మద్దూరు మండలం పిట్టల గూడెం సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి:
బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. బొంగోని సురేష్ గౌడ్
మద్దూరు నేటి ధాత్రి
జనగామ నియోజకవర్గం మద్దూరు మండలం లో ధర్మారం గ్రామం పిట్టల గూడెం లో బీజేపీ మండల అధ్యక్షులు ఉదయ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. బొంగోని సురేష్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మారం గ్రామ పిట్టల గూడెం లో కనీస వసతులు లేవని, ఉండడానికి ఇల్లు లేక గుడిసెల్లో జీవనం సాగిస్తుంటే పాము కాటుకు గురి కానీ కుంటుంబం అంటూ లేదు అని బాధపడ్డారు అలాగే మురుగు నీరు రోడ్లమీద ప్రవహిస్తుంటే ఈ కాలనీ వాసులు రోగాల పాలు అవుతున్నారని, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మరుగు దొడ్లు మంజూరు చేపిస్తే ఈ కాలనీ వాసులకు ఇవ్వలేని దుస్థితి నెలకొనడం బాధాకరం అని వాపోయారు స్థానిక శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి కి, కాంగ్రెస్ ఇక్కడి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కంటికి కనబడడం లేదా అని మండిపడ్డారు. పిట్టల గూడెం ప్రజల సమస్యలను పరిష్కరించాలని లేని యెడల వారి వారికీ అండగా బీజేపీ పోరాడుతుందని హెచ్చరించారు.అదేవిదంగా పిట్టల గూడెం రోడ్డు అద్వానంగా తయారై నిత్యం ప్రమాదలకు గురై నానా అవస్థలు పడుతున్నారని వెంటనే తారు రోడ్ ను వేయాలని డిమాండ్ చేశారు.అనంతరం పిట్టల గూడెం వాసులతో కలిసి వారి గుడిసెలో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు కూరెళ్ల కిరణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బియ్య రమేష్, నరదాసు సందీప్, బండి శ్రీహరి,వినయ్, సిరిమల్లె సురేష్, ఏలూరి శివ, రవి, బొల్లు రాజు, ప్రశాంత్, సాయి కిరణ్, సాయి బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.
(ఆంగ్లం: National Handloom Day) ఆగస్టు 7న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. భారత స్వాతంత్ర్యోద్యమములో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్ర్య సమపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత. గాంధీజీ కూడా రాట్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేతరంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏర్పాటుచేయడం జరిగింది.
ప్రారంభం
2015, ఆగస్టు 7న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించి, భారత చేనేత లోగోను ఆవిష్కరించడంతోపాటూ ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా 2012-14 సంవత్సరాల్లో చేనేత రంగంలో ప్రతిభ కనబరిచిన 72మందికి అవార్డులు (వీరిలో 16 మందికి సంత్ కబీర్ పురస్కారాలు) ప్రదానం జరిగింది.
చరిత్ర
భారత స్వాతంత్ర్యోద్యమములో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్ర్య సమపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత. భారత స్వాతంత్ర్యోద్యమంలో చేనేత అహింసాయుత ఉద్యమానికి నాంది పలికిన చేనేతరంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాపోలు ఆనంద భాస్కర్ 2005లో చేనేత దినోత్సవానికి సంబంధించిన పరిశోధన చేసి చారిత్రిక ఆనవాళ్లను శోధించాడు, చేనేత దినోత్సవానికి సరైన తేదీ కోసం అధ్యయనం చేశాడు. భారత స్వాతంత్ర్య ఉద్యమం జరుగుతున్న సమయంలో విదేశీ వస్త్రాలను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం వచ్చింది. మొదటిసారిగా 1905లో బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తాలోని టౌన్‌హాల్‌లో 1905 ఆగస్టు 7న భారీ సమావేశం నిర్వహించి విదేశీ వస్త్రాలను బహిష్కరించడంతోపాటూ దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు. అలా విదేశి వస్తు బహిష్కరణలో కీలకపాత్ర వహించిన ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా చేయాలని ఆనంద భాస్కర్ ప్రతిపాదించాడు. ఈ దినోత్సవానికి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించాలని తడ్క యాదగిరి, ఎర్రమాద వెంకన్న నేతతోపాటు మరికొందరిని ప్రోత్సహించాడు.
National Handloom Day
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2006వ సంవత్సరం నుండి స్థానిక చేనేత సంఘ నాయకులతో కలిసి వివిధ కార్యక్రమాలను నిర్వహించిన ఆనంద భాస్కర్, ఆగస్టు 7వ తేదీకి ఉన్న చారిత్రిక ప్రాధాన్యతను అందరికి తెలియజేసి, 2006 నుండి చేనేత దినోత్సవ కార్యక్రమం క్రమంతప్పకుండా జరిగే విధంగా రూపకల్పన చేశాడు.
అప్పటి భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, అప్పటి కేంద్ర జౌళీ శాఖ మంత్రి శ్రీ శంకర్ సింగ్ వాఘేలా, ఎల్.కె.అద్వానీ లతోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఆనంద భాస్కర్ ప్రయత్నాన్ని అభినందిస్తూ సందేశాలు పంపారు. 2008, ఆగస్టు 7న హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన చేనేత దినోత్సవ వేడుకలకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. వై.యస్. రాజశేఖరరెడ్డి పాల్గొన్నాడు.
2012, ఏప్రిల్ 2న ఆనంద భాస్కర్ కు రాజ్యసభ సభ్యునిగా అవకాశం రావడంతో చేనేత దినోత్సవ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 2012, ఏప్రిల్ 6న రవీంద్రభారతిలో ఎర్రమాద వెంకన్న నేత సారథ్యంలో చేనేత దినోత్సవ చరిత్ర, ఆవశ్యకతను వివరిస్తూ స్వదేశీయం సంగీత నృత్య రూపకం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి అప్పటి రాజ్యసభ సభ్యులు రాపోల్ ఆనంద భాస్కర్, చిరంజీవి ముఖ్య అతిధులుగా హజరయ్యారు. ఆ తరువాత చేనేత దినోత్సవానికి సంబంధించి ఢిల్లీలో జరిగిన అన్ని జాతీయ కార్యక్రమాలకు ఆనంద భాస్కర్ నాయకత్వం వహించాడు. వివిధ రాష్ట్రాలలోని జాతీయ నాయకులను కలిసి దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారాన్ని కల్పించాడు.
2012, ఆగస్టు 7న ఆనంద భాస్కర్ ఆద్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారిగా చేనేత దినోత్సవం జరుపబడింది. ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కళాకారులను, రాజకీయ దిగ్గజాలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ఎర్రకోట నుండి రాజ్ ఘాట్ వరకు చేనేత వాక్ నిర్వహించి జాతీయ స్థాయిలో ఈ దినోత్సవంపై ఆసక్తిని కలిగించాడు. 2014లో అదే రాజ్ ఘాట్ లో చేనేత దినోత్సవ ర్యాలీకి ముఖ్య అతిథిగా వచ్చిన అప్పటి కేంద్ర జౌళీ శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ప్రధానితో చర్చించి చేనేత దినోత్సవాన్ని అధికారికం చేస్తామని మాటిచ్చాడు.
2014 నుండి 2015 వరకు ప్రభుత్వాధికారులపై ఒత్తిడి పెంచిన ఆనంద భాస్కర్, 2015 మార్చి 3న రాజ్యసభలో ఆగస్టు 7ని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించాలని ప్రతిపాదించాడు. అందుకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి, అందులో రాపోలు ఆనంద భాస్కర్ ని సభ్యునిగా చేర్చి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరింది. చేనేత దినోత్సవానికి సంబంధించిన డాక్యుమెంటేషన్, రికార్డులు, పూర్వ చరిత్ర, సంబంధిత చేనేత జౌళిశాఖామంత్రి అప్పటి కేంద్ర వస్త్ర, జౌళి శాఖామంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ కి అందించాడు. ఆనంద భాస్కర్ సమర్పించిన పత్రాలు రికార్డులను పరిశీలించిన శాఖ అధికారులు, తమ నివేదికను ప్రధానమంత్రికి సమర్పించారు. ఆనంద భాస్కర్ ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర ప్రాంత ప్రభుత్వాల అంగీకారంతో 2015, జూలై 29న భారత ప్రభుత్వం ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా అధికారిక గెజిట్ విడుదల చేసింది. 2015, ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ చెన్నైలో అధికారికంగా ప్రారంభించారు. ఈ అధికారిక జాతీయ పండుగకు కేంద్ర మంత్రులు, తమిళనాడు రాష్ట్ర మంత్రులు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ చేనేత కళాకారులు పాల్గొన్నారు. ఆనాటి నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రమం తప్పకుండా జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తున్నాయి.
మ్యూజియం నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశాడు. అనంతరం మన్నెగూడలోని బీఎంఆర్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొని రాష్ట్రంలోని చేనేత కార్మికులు కొత్త తరహా మగ్గాల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించడంకోసం రూపొందించబడిన తెలంగాణ చేనేత మగ్గం పథకాన్ని ప్రారంభించాడు. నేతన్న బీమా పథకం వయో పరిమతిని 59 నుండి 75 వయస్సుకు పెంచుతున్నట్లు, చేనేత మిత్ర పథకం ద్వారా అందించే 50 శాతం సబ్సిడీకీ బదులుగా మగ్గానికి నెలకు రూ.3వేలు అందజేయనున్నట్లు, కార్మికులు దహన సంస్కారాల కోసం అందించే ఆర్థక సహాయాన్ని రూ.12,500 నుండి రూ.25వేలకు పెంచుతున్నట్లు, ఆరోగ్య కార్డు ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా రూ. 25వేల వరకు వైద్య సేవలు అందించనున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా చేనేత మిత్ర, పావలావడ్డీ, నేతన్నకు చేయూత, నూలు సబ్సిడీ లబ్ధిదారులకు చెక్కులనూ, 36మంది చేనేత కార్మికులు, వృత్తి నిపుణులకు కొండా లక్ష్మణ్‌బాపూజీ అవార్డులను అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక-సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, ఎమ్మెల్సీ రమణ, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, పవర్ లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చైర్మన్ గూడూరి ప్రవీణ్ లతోపాటు పలు చేనేత సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇతర వివరాలు
✓ చేనేతరంగంలో విశిష్ట కృషిచేసిన చేనేత కార్మికులను గౌరవిస్తూ 2012నుంచి ఏటా చేనేత కార్మికులకు సంత్‌కబీర్ అవార్డులను జాతీయస్థాయిలో అందిస్తున్నారు. ✓ 2018లో యాదాద్రి – భువనగిరి జిల్లా పోచంపల్లి గ్రామానికి చెందిన చేనేత కళాకారులు కుట్టులేని జాతీయ జెండాను రూపొందించారు. 24 ఆకులతో కూడిన అశోక చక్రం సహా జాతీయ పతాకమంతా ఎలాంటి కుట్టులేకుండా మగ్గంపై తయారుచేశారు.
జహీరాబాద్ ప్రాంతంలోని పాల రైతులు, పాల డైరీ కేంద్రం ఆరు సంవత్సరాలుగా పాలు కొనుగోలు చేయకుండా నిలిపివేయడంతో తీవ్రంగా నష్టపోతున్నారని డైరీ ఫార్మ్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణు తెలిపారు. గోవిందపూర్ పరిధిలోని ఈ కేంద్రం నుంచి ఇటీవల పాలు కొనడం ఆగిపోయింది. ఈ సమస్యపై స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతూ, అసోసియేషన్ ఆధ్వర్యంలో పాల రైతులు బుధవారం సాయంత్రం కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం సమర్పించారు.
78 ఏళ్ళ స్వాతంత్రంలో దేశ ప్రజల అవసరాలకు తగినన్ని ఏర్పాటు కానీ విద్య -వైద్య శాలలు…
నిధుల కొరత, నిర్వహణ లోపం తో సక్రమంగా నడవని విద్య-వైద్య సంస్థలు…
విశ్వ జంపాల, న్యాయవాది మరియు విశ్వ సమాజం వ్యవస్థాపకులు…
నేటి ధాత్రి -మహబూబాబాద్ :-
భారత దేశానికి స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలైనప్పటికీ మన దేశంలో ప్రజల అవసరాలకు తగినన్ని విద్యాలయాలు – వైద్య శాలలు ఇంకా ఏర్పాటు కాలేదు.ప్రస్తుతం ఉన్న వాటిపై ప్రజలకు విశ్వాసం లేదు.నిధుల కొరత, నిర్వహణ లోపం, పర్యవేక్షణ లోపం, ప్రజల అవగాహన లేమితో ప్రభుత్వ విద్యా, వైద్య సంస్థలు సక్రమంగా నడవడం లేదు.ప్రభుత్వ విద్యా-వైద్య సంస్థలలో పనిచేసే కొందరు ఉపాధ్యాయులు, డాక్టర్లు, ప్రయివేటు విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, అధికారిక, అనధికారిక లావాదేవీలు, వ్యాపారాలు నిర్వహిస్తూ మనసును,సమయాన్ని ఉద్యోగం కన్నా వాటిపైనే కేంద్రీకరిస్తున్నారు.కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఏకోపాధ్యాయుడు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.కొందరు ఉపాధ్యాయులు,డాక్టర్లు ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను ఏదోరకంగా మచ్చిక చేసుకొంటూ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఒక అంకెకు మించిలేదు.ఒకప్పుడు ఊరుకొక్క బడి పేరుతో విస్తరింపజేసిన ప్రభుత్వాలు ఆచరణలో శ్రద్ధ చూపకపోవడం,సమాజంలో వచ్చిన పరిణామాలు ప్రభుత్వ పాఠశాలలను,వైద్య శాలలను మరింత అధ్వాన స్థితిలోకి నెట్టి వేశాయి.పేదలకో బడి, పెద్దలకో బడి అన్నట్లుగా మారి,ఒకప్పుడు ప్రజలందరి కోసం ఏర్పాటు చేయబడిన విద్య-వైద్య సంస్థలు కేవలం కఠిక పేద వాళ్ళ కోసమేనన్న విధంగా తయారయ్యాయి.ఎంతో కొంత నాణ్యత ప్రమాణాలు మానవీయ విలువలు పాటించే ప్రభుత్వ విద్యా-వైద్య సంస్థలు నేడు నిర్లక్ష్యం నీడన నిరు పేదల బ్రతుకులు అన్న చందంగా మారాయి. “ధరిద్రులను దేవతలు కూడా బాగుచేయలేరు” అనే హితోపదేశాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలు-అధికారులు-విద్య-వైద్య సంస్థల ఉద్యోగులు బాధ్యతల నుండి తప్పుకుంటూ ఉద్యోగ వృత్తి ధర్మాలను నిర్లక్ష్యం చేస్తున్నారు.రోగమొచ్చిన సమాజానికి శస్త్ర చికిత్స చేయగలిగిన వారు డాక్టర్లు-ఉపాధ్యాయులు మాత్రమే.ఉపాధ్యాయులు, డాక్టర్లు అపసవ్య పరిసరాలను-పరిస్థితులను వారికి అనుకూలంగా మార్చుకునే శక్తి యుక్తులు-సామర్థ్యం కలిగి ఉంటారు. వీరు విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దగలరు,రోగులను ఆరోగ్యవంతులుగా తయారు చేయగలరు.డాక్టర్లు-ఉపాధ్యాయులు సమాజాన్ని మానవీయ కోణంలో ముందుకు నడిపించేందుకు నిరంతరం శ్రమిస్తూ, నాయకులై నడిపిస్తూ సమాజ నిర్దేశకులుగా నిలువగలరు.వారికి ఆవిధమైన శక్తి యుక్తులు-సామర్థ్యం గలదు. కాని డాక్టర్లు-ఉపాధ్యాయులు కూడా ప్రపంచీకరణ- ప్రైవేటైజేషన్-లిబరలైజేషన్ ప్రభావానికి గురైనారు. డాక్టర్లు, ఉపాధ్యాయులు నాటి ప్రేమ, ఆప్యాయతతో కూడిన పలకరింపులు మర్చిపోయినారు.కొందరైతే ఉన్నామా! తిన్నామా! పడుకున్నామా! అన్నట్లు ఉద్యోగ వృత్తి బాధ్యతలను నిర్వర్తిస్తూన్నారు.తల్లి-తండ్రి-దైవం అనే నానుడి ఒకప్పుడు ఉండేది.కాలక్రమేణ అది తల్లి-తండ్రి-గురువు అయ్యింది.ఆ తరువాత తల్లి-తండ్రి-గురువు-వైద్యుడు అయింది. ఈ నలుగురి తర్వాతే దైవం అని సామాన్య ప్రజలు భావిస్తున్నారు. రోగం వైద్యుడి వల్ల నయం కానప్పుడు మాత్రమే ప్రజలు దైవం మీద భారమేస్తారు.డాక్టర్లు-ఉపాధ్యాయులను దేవుడి కన్నా గొప్పగా సమాజం చూసేది. ప్రతి మనిషి తల్లిని, తండ్రిని గురువులో చూస్తారు. ఆ ముగ్గురిని వైద్యునిలో చూస్తారు. ఇప్పుడు గురువును-వైద్యున్ని అంతటి గౌరవ స్థానంలో చూడడానికి, గౌరవించడానికి, సమాజం సంకోచిస్తూంది. దీనికి కారణం గురువులు,వైద్యులు మానవీయ విలువలు పాటించక పోవడం. నేడు గురు శిష్యుల బందాలు కాని, డాక్టర్-రోగి సంబంధాలు కానీ లేవనే చెప్పాలి.అంకితా భావం కలిగిన తోటి ఉపాధ్యాయుల పట్ల కొందరు ఉపాధ్యాయులే చులకన చేసి మాట్లాడడం బాధాకరం. ఇది ఉపాధ్యాయ వృత్తికే అవమానం.ఎన్నికల్లో లక్షలు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కొని, ప్రజా ప్రతినిదులై కోట్లు దండు కొంటున్న మాదిరిగానే, కార్పోరేట్ సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు లక్షలు వెచ్చించి విద్యను కొనుక్కొని భవిష్యత్ లో కోట్లు గడించాలన్న భావన తప్పా, మానవీయ కోణం మచ్చుకైనా కానరాదు. పాలక వర్గాలు భారత రాజకీయాలను నోట్లు ఓట్లు కోట్లు అనే ఫార్ములాకు దిగజార్చారు.అదే మాదిరి విద్యా వైద్య రంగాలను కూడా పైసలు పట్టాలు ధనార్జన గా మార్చారు. విద్యా-వైద్య రంగాలలో విస్తరించిన ప్రైవేట్, కార్పోరేట్ యాజమాన్యాలు పచ్చదనం పరిశుభ్రత లాంటి ఆరోగ్య సేవల రంగంలో అడుగు పెట్టక పోవడం గమనించదగిన విషయం.దీనికి ప్రధాన కారణం ఆరోగ్య సేవల్లో లాభాలు లేకపోవడమే. ప్రజా ప్రతినిధులు, ఉన్నత ఉద్యోగులు, ఉపాధ్యాయులు, బడి బాటలో భాగంగా ఎవరైనా ఎక్కడైనా తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించారేమో ఆలోచించాలి? ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు,ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వాలు ఆత్మ విమర్శ చేసుకోవాలి.ఆచరణాత్మక ఆలోచనలతో నిర్మాణాత్మక ప్రతి పాధనలకు పూనుకోవాలి.
గారెడ్డి , సైబర్ జాగ్రుకత దివాస్ సందర్భంగా –జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు..
•:- సైబర్ నేరాల గురించి అవగాహన కలిగి, అప్రమత్తంగా ఉందండండి..
•:- సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ ఎన్.వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జహీరాబాద్ ఆచార్య డిగ్రీ కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం..
సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శికాగోయల్ ఐపిఎస్ ఆదేశాలనుసారం, జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. సూచనల మేరకు ఈ రోజు తేది: 06.08.2025 ఆగస్టు నెల మొదటి బుధవారాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా సైబర్ జాగ్రుకత దివాస్ పేరుతో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది అన్నారు. సైబర్ సెల్ డీఎస్పీ ఎన్.వేణుగోపాల్ రెడ్డి, జహీరాబాద్ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలోని ఆచార్య డిగ్రీ కళాశాల విద్యార్థులకు
•:- వ్యాపారాలలో, పెట్టుబడి మోసాలు – పార్ట్ టైం జాబ్ స్కామ్స్..
•:- లోన్ మోసాలు – నకిలీ లోన్ యాప్స్ & ఆర్థిక ఉచ్చులు..
•:- ప్రకటన మోసాలు – ఆన్‌లైన్‌లో వస్తువులు / సేవలు అందకపోవడం..
•:- ఆన్‌లైన్ భద్రత చిట్కాలు – డిజిటల్ ప్రపంచంలో మీరే మీ రక్షకులు.. అనే అంశాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సైబర్ నేరాలు అనేవి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎదురుకుంటున్న సమస్య అని, సైబర్ నేరాల నుండి బయటపడాలంటే అవగాహన ముఖ్యం అన్నారు. అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్లు పన్నిన వలలో పడవద్దన్నారు. సైబర్ నేరాలకు గురిఅవుతున్న వారిలో విధ్యావంతులే అధికం అని, మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, వంటి ఆన్లైన్ మోసాల పట్ల అవగాహ కలిగి ఉండాలని, మొదట డబ్బులు వస్తున్నట్లు ఆశ చూపించి, ఆతర్వాత ఆన్లైన్ మోసాలకు పాల్పడతారని గుర్తించాలన్నారు. ఏ పోలీసు అధికారి ఎంక్వైరీ పేరుతో నేరుగా వాట్స్ ఆప్ వీడియో కాల్స్ చేయరాని, డిజిటల్ అరెస్ట్ అని కాల్స్ వస్తే నమ్మరాదని అన్నారు. అనుమానిత ఫోన్ నెంబర్ల నుండి కాల్స్ వస్తే సంబంధిత పోలీసు స్టేషన్ లో సమాచారం అందించాలని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ నందు రిపోర్ట్ చేయాలని సూచించారు. అమాయక ప్రజల బాలహీనతే, సైబర్ నేరాగాళ్ల బలంగా.. వివిధ రకాల సైబర్ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో టెక్నాలజీని వాడుకొని మరిన్ని సైబర్ మోసాలు చేయడానికి అవకాశం ఉందని, సైబర్ నేరాల గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి, అప్రమత్తంగా ఉన్నప్పుడే సైబర్ నేరాల నుండి బయటపడవచ్చని అన్నారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురి అయినట్లైతే వెంటనే (గోల్డెన్ అవర్)/48 గంటలలోపు 1930 కు యన్.సి.ఆర్.బి. (https://www.cybercrime.gov.in) పోర్టల్ నందు కాంప్లయింట్ నమోదు చేయాలని సూచించారు.
సైబర్ జాగ్రుకత దివాస్ కార్యక్రమంలో ఆచార్య డిగ్రీ కళాశాల నుండి సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొనగా, విద్యార్థిని, విద్యార్థులకు క్విజ్ మరియు రాత పరీక్ష నిర్వహించి, విజేతలుగా నిలిచిన కె. వెంకటేశ్, ఎం. నాగేశ్వరి నవ్యశ్రీ లకు ప్రశంసా పత్రాలు శీల్డులు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ టౌన్ ఎస్ఐ వినయ్ కుమార్, చిరాగపల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి, ఆచార్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హరికుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి D4C, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కొవాలి. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అధికారానికి దూరం కావడానికి ప్రధాన కారణం బిసిలు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ ఇంత కాలానికి గుర్తించింది. అందుకే మళ్లీ దేశంలో పూర్వ వైభవం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తోంది. బిసిలను మరింత దగ్గర చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించింది. దేశ వ్యాప్తంగా వస్తున్న రాజకీయ మార్పుల్లో భాగంగా రాను రాను కాంగ్రెస్ బిసిలకు కొంత దూరమౌతూ వచ్చింది. ఒకప్పుడు పేదలు, బడుగుల పార్టీ అంటే కాంగ్రెస్ అనే పేరు వుంది. ముఖ్యంగా దళితులు, గిరిజనులు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీనే నమ్ముతున్నారు. బలమైన ఓటు బ్యాంకుగా కాంగ్రెస్ పార్టీకి వున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటికీ దళిత, గిరిజన ప్రజలకు ఇందిరమ్మ నామమే జపిస్తారు. అంటే కాంగ్రెస్‌కు మాత్రమే ఓట్లు వేస్తారు. ఆ ఓటు బ్యాంకును ఇప్పటి వరకు ఎవరూ ఒక్క శాతం కూడా కదిలించలేకపోయారు. ఇది దేశంలోని చాలా రాష్ట్రాల్లోనూ ఇప్పటికీ ఆ రెండు వర్గాలు కాంగ్రెస్‌కు అండగా వుంటూ వస్తున్నారు. అంతే కాకుండా ముస్లిం, మైనార్టీలు కూడా కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకుగా వుంది. అయితే ఎప్పుడైతే దేశంలో బిజేపి బలపడుతూ వచ్చిందో అప్పటి నుంచి మెల్లిగా బిసిలు కాంగ్రెస్‌కు దూరమౌతూ వచ్చారు. అందుకు అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ఎస్పీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీల ఓట్లకే అధిక ప్రాదాన్యతనిస్తుందన్న ప్రచారం బిజేపి బాగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. అంతే కాకుండా మెజార్టీ ప్రజల ఓట్లను కాదని, కేవలం అధికారం కోసం కాంగ్రెస్ మైనార్టీల ఓట్లకోసమే తపిస్తుందంటూ విపరీతమైన ప్రచారం సాగిస్తూ వచ్చారు. దానిని ప్రజలు కూడా క్రమంగా నమ్ముతూ వచ్చారు. బిసిలకు, మధ్యతరగతి ప్రజలకు అండగా బిజేపివుంటుందన్న నమ్మకాన్ని కల్పిస్తూ వచ్చారు. అంతే కాకుండా బిసిలలో వుండే దైవం మీద నమ్మకాన్ని మరింత పురిగొల్పుతూ వచ్చారు. సనాతన ధర్మం వైపు బిసిలను అడుగులు వేయించారు. 2014లో అధికారంలోకి వచ్చే వరకు బిజేపి బలంగా బిసి జపం చేసింది. దానితోపాటు మెజార్టీ ప్రజల మీద మైనార్టీ ప్రజల దాడుల గురించి పదే పదే ప్రస్తావిస్తూ వచ్చేవారు. క్రమంగా సనాతన ధర్మాన్ని బలంగా విశ్వసించే బిసిలను కాంగ్రెస్‌కు దూరం చేస్తూ వచ్చారు. దేశ వ్యాప్తంగా బిజేపి అనేక రాష్ట్రాలలో పాగా వేసే దాకా వచ్చారు. దేశంలో వరుసగా బిజేపి మూడు సార్లు కేంద్రంలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం బిసిలు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఏడు సార్లు వరసగా బిజేపి అధికారంలోకి వచ్చింది. మహారాష్ట్రలో వరసగా మూడుసార్లు, ఆఖరుకు హర్యానా లాంటి రాష్ట్రంలో కూడా మూడుసార్లు, మధ్య ప్రదేశ్‌లో ఐదుసార్లు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రికార్డులు సృషిస్తూ వచ్చింది. ఇదంతా బిసి ప్రజల పుణ్యమే అన్నది ఇప్పుడు కాంగ్రెస్‌కు అర్దమౌతోంది. కేవలం బిజేపి మత రాజకీయమే అనుకుంటున్నారు కాని, బిసిల బలం విపరీతంగా తోడు కావడంతో బిజేపి ఎక్కడిక్కడ పెరుగుతూ వచ్చింది. అయితే ఎప్పుడైతే రాహుల్ గాంధీ బిసి గణన జరిపించాలని డిమాండ్ చేశారో బిజేపి అసలు రూపం బైట పడిరది. బిసి ముసుగు రాజకీయాన్ని బిజేపి ఎంత చాకచక్యంగా సాగిస్తోందన్నది దేశ ప్రజలకు కూడా అర్ధమైపోయింది. బిజేపి కన్నా బిసిలకు మేలు చేసింది కాంగ్రెస్ పార్టీయే అన్న నిజం ఇప్పుడిప్పుడే ప్రజలు తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ దేశంలో, రాష్ట్రాలలో అధికారంలో వున్నప్పుడు ఎస్సీ, ఎస్టీ రుణాలతోపాటు, బిసి యువతకు కూడా పెద్దఎత్తున రుణాలు ఇస్తూ వచ్చేవారు. వాటి స్ధానంలో బిజేపి ముద్రా రుణాలు అంటూ రకరకాల పేర్లతో తెచ్చిన రుణాలు ఎవరికి అందుతున్నాయో? అర్ధం కాని పరిస్దితి ఎదురౌతోంది. కొన్ని లెక్కల ప్రకారం బిజేపి కేంద్ర ప్రభుత్వం తరుపున ఇస్తున్న రుణాలన్నీ ఓసిలకే చెందుతున్నాయన్న నిజాలు కూడా బైటపడుతున్నాయి. . అంటే బిజేపి ఓట్ల కోసం బిసిలను, లాభపడేందుకు ఓసిలను ఎంచుకుంటుందన్న సత్యం వెలుగులోకి వస్తుంది. అంతేకాకుండా బిజేపిలో పెత్తనమంతా ఓసిలది, రాజకీయంగా ఓట్లు మాత్రం బిసిలవి అనే విషయం కూడా తేటతెల్లమౌతూ వస్తోంది. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూసే క్రమంలో కాంగ్రెస్ మళ్లీ అందుకున్నది. బిసిలను దగ్గర చేసుకోవాలన్న ఆలోచన చేసింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ దేశ మంతటా బిసి గణన జరగాలి. బిసిలకు ఈ దేశంలో జరగాల్సినంత న్యాయం జరగలేదని ప్రకటించారు. అన్ని వర్గాలకు ఎంతో కొంత న్యాయం జరిగినా, బిసిలకు జనాభా ప్రాతిపదికన అందాల్సిన న్యాయం అందలేదన్నది బలంగా రాహుల్ గాందీ ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇదే సమయంలో తెలంగాణ ఎన్నికల మందు ఒక ప్రయోగం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, బిసి డిక్లరేషన్ అమలు చేస్తామని ప్రకటించారు. సిఎం. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రజల బలంగా నమ్మేలా చేశారు. ఎక్కడికెళ్లినా ముందు బిసి డిక్లరేషన్ గురించి గట్టిగాచెప్పుతూ వచ్చారు. ఉద్యోగ, రాజకీయ రంగాలలో బిసిలకు తగిన ప్రాధాన్యత దక్కాలని సూచిస్తూ వచ్చారు. అది కాంగ్రెస్ వల్లనే సాద్యమౌతుందని అంటూ వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రేభుత్వం వచ్చిన వెంటనే 42శాతం రిజర్వేషన్ ఉద్యోగ, రాజకీయ రంగాలలో వెంటనే అమలు చేస్తామన్నారు. కాకపోతే ఇంత తిరకాసు వుంటుందని ఏ రాజకీయ పార్టీ చెప్పదు. కాని ఒక ప్రయత్నం చేయడం ఎంతోముఖ్యం. కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన 42శాతం హమీని ప్రతిపక్షాలు కూడా కాదని చెప్పలేని పరిస్ధితుల్లోకి వెళ్లిపోయాయి. దాంతో కాంగ్రెస్‌కు బిసిల మద్దతు విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలో రేవంత్ సర్కారు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అయితే కాంగ్రెస్ ఈ పదేళ్ల కాలంలో బలహీన పడుతూ రావడానికి బలమైన బిసి నాయకులు కూడా లేకపోవడం ఒక కారణమనే చెప్పాలి. అది దేశ వ్యాప్తంగా ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఎంత ఓసి నాయకులు వున్నా, ముందు వరసులో వుండాల్సిన బిసి నాయకులు కూడా చాలా మంది అవసరం. గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు బిసిలు దూరమౌతూ వస్తుండడడంతో పాత తరం కనుమరుగైపోయింది. కొత్త తరం కాంగ్రెస్‌లో లేకుండాపోయింది. మొత్తంగా బిసి నాయకత్వం బలంగా లేకుండాపోయింది. ఇప్పుడు ఆ లోటును పూడ్చితే కాంగ్రెస్‌కు వచ్చే మరో ముపై ఏళ్లు దేశంలో తిరుగులేని శక్తిగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు. తెలంగాణలో ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తే దేశమంతా తెలంగాణ వైపు చూడడమే కాకుండా, కాంగ్రెస్ వైపు చూస్తారు. కాంగ్రెస్‌ను బిసిలంతా బలపర్చుతారు. అందుకే ఆ అడుగు తెలంగాణ నుంచి కాంగ్రెస్‌పార్టీ వేస్తోంది. ముందుగా తెలంగాణలో ఆ ప్రచారం సక్సెస్ అయ్యింది. అందులో భాగంగా బిసి గణన కూడా విజయవంతంగా పూర్తయ్యింది. దేశానికే ఆదర్శమైంది. ఆఖరుకు మొన్నటిదాక బిసి గణనకు ససేమిరా? అన్న బిజేపి కూడా కాంగ్రెస్ డిమాండ్‌కు తలొగ్గింది. ఇండియా కూటమి నుంచే కాకుండా ఎన్డీయే కూటమిలో వున్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా బసి గణన చేయాలని పట్టుపట్టారు. ఆ రాష్ట్రంలో పూర్తి చేశారు. దాంతో ఎన్టీయే కూడా కదలక తప్పలేదు. బిజేపి ఒప్పుకోక తప్పలేదు. ఇది ఒక రకంగా కాంగ్రెస్ విజయమే అయినా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ ఎంతో వుందని చెప్పడంలో సందేహం లేదు. ఒక వేళ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది లేకపోతే బిసి గణన ఏదో తూతూ మంత్రంగా చేపట్టేవారు. కాని ఆయన అనేక విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. అన్ని విమర్శలు ఆయన ఎదుర్కొవాల్సిన అవసరం లేదు. కాని ప్రజలకిచ్చిన మాట మేరుకు అడుగులు వేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి లేకుంటే తెలంగాణలో బిసి మాటే లేదు. బిసిలకు 42శాతం రిజర్వేషన్ అనే ఆలోచనే లేదు. అలాంటి చైతన్యమే ఇప్పుడు వచ్చేది కాదు. బిసిల కోసం మిగతా ఏ పార్టీలు అనసరించేవి కాదు. అన్ని పార్టీలు బిసి మంత్రాన్ని జపించేవే కాదు. ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీయే కాదు, అన్ని పార్టీలు బిసి ఎజెండా ఎత్తుకోకుండా మనుగడ సాధించే పరిస్దితి లేదు. ఇంతా సిఎం. రేవంత్ రెడ్డి పుణ్యమే అని చెప్పాలి.
కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
నేటిధాత్రి చర్ల
చర్ల మండలం ఎంపీడీవో ఆఫీస్ పక్కన రైతు వేదిక వద్ద కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారి అధ్యక్షతన ముఖ్యఅతిథులుగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కళ్యాణ లక్ష్మి పధకం క్రింద పేద ఇంటి ఆడబిడ్డ పెళ్ళి చేసిన తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా ఏర్పాటు చేసిన ఈ పధకం ద్వారా చర్ల మండలంలో 18 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు రావడం జరిగింది సంబంధితులకు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి భద్రాచలం నియోజకవర్గం టిపిసిసి ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీమలమర్రి మురళి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలిన లంక రాజు ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ పరుచూరి రవిబాబు గుండెపూడి భాస్కర్ రావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజా ప్రతినిధులు యూత్ కాంగ్రెస్ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
ఝరాసంగం అక్రమంగా గంజాయి సాగు కేసులో నిందితురాలికి ఐదేళ్లు జైలు శిక్షతో పాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ సంగారెడ్డి జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి కె. జయంతి మంగళవారం తీర్పు వెల్లడించినట్లు జహీరాబాద్ ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం ఝరాసంగం మండల పరిధిలోని జూనేగావ్ (ఇస్లాంపూర్) గ్రామానికి చెందిన బోయిని సావిత్రమ్మ అనే మహిళ తన వ్యవసాయ పొలంలో 2020లో అక్రమంగా 175 గంజాయి మొక్కలను సాగు చేస్తూ ఎక్సైజ్ పోలీసు లకు పట్టుబడింది. ఈ మేరకు ఎక్సైజ్ పోలీసులు ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసుకొని రిమాండ్ కు తరలించారు. అనంతరం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి పీపీ టి. రాజేశ్వర్ తన వాదనలు బలంగా వినిపించడంతో, నేరం రుజువుకావడంతో నిందితురాలికి శిక్ష ఖరారు చేస్తూ అదనపు జడ్జి తీర్పు ఇచ్చారు. ఎవరైనా అక్రమంగా గంజాయి సాగు చేసిన, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ ఈ సందర్భంగా హెచ్చరించారు.
అమ్మ పాలు అమృతంతో సమానం బిడ్డకు తల్లిపాలే మొదటి టీకా *తల్లిపాల వారోత్సవంలో..తహసిల్దార్ జాలీ సునీతా
మొగులపల్లి నేటి ధాత్రి బిడ్డకు తల్లిపాలే మొదటి టీకా అని, జీవితాంతం బిడ్డను పలు వ్యాధుల నుంచి తల్లిపాలు రక్షిస్తాయని మొగుళ్ళపల్లి తహసిల్దార్ జాలీ సునీతా రెడ్డి చెప్పారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా..మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు రజిత, వెన్నెల, శ్రీమత, సప్న , ఆశా వర్కర్లు సుమలత, స్వప్న మరియు తల్లులతో కలిసి తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి మండల తహసీల్దార్ జాలీ సునీతా రెడ్డి వారిని ఉద్దేశించి మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలు మనదేశంలో పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు తాగుతున్న పసికందులు కేవలం 4 శాతం మాత్రమేనని ఇదే పొరుగున్న బంగ్లాదేశ్లో 92 శాతం అని గుర్తు చేశారు. ప్రపంచంలో తల్లిపాలకు ప్రత్యామ్నాయం లేదని, తల్లిపాలు అత్యంత విశిష్టమైనవన్నారు. బిడ్డకు తల్లిపాలు పడితే అటు బిడ్డ, ఇటు తల్లి, అనేక వ్యాధుల నుంచి విముక్తులవుతారని చెప్పారు. బిడ్డ పుట్టిన మొదటి గంటలో తల్లి నుంచి వచ్చే మురుపాల అమృతంతో సమానమని, బిడ్డను భవిష్యత్తులో షుగర్, అధిక బరువు, ఆస్తమా, వంటి రోగాల నుంచి కాపాడుతాయన్నారు. తల్లిపాలు బిడ్డ ఎంత ఎక్కువ కాలం తాగితే అంత బాగా తెలివితేటలు వృద్ధి చెందుతాయని వివరించారు, తల్లిపాలు ముద్దు..డబ్బా పాలు వద్దు అని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర బీసీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యమిద్దాం
బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్
కరీంనగర్, నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశ రాజధాని ఢిల్లీలో బీసీల డిమాండ్లపై ధర్నాలు ఆందోళనలు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండడం పట్ల తెలంగాణ బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బుచ్చన్న యాదవ్ ఒక ప్రకటనలో బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలలో విద్యా, ఉద్యోగ రంగాలలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ నలబై రెండు శాతం రిజర్వేషన్ ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్ కు పంపించి నెలలు గడిచిన దానిపై నేటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం చూస్తుంటే బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎంత కపట ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు. నేను బీసీ ప్రధానమంత్రిని అని చెప్పుకునే మోడీకి బీసీ డిమాండ్లు పట్టవా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలోని బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో బీసీ బిల్లుకు మద్దతు పలికి కేంద్రంలో దానిని వ్యతిరేకంగా వ్యవహరించడం బిజెపి ప్రభుత్వ ద్వంద వైఖరికి నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని ప్రగల్బాలు పలికిన బిజెపి నేతలు స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్రం నుండి కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు మిగతా ఎంపీలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వాన్ని, ఎంపీలను ఒప్పించి రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించాలని లేకుంటే బీసీ ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల పేదల కోసం అంటూ 13వ రాజ్యాంగ సవరణ చేసి పది శాతం రిజర్వేషన్లు పార్లమెంటులో బిల్లు పెట్టి అమలు చేసిందని కానీ బీసీల పట్ల మెతక వైఖరి వహించడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి బీసీలకు రిజర్వేషన్లు వెంటనే కల్పించాలని లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వంపై బీసీలంతా ఐక్యంగా ఉండి ప్రజా ఉద్యమాలు చేస్తామని కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ హెచ్చరించారు.
బోర్ మోటార్ ని ప్రారంభం చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ సర్పంచ్ మేకల ప్రభాకర్ యాదవ్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కోరటపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీ, ముదిరాజ్ కాలనీలలో చేతి పంపులు పని చేయక తాగునీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్న సమస్యను గుర్తుంచి వెంటనే స్పందించి తన స్వంత ఖర్చులతో బోర్ మోటార్ ఫిట్ చేపించి ఇబ్బందిని తీర్చిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ సర్పంచ్ మేకల ప్రభాకర్ యాదవ్. ఈసందర్భంగా గ్రామ ప్రజలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో యువ మోర్చా మండల అధ్యక్షులు దురుశెట్టి రమేష్, బూత్ అధ్యక్షులు ఉప్పు తిరుపతి, మేకల అభిషేక్, దుర్శేట్టి అంజి, కనుకం మల్లయ్య, రాజయ్య, పోచయ్య, గణేష్, శ్రీకాంత్, గ్రామ ప్రజలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని జహీరాబాద్ గ్రామీణ ఎస్సై ఏం కాశీనాథ్ యాదవ్ అన్నారు. బుధవారం జహీరాబాద్ మండల పరిధిలోని హోతి-కే లో గల తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల,కళాశాలలో ప్రిన్సిపల్ ఎ. సురేఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ… సైబర్ నేరాలపై ప్రతీ ఒక్కరు అవగాహన కల్గి ఉండాలని, అపరిచితుల నుంచి ఎస్ఎంఎస్,ఈమెయిల్,వాట్సప్ ద్వారా వచ్చే బ్లూ కలర్ లింక్ను క్లిక్ చేస్తే,మీ మొబైల్లోని డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పోతుందని, గుడ్ టచ్,”బ్యాడ్ టచ్, స్వీయ రక్షణ, బాల్య వివాహాలు, తెలియని వయసులో ప్రేమ, ఆకర్షణ, సోషల్ మీడియాలో పరిచయాలు, ఆన్లైన్ వేధింపులు, ప్రేమ పేరుతో వలవేసి చేసే ఆర్థిక, శారీరక, మానసికంగా ఇబ్బందులు, మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్, మరియు చట్టాలపై కూడా విద్యార్థినులకు అవగాహన కల్పించారు.డిజిటల్ అరెస్టులంటూ ఎవరైనా ఫోన్ ద్వారా బెదిరిస్తే ఎలాంటి ప్రలోభాలకు, భయాలకు గురికాకుండా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 కు కాల్ చేయాలన్నారు. అవగాహన తోనే సైబర్ నేరాల బారిన పడకుండా ఉండగలమని, కావున ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అవగాహన ఏర్పరచుకొని సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏటిపి జి. రాజ్యలక్ష్మి, పాఠశాల కళాశాల,ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారని ప్రిన్సిపల్ తెలిపారు.
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని సిఐగా పని చేస్తున్న రామచందర్రావును బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కరీంనగర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గా రాంచందర్రావు నియమిస్తూ మల్టీ జోన్ వన్ ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు కరీంనగర్ వన్ టౌన్ లో పనిచేస్తున్న బిల్లా కోటేశ్వర్ ను ఐ జి పి కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు
మండలంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలోని భూ భారతి రెవెన్యూ చట్టానికి సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు. అనంతరం తాసిల్దార్ రాజ్ కుమార్ ను మండల వ్యాప్తంగా వచ్చిన ఫైళ్ళ వివరాలు అడిగి తెలుసుకుని రెండు రోజులలో భూ సమస్యల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులతో సిబ్బంది వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత దరఖాస్తులను ఎప్పటికప్పుడు కలెక్టర్ కార్యాలయానికి చేరవేయాలని అన్నారు. ఏమాత్రం అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని సిబ్బంది టీములుగా విడిపోయి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎప్పటికప్పుడు నివేదికను పంపించాలని అన్నారు.
నెక్కొండ సర్వేయర్ పై ఆగ్రహం
మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించిన వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి నెక్కొండ సర్వేయర్ కుశాల్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేయర్ భూభారతి దరఖాస్తులపై వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించక రెవెన్యూ కార్యాలయంలో ఏం చేస్తున్నావ్ అంటూ చురకలంటించారు. ఎక్కువ శాతం భూ సమస్యలు సర్వేయర్లు వెళ్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, వరంగల్ ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, నర్సంపేట డి ఏ ఓ శ్రీనివాస్, వరంగల్ డీఏవో ఫణి కుమార్, రెవెన్యూ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
ఘనంగా టీజీఈ చైర్మన్,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ జన్మదిన వేడుకలు
మంచిర్యాల,నేటి ధాత్రి:
టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా టిజిఈ జేఏసీ చైర్మన్,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ జన్మదిన వేడుకలు మంచిర్యాల టీఎన్జీవో కార్యాలయంలో బుధవారం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి ఉద్యోగుల సమస్యలు సాధించడానికి ఉద్యోగులందరూ టిజిఇ జేఏసీ చైర్మన్,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ కి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్నం మల్లయ్య,అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాబురావు, ఉపాధ్యక్షులు కేజియా రాణి,రామ్ కుమార్ సంయుక్త కార్యదర్శి,రవి కిరణ్ మంచిర్యాల యూనిటీ అధ్యక్షులు,నాగుల గోపాల్ బెల్లంపల్లి యూనిటీ అధ్యక్షులు,వెంకటేష్ సభ్యులు రోశయ్య తదితరులు పాల్గొన్నారు.
రామాయంపేట పట్టణంలోని పాత పెట్రోల్ బంక్ సమీపంలో ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ సంస్థ కొత్త బ్రాంచ్‌ను జోనల్ హెడ్ శ్రీ గంధం కృష్ణ కుమార్ ప్రారంభించి జ్యోతి వెలిగించి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ సంస్థ 1887లో తిరువనంతపురం, కేరళలో స్థాపించబడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3600కు పైగా బ్రాంచులతో విస్తరించింది. ఈ బ్రాంచ్‌లు హైదరాబాద్ జోన్‌లోకి వస్తాయి” అని తెలిపారు.
తక్కువ డాక్యుమెంటేషన్‌తో గోల్డ్ లోన్స్, టూ వీలర్ లోన్స్, బిజినెస్ లోన్స్, చిన్న వ్యాపారుల అభివృద్ధికి రుణ సదుపాయాలు. మనీ ట్రాన్స్ఫర్ సర్వీసులు, బీమా ఉత్పత్తులు (జీవ, ఆరోగ్య, జనరల్) ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ సేవలు, బిల్లు పేమెంట్లు, మొబైల్ రీఛార్జీలు, ఇతర డిజిటల్ సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ శ్రీపద్ శాస్త్రి, ఏరియా మేనేజర్ అమర్నాథ్, బ్రాంచ్ మేనేజర్ శేఖర్ రెడ్డి, నందిని, వనిత, శ్రీకాంత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
కథలాపూర్ మండలంలోని దులూరు గ్రామంలో బుధవారం రోజున రజక సంఘ నూతన భవన నిర్మాణానికి సంఘ సభ్యులు భూమిపూజ చేసారు.రజక సంఘానికి పార్లమెంట్ సభ్యులు MP లాడ్స్ నుండి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు 3 లక్షల రూపాయలు మంజూరు చేసారని తెలిపారు ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, సహకారాన్ని అందించిన వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చెన్నమనేని వికాస్ రావు లకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్యాల మారుతి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు రాచమడుగు వెంకటేశ్వర్రావు,నరెడ్ల రవి,కాసోజీ ప్రతాప్,లక్ష్మి నర్సయ్య,రాజేష్,జెలందర్,మీన్ రెడ్డి, రాజారెడ్డి,వెంకటేష్,శ్రీమాన్,శ్రీకాంత్, రాజు,గంగారాం పాల్గొన్నారు.
*ఏపీఎంఎఫ్ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి పోరాటం ఫలితం..
*త్వరలోనే రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు..
*జర్నలిస్టుల అక్రిడేషన్ మంజూరుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం..
*సీఎం నారా చంద్రబాబు నాయుడు కు ధన్యవాదాలు తెలిపిన ఢిల్లీ బాబు రెడ్డి..
తిరుపతి(నేటి ధాత్రి) ఆగస్టు 05:
రాష్ట్రంలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ త్వరలోనే కొత్త అక్రిడేషన్ కార్డులు ఇస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తయిందని త్వరలోనే కొత్త అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి జర్నలిస్టుల అక్రిడేషన్ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పలు సందర్భాల్లో చర్చించారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని అక్రిడేషన్ త్వరగా మంజూరు చేయాలని పలుమార్లు ముఖ్యమంత్రికి వినతి పత్రాలు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల డిమాండ్స్ డే జరిగింది. ఈ సందర్భంగా విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి పార్థసారధిని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి పలువురు జర్నలిస్టులు మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ తమ ప్రభుత్వం జర్నలిస్టుల విషయంలో పూర్తి సానుకూలతతో ఉందని, జర్నలిస్టుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూల దృక్పథంతో ఉన్నారని అన్నారు. జర్నలిస్టుల జర్నలిస్టుల సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల విషయ క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.గత ప్రభుత్వం ఇచ్చిన అక్రిడేషన్లను ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చిందన్నారుఅర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, విశ్రాంతి జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని ,ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతి పత్రం వినతి సమర్పించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ పోరాట ఫలితంతో రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలపడంతో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి హర్షం వ్యక్తం చేశారు..
ఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన గౌరవ ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన మహనీయులు ఆచార్య జయశంకర్ గారి జయంతి సందర్భంగా శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు క్యాంపు కార్యాలయంలో ప్రో. జయశంకర్ సార్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన జీవితాంతం తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసిన మహోన్నత ఉద్యమ శిఖరం, తెలంగాణ సిద్ధాంతకర్త అని అన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,తులసి దాస్ ,మాజి సర్పంచ్ లు చిన్న రెడ్డి ,ఓంకార్ ,నాయకులు మోహన్,శ్రీనివాస్ , ఫయాజ్ ,అశోక్ రెడ్డి ,శేఖర్,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
స్వరాష్టం కోసం ప్రజలు కన్నా కలలను నిజం చేసిన మహనీయుడు
బి ఆర్ ఎస్ మాజీ ఎంపీటీసీ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి
ముత్తారం :- నేటిధాత్రి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పరితపించి,తన జీవితాన్నే త్యాగం చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు ముత్తారం లో ఘనంగా నిర్వహించారు సందర్భంగా మాజీ ఎంపీటీసీ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ జాతిపిత జయశంకర్ ను రాష్ట్ర ప్రజలు ఎప్పటికి గుర్తుపెట్టుకుంటారు రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేశారు కోట్లాది మంది ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపి ప్రజలను రగిలించారు ప్రత్యేక రాష్ట్ర సాధనలో కేసిఆర్ తో కలిసి అయన చేసిన సూచనలు సలహాలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకాలు అని అన్నారు తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషిచేసారు యావత్ జీవితాన్ని ఉద్యమానికి దారపోశారాణి అన్నారు ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ లు జక్కుల ముత్తయ్య అత్తె చంద్ర మౌళి వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్ రావు సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు మాజీ సర్పంచ్ నూనే కుమార్ పి ఏ సి ఎస్ మాజీ చైర్మన్ గుజ్జుల రాజి రెడ్డి బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.