కోతుల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు
పట్టించుకోని అధికారులు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో కోతుల బెడద మరీ ఎక్కువగా ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నా అధికారులు వినీ విననట్టు ప్రవర్తిస్తున్నారు. అనేకమార్లు అనేకమందిని కోతులు దాడి చేసి గాయపరి చిన సంఘటనలు కోకొల్లలు. గ్రామంలో, మండల పరిధిలో కుక్కల బెడదతోనే తట్టుకోలేక పోతున్న జనానికి కోతుల బెడదతో జనానికి ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ఒంటరిగా వెళుతున్న మనిషి కనబడితే పాపం చేతిలో ఏమైనా ఉంటే గుంజుకొని దాడి చేయడం పరిపాటిగా మారింది. గురువారం ఉద యం ఇంటి ముందు తన పనులు చేసుకుంటుండగా ఒకేసారి 20 నుండి 30 కోతులు ధైనoపెళ్లి సాంబయ్య అని వ్యక్తిపై పడి విపరీతంగా కరిచాయి.
అక్కడే ఉన్న మహిళ అరవడంతో చాలా మంది రావడంతో కోతులు అతడిని వదిలి వెళ్లాయి ఎటు చూసినా రక్తమే, అక్కడభయం కర వాతావరణం నెలకొంది తీవ్ర గాయాల పాలైన దైనం పెల్లి సాంబయ్య అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. స్థానికులు వెంటనే 108 కి ఫోన్ చేసి హుటాహుటిన వరంగల్ లోని ఎంజిఎం ఆసుపత్రికి తరలిం చారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తామని హెచ్చరిం చారు.