డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో లక్ష్మీ కాలనీ గ్రామంలో వైద్యశిబిరం
నేటిధాత్రి చర్ల
చర్ల మండల కేంద్రంలోని కొయ్యూరు ప్రాథమిక వైద్యశాల పరిధిలో లక్ష్మీ కాలనీ గ్రామంలో డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు ఈ ఆరోగ్య శిబిరంలో జ్వరంతో బాధపడుతున్న ముగ్గురికి రక్త పరీక్షలు చేసి సాధారణ జ్వరంగా నిర్ధారణ అవ్వటంతో వైద్యం అందించడం జరిగినది ఈ ఆరోగ్య శిభిరంలో 47 మంది ప్రజలకు వైద్య సేవలు అందించారు డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది కనుక అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అందరూ ఫ్రైడే డ్రైడే పాటించాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమలు పెరిగే అవకాశం ఉండదనీ తెలిపారు రాత్రి వేళలో నిద్రించేటప్పుడు అందరూ దోమతెరలు వాడాలని తెలియజేశారు నీటిని వేడి చేసి చల్లార్చి తాగాలని ఆహార పదార్థాలు వేడి వేడిగా ఉన్నప్పుడే భోజనం చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మొబైల్ డాక్టర్ సచిన్ ఆర్ బిఎస్కే వైద్యురాలు డాక్టర్ స్పూర్తి హెల్త్ సూపర్వైజర్ రామ్ ప్రసాద్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ శిరీష మొబైల్ నర్సింగ్ ఆఫీసర్ దీక్షిత హెల్త్ అసిస్టెంట్ స్వరూప రాణి ఆర్బిఎస్కే స్టాఫ్ నర్స్ దుర్గ సార్బి ఎస్ కే ఎన్ ఎం భారతి ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు
ప్రతిభ చూపిన విద్యార్థులకు ‘స్టూడెంట్ ఆఫ్ మంత్’ అందజేత
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంఘం మండలం బిడెకన్నే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ‘స్టూడెంట్ ఆఫ్ మంత్’ కార్యక్రమం గురువారం నిర్వహించారు. జూలై నెలలో క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపాధ్యాయులు గోరకనాథ్ ఈ అవార్డును అందజేశారు. విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు.
అల్ఫోర్స్ పాఠశాలలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం, ముందస్తు రక్షాబంధన్ వేడుకలు
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని అల్ఫోర్స్ పాఠశాలలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రత వేడుకలు, పూజలు ఘనంగా నిర్వహించిన అనంతరం ఉపాధ్యాయినిలు అందరూ వాయనం ఇచ్చుకున్నారు. తదనంతరం రాఖీ పౌర్ణమి సందర్భంగా ముందస్తు రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు నరేందర్ రెడ్డికి రాఖీలు కట్టడం జరిగినది. ఈకార్యక్రమంలో పాఠశాల చైర్మన్, డాక్టర్ వి.నరేందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
ఝరాసంగం మండల కేంద్రంలో బంగ్లా గడ్డ పంచాయతీ పరిధిలోని కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గ్రామపెద్దలు భూమిపూజ చేశారు. ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్దిదారులకు కొలతలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు లబ్దిదారుల అకౌంట్లలో జమచేస్తుందని అన్నారు. ఇండ్లు మంజూరు అయిన లబ్దిదారులు ఇండ్ల నిర్మాణం పనులను ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వీరేశం పటేల్ మొహమ్మద్ అష్రఫ్ అలీ ఇస్మాయిల్ సాబ్ మొహమ్మద్ బషీర్ మొహమ్మద్ గౌసుద్దీన్, తదితరులు పాల్గొన్నారు
అనేగుంట పంచాయతీ కార్యదర్శి కిమెమో జారీ చేసిన జిల్లా అధికారులు
జహీరాబాద్ నేటి ధాత్రి
జహీరాబాద్ మండలం ఆనెగుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు రోడ్డును ఆక్రమించి ఇల్లును నిర్మిస్తున్న వ్యక్తి పై కంప్లైంట్ వచ్చిన దానికి చర్య నిమిత్తం జిల్లా పంచాయతీ అధికారి గారు మెమో జారీ చేస్తూ మండల పంచాయతీ అధికారి ఇట్టి విషయములో 3 రోజులలో రిపోర్ట్ ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారి సంగారెడ్డి జిల్లా ఆదేశిచడం జరిగింది.
భాషా నైపుణ్యాలతోనే ఉపాధి అవకాశాలు :_ ఆచార్య మల్లం నవీన్.
నేటిధాత్రి, వరంగల్.
వరంగల్ దేశాయిపేటలోని సికేఎం ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాలలో గురువారం గ్రంథ పాలకుల దినోత్సవం పురస్కరించుకొని ఆంగ్ల భాషలో సమర్థవంతమైన సంప్రదింపు అనే అంశంపై కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ ధర్మారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యాశాలలో ముఖ్య అతిథిగా కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు, నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు సమాచార భావవ్యక్తీకరణ ఎంతో ముఖ్యమని తెలిపారు. భాషా నైపుణ్యాలపై పట్టు సాధించినప్పుడు ఉద్యోగ , ఉపాధి అవకాశాలు సులభంగా దరిచేరతాయని తెలిపారు. ఆంగ్ల భాషను ప్రభావంతంగా ఎలా వినియోగించాలో పవర్ పాయింట్ ద్వారా మన మాటలు, భావాలు, సమాచారం, ఆలోచనలు స్పష్టంగా మరియు సరైన రీతిలో ఇతరులకు అర్థమయ్యేలా చెప్పడం ఎలా అనేది వివరించారు. అలాగే ఆంగ్ల భాషపై స్పష్టత శుద్ధమైన వ్యాకరణం, శరీర భాష , వినే నైపుణ్యం, ఆత్మవిశ్వాసం అనే అంశాలపై విద్యార్థులకు క్షుణ్ణంగా తెలిపారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిలో భాగంగా విద్యార్థులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ సికేఎం కళాశాలకు ఎంతో చారిత్రాత్మక విద్య ప్రాధాన్యత కలిగి ఉందని అందుకే కళాశాల ప్రభుత్వ స్వాధీనంలోకి వెళ్లిందని తెలిపారు. కార్పొరేట్ విద్యకు దీటుగా విద్యా ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు భట్టి సంస్కృతిని విడనాడి సమాజం జరిగే ప్రతి అంశం పైన విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం ముఖ్యఅతిథి ప్రొఫెసర్ మల్లం నవీన్ ను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యశాల కన్వీనర్ ఎస్. అనిల్ కుమార్, ఐక్యుఏసి కోఆర్డినేటర్ మరియు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్. కే ఎల్ వి. వరప్రసాదరావు, కెప్టెన్ డాక్టర్ పూజారి సతీష్ కుమార్, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.
దేశంలో బంగారం ధరలు మరోసారి ఆశ్చర్యపరుస్తూ ఆల్ టైం గరిష్ఠానికి చేరుకున్నాయి. అయితే బంగారం ధరల పెరుగుదల వెనుక ఉన్న కారణాలేంటి, ఇతర నగరాల్లో వీటి రేట్లు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.దేశంలో పసిడి ధరలు ఆల్ టైం గరిష్టానికి చేరుకుని మరోసారి షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 8, 2025 ఉదయం 6:10 గంటల సమయానికి బంగారం ధరలు సరికొత్త స్థాయికి చేరాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,560కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 94,010కి చేరుకుంది.
ఇదే సమయంలో వెండి ధరలు కూడా పెరిగాయి (gold and silver price on August 8th 2025). కిలో వెండి ధర రూ. 1,17,100 స్థాయిలో ఉంది. ఈ ధరల పెరుగుదల దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో కొనసాగుతోంది. స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు, మార్కెట్ డిమాండ్ ఆధారంగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
హైదరాబాద్: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,02,560.. 22 క్యారెట్ల బంగారం రూ. 94,010, వెండి (1 కిలో) రూ. 1,27,100.
ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం రూ. 1,02,710.. 22 క్యారెట్ల పసిడి రూ. 94,160, వెండి రూ. 1,17,100.
చెన్నై: 24 క్యారెట్ల గోల్డ్ రూ. 1,02,560.. 22 క్యారెట్ల బంగారం రూ. 94,010, వెండి రూ. 1,27,100.
ముంబై: 24 క్యారెట్ల పసిడి రూ.1,02,560, 22 క్యారెట్ల గోల్డ్ రూ. 94,010, వెండి రూ. 1,17,100.
బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం రూ. 1,02,560, 22 క్యారెట్ల పసిడి రూ.94,010, వెండి రూ. 1,17,100.
బంగారం, వెండి ధరల ప్రధాన పెరుగుదలకు కారణాలు
బంగారం, వెండి ధరలు మళ్లీ పెరగడానికి అనేక అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉన్నాయి. ప్రధానంగా అమెరికా-చైనా మధ్య వాణిజ్య అంశాలు తీవ్రతరం కావడం, అమెరికా డాలర్ విలువ క్షీణించడం ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్లు, అమెరికా అప్పులు 36 ట్రిలియన్ డాలర్లకు చేరడం వంటి అంశాలు పెట్టుబడిదారులను బంగారం, వెండి వంటి సురక్షిత ఆస్తుల వైపు మొగ్గేలా చేశాయి. దేశంలో దిగుమతి సుంకాలు, స్థానిక మార్కెట్ డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు దోహదపడ్డాయి.
మార్కెట్ ప్రభావం
ఈ ధరల పెరుగుదలతో ఆభరణాల విక్రయాలు కొంత తగ్గాయి. చాలా మంది కస్టమర్లు 18 లేదా 14 క్యారెట్ల ఆభరణాల వైపు మొగ్గుచూపుతున్నారు. చిన్న ఆభరణాల షాపుల వ్యాపారం 20-25% తగ్గినట్లు వర్తకులు తెలిపారు. అయితే, బంగారం ఎప్పటికీ సురక్షిత పెట్టుబడిగా భావించబడుతుంది కాబట్టి, దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఈ ధరల పెరుగుదలను సానుకూలంగా చూస్తున్నారు.
సలహా
బంగారం తీసుకునే క్రమంలో హాల్‌మార్క్ గుర్తు ఉన్న ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి, కొనుగోలుదారులు కొనే సమయంలో మళ్లీ ధరల గురించి తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవాలి.
ప్రస్తుత వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పరకాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ గౌతమ్ చౌహన్,డాక్టర్.బాలకృష్ణ తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో విష జ్వరాలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని,కావున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.కలుషిత నీరు,కలుషిత ఆహారం,అపరిశుభ్ర వాతావరణం,వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వల్ల సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయన్నారు. పందులు,ఈగలు,దోమలు విషజ్వరాల వ్యాప్తికి ప్రధాన వాహకాలుగా ఉంటాయని, వాటికి దూరంగా ఉండాలని నీటి కుండిలను,పూల కుండీలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.పనికి రాని టైర్లు, బకెట్లలో,ఖాళీ కొబ్బరి బొండాలలో నీళ్లు నిల్వ ఉంచకూడదని ఖాళీ చేసి పనికి రాని వస్తువులను పడేయలని,కూలరులో ఉన్న నీళ్లను తీసివేసి శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
Seasonal Diseases
రోజుల తరబడి నిల్వ ఉన్న నీటిలో లార్వా,దోమలు వృద్ధి చెంది ఆరోగ్యానికి హాని చేస్తాయని,ప్రజలు కూడా సీజనల్ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.మన ఇంటి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలలో నీటి నిలువ లేకుండా చూడాలని,పరిసర ప్రాంతాలు శుభ్రతగా ఉంటేనే మనకు ఎటువంటి వ్యాధులు రావని,డెంగ్యూ,మలేరియా వ్యాదులు అనేవి ప్రధానంగా దోమల వల్ల వస్తుందని,ప్రధానంగా గ్రామాలలో ఎక్కడ నీటి నిలువ లేకుండా చూసుకోవాలని ఒకవేళ నీటి నిలువ ఉన్న ప్రాంతాలలో బ్లీచింగ్ పౌడర్ వేసుకోవాలని అన్నారు.పరిసరాల ప్రాంతాల శుభ్రత పాటిస్తూ జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి లక్షణాలు కనిపించిన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి అని వైద్యులు తెలిపారు.
`నాయకులను చేసిన పార్టీలకు నమ్మక ద్రోహం నేర్చుకున్నారు.
`గెలిచే దాక ఒక పార్టీ, గెలిచిన తర్వాత అధికారం గూటికి
`ప్రజా తీర్పును అవమానిస్తున్నారు.
`ప్రజాస్వామ్య స్పూర్తిని దెబ్బ తీస్తున్నారు.
`రాజకీయాలంటే ప్రజలు అసహ్యించుకునేలా చేస్తున్నారు.
`గెలిచినా అధికారం పంచన చేరాలనుకుంటున్నారు.
`ఓడినా అధికారం నీడ కోరుకుంటున్నారు.
`పదవులిచ్చిన పార్టీకి అన్యాయం చేస్తున్నారు.
`తమను పట్టించుకోవడం లేదని సాకులు చెబుతున్నారు.
`పార్టీలు మారి అదృష్టం కొద్దీ పదవులు పొందిన వారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు.
`తమ గౌరవాన్ని తామే తగ్గించుకుంటున్నారు.
`చరిత్ర హీనులుగా మిగిలేందుకు పోటీ పడుతున్నారు.
`పార్టీ గాలిలో గెలిచిన వాళ్లు కూడా బలవంతులనుకుంటున్నారు.
`ఓడిపోయి తమ తప్పేం లేదని ఆత్మ వంచన చేసుకుంటున్నారు.
`పార్టీలు మారడం ఎంత తప్పో ఈటెల రాజేందర్ లాంటి వాళ్లు చెప్పినా చెవికెక్కించుకోవడం లేదు.
`తెలిసి తెలిసి తమ రాజకీయ గోతిని వాళ్లే తవ్వుకుంటున్నారు.
హైదరాబాద్,నేటిధాత్రి: తన బలమేమిటో తెలుసుకోలేని వాడు నాయకుడే కాదు. తన బలహీనత తెలిసుకోకపోతే నాయకుడుగా ఎదగలేడు. ఇది రాజకీయాల్లో మూల సిద్దాంతం. ప్రతి నాయకుడు తనే బలవంతుడు అనుకోకపోతే రాణించలేడు. ప్రతి నాయకుడు వచ్చే ఎన్నికల్లో గెలవాలన్న తపన బలంగా లేకపోతే ముందుకు వెళ్లలేడు. అయితే కొన్ని సార్లు పరిస్ధితులు అనుకూలించొచ్చు. అనుకూలించకపోవచ్చు. కాలం కలిసి వచ్చే వరకు ఎదురుచూసే వారే నిజమైన నాయకుడు. కొన్ని సార్లు కాలానికి ఎదురు వెళ్తే గాని భవిష్యత్తు చూడలేని వాళ్లు కూడా కొందరుంటారు. అదంతా ఆ సమయంలో తీసుకునే నిర్ణయం మీదనే ఆదారపడి వుంటుంది. అంతే తప్ప నాయకుడి మీద కాదు. ఈ విషయాన్ని ప్రతి నాయకుడు తప్పకుండా తెలుసుకోవాలి. కాని ఎవరికి వారు మరీ అతి విశ్వాసంతో వుంటున్నారు. కాని తమ పార్టీ వల్లనే ఓ స్ధాయికి ఎదిగామన్న సంగతి మర్చిపోతున్నారు. అందుకు నాయకులు తమకు ప్రాదాన్యత దక్కడం లేదనో, పదవులు రావడం లేదనో, గెలిచిన పార్టీలలో చాలా మంది వుండడం లేదు. ఇది దేశ వ్యాప్తంగా ఓ వైరస్‌గా మారిపోతోంది. పార్టీలు మారడం కూడా ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కడ అదికారం వుంటే అక్కడ వాలిపోతున్నారు. అదికారంలోలేకపోలే బతకలేమన్నంతగా తమ వ్యవహార శైలిని మార్చకుంటున్నారు. ప్రతిపక్షంలో వుండడానికి ఏ నాయకుడు సిద్దపడడం లేదు. అదికారం చెలాయించడం అలవాటు చేసుకున్నారు. ప్రతిపక్షంలో వుండాలంటే నిత్యం ప్రజలతోవుండాలి. ప్రజల కోసం కొట్లాడాలి. ఉద్యమాలు చేయాలి. కేసులు ఎదుర్కొవాలి. కార్యకర్తలకు ధైర్యం చెబుతూ వుండాలి. వచ్చిన ప్రతి వారిని ఆదరిస్తూ వుండాలి. అదికారంవున్నప్పుడు వున్న దర్పం లేకపోతే కూడా నాయకులు భరించలేకపోతున్నారు. ప్రతిపక్షంలో వుంటే పనులు రావడం లేదు. పైసలు అందడం లేదు. ఖర్చులకు సరిపోవడం లేదు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చును సంపాదించుకోవాలంటే ప్రతిపక్షంలో సాధ్యం కాదు. ఐదేళ్లపాటు ప్రజల కోసం పోరాటం చేసే ఓపికలేదు. ప్రభుత్వంతో తలబడే శక్తి లేదు. ఏటికి ఎదురీదడం కాన్న, సాఫీగా సాగితే చాలు. ఈ గొడవలు, ఇబ్బందులు,సమస్యల వలయం కన్నా, హాయిగా అధికార పార్టీలో వుంటే ఎలాంటి తలనొప్పి వుండదు. ఇదీ ఇప్పటి ఎమ్మెల్యేల ఆలోచన. అది ఏ పార్టీలో వున్నా ఇదే ఆలోచన. ఇంతకు మించి ప్రజల గురించి ఆలోచించే నాయకుడు కరువౌతున్నాడు. పార్టీ మారడానికి ఓ సాకు పెట్టుపెట్టుకుంటున్నారు. అభివృద్ది పేరిట పార్టీ మారుతున్నాను. నా ప్రజల సంక్షేమం కోసం కండువా మార్చుకుంటున్నాను. పార్టీ మారడమనే పెద్ద తప్పును, చిన్న మాటతో వదిలించుకుంటున్నారు. చేరబోయే పార్టీని పొడుగుతున్నారు. వీడుతున్న పార్టీలో తనకు న్యాయం జరగలేదంటారు. గుర్తింపు లేదంటారు? పార్టీలో గుర్తింపు లేకుండానే రెండు మూడుసార్లు గెలిచిన సంగతి మర్చిపోతారు. పార్టీలు మారడం అనేది చాలా చిన్న విషయంగా తీసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే పార్టీలు మారి బాగుపడినా అది తాత్కాలికమే. కొంత కాలమే..రాజకీయాల్లో ఏ పార్టీ శాశ్వతం కాదు. అధికారం అంతకన్నా శాశ్వతం కాదు. ఈ సంగతి తెలిసి కూడా పార్టీలు మారుతున్నారు. నాయకులను చేసిన పార్టీలకు నమ్మకం ద్రోహం చేస్తున్నారు. అలా పార్టీలను నిండా ముంచిన వారు చాలా మంది వున్నారు. మళ్లీ తిరిగి , చివరి దశలో అదే పార్టీకి చేరిన వాళ్లు కూడాచాలా మంది వున్నారు. అప్పుడు పుట్టింటికి వచ్చామని మళ్లీ బడాయిలు పోతారు. తమ నాలుకను ఎటు వైపైనా తీప్పే నాయకులు చాలా మంది తయారౌతున్నారు. టికెట్ ఇచ్చేదాకా, గెలిచే దాక ఒక పార్టీ. ఆ పార్టీ గెలిస్తే చాలు. పొరపాటున ఆ పార్టీ ఓడిపోతే ఇక అంతే.. ఎప్పుడు అధికార పార్టీలోకి వెళ్దామా అని ఎదురుచూస్తుంటారు. ఈసారి ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల్లోనే పది మందిఎమ్మెల్యేలు కారు దిగి, చెయ్యందుకున్నారంటే నాయకులు ఎంత అనైతకను ప్రదర్శిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అలా పార్టీలు మారిన వారిలో సీనియర్లు కూడా వుండడం విడ్డూరం. సీనియర్ ఎమ్మెల్యే అయినా సరే దానం 1999లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. వెంటనే ఆయన తెలుగుదేశంపార్టీలో చేరారు. రాత్రికి రాత్రి టికెట్ తెచ్చుకున్నారు. టిడిపి నుంచి గెలిచారు. కాని ఆ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆయన టిడిపికి, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లోకి మళ్లీ వెళ్లారు. ఇండిపెండెంటుగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో మళ్లీ కాంగ్రెస్ పార్టీనుంచిగెలిచారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ముందస్తు ఎన్నికలు 2018 ముందు బిఆర్‌ఎస్‌లో చేరారు. గెలిచారు. 2023లో కూడా కారుపార్టీ మీద గెలిచారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే జెండా మార్చారు. కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇలా పార్టీలు మారుడం అలవాటున్న నాయకులను కూడా రాజకీయ పార్టీలు ఆదరించకూడదు. ప్రధాని నరేంద్ర మోడీ అయినా సరే, రాహుల్ గాందీ అయినా సరే పార్టీల వల్లనే నాయకులౌతారు. ఆ సంగతి తెలిసినా కొన్ని సార్లు నాయకులు తమ బలం వేరు అనుకుంటారు. కేసిఆర్ విషయానికి వస్తే ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని బైటకు వచ్చి రాజకీయ పార్టీ పెడితే ఎదిగేవారు కాదు. కాని ఆయన బైటకు వచ్చి తెలంగాన గళం ఎత్తుకున్నారు. తనకు జరిగిన అన్యాయం తెలంగాణకు జరిగిన మోసంగా చిత్రీకరించగలిగారు. అందుకే కేసిఆర్ నిలబడ్డాడు. తెలుగుదేశం పార్టీ స్దాపకుడు ఎన్టీఆర్‌కూడ అంతే. కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటులో తెలుగు జాతి ఆత్మగౌరవం తెరమీదకు తెచ్చాడు. లేకుంటే ఆయన కూడా గెలిచేవారు కాదు. పార్టీ స్ధాపించేవారు కాదు. అలా కొన్నిసార్లు ఇతర నాయకులు బాటను ఎంచుకొని కనుమరుగైన నాయకులు కూడా వున్నారు. తెలంగాణలో తేదేపా నుంచి బైటకు వచ్చిన నవ తెలంగాణ అని పార్టీ పెట్టిన దేవేందర్ గౌడ్ అడ్రస్ లేకుండా పోయారు. తెలుగుదేశం నీడలో వున్నప్పుడు ఆయన నెంబర్ టూగా వెలుగొందారు. అదంతా పార్టీ పుణ్యమని మర్చిపోయారు. తాను బలవంతుడిననుకున్నారు. పార్టీలు మారడంలో కూడా కొన్ని సమయం, సందర్బాలు కూడా వుంటాయి. అవి కలిసి వస్తే నాయకులకు మరింత కాలం పదవులు కలిసి వస్తాయి. తెలుగుదేశం పార్టీ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇ ంద్రారెడ్డి లాంటి వారికి కలిసివచ్చింది. అది వారి అదృష్టమే కాదు, పార్టీకి అనువైన కాలం కావడం తో రెండు విధాల మేలు జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో తెలుదేశం పార్టీ ఉనికి కష్టమనే విషయాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ పసిగట్టారు. పార్టీ మారారు. అప్పుడు ఆ పార్టీలో వున్నా, ఇప్పుడు ఆ పార్టీలో వున్నా అదే నిబద్దతతో పని చేస్తున్నారు. పదవుల కోసం పార్టీలు మారినట్లు విమర్శలు ఎదుర్కొన్నా, పార్టీలో మంచి గౌరవం పొందుతున్నారు. తెలుగుదేశంలో ఎంత దూకుడుగా వుండేవారో, ఇప్పుడు అంత పరిణతి పొందిననాయకుడుగా వుంటున్నారు. సబిత ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి మారి బిఆర్‌ఎస్‌లోకి మారారు. తన గౌరవాన్ని తాను కాపాడుకుంటున్నారు. అలా గౌరవంగా వుంటున్న వారు కొందరున్నారు. కాని ఏ ఎండకాగొడుగు పట్టాలనుకుంటే చాల సార్లుకాలం కలిసి రాకపోవచ్చు. అందుకు సొంత పార్టీని ఎదిరించిన మేనకా గాందీ పరిస్దితి ఎలా వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో వచ్చే తరానికి మరో ఇందిరాగాంధీ అవుతుందని అందరూ అనుకున్నారు. ఇందిరాగాందీకి ప్రభుత్వంలో, పార్టీలో ఆమె చూపిస్తున్న చొరవ అందర్నీ ఆకర్షించింది. పైగా ఎమర్జెన్సీ సమయంలో తన భర్తకు, అత్త ఇందిరాగాందీకి ఆమె తోడుగా నిలిచారు. పార్టీని కాపాడుకోవడంలో ఎంతో కృషి చేశారు. కాని ఆమె భర్త సంజయ్‌గాంధీ మరణంతో తనకు ప్రాధాన్యత తగ్గుతుందని భావించారు. ఒక రకంగా అపోహపడ్డారు. అత్తతో విబేదాలు కొని తెచ్చుకున్నారు. అత్తనుంచి దూరం జరిగి, రాష్ట్ర సంజయ్ మంచ్ అనే పార్టీని ఏర్పాటు చేసి బొక్క బోర్లా పడ్డారు. ఆమె ఆనాడు పార్టీ మారకపోయి వుంటే, ఇప్పుడు సోనియాగాందీ స్ధానంలో ఆమె కాంగ్రెస్‌ను నడిపించేవారు. ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు నాయకుల జీవితాలను తలకిందులు చేస్తాయని చెప్పడంలో సందేహం లేదు.
ములుగు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జాయింట్ డైరెక్టర్ డా. అమర్ సింగ్
ములుగు జిల్లా, నేటిధాత్రి:
వర్షాకాలంలో వచ్చే కీటక జీనిత వ్యాధులైన మలేరియా డెంగ్యూ నియంత్రణ కార్యక్రమాలు జిల్లాలో అమలుతీరును పరిశీలించడానికి జాయింట్ డైరెక్టర్ కీటక జనిత నియంత్రణ అధికారి డాక్టర్ అమర్ సింగ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ములుగును సందర్శించి, మాట్లాడుతూ , ఆరోగ్య సిబ్బంది విధి నిర్వహణనలో అలసత్వం వహించకుండా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సమయపాలన పాటించాలని తెలిపారు. హాస్పటలోఉన్న అన్ని వార్డులను పరిశీలించి, వైద్య సేవలు పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య సేవలతీరుని అడిగి తెలుసుకున్నారు. బ్లడ్ బ్యాంకులో అన్ని గ్రూపుల రక్త నిల్వలను నిల్వ ఉంచుకోవాలని, డ్రగ్ స్టోర్ లో ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకుని మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ లాంటి వర్షాకాల వ్యాధులకు ఇచ్చే చికిత్స మందులను సమకూర్చుకోవాలని, జ్వరం ఉన్న ప్రతి రోగికి మలేరియా డెంగ్యూ ఆర్డిటి పరీక్షలు తప్పనిసరిగా చేయాలని, టీ హబ్బులో అన్ని రకాల రక్త పరీక్షలను చేసి వాటి రిపోర్టులను సరి అయిన టైంలో అన్ని హాస్పిటలకు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాలరావు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరిండెంట్ చంద్రశేఖర్, హాస్పిటల్ అడిషనల్ డెరైక్టర్ గఫర్ టీ _హబ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ , మరియు డా,ప్రసాద్ మొదలగు వారు పాల్గొన్నారు.
కార్మికుల ప్రధాన సమస్యలపై గని మేనేజర్ కి ఐఎన్టియుసి ఆధ్వర్యంలో మెమోరాండం అందజేత
మంచిర్యాల,నేటి ధాత్రి:
సింగరేణిలో నెలకొన్న ప్రధాన సమస్యలైనా సొంతింటి కలను నెరవేర్చాలని,ఆదాయపు పన్నును మాఫీచేయాలని,మెడికల్ అటెండెన్స్ నియమాలను మార్చాలని కోరుతూ గురువారం ఐఎన్టియుసి నాయకులు గని మేనేజర్ కు మల్లారెడ్డి అధ్యక్షతన మెమోరాండం అందజేశారు. అనంతరం కేంద్ర కమిటీ నాయకులు గరిగే స్వామి మాట్లాడుతూ…నూతన బదిలీ విధానం,నూతన గనులు, తదితర కార్మికుల ప్రధాన సమస్యలను సింగరేణి యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని కోరారు.గని యాజమాన్యం అవసర నిమిత్తం తీసుకుని పనిచేస్తున్న జనరల్ అసిస్టెంట్ డ్రెస్ కోడ్ ధరించాలని,వారు అధికారులు లాగా కార్మికులతో వ్యవహరిస్తున్నారని,మాన్ వే వద్ద ఇన్,అవుట్ కు రావట్లేదని,ఫోన్ ద్వారానే వారికి ఇన్,అవుట్ వేయడం జరుగుతుందన్నారు.వీరికి యాజమాన్యాన్ని సర్కులర్ రిలీజ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్కే 5 ఫిట్ సెక్రటరీ నంబయ్య,అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీలు రవి,రాజేందర్, ఏరియా నాయకులు మహేందర్ రెడ్డి,పెద్ది రాజు,చందు,రామకృష్ణ,గని. యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
పట్టా భూమిని ఫారెస్ట్ భూమి అంటున్న ఫారెస్ట్ అధికారి
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్.
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండలంలోని రాఘవపూర్ గ్రామ శివారులో 326 సర్వే నంబర్లో పర్వతం ఉమా పేరుమీద 9 ఎకరాలు పర్వతం మహేష్ సన్నాఫ్ యాదగిరి పేరు మీద 13 ఎకరాలు భూమి పట్టా కలిగి ఉంది పెన్నింటి లక్ష్మి పేరు మీద నాలుగు ఎకరాలు పట్ట కలిగి ఉంది ఈ భూమి ని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది మాకు పట్టా ఉంది అని చెప్పేసి మేము సాగు చేసుకుంటామని సాగుకు యోగ్యంగా చేసుకుంటున్న భూమిని ఇందులో ఫారెస్ట్ భూమి ఉందని నిలుపుదల చేసిన ఫారెస్ట్ అధికారులు నెల రోజులు అవుతున్న ఇప్పటివరకు ఇది ఫారెస్ట్ భూమిన రెవిన్యూ పట్టాభూమిన అని తేల్చడంలో నిర్లక్ష్యం చేస్తున్న ఫారెస్ట్ మండల అధికారి జిల్లా అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ఫారెస్ట్ జిల్లా ఉన్నత అధికారులతో సర్వే నిర్వహించి రెవెన్యూ పట్టా భూమిన ఫారెస్ట్ భూమిన తేల్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం పట్టాలో ఉన్నటువంటి లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఒకవేళ ఫారెస్ట్ భూమి అయితే తక్షణమే హద్దులు ఏర్పాటు చేయాలని రెవిన్యూ భూమి పట్టా ఉంది కాబట్టి వారికి కూడా హద్దులు ఏర్పాటు చేయాలని అన్నారు న్యాయం జరగకపోతే ఆందోళనలకు సిద్ధం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం . యాదగిరి పాల్గొన్నారు
రామకృష్ణాపూర్ పట్టణంలో చేనేత దినోత్సవ వేడుకలను అధ్యక్షులు వనం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పద్మశాలి కుల సంఘం సభ్యులు చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని పురవీధులల్లో తిరుగుతూ నిర్వహించారు. నేత కార్మిక సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ మనోధైర్యాన్ని అందిస్తూ పట్టణంలోని అన్ని వీధులలో పర్యటించారు. ఈ సందర్భంగా వనం సత్యనారాయణ మాట్లాడారు. నేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉండాలని కోరారు. నేత కార్మికులకు ఉచిత కరెంటు, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ఎత్తివేయాలని, నేత అన్నలకు కనీస వేతనం అందే విధంగా చూడాలని, వస్త్రాలను అన్ని రంగాల్లో సోదరులకు అందించేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఆడేపు తిరుపతి, కోశాధికారి వేముల వెంకటేశం, ఉపాధ్యక్షులు ఆడేపు కృష్ణ, సమ్మయ్య, సహాయ కార్యదర్శి వేముల అశోక్, ఆర్గనైజర్ సెక్రటరీ కొండ కుమార్ ,బొద్దుల ప్రేమ్ సాగర్, యాదగిరి, తిరుపతి, వెంకట స్వామి, సంతోష్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఒకరికి జైలు శిక్ష
రోడ్డు భద్రత నియమ నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలి
పరకాల సీఐ క్రాంతికుమార్
పరకాల నేటిధాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష విధించినట్టు సిఐ క్రాంతికుమార్ తెలిపారు.ఆగస్టు 3న పట్టణ సమీపంలో వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో విలీన గ్రామం సీతారాంపురం గ్రామానికి చెందిన పెర్వలా రమేష్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు,అతనికి గురువారం పరకాల స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యూడిషయల్ మెజిస్ట్రేట్ కొప్పుల శంకర్ ముందు కోర్టు కానిస్టేబుల్ నాగరాజు హాజరుపరచగా ఒకరోజు జైలు శిక్షతోపాటు 500 జరిమానా విధించినట్లు తెలిపారు.ఈ సందర్బంగా సీఐ క్రాంతికుమార్ మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమ నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలని లేదంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని రామాలయం పాఠశాల ఆవరణలో గల అంగన్వాడి కేంద్రం,ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు.నర్సంపేట బ్రహ్మకుమారీస్ నిర్వాహకులు జ్యోతి బెహన్,నర్సంపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు విడిపిఓ మధురిమ హాజరై మాట్లాడుతూ సోదర భావాలను పెంపొందించే ఈ రక్షాబంధన్ కార్యక్రమం పిల్లలతో నిర్వహించడం వలన ప్రేమ,స్నేహం,సౌభ్రాతృత్వం పెంపొందించుకోవచ్చని తెలిపారు.శాంతియుత సమాజ నిర్మాణంకోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.అనంతరం విద్యార్థులతో ధ్యానం చేయించి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మ కుమారీస్ వీరలింగం, సుభద్ర, ఐసీడీఎస్ స్థానిక సూపర్ వైజర్ రమ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ, ఉపాధ్యాయులు రవీందర్,వెంకటేశ్వర్లు,పద్మ, స్థానిక అంగన్వాడి టీచర్ నల్లభారతి, గౌసియా, ఆయా సునీత, విద్యార్థులు పాల్గొన్నారు.
సోషల్ మీడియాలో చెడుకు,ఇతర వ్యసనాలకు బానిసగా సెల్ ఫోన్ ద్వారా ప్రభావితం అవుతున్న యువత సెల్ ఫోన్లు వీడి క్రీడల్లో పాల్గొని మానసికంగా శారీరకంగా అభివృద్ధి చెందాలని నర్సంపేట టౌన్ సిఐ లేతాకుల రఘుపతిరెడ్డి పిలుపునిచ్చారు.నర్సంపేట మండలంలోని రాజపల్లి గ్రామంలో ఖో ఖో,వాలీబాల్ కోర్ట్ లను టౌన్ సిఐ రఘుపతిరెడ్డి స్థానిక ఎస్సై అరుణ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ యువత ,పిల్లలు మొబైల్ వీడాలి – క్రీడలు ఆడాలి అను నినాదం గ్రామాల్లోని యువతకు మార్గనిర్దేశం అని పేర్కొన్నారు.మాజీ ప్రజా ప్రతినిధులు,అధికారులు,యువకులు పాల్గొన్నారు.
మండలంలోని ముస్త్యాలపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బందెల దామోదర్ అనారోగ్య కారణాల వల్ల మృతి చెందిన విషయం తెలిసి వారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి,వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేసి,ఘన నివాళ్లులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటానని తెలియజేసిన నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి కుడ్ల మలహాల్ రావు వెంట నడికూడ మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు,ఎఎమ్సి డైరెక్టర్ భోగం కమల,పరకాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల చిన్ని,మండల సమన్వయ కమిటీ సభ్యులు పాడి ప్రతాప్ రెడ్డి,చౌటుపర్తి గ్రామ కమిటీ అధ్యక్షులు ఓదేలా రవి,ముస్తలపల్లి గ్రామా కమిటీ ఎస్సి సెల్ అధ్యక్షులు బోట్ల అనిల్,నార్లపూర్ గ్రామ బూత్ కమిటీ సభ్యులు శనిగరపు రవీందర్, ముస్తాలపల్లి మాజీ సర్పంచ్ బోట్ల రవి, రాజేందర్(రమాకాంత్),రాష్ట్ర మాల మహానాడు అధికార ప్రతినిధి నీరటి రాములు, సీనియర్ నాయకులు బందెల స్వామి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి టియుటిఎఫ్ సంఘం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దార గణేష్ పేర్కొన్నారు.నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2011ఆగస్టు 7 న ఏర్పడి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిందన్నారు.టియుటిఎఫ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గురువారం నర్సంపేట మండల కేంద్రంలో ఆ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించి టియుటిఎఫ్ పతాకాన్ని ఎగురవేశారు. ఉపాధ్యాయుల పదోన్నతులు ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా పారదర్శకంగా చేపట్టాలని టియుటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు సందినేని వేంకటేశ్వర్ రావు ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఎన్.ఇంద్రారెడ్డి, కోశాధికారి పి.కవిత, ఉపాధ్యాయులు పత్తి నరసింహారెడ్డి, బోడ రమేష్,రేవూరి కృష్ణారెడ్డి,అంబటి సత్యనారాయణ రాజు,గుండె లక్ష్మయ్య, అనిరుధ్ యాదవ్ తదతరులు పాల్గొన్నారు.
ఆ జాగ్రత్తగా బస్సును నడిపిన మాస్టర్ మైండ్ స్కూల్ డ్రైవర్
ఇవన్నీ కామన్ అంటున్న స్కూల్ యాజమాన్యం
అడ్డుకున్న బీజేపీ నేతలు
గతంలో నిబంధనలు పాటించట్లేదని ఫిర్యాదు చేసిన పట్టించుకోని విద్యాధికారి
ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి
ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల నిబంధన అతిక్రమనలు తారా స్థాయికి చేరుతున్నాయి. వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మాస్టర్ మైండ్ స్కూల్ యాజమాన్యం స్కూల్ బస్ నడపడానికి ఎలాంటి అనుభవం లేని కొత్తగా లైసెన్స్ తీసుకున్న డ్రైవర్లచే బస్సును నడిపిస్తూ పిల్లల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. పాఠశాల బస్సు నడపాలంటే ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరాల అనుభవం కలిగిన వారిని పెట్టాలనే నిబంధనలను అతిక్రమిస్తూ ఇష్టాను రీతిలో యాజమాన్యం ప్రవర్తిస్తున్నారు. గురువారం రోజున ఉదయం పిల్లలను ఎక్కించుకొని పాఠశాల వైపు అతివేగంగా వస్తున్న బస్సును గమనించిన బిజెపి మండల నాయకులు ఆపి ప్రశ్నించగా డ్రైవర్ కు లర్నింగ్ లైసెన్స్ ఉందని అది కూడా కొద్ది రోజుల క్రింద అప్లై చేసి ఉందని దానిని చూసి యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఇవన్నీ కామన్ అంటూ సర్దుకునే ప్రయత్నం చేశారు. కామన్ అంటూ పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని బిజెపి నాయకులు వాగ్వాదానికి దిగగా డ్రైవర్ ను తీసేస్తున్నాం అని చాలా నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తున్నారు. గతంలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ ఎంఈఓ పలుమార్లు విన్నవించుకున్న కనీసం పట్టించుకోవట్లేదు అని తెలిపారు. ఒక పాఠశాలను మొదలుపెట్టే ముందు దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తున్నటువంటి పత్రాలను మండల విద్యాధికారి ఆఫీసులో జత చేయాల్సి ఉంటుంది. ప్రతి విషయంలో ప్రైవేటు పాఠశాలల పత్రాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నాయని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పాఠశాలకు అనుమతులు ఇస్తున్నారా? లేదంటే కనీసం అనుమతుల వివరాలను చూడకుండా ఇస్తున్నారా? అనే ప్రశ్నలు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయాలపై అధికారులు చొరవ తీసుకొని ప్రైవేటు పాఠశాలల మీద విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పాఠశాలలను సీజ్ చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ప్రధాన కార్యదర్శులు నంది నరేష్, దాసరి గణేష్, సాయి కిరణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
గనిప్రమాదాలు,రక్షణ చర్యలు, పని ఒత్తిడి,వైద్య సౌకర్యాల్లో కొనసాగుతున్న లోపాలపై జిఎం కార్యాలయం వద్ద సీపీఎం నిరసన పర్సనల్ మేనేజర్ గార్క్ వినతి పత్రం.
ఎస్ సి సి ఎల్ మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాలల్లో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న పర్మనెంట్, కాంట్రాక్టు కార్మికులు విధుల నిర్వహణలో అనేక ప్రమాదాలు జరిగి మరణించడం, గాయలపాలు కావడం జరుగుతుంది.తమ ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబాలు మానసికక్షోభకు గురై పోతున్నారు.సంస్థను లాభాల బాటలో నడిస్తున్నా కార్మికుల ప్రాణాలను కాపాడడంలో సింగరేణి యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యాన్ని పాటిస్తున్నది.ఉత్పత్తి,లాభలు సాదిసిస్తున్నా కార్మికుల ప్రాణాలను కాపాడం కోసం రక్షణ వ్యవస్థను పటిష్టం చెయ్యడం లేదు,రక్షణ సూత్రాలను యాజమాన్యం పాటించడం లేదు.పని ప్రదేశాల్లో ఎలాంటి ఇబ్బందులున్నాయో కార్మికులు,కార్మిక సంఘాలు చెప్పిన కూడ కనీసం వినడం లేదు, పట్టించుకోవడం లేదు. కాల పరిమితి నిండిపోయి,చెడిపోయిన యంత్రాలతో పని చేయిస్తు. ప్రమాదాలకు కారణం అవుతున్నారు.ప్రమాదంలో గాయపడ్డవారిని గనిలో నుంచి తీసుకురావడం కోసం కనీసం స్త్రేచ్చర్ లేకపోవడం,అంబులెన్స్ లు అందుబాటులో లేకపోవడం,నిపుణులైన వైద్యులు లేకపోవడాన్ని చూస్తుంటే సింగరేణిలో ఆటవీక రాజ్యం కొనసాగుతున్నట్లుగా కనిపిస్తున్నది.పని స్థలాల్లో స్వచ్ఛమైన గాలి అందకపోవడం,రక్షణ చర్యలు చేపట్టకపోవడం, ఉత్పత్తి,లాభాల కోసం షిప్ట్ ల సంఖ్యను పెంచడం, నాసి రకమైన రక్షణ పరికరాలతో బలవంతంగా ప్రమాదకరమైన పరిస్థితిల్లో కార్మికులను యంత్రాల్లగా పని చేయించడం జరుగుతుంది. గడిచిన 2,3 సం.రాల నుంచి నేటి వరకు అనేక ప్రమాదాలు జరిగి పలువురు పర్మనెంట్,కాంట్రాక్టు కార్మికులు మరణించడం,గాయల పాలుకావడం జరిగింది. ఇన్ని ప్రమాదాలు జరిగినా బాధ్యులపై చర్యలు లేవు, భవిష్యత్తులో జరగకుండ చెయ్యడం కోసం యాజమాన్యంలో చలనం లేదు. ఉత్పత్తి,లాభాల కోసం యాజమాన్యం ఎంతైతే శ్రద్ద పెట్టుతున్నదో అంతకంటే ఎక్కువ శ్రద్ద కార్మికుల ప్రాణాలను కాపాడం కోసం తక్షణమే రక్షణ వ్యవస్థను బలోపేతం కోసం తగిన చర్యలు చేపట్టాలి.లేకుంటే ప్రతి మరణం,ప్రమాదం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో సింగరేణి యాజమాన్యం చేస్తున్న కుట్రలుగా కార్మికులు,ప్రజలు బావించ వల్సిసి వస్తుంది. సి & ఎండీ చైర్మన్,డైరెక్టర్లకు, సేఫ్టీ జీఎం,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి కార్మికుల ప్రాణాలను కాపాడలని డిమాండ్ చేస్తున్నాము.
డిమాండ్స్
1,జరిగిన ప్రమాదాలు,దాని కారణాలు,రక్షణ వ్యవస్థ పని తీరుపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి. 2,తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం తక్షణమే అన్ని పర్మనెంట్,కాంట్రాక్టు యూనియన్లతో,నిపుణులతో,సీనియర్ కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చెయ్యాలి. 3,ప్రమాదాలకు బాధ్యులుగా స్థానిక అధికారి,సేఫ్టి అధికారి, ఏరియా జనరల్ మేనేజర్లపై చర్యలు తీసుకోవాలి. 4,డీజీఎంఎస్ తో జరిగే త్రిసభ్య కమిటి సమావేశంలో అన్ని కార్మిక సంఘాలను, కాంట్రాక్టు కార్మిక సంఘాలను పిలవాలి. 5,ప్రతి షిఫ్ట్ లో సెప్టి అధికారులను నియమించాలి. 6,పని ప్రదేశాల్లో పటిష్ఠమైన రక్షణ చర్యలు తీసుకోవాలి. 7,ప్రతి విభాగం వద్ద ప్రాథమిక వైద్యంతో పాటు,అంబులెన్స్ లు, స్త్రేచ్చర్లు,ఆక్సిజన్,ఫస్ట్ యిజ్ స్టేషన్ ఏర్పాటు చెయ్యాలి 8,బెల్లంపల్లి,రామకృష్ణ పూర్ ఏరియా ఆసుపత్రిలల్లో అన్ని రకాల వైద్య నిపుణులతో పాటు,తగినంత సిబ్బందిని నియమించాలి. 9,ఉత్పత్తి,లాభాలే కాదు కార్మికులు,వారి కుటుంబాలు,ప్రాణాలు, సంక్షేమం మాదే అనే విధంగా యాజమాన్యం వ్యవరించాలి. 10,ప్రమాదాలు జరిగినప్పుడు అంబులెన్స్ తో పాటు డాక్టర్లను ప్రమాదం జరిగిన ప్రాంతానికి పంపించాలి. 11,కార్మికులకు రక్షణ మరియు సంక్షేమానికి నిధులను పెంచాలి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
సంకె రవి సీపీఎం జిల్లా కార్యదర్శి
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోమసా ప్రకాష్,బోడెంకి చందు జిల్లా కమిటీ సభ్యులు దూలం శ్రీనివాస్,గుమసా అశోక్,సామల ఉమ రాణి.
నాయకులు దాగం శ్రీకాంత్, జి.మహేందర్,సిడం సమ్మక్క, బి.రమాదేవి,నిర్మల ,సిడం జంగు బాయి, కె.రాజేశం, రాజలింగు, పోషం తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.