దుర్గమ్మ తల్లి పండుగ సందర్భంగా గూగుల్ శంకర్ .!

దుర్గమ్మ తల్లి తిరుగు పండుగ ఉత్సవం సందర్భంగా మాజీ కౌన్సిలర్ గూగుల్ శంకర్ నివాసంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సందడి

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి :

 

 

తొర్రూర్ డివిజన్ పరిధిలోని టీక్యా తండా , ఎర్రసోమ్లా తండా లో మాజీ కౌన్సిలర్ గూగుల్ శంకర్ నివాసంలో బిఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, వద్దిరాజు రవిచంద్ర సందడి చేశారు.
గ్రామీణ ప్రాంతంలో గిరిజనులు ఎంతో ఉత్సాహంగా, సాంప్రదాయమైన పద్ధతులల్లో జరుపుకొనే ఈలాంటి పండుగలు మనుషుల మధ్య మానవ సంబంధాన్ని, ఆచార సాంప్రదాయాన్ని ప్రేమను పంచే విలువైన పండుగలుగా వర్ణించారు. గిరిజన మిత్రుడు శంకర్ నివాసంలో పండుగ సంబరాలు పాల్గొనడం ఎంతో ఆనందంగా అందని తెలియజేశారు.

 

Celebrations

ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ తోరూర్ మండల పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, మాజీ జడ్పిటిసి & మహబూబాబాద్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ మంగళ పెల్లి శ్రీనివాస్, పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు రామిని శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నలవాస ప్రమోద్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్ , మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్స్ ఎన్నమ నేని శ్రీనివాసరావు, నాయకులు కర్నే నాగరాజు, పేర్ల జంపా సింగిల్ విండో డైరెక్టర్ జనార్దన్ రాజు , మాజీ సర్పంచ్ విజయకుమార్ నాయకులు, గుంజి రవి యాకూబ్, బానోత్ అశోక్ తండావాసులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

దుర్గమ్మ తల్లి తిరుగు పండుగ ఉత్సవం.!

దుర్గమ్మ తల్లి తిరుగు పండుగ ఉత్సవం సందర్భంగా మాజీ కౌన్సిలర్ గూగుల్ శంకర్ నివాసంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సందడి

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి:

తొర్రూర్ డివిజన్ పరిధిలోని టీక్యా తండా , ఎర్రసోమ్లా తండా లో మాజీ కౌన్సిలర్ గూగుల్ శంకర్ నివాసంలో బిఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, వద్దిరాజు రవిచంద్ర సందడి చేశారు.
గ్రామీణ ప్రాంతంలో గిరిజనులు ఎంతో ఉత్సాహంగా, సాంప్రదాయమైన పద్ధతులల్లో జరుపుకొనే ఈలాంటి పండుగలు మనుషుల మధ్య మానవ సంబంధాన్ని, ఆచార సాంప్రదాయాన్ని ప్రేమను పంచే విలువైన పండుగలుగా వర్ణించారు. గిరిజన మిత్రుడు శంకర్ నివాసంలో పండుగ సంబరాలు పాల్గొనడం ఎంతో ఆనందంగా అందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ తోరూర్ మండల పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, మాజీ జడ్పిటిసి & మహబూబాబాద్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ మంగళ పెల్లి శ్రీనివాస్, పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు రామిని శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నలవాస ప్రమోద్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్ , మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్స్ ఎన్నమ నేని శ్రీనివాసరావు, నాయకులు కర్నే నాగరాజు, పేర్ల జంపా సింగిల్ విండో డైరెక్టర్ జనార్దన్ రాజు , మాజీ సర్పంచ్ విజయకుమార్ నాయకులు, గుంజి రవి యాకూబ్, బానోత్ అశోక్ తండావాసులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

44 కార్మిక చట్టాలను అమలు చేయాలి AITUC డిమాండ్. !

4.లేబర్ కోడ్లను రద్దుచేసి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలి AITUC డిమాండ్…………………

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి :

 

 

అంగన్వాడి టీచర్స్ & హెల్పర్స్ అసోసియేషన్ AITUC ఆధ్వర్యంలో మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలోని ICDS అధికారి మజార్ గారికి సమ్మె నోటీసు ఇచ్చి అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు చీర లక్ష్మీ నరసమ్మ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు సాధించుకున్న చట్టాల గురించి ఆలోచించకుండా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించడం ఎంతవరకు సరి అయిందన్నారు 44 కార్మిక. చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా చేయాలని చూసి ఆలోచనను విరమించుకోవాలన్నారు అంగన్వాడి, ఆశ, మధ్యాహ్న భోజనం కార్మికులంతా కేంద్ర ప్రభుత్వ స్కీం వర్కర్స్ లక్షలాదిమంది శ్రమదోపిడికి గురవుతూ అతి తక్కువ వేతనాలతో ఎక్కువ పని గంటలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ప్రయత్నిస్తుంటే మా యొక్క హక్కులను కాలరాయటం బిజెపి ప్రభుత్వానికి ముఖ్యంగా నరేంద్ర మోడీకి తగునా అన్నారు మే 20 తారీకు నాడు చేపట్టినటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు కార్మికులంతా అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు………….. కార్యక్రమంలో. రేషపల్లి నవీన్. బందు మహేందర్. డప్పు శీను తదితరులు పాల్గొన్నారు

దోపిడి పాలకులకు వామపక్ష ఐక్యతే ఏకైక మార్గం.

దోపిడి పాలకులకు వామపక్ష ఐక్యతే ఏకైక మార్గం

ఓంకార్ పీడిత ప్రజల మహాశక్తి

ఎంసిపిఐ(యు)జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్

ఓంకార్ శత జయంతి వార్షికోత్సవ ప్రారంభ సభలో పాల్గొన్న వామపక్ష సామాజిక రాష్ట్ర నేతలు

వరంగల్ జిల్లా ప్రతినిధి  నేటిధాత్రి:

దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలకు మతోన్మాద దోపిడీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం వామపక్ష సామాజిక శక్తుల ఐక్య ఉద్యమాలు అని ఎంసిపిఐ యు జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్ అన్నారు. కమ్యూనిస్టుల ఐక్యతకు అమరజీవి మద్ది కాయల ఓంకార్ కలలు కన్నాడని అది నిజం చేయడం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, అసెంబ్లీ టైగర్ ఎంసిపిఐ యు వ్యవస్థాపకులు,అమరజీవి మద్ది కాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ ప్రారంభ సభ కామ్రేడ్ గోనె కుమారస్వామి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన అశోక్ ఓంకార్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు, ప్రజాకవి జయరాజు, సినీ డైరెక్టర్ బాబ్జి, సిపిఐ ఎంఎల్ యు డెమోక్రసీ అధికార ప్రతినిధి చలపతిరావు, బిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాష్, మురహరి తదితరులు మాట్లాడుతూ అమరజీవి ఓంకార్ త్యాగాలు ఆదర్శాలు ప్రతి కమ్యూనిస్టు ఉనికిబుచ్చుకొని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆ దిశలో బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందని అందరికీ చెందాల్సిన సంపదను పెట్టుబడిదారులకు కట్ట పెడుతున్నారని ప్రజా ఉద్యమాలనుంచి వేస్తున్నారని భద్రత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మతం అంట కడుతున్నారని ప్రజలకు కనీస అవసరాలు సమకూర్చడంలో కనీస చిత్తశుద్ధి ప్రదర్శించని పాలకులు పోరాడే వారిపై మాత్రం అణిచివేత చర్యలకు పాల్పడుతున్నారని ఇలాంటి పరిస్థితుల్లో ఓంకార్ గారి స్ఫూర్తితో ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి పోరాటాలను నిలబెట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, పోలి బ్యూరో సభ్యులు కాటం నాగభూషణం, వల్లె పుపేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు వనం సుధాకర్, జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, యువ రచయిత యోజన,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ రెడ్డి అంశారెడ్డి, మస్తుల మట్టయ్య, వరికుప్పల వెంకన్న,మంద రవి,కుంభం సుకన్య, తుకారాం నాయక్, లింగంపల్లి శ్రీనివాసరెడ్డి,వర్ణం వెంకటరెడ్డి, సోమిడి శ్రీనివాస్ లతోపాటు ఐక్య ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కన్నం వెంకన్న బృందం ఇతర కళాకారులు ఆటపాట అలరించాయి.ముందుగా వరంగల్ వ్యాప్తంగా ఎర్రజెండాలు,ప్రభబండ్లు,కోలాటాలు,ప్రజా నాట్యమండలి డప్పు చప్పుళ్ళతో వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై
భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.మహిళల కోలాట నృత్యాలు,విప్లవ పాటలు ఎంతగానో అలరించారు.

నర్సింగ్ హోమ్ ను తనిఖీ చేసిన వైద్యాధికారులు .

నర్సింగ్ హోమ్ ను తనిఖీ చేసిన వైద్యాధికారులు

నిజాంపేట, నేటి ధాత్రి :

 

 

మెదక్ జిల్లా నిజాంపేట
మండల కేంద్రంలోని శ్రీనివాస నర్సింగ్ హోమ్ ను జిల్లా వైద్యాధికారులు మంగళవారం తనిఖీలు చేశారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ సుజన మాట్లాడుతూ నిజాంపేట శ్రీనివాస నర్సింగ్ హోమ్ పై వచ్చిన ఫిర్యాదు మేరకు తనికి చేయడం జరిగిందని అన్నారు. అందులో భాగంగానే అన్ని రిపోర్టులను సేకరించి డిఎంహెచ్వో కు పంపించడం జరుగుతుందని తదుపరి విచారణ చేపట్టిన తర్వాత తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ అనిల్, డాక్టర్ హరిప్రియ, డెమో శ్రీనివాస్, సూపర్వైజర్లు వెంకటేశ్వరరావు, కొండయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు.

దోపిడి పాలకులకు వామపక్ష ఐక్యతే ఏకైక మార్గం .

దోపిడి పాలకులకు వామపక్ష ఐక్యతే ఏకైక మార్గం

ఓంకార్ పీడిత ప్రజల మహాశక్తి

ఎంసిపిఐ(యు)జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్

ఓంకార్ శత జయంతి వార్షికోత్సవ ప్రారంభ సభలో పాల్గొన్న వామపక్ష సామాజిక రాష్ట్ర నేతలు

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్ర :

 

 

దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలకు మతోన్మాద దోపిడీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం వామపక్ష సామాజిక శక్తుల ఐక్య ఉద్యమాలు అని ఎంసిపిఐ యు జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్ అన్నారు. . వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, అసెంబ్లీ టైగర్ ఎంసిపిఐ యు వ్యవస్థాపకులు,అమరజీవి మద్ది కాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ ప్రారంభ సభ కామ్రేడ్ గోనె కుమారస్వామి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన అశోక్ ఓంకార్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు, ప్రజాకవి జయరాజు, సినీ డైరెక్టర్ బాబ్జి, సిపిఐ ఎంఎల్ యు డెమోక్రసీ అధికార ప్రతినిధి చలపతిరావు, బిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాష్, మురహరి తదితరులు మాట్లాడుతూ అమరజీవి ఓంకార్ త్యాగాలు ఆదర్శాలు ప్రతి కమ్యూనిస్టు ఉనికిబుచ్చుకొని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆ దిశలో బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 

plundering rulers

ప్రజా సమస్యల పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందని అందరికీ చెందాల్సిన సంపదను పెట్టుబడిదారులకు కట్ట పెడుతున్నారని ప్రజా ఉద్యమాలనుంచి వేస్తున్నారని భద్రత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మతం అంట కడుతున్నారని ప్రజలకు కనీస అవసరాలు సమకూర్చడంలో కనీస చిత్తశుద్ధి ప్రదర్శించని పాలకులు పోరాడే వారిపై మాత్రం అణిచివేత చర్యలకు పాల్పడుతున్నారని ఇలాంటి పరిస్థితుల్లో ఓంకార్ గారి స్ఫూర్తితో ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి పోరాటాలను నిలబెట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, పోలి బ్యూరో సభ్యులు కాటం నాగభూషణం, వల్లె పుపేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు వనం సుధాకర్, జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, యువ రచయిత యోజన,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ రెడ్డి అంశారెడ్డి, మస్తుల మట్టయ్య, వరికుప్పల వెంకన్న,మంద రవి,కుంభం సుకన్య, తుకారాం నాయక్, లింగంపల్లి శ్రీనివాసరెడ్డి,వర్ణం వెంకటరెడ్డి, సోమిడి శ్రీనివాస్ లతోపాటు ఐక్య ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కన్నం వెంకన్న బృందం ఇతర కళాకారులు ఆటపాట అలరించాయి.ముందుగా వరంగల్ వ్యాప్తంగా ఎర్రజెండాలు,ప్రభబండ్లు,కోలాటాలు,ప్రజా నాట్యమండలి డప్పు చప్పుళ్ళతో వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై
భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.మహిళల కోలాట నృత్యాలు,విప్లవ పాటలు ఎంతగానో అలరించారు.

ఆర్వెస్టర్ యజమానులతో ఎంఎఓ సమావేశం.

ఆర్వెస్టర్ యజమానులతో ఎంఎఓ సమావేశం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలోని రైతు వేదికలో. మొగుళ్ళపల్లి మండల ఆర్వెస్టర్ యాజమాన్యంతో. మండల వ్యవసాయ అధికారి సురేందర్ రెడ్డి, సమావేశం నిర్వహించారు. అనంతరం ఎంఎఓ మాట్లాడుతూ. వరి కోతలు కోసే సమయంలో ఆర్వెస్టర్ 18 ఆర్పిఎం పెట్టాలని తద్వారా వడ్లనుండి తాలు వేరుచేయబడి వడ్లు మాత్రమే బయటకు వస్తాయని ధాన్యం కోసేటప్పుడు 18 ఆర్పీ ఎం కంటే తక్కువ పెట్టడం వలన తాలు మట్టిపెల్లలు గడ్డి లాంటివి వస్తాయని అందువల్ల వరి ధాన్యం నాణ్యత ప్రామాణాలు దెబ్బతింటాయని. ధాన్యం అమ్మేటప్పుడు నాణ్యత ప్రామాణాలు ఉండకపోవడంతో రైతులు నష్టపోయే అవకాశం ఉందని. అందువల్ల వరి పైరు కోసేటప్పుడు హార్వెస్టర్ యాజమాన్యం తప్పనిసరిగా 18 ఆర్ పి ఎం ఉండేవిధంగా చూసుకోవాలని. దీనివల్ల రైతులు నష్టపోకుండా మేలు జరుగుతుందని. బ్లోయర్ నిర్ణిత పరిధిలో తిరుగునట్లు చూసుకోవాలని. అదేవిధంగా వరిపైరు 85% ఎండిన తర్వాతనే కోతలు కోయాలని పచ్చగా ఉన్న ధాన్యాన్ని కోయరాదని హార్వెస్టర్ యజమానులకు సూచించారు. ఈ సమావేశంలో మండలంలోని ఏఈవోలు, హార్వెస్టర్ యజమానులు పాల్గొన్నారు.

‘రైతులకు ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ’

‘రైతులకు ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ’

దేవరకద్ర /నేటి ధాత్రి :

 

 

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలంలోని జానంపేట గ్రామంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మంగళవారం అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్ మండలాలకు చెందిన 67 మంది రైతులకు నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉండి లో వోల్టేజీ సమస్యను తీర్చలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మార్లను అందజేస్తున్నమన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో ఏ ఒక్క రైతుకు లో వోల్టేజీ సమస్యతో బాధపడకుండా.. పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

అంగన్వాడి ను తనిఖీ చేసిన జిల్లా అధికారి హైమావతి.!

అంగన్వాడి సెంటర్ ను తనిఖీ చేసిన జిల్లా అధికారి హైమావతి

నిజాంపేట్, నేటి ధాత్రి :

 

 

నిజాంపేట మండలం పరిధిలోని చల్మెడ గ్రామంలో మంగళవారం రోజున జిల్లా వెల్ఫేర్ అధికారి హైమావతి చల్మెడ అంగన్వాడి 4 వ సెంటర్ ను సందర్శించడం జరిగింది. బరువు తక్కువ ఉన్న పిల్లలు(SAM), నామ మాత్రం బరువు తక్కువ ఉన్న పిల్లలు(MAM) పిల్లల బరువులు, ఎత్తు, చూడడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ లక్ష్మి, అంగన్వాడి టీచర్ లక్ష్మీనరసమ్మ, పిల్లల తల్లులు గర్భిణీలు పాల్గొన్నారు.

సరస్వతి పుష్కరాలకు బస్సుల ఏర్పాటు. !

సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు

రోజుకు 10 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి

పరకాల డిపో మేనేజర్ రవి చందర్

పరకాల నేటిధాత్రి :

 

ఈ నేల 15 నుండి 26 వరకు జరిగే సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడువు తున్నట్టు డిపో మేనేజర్ రవిచందర్ ఓ ప్రకతనలో తెలిపారు.రోజుకు 10 ప్రత్యేక బస్సులు పరకాల నుండి కాళేశ్వరంకు నడుపుతున్నట్టు తెలిపారు.ఈ పుత్యేక బస్సులకు చార్జీలు పరకాల నుండి కాళీశ్వరంకు పెద్దలకు 190రూపాయలు పిల్లలకు 110రూపాయలు గా నిర్ణయించినట్టు తెలిపారు.ఏదైనా వివరాలకు 9705479088,7382 926774 నంబర్లను సంప్రదించాలని,భక్తులందరు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

బిఆర్ఎస్ నాయకున్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.

బిఆర్ఎస్ నాయకున్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.

చిట్యాల నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం రామ్ నగర్ కు చెందిన బిఆర్ఎస్ మండల నాయకులు ఆరెపల్లి సమ్మయ్యను హైదరాబాద్ యశోద హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి మంగళవారం రోజు పరామర్శించి వైద్యులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు , వారి వెంట బి ఆర్ఎస్ మండల అద్యక్షులు అల్లం రవీందర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరు రాజిరెడ్డి గారు మండల నాయకులు పాండ్రాల వీరస్వామి పెరుమాండ్ల రవీందర్ గౌడ్  ఉన్నారు.

‘తడిసిన ధాన్యం.. ఇబ్బందుల్లో రైతులు’

‘తడిసిన ధాన్యం.. ఇబ్బందుల్లో రైతులు’ 

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని తిరుమలగిరి, చిన్నరేవల్లి, మోదంపల్లి, హేమాజీ పూర్ తదితర గ్రామాల్లో సోమవారం అర్ధరాత్రి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెద్దరేవల్లి రైతు వేదిక వద్ద ఈదురు గాలులకు ఆరబెట్టిన ధాన్యం స్వల్పంగా తడిసింది. ఈదురు గాలులకు కుప్పలపై కప్పిన టార్పలిన్లు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసిందని రైతులన్నారు. తాత్కాలికంగా నిర్మించిన టెంట్ సైతం కూలిపోయిందన్నారు.

గణపురం లో కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల.!

గణపురం లో కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల నిర్మాణ సన్నాహక సమావేశం

సంస్థాగత నిర్మాణం వైపు కాంగ్రెస్ అడుగులు
భూపాలపల్లి నియోజక వర్గం

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం లో ప్రతిపాదనల స్వీకరణ
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంస్థాగత నిర్మాణంలో భాగంగా, భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండల కేంద్రంలోని ప్రొ బెల్ స్కూల్ లో మండల అధ్యక్షులు రేపాక రాజేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంస్థాగత నిర్మాణం సమావేశానికి ముఖ్య అతిధులుగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా పరిశీలకులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి , మాసంపెల్లి లింగాజి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సమావేశంలో వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఈరోజు గణపురం మండల కేంద్రంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, మండల స్థాయి నుంచి పీసీసీ దాకా కార్యవర్గాలను ఏర్పాటు చేసేందుకు మండల కమిటీ అధ్యక్షుడు కి గ్రామ కమిటీ అధ్యక్షుడుకి ప్రతిపాదనలు పంపేందుకు, ఆసక్తి ఉన్న ముఖ్యనాయకులు, కార్యకర్తలు అందరూ సకాలంలో తమరి బయోడేటా, పాస్ ఫోటోతో ప్రతిపాదన సమర్పించాలని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ, అనుబంద సంస్థల, బ్లాక్ అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గోన్నారు.

చైతన్యం ద్వారానే అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ .

ప్రజల్లో చైతన్యం ద్వారానే అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ

అటవీ అభివృద్ధి సంస్థ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

ప్రజల్లో చైతన్యం,అవగాహన ద్వారానే అడవులు, ప్లాంటేషన్లలో అగ్ని ప్రమాదాల నివారణ పూర్తిగా సాధ్యమవుతుందని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీ ఎఫ్ డీసీ) మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ అన్నారు.అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం జైపూర్ మండలంలోని ముదిగుంట శివారులో ఉన్న నీలగిరి ప్లాంటేషన్ లో అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వేసవిలో ప్లాంటేషన్ లలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించినప్పుడు మంటలు ఎలా ఆర్పాలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

Forest fires

సంస్థ పరంగా బ్లోయర్ లతో మంటలు ఎలా నియంత్రిస్తారో వివరించడం జరిగింది. ప్లాంటేషన్లు,అటవీ ప్రాంతాల మీదుగా వెళ్లేవారు బీడీలు సిగరెట్లు తాగి నిర్లక్ష్యంగా పడేయవద్దని చెప్పారు. అడవులు,ప్లాంటేషన్లు కాలడం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందన్నారు.వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ తో పాటు కాగజ్ నగర్,బెల్లంపల్లి రేంజ్ ల ప్లాంటేషన్ మేనేజర్లు లక్ష్మణ్, సునీత,ఫీల్డ్ సూపర్వైజర్లు రాజేష్,శ్రీనివాస్,వాచర్లు, సిబ్బంది శంకర్,సాయికిరణ్, లచ్చన్న,రాకేష్,ఓదెలు, సంజీవ్ లు పాల్గొన్నారు.

పార్టీవ దేహానికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్.

పార్టీవ దేహానికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ (టిఎస్ఎస్ సిసిడిసి)మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

జి.శ్రీనివాస్ న్యాయవాది తండ్రి జి.అడివప్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించిన విషయం తెలిసి ఎస్సి కార్పొరేషన్ (టిఎస్ఎస్ సిసి డిసి) మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు. ఈ రోజు వారి ఇంటికి వెళ్లి పార్టీవ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు,నివాళులర్పించిన వారిలో చెంగల్ జైపాల్,దిలీప్,ఉన్నారు.

2వ రోజు ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం .!

ఘనంగా 2వ రోజు ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

నేటి ధాత్రి అయినవోలు :-

 

 

అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు గల నూతన ఎల్లమ్మ ఆలయం నందు శ్రీ ఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపన. కార్యక్రమంలో రెండవ రోజు ఎల్లమ్మ విగ్రహానికి, గణపతి విగ్రహానికి, సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలను ఊరేగించి జలాభిషేకం చేయడం జరిగింది. మరియు ప్రాతశాపాసన, వాస్తు పూజన, వాస్తు శాంతి, పర్యగ్నికరణ, లక్షణోద్ధారణ, జలాధివాసన, బింబశుద్ది, ధాన్యాధివాసన, కళానాహన, శాంతి హవన, పంచావరణ స్థాపన, తత్త్యత్రయ మూలమంత్ర హవన, నీరాజన, మన్త పుష్ప సమర్పణ, నిత్యబలిహరణ, తీర్ధప్రసాద వితరణ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వర్ రావు, ఉప ప్రధానార్చకులు పాతర్లపాటి రవీందర్ దేవాలయ నిర్మాణ దాత శ్రీ పర్ష సర్వేశ్వర్ రావు యాదవ్ కుటుంబ సభ్యులు ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్ అయినవోలు మధుకర్ శర్మ వేద పండితులు గట్టు పురుషోత్తం శర్మ విక్రాంత్ వినాయక్ జోషి, అర్చక సిబ్బంది పాల్గొన్నారు. కోమల్లపెల్లి సంపత్ కుమార్ రూత్విక బృందం ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది.

వనపర్తి నుండి పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపాలి .

వనపర్తి నుండి పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపాలి

డి ఎం కు వినతిపత్రం ఇచ్చిన ఐక్యవేదిక

వనపర్తి నేటిధాత్రి :

 

 

వనపర్తి బస్ డిపోలో బస్సుల సంఖ్య పెంచి వనపర్తి నుండి పుణ్యక్షేత్రలకు బస్ లను నడపాలని వనపర్తి జిల్లా
అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యర్య ములో వనపర్తి డి ఎం కు ఇచ్చామని ,అధ్యక్షుడు సతీష్ యాదవ్ ఒక ప్రకటన లో.విలేకరుకు తెలిపారు దూర ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాలకు వనపర్తి డి పో బస్ లు పుణ్యక్షేత్రాలైన యాదగిరిగుట్ట, మంత్రాలయం, శ్రీశైలం, తిరుపతి భద్రాచలం అరుణచలం వెంటనే బస్సులు నడపాలని వనపర్తి , మాజీ బిసి ఎమ్మెల్యేల గ్రామాలకు జయరాములు గ్రామం గుమ్మడం కు బాలకృష్ణయ్య గ్రామం చిట్యాల పెద్దమందడి మీదుగా మహబూబ్ నగర్ , హైదరాబాద్ కు బస్సులు నడుపాలని, పాత బస్టాండు నిర్మాణం చేయించి, ప్రయాణికులకు అందుబాటులో కి తీసుక రావాలని బస్ లు పో నీ మారుమూల గ్రామాలకు బస్సులు నడపాలని కోరారు స్క్రాప్ బస్సులో స్థానంలో 20 బస్సులు వచ్చాయని అవి సరిపోక మరో 25 బస్సులు డిపోకు అవసరమని వెంటనే తెప్పించాలని ఎమ్మెల్యే మేగారెడ్డి, కలెక్టర్ ని ఒక ప్రకటన లో కోరారు
సతీష్ యాదవ్, వెంట వెంకటేశ్వర్లు, తెలుగుదేశం కొత్త గొల్ల శంకర్ గౌనికాడి యాదయ్య, రాజ్ కుమార్, మన్యం నాయక్, రాము యాదవ్, శివకుమార్, పుట్టపాక బాలు తదితరులు ఉన్నారు

సార్వత్రిక సమ్మెకు మద్దత్తుగా గ్రామీణ బంద్ ను జయప్రదం.!

ఈ నెల 20 న సార్వత్రిక సమ్మెకు మద్దత్తుగా గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్

కరీంనగర్ నేటిధాత్రి:

దేశంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, వ్యవసాయ, రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 20 తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దత్తుగా గ్రామాల్లో వ్యవసాయ కూలీలు గ్రామీణ బంద్ నిర్వహించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల సమావేశం జరిగింది. ఈసందర్బంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ చాయ్ వాలా పేరుతో దేశంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా నిర్లక్ష్యం చేస్తూ, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ, హక్కులను హరిస్తున్నారని, నలబై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తెచ్చారని, ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ దేశ సంపదను అధాని, అంబానిలకు కట్టబేడుతున్నారని ఆరోపించారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పెద బడుగు బలహీన వర్గాలకు చేతి నిండా పని కల్పించాలనే లక్ష్యంతో యుపిఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అమలు చేసి కోట్లాది మంది కూలీలకు పని కల్పిస్తుంటే నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపులో కోత విధిస్తున్నారని, పని రోజులు తగ్గిస్తున్నారని, పని ప్రదేశాల్లో పనికి ముందు పనికి తర్వాత కూలీలను ఫోటో అప్లోడ్ చేసే విదానాన్ని తెచ్చారని అన్నారు. ఉపాధి కూలీలకు రెండు వందల రోజుల పని కల్పించాలని, రోజు వారి కూలీ ఆరు వందలు చెల్లించాలని, వేసవి భృతి యధావిధిగా కొనసాగించాలని, పని ప్రదేశాల్లో కొలుతలు లేకుండా పని కల్పించి బిల్లులు చెల్లించాలని, ఆధార్, జాబ్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనుసంధానం చేయడం ఆపాలనే, ఉపాధి కూలీలకు ఇన్స్యూరెన్స్ అవకాశం కల్పించాలని, ఉపాధి హామీ పథకం రద్దు చేసే కుట్రలను మానుకోవాలని కోరుతూ 20 వ తేదీన కూలీలు ఉపాధి హామీ పనులను బంద్ చేసి దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్ ను జయప్రదం చేయాలని సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. ఈసమావేశంలో బికెయంయు జిల్లా అధ్యక్షులు బోయిని అశోక్, ఏఐఏడబ్లుయు జిల్లా ఉపాధ్యక్షులు రాయికంటి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి సుంకరి సంపత్, నాయకులు నల్లగొండ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

మహోత్సవానికి ఉప్పల వెంకటేష్ ఆర్థిక సహాయం.!

ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఉప్పల వెంకటేష్ ఆర్థిక సహాయం.

కల్వకుర్తి/నేటి ధాత్రి :

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం, కల్వకుర్తి మున్సిపల్ పట్టణానికి చెందిన భగత్ సింగ్ తండాలోని నూతన దేవాలయంలోని విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, తెలంగాణ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ & ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ రూ.25 వేల ఆర్థిక సహకారం అందించారు. ఈనెల 16,17,18,19 తేదీలలో జరిగే బ్రహ్మోత్సవాలకు కూడా రావలసిందిగా ఉప్పల వెంకటేష్ ఆహ్వానం అందించిన భగత్ సింగ్ తండా ఆలయ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు.ఈ కార్యక్రమంలో ఉప్పల వెంకటేష్ సైన్యం & తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధమోని రమేష్ గౌడ్ ,భగత్ సింగ్ తండా నాయకులు రాజు నాయక్, బాలు నాయక్, హర్యా నాయక్, దేవేందర్ నాయక్, భాస్కర్ నాయక్, బోడు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

రైతులు తక్కువ పెట్టుబడితో లాభాలు పొందవచ్చు.!

ఫామ్ ఆయిల్ తోటలతో రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చు

రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిధాత్రి :

 

 

వనపర్తి మండలం అచ్యుతాపురం గ్రామములో రైతు బోయినీ.వాసు 4ఎకరాలతో సాగు చేస్తున్న ఫామ్ ఆయిల్ తోటను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు భవిష్యత్తు ప్రయోజనాల కోసం తాను మంత్రిగా ఉన్నప్పుడు ఫామ్ ఆయిల్ తోటలు పట్ల రైతులకు అవగాహన కల్పించి సాగు దిశగా ప్రోత్సహించామని నిరంజన్ రెడ్డి అన్నారు.ఫామ్ ఆయిల్ తోటల వల్ల రైతులు దీర్ఘకాల ఆదాయం లాబాలు పొందుతూ అదేవిధంగా అంతర్గత కొత్త రాకాల పంటల వేసుకొని జీవనోపాధి పొందవచ్చని అన్నారు.మార్కెట్లో ఫామ్ ఆయిల్ మంచి గిరాకీ ఉన్నదని భవిష్యత్తు మొత్తం ఫాం ఆయిల్ తోటలది మాజీ మంత్రి అన్నారు. పంట సాగు చేస్తున్న వాసుకు సూచనలు చేసి అభినందించారు. మాజీ మంత్రి
నిరంజన్ రెడ్డి వెంట మాజీ సర్పంచ్ శారద ఆశన్న నాయుడు, చిట్యాల.రాము,నరసింహ,బి.ఆర్.ఎస్ నాయకులు తదితరులు ఉన్నారని మీడియా ఇంచార్జి నందిమల్ల అశోక్ తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version