ట్రంప్, పుతిన్ భేటీ వాయిదా.. ఎందుకంటే..

ట్రంప్, పుతిన్ భేటీ వాయిదా.. ఎందుకంటే..?

 

ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఫుల్ స్టాప్ పెట్టేందుకు తాను, రష్యా అధ్యక్షుడు పుతిన్ హంగేరి రాజధాని బుడాపేస్ట్‌లో సమావేశం అవుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. అయితే ఈ సమావేశం వాయిదా ప్రస్తుతానికి వాయిదా పడింది. మళ్లీ భవిష్యత్తులో ఈ సమావేశం జరుగుతుందనే అంశంపై స్పష్టత లేదని వైట్ హౌస్ వెల్లడించింది.

 రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో హంగేరి రాజధాని బుడాపేస్ట్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. ఉక్రెయిన్‌పై కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేందుకు రష్యా సుముఖత వ్యక్తం చేయ లేదు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఫోన్లు ద్వారా చర్చించుకున్నారు. అనంతరం ఈ ప్రకటన జారీ అయింది. ట్రంప్, పుతిన్‌ల మధ్య బుడాపెస్ట్‌లో సమావేశం జరగనుందంటూ గత వారం ఒక ప్రకటన వెలువడిన విషయం విదితమే.

అయితే ఈ సమావేశం నిలిచిపోయేందుకు స్పష్టమైన కారణాలు అయితే లేవని అమెరికా స్పష్టం చేసింది. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఉపయోగం లేని ఈ భేటీ ద్వారా సమయం వృధా చేసుకోవాలంటూ తనదైన శైలిలో ఆయన తెలిపారు. ఈ చర్చల వల్ల ఎలాంటి ఆశాజనక పరిణామాలు ఉండవని ట్రంప్ వెల్లడించారు. అయితే రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొన్ని నెలలుగా సాగుతోంది.దాంతో ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణపై చర్చలకు ట్రంప్, పుతిన్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా వీరు మరికొద్ది రోజుల్లో బుడాపేస్ట్‌లో సమావేశం కావాల్సి ఉంది. ఇక వీరి భేటీపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సైతం స్పందించింది. భవిష్యత్తులో వీరి భేటీ సందేహమేనంటూ అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఈ కాల్పుల విరమణకు ముందు ఉక్రెయిన్ మరిన్ని భూభాగాలను వదులుకోవడానికి అంగీకరించాలంటూ మాస్కో చాలా కాలంగా డిమాండ్ చేస్తోన్న విషయం విదితమే.

కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం…

 

కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!

 

ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈజిప్టు వేదికగా జరగనున్న గాజా శాంతి ఒప్పందానికి ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించారు.

ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈజిప్టు వేదికగా జరగనున్న గాజా శాంతి ఒప్పందానికి ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించారు. అయితే ఈ ఒప్పందానికి రావాలంటూ ప్రధాని మోదీకి ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్ సిసి సైతం ఆహ్వానించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం ధృవీకరించలేదు. సోమవారం ఈజిప్టులో గాజా శాంతి ఒప్పందం జరగనుంది. ఈ ఒప్పందానికి వివిధ దేశాధినేతలు హాజరుకానున్నారు.
దాదాపు రెండేళ్లుగా ఇజ్రాయెల్, తీవ్రవాద సంస్థ హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో వేలాది మంది మరణించారు. కోట్లాది రూపాయిల ఆస్తి నష్టం సంభవించింది. అయితే గాజాగా ఈ యుద్ధాన్ని ముగించేందుకు ఈ రెండు సుముఖత వ్యక్తం చేశాయని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. ఈ యుద్ధం ముగింపు కోసం 20 సూత్రాల శాంతి ఒప్పందాన్ని ట్రంప్ తెరపైకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.

 టారిఫ్‌లతో అమెరికాకు ఎంత ప్రయోజనం కలుగుతుందంటే..

 టారిఫ్‌లతో అమెరికాకు ఎంత ప్రయోజనం కలుగుతుందంటే..

 

 

ట్రంప్ అధిక సుంకాలతో అమెరికా విత్త లోటు వచ్చే పదేళ్లల్లో 3.3 ట్రిలియన్ డాలర్ల మేర తగ్గే అవకాశం ఉందని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీసు నివేదికలో వెల్లడైంది. ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీల్లో కూడా 0.7 ట్రిలియన్ డాలర్ల మేర కోత పడే అవకాశం ఉంది.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధింపుతో ప్రపంచ వాణిజ్యం అస్తవ్యస్తంగా మారిపోయింది. తమపై కూడా ధరాభారం పెరుగుతుందన్న భయం అమెరికా ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో టారిఫ్‌ల ద్వారా అమెరికాకు కలిగే ప్రయోజనం గురించి అక్కడి చట్టసభల ఆధ్వర్యంలో ఓ అధ్యయనం జరిగింది. దీనికి సంబంధించిన విషయాలను శుక్రవారం విడుదల చేశారు.

అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనా ప్రకారం, ట్రంప్ సుంకాలు ఇలాగే కొనసాగితే వచ్చే పదేళ్లల్లో విత్తలోటు సుమారు 3.3 ట్రిలియన్ డాలర్ల మేర తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా, ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీల్లో కూడా 0.7 ట్రిలియన్ డాలర్ల మేర కోత పడుతుంది. అయితే, సుంకాలు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశాలు కూడా తక్కువని బడ్జెట్ ఆఫీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. వివిధ దేశాలతో అమెరికా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటుండటంతో సుంకాలు తగ్గుతాయని చెబుతున్నారు.

అమెరికా ట్రెజరీ లెక్కల ప్రకారం, ప్రస్తుతం ప్రభుత్వంపై మొత్తం అప్పుల భారం 37.18 ట్రిలియన్ డాలర్లు. ఏటా ఈ అప్పుల బెడద పెరుగుతూనే ఉంది. మరోవైపు, ఆదాయానికి మించి ఖర్చులు పెట్టడం మినహా అమెరికా ప్రభుత్వం ముందు మరో ప్రత్యామ్నాయం లేదు.

ఈ నేపథ్యంలో అధిక ఖర్చులకు చట్టసభలు ప్రభుత్వానికి అనుమతిస్తూనే ఉన్నాయి. ఫలితంగా అప్పుల భారం అంతకంతకూ పెరుగుతోంది. ఈసారి ఖర్చులకు సంబంధించిన డెడ్‌లైన్ సెప్టెంబర్‌లో ఉంది. అప్పటికి అమెరికా కాంగ్రెస్ అదనపు ఖర్చులకు అనుమతించని పక్షంలో ప్రభుత్వ మొత్తం షట్ డౌట్ అయ్యే ప్రమాదం ఉంది.

ప్రస్తుతం అమెరికా ఇతర దేశాలపై విధిస్తున్న సగటు సుంకం 16.7 శాతంగా ఉంది. జులైలో ఇది 15.1 శాతంగా ఉండేది. ఇప్పటివరకూ సుంకాల రూపంలో అమెరికా ఖజానాకు 26 బిలియన్ డాలర్లు చేరాయని ఆక్సఫర్డ్ యూనివర్సిటీ అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే ఇది అనేక రెట్లు ఎక్కువని తేల్చింది.

ట్రంప్‌పై నిరసన..నాగ్‌పూర్‌లో భారీ దిష్టిబొమ్మ ప్రదర్శన…

ట్రంప్‌పై నిరసన..నాగ్‌పూర్‌లో భారీ దిష్టిబొమ్మ ప్రదర్శన

 

 

నాగ్‌పూర్‌లో జరుగుతున్న మార్బత్ పండగ.. ట్రంప్ సుంకాలపై నిరసనలకు వేదికైంది. స్థానికులు ట్రంప్ దిష్టిబొమ్మను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో మార్బత్ పండగ సందర్భంగా ట్రంప్‌పై నిరసనలు వెల్లువెత్తాయి. అనేక మంది ట్రంప్ దిష్టిబొమ్మను ఊరేగిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. భారత వస్తువులపై ట్రంప్ 50 శాతం సుంకం విధించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపేందుకు స్థానికులు ఈ పండగను వేదికగా ఎంచుకున్నారు.

మట్టి, గడ్డితో ఈ దిష్టిబొమ్మను చేసి ఎర్ర కోటును తొడిగారు. రకరకాల పూల దండలను కూడా దిష్టిబొమ్మకు వేసి డప్పుల చప్పుళ్ల మధ్య ఊరేగించారు. స్థానికులు వినూత్న శైలిలో తమ నిరసనలు తెలియజేశారు. ‘టారిఫ్‌లతో మమ్మల్ని బెదిరిస్తే.. భారత్ దెబ్బకు మీకు కన్నీళ్లు తప్పవు’ అని ఓ స్థానికుడు ప్లకార్డు ప్రదర్శించాడు. మా పై సుంకాలు మీకే చేటు అని రాసున్న ప్లకార్డును మరో వ్యక్తి ప్రదర్శించాడు. మరికొందరు అమెరికా ద్వంద్వ వైఖరినీ ఎండగట్టారు. రష్యా వస్తువులు కొంటున్న అమెరికాకు భారత్‌పై అక్కసు ఎందుకని ప్రశ్నించారు.

ఏటా జరుపుకునే ఈ పండగకు పెద్ద చరిత్రే ఉందని స్థానికులు చెబుతున్నారు. 1800 దశాబ్దం చివర్లో ఈ సంప్రదాయం ప్రారంభమైంది. అప్పట్లో స్థానికులు దుష్టశక్తులను పారద్రోలేందుకు దిషి బొమ్మలను ఊరేగించారు. కాలక్రమంలో ఈ పండుగ కొత్త సోబగులు సొంతం చేసుకుంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేసే వేదికగా మారింది. హాస్య చతురతను, సెటైర్‌ను జోడించి జనాలను ఆకట్టుకునేలా ప్లకార్డులు, దిష్టి బొమ్మలను ప్రదర్శించడం ప్రారంభించారు. వినూత్న శైలిలో నిరసనలకు కూడా ఇది వేదికగా మారింది.

వాణిజ్య లోటు పూడ్చుకోవడంలో భాగంగా ట్రంప్ తొలుత భారత వస్తువులపై 25 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. అమెరికా అభ్యంతరాలను కాదని రష్యా చమురు కొనుగోలును కొనసాగిస్తున్నందుకు శిక్షగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్టు ఆ తరువాత ప్రకటించారు. దీంతో, భారత్‌పై మొత్తం సుంకం 50 శాతానికి చేరింది. ఆగస్టు 27 నుంచి ఈ సుంకాలు పూర్తిస్థాయిలో అమలు కానున్నాయి.

ట్రంప్-పుటిన్ అలాస్కా సమ్మిట్: భారత్ టారిఫ్ సమాచారం…

ఈ వారంలో అతి పెద్ద అలాస్కా సమ్మిట్‌లో US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ సమావేశమయ్యారు. సమ్మిట్ తర్వాత, ట్రంప్ రష్యన్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసే భారత్ వంటి దేశాలపై అదనపు టారిఫ్‌లను విధించకోవచ్చని సంకేతం ఇచ్చారు. ఈ సమావేశం రష్యా-యుక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ పరిణామాల కారణంగా విశేషంగా గమనించబడింది.
పైగా, ఇండస్ వాటర్స్ ట్రిటీ విషయంలో పాకిస్తాన్ న్యూక్లియర్ హెచ్చరికలు ఇచ్చింది. ఆర్మీ చీఫ్ అసీం మునీర్, ప్రధాని షరీఫ్, బిలావాల్ భుట్టో భారత్‌ను హెచ్చరించారు. ట్రంప్ భారత్, చైనా పట్ల రష్యన్ ఆయిల్ టారిఫ్‌లలో భిన్నమైన విధానాన్ని చూపడం గమనార్హం.
ఇతర ఘటనల్లో, గాజాలో ఇజ్రాయిల్ ఎయిర్‌స్ట్రైక్స్‌లో అల్-జజీరా జర్నలిస్ట్ అనాస్ అల్-షరీఫ్ మరణించారు. చైనాలో యువకులు ఉద్యోగం కనిపించేలా కనిపించడానికి చెల్లిస్తున్నారు. అలాగే, ఒక వైరల్ వీడియోలో కిల్లర్ వేల్ లైవ్ షోలో ట్రైనర్‌ను అటాక్ చేసింది. 

భారత్ బ్రహ్మోస్ క్షిపణి ట్రంప్‌ను భయపెట్టిందా.!

భారత్ బ్రహ్మోస్ క్షిపణి ట్రంప్‌ను భయపెట్టిందా? ఆపరేషన్ సిందూర్‌లో అమెరికా జోక్యానికి కారణమేంటి..

అమెరికా అధ్యక్షుడు భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలను విధించారు. అలాగే భారత ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. పాకిస్థాన్‌లో చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి ఉమ్మడి కార్యచరణను ప్రకటించారు. ఏదో ఒకరోజు భారత్‌కు పాకిస్థాన్ ఆయిల్ అమ్ముతుందని ప్రకటించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవలి కాలంలో భారత్‌పై విద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారు. తన ఆదేశాలను ధిక్కరించి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై సుంకాల దాడికి దిగారు (Trump Tarrifs). భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలను విధించారు. అలాగే భారత ప్రత్యర్థి పాకిస్థాన్‌తో (Pakistan) ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. పాకిస్థాన్‌లో చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి ఉమ్మడి కార్యచరణను ప్రకటించారు. ఏదో ఒకరోజు భారత్‌కు పాకిస్థాన్ ఆయిల్ అమ్ముతుందని ప్రకటించారు.

ఇక, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో ట్రంప్ జోక్యం గురించి తెలిసిందే. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది తానేనని ట్రంప్ పలుసార్లు ప్రకటించుకున్నారు. అయితే తాజాగా అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ (Wall Street Journal) ఆ ఆసక్తికర కథనాన్ని వెల్లడించింది. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను భయపెట్టిందని ఆ పత్రిక పేర్కొంది. పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ తన బ్రహ్మోస్ క్షిపణుల (BrahMos missile)ను ప్రయోగిస్తున్నట్టు వచ్చిన వార్తలు ట్రంప్‌నకు కలవరం కలిగించాయట.

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌పై భారత్ ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణులలో అణ్వాయుధాలను నింపే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు నిర్ధారించాయని ఆ పత్రిక పేర్కొంది. దీంతో వైట్‌హౌస్‌లో తీవ్ర ఆందోళన మొదలైందట. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు వేగవంతమైన, ఉన్నత స్థాయి చర్చలు మొదలయ్యాయట. పరిస్థితి చేయి దాటితే పాక్‌పై భారత్ అణు దాడులు చేయాలనుకుంటుందని, అలాగే పాకిస్థాన్ కూడా తన సొంత అణ్వాయుధ పరికరాన్ని ప్రయోగించాలని నిర్ణయించుకోవచ్చని ట్రంప్ భయపడ్డారని ఆ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

భారతదేశం, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి అణ్వాయుధాలను మోసుకెళ్లగలదని అమెరికా అధికారులు విశ్వసిస్తున్నారని ఆ కథనం పేర్కొంది. అయితే ఆ కథనాన్ని భారత రాయబార కార్యాలయ అధికారులు తోసిపుచ్చినట్టు కూడా ఆ కథనం తెలిపింది. మొదటగా అణుబాంబులను ప్రయోగించకూడదనే నియమాన్ని భారత్ ఉల్లంఘించదని భారత అధికారులు చెప్పినట్టుగా పేర్కొంది. బ్రహ్మోస్ క్షిపణులు కేవలం సాంప్రదాయ ఆయుధ వ్యవస్థలే తప్ప, అణ్వాయుధాలను మోసుకెళ్లలేవని ఎప్పట్నుంచో భారత్ నొక్కి చెబుతోంది.

వాణిజ్య ఒప్పందాన్ని ప్ర‌క‌టించిన ట్రంప్‌..

వాణిజ్య ఒప్పందాన్ని ప్ర‌క‌టించిన ట్రంప్‌.. ఆ డీల్‌ను ఆహ్వానించిన జ‌పాన్ ప్ర‌ధాని

జ‌పాన్‌తో భారీ వాణిజ్య ఒప్పందం జ‌రిగిన‌ట్లు ట్రంప్ వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో జ‌పాన్ ప్ర‌ధాని షిగేరు ఇసిబా స్పందించారు. ట్రంప్ ప్ర‌క‌ట‌న‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

జ‌పాన్‌తో భారీ వాణిజ్య ఒప్పందం(Trade Deal) జ‌రిగిన‌ట్లు ట్రంప్ వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో జ‌పాన్ ప్ర‌ధాని షిగేరు ఇసిబా స్పందించారు. ట్రంప్ ప్ర‌క‌ట‌న‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఫిలిప్పీన్స్‌తో జ‌రిగిన వాణిజ్య ఒప్పందాన్ని కూడా ట్రంప్ ప్ర‌క‌టించారు. జ‌పాన్ టారిఫ్ రేట్‌ను 15 శాతానికే ఫిక్స్ చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న దేశాల్లో ఈ రేట్ అత్యంత క‌నిష్ట‌మైంది. జ‌పాన్ వాహ‌నాల‌పై విధిస్తున్న రేట్‌ను 25 శాతానికి పెంచాల‌నుకున్నారు, కానీ దాన్ని 15 శాతానికే కుదించిన‌ట్లు జ‌పాన్ ప్ర‌ధాని ఇషిబా తెలిపారు. జ‌ప‌నీస్ వైపు ప‌న్ను శాతం త‌గ్గిన‌ట్లు ఎటువంటి ప్ర‌క‌ట‌న జ‌ర‌గ‌లేదు. బ‌ల‌మైన రీతిలో లాబీయింగ్ చేయ‌డం వ‌ల్లే అమెరికా త‌మ‌పై ప‌న్నుల‌ను భారీగా వ‌సూల్ చేయ‌డం లేద‌ని జ‌పాన్ ప్ర‌ధాని వెల్ల‌డించారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో వైట్‌హౌజ్‌లో ట్రంప్‌తో జ‌రిగిన స‌మావేశంలో టారిఫ్‌ల క‌న్నా ఇన్వెస్ట్‌మెంట్‌ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని చెప్పిన‌ట్లు తెలిపారు. ఆగ‌స్టు ఒక‌టో తేదీ వ‌ర‌కు డీల్ కుదుర్చుకోకుంటే, వాణిజ్య ప‌న్నులను పెంచ‌నున్న‌ట్లు ట్రంప్ హెచ్చ‌రిక ఇచ్చిన నేప‌థ్యంలో కొన్ని దేశాలు ఆ ఒప్పందానికి రెఢీ అయ్యాయి. డీల్‌కు చెందిన వివ‌రాల‌ను శ్వేత‌సౌధం ఇంకా రిలీజ్ చేయ‌లేదు.

చ‌రిత్ర‌లో అతిపెద్ద వాణిజ్యం ఒప్పందం కుదిరిన‌ట్లు ట్రంప్ ప్ర‌క‌టించారు. జ‌పాన్‌తో జ‌రిగిన అతిపెద్ద డీల్ ఇదే అని ఆయ‌న వెల్ల‌డించారు. ట్రుత్ సోష‌ల్‌లో ఆయ‌న దీనికి సంబంధించిన ఓ వీడియోను పోస్టు చేశారు. అమెరికాలో సుమారు 550 బిలియ‌న్ల డాల‌ర్లు ఇన్వెస్ట్ చేయ‌డానికి జ‌పాన్ సిద్ధంగా ఉంది. అలాగే 15 శాతం దిగుమ‌తి సుంకాన్ని కూడా చెల్లించేందుకు జ‌పాన్ అంగీక‌రించింది.

ఫిలిప్పీన్స్ ఉత్ప‌త్తుల‌పై 19 శాతం ప‌న్ను విధించ‌నున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ తెలిపారు. ఆ దేశ అధ్య‌క్షుడితో జ‌రిగిన భేటీ త‌ర్వాత ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేశారు. కొత్త టారిఫ్ విధానంపై ట్రంప్ త‌న సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించారు. అయితే అమెరికా వ‌స్తువుల‌పై విధించే సుంకాన్ని త‌గ్గించ‌నున్న‌ట్లు ఫిలిప్పీన్స్ తెలిపింది. ఇండోనేషియాకు చెందిన వ‌స్తువుల‌పై కూడా 19 శాతం ప‌న్ను విధించ‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు.

ట్రంప్ ప్ర‌క‌ట‌న‌తో.. జ‌పాన్‌లోని కార్ల కంపెనీల షేర్లు పెరిగిపోయాయి. జ‌పాన్ కార్ల‌పై దిగుమ‌తి సుంకాన్ని 25 శాతం నుంచి 15 శాతానికి త‌గ్గించారు. దీంతో నిస్సాన్ షేర్లు పెరిగిపోయాయి. 8.5 శాతం షేర్లు పెరిగాయి. హోండా షేర్లు 11 శాతం, టొయోటా షేర్లు 14 శాతం వృద్ధి చూపించాయి. కొత్త అగ్రిమెంట్ ప్ర‌కారం అమెరికా వాహ‌నాల‌కు జ‌పాన్‌లో ఎంట్రీ ల‌భించ‌నున్న‌ది.

 

ట్రంప్ బర్త్‌డే రోజు పుతిన్ ఫోన్ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం గురించి చర్చలు.

ట్రంప్ బర్త్‌డే రోజు పుతిన్ ఫోన్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి చర్చలు…

Donald Trump: ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ స్పందించారు. తన బర్త్‌డే రోజున రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ తనకు ఫోన్ చేశాడని, యుద్ధంపై మాట్లాడామని చెప్పారు. యుద్ధం ఆపడానికి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. మిస్సైల్స్, డ్రోన్లతో పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగానే ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా, ఇరాన్.. ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ స్పందించారు. తన బర్త్‌డే రోజున రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ తనకు ఫోన్ చేశాడని, యుద్ధంపై మాట్లాడామని చెప్పారు. యుద్ధం ఆపడానికి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఈ విషయాలను సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించారు. ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో.. ‘అధ్యక్షుడు పుతిన్ ఈ రోజు ఉదయం నాకు ఫోన్ చేశారు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దాని కంటే ముఖ్యంగా ఇరాన్ దేశం గురించి మాట్లాడుకున్నాం. దాదాపు గంట సేపు మాట్లాడుకున్నాం. నేను అనుకుంటున్నట్లే ఆయన కూడా అనుకుంటున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ఆగాలని కోరుకుంటున్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం గురించి కొంచెంసేపు మాత్రమే మాట్లాడుకున్నాం.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version