద్రావణాన్ని చల్లాలని ఆశా కార్యకర్తకు చెప్పడం జరిగింది
ఈ కార్యక్రమంలో
డాక్టర్ దివ్యనయన
హెచ్ఈఓ బాబురావు
సంధ్య ఎమ్ హెల్ హెచ్ పి
వరప్రసాద్ హెల్త్ అసిస్టెంట్
ఆశా కార్యకర్త భూలక్ష్మి
పాఠశాల ఉపాధ్యాయులు
తదితరులు పాల్గోనడం జరిగింది

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version