కళాకారుడి అంతిమయాత్రలో ప్రభుత్వ విప్ బిర్లా అయిలయ్య…

*కళాకారుడి అంతిమయాత్రలో ప్రభుత్వ విప్ బిర్లా అయిలయ్య
# కళాకారుడు ఎండి జహంగీర్ అంతిమయాత్రలో పాల్గొని శవపేటికను(జానాజా డోలి)ని మోసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు.

నేటిదాత్రి యాదాద్రి:

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కేంద్రానికి చెందిన తెలంగాణ రాష్ట్ర గాయకుడు కళాకారుడు యండి జహంగీర్ గారు గురువారం రోజు గుండె పోటు తో మృతిచెందగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు. అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎండి జహంగీర్ గారి శవపేటిక(జానాజా డోలిని)బీర్ల అయిలయ్య గారు మోసి ఘనమైన నివాళులర్పించారు.

ఎండి జహంగీర్ గారి గురించి మాట్లాడుతూ కళతో ప్రజల గుండెల్లో చైతన్యం నింపిన గొప్ప యోధుడు అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి అలాగే తన వంతుగా ఎండి జాంగిర్ కుటుంబానికి సహకారం అందిస్తామని తెలిపారు. ఉద్యమ సమయంలో ప్రస్తుత సమయంలో గజ్జెల శబ్దంలో గళమెత్తిన విప్లవ స్వరానికి జోహార్లు తెలిపారు.బడుగు బలహీన వర్గాల కన్నీళ్లను గీతలుగా మలిచిన మహానుభావుడికి నివాళులు తెలిపారు.

తన గాత్రంతో ప్రజా సమస్యలను ప్రపంచానికి వినిపించిన మహోన్నత వ్యక్తిత్వానికి జోహార్లు,
కళాకారుడిగా మాత్రమే కాదు, సమాజ మార్గదర్శిగా నిలిచిన మహానుభావుడికి,
ఆయన స్వరం ఆగిపోయినా, ఆయన ఆలోచనలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.

అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గద్దర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గద్దర్ జయంతి వేడుకలు.

చిట్యాల, నేటిదాత్రి :

చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో కళాకారుడు తెలంగాణ ఉద్యమంలో రథసారథిగా నిలిచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుటకు ఎన్నెలేని కృషి చేసి సాధించిన విప్లవకారుడు గద్దర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య అన్నారు. గద్దర్ చిత్రపటానికి ముందుగా పూలమాల పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మల్లయ్య మాట్లాడుతూ తన ఆటపాటతో ఉర్రుతలూగించి ఒక విప్లవ జ్యోతిగా నిలిచిన గద్దరని తెలిపారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విట్టల్ రావు ఈయన 1949లో మెదక్ జిల్లాలో జన్మించాడని 2023లో అనారోగ్యంతో మరణించడం జరిగిందని తెలిపారు. ఇంజనీరింగ్ వరకు చదివి మధ్యలో బ్యాంకు ఉద్యోగం చేశాడని చెప్పారు . రిక్షా దొక్కేరహీం అన్న రాళ్లు కొట్టే రామన్న అనే పాటతో గాయకుడిగా మారాడని తెలిపారు ప్రజాస్వామ్య తెలంగాణ రావాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ స్థాపించాడని, 1997లో గద్దర్ పై హత్యాయత్నం జరిగిందని అన్నారు. పాటను ఆయుధంగా మలిచిన ప్రజా గాయకుడు అని తెలిపారు. ఆయన మరణంతో తెలంగాణ గొంతుక మూగబోయిందని అన్నారు ఆయన అణగారిన వర్గాల ప్రజలను దళితులను మహిళలను చైతన్య వంతులను చేయచూ ఆటపాటలతో ఉర్రుతలు ఊగించి ఒక ఉన్నత స్థాయికి ఎదిగాడు అన్నారు ఆయన చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా జయశంకర్ జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ మండల సీనియర్ నాయకులు గురుకుంట్ల కిరణ్ దాసారపు సాంబయ్య చందర్ గడ్డం సదానందం తదితరులు పాల్గొన్నారు

గద్దర్ చిత్రపటానికి నివాళులర్పించిన..

గద్దర్ చిత్రపటానికి నివాళులర్పించిన
కామ్రేడ్ చంద్రగిరి శంకర్.

భూపాలపల్లి నేటిధాత్రి

హైదరాబాదులో రవీంద్రభారతిలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ మూడో వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఏఐ ఎఫ్ టియు కార్మిక నాయకుడు కామ్రేడ్ చంద్రగిరి శంకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా విప్లవ నాయకుడు గద్దర్ ఆశయాలను నేటి యువత కొనసాగించాలని కామ్రేడ్ చంద్రగిరి శంకర్ అన్నారు. గద్దర్ తన | ఆటపాటలతో సమాజాన్ని చైతన్యపరిచి చివరి శ్వాస వరకు ప్రజల పక్షాన నిలిచి తరతరాలకు ఉద్యమ స్ఫూర్తిని అందించిన పోరాట యోధుడు ప్రజాయుద్ధనౌక గద్దర్ అని అన్నారు ఆయన చేసిన సేవలు మరువలేనివి అని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version