నిర్ణీత గడువులోగా దరఖాస్తులు పరిష్కరించాలి.

నిర్ణీత గడువులోగా దరఖాస్తులు పరిష్కరించాలి

ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి ):

 

 

ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రతి సోమవారం ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారులతో  కలెక్టర్ నేరుగా మాట్లాడి, వారి సమస్యలను సానుకూలంగా స్పందించారు. ప్రజావాణి ద్వారా వచ్చే అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దని అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం లో డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు , మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇప్పపువ్వు లడ్డుతో ఆరోగ్య ప్రయోజనాలు.

ఇప్పపువ్వు లడ్డుతో ఆరోగ్య ప్రయోజనాలు

గంగారం నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ . గంగారం మండలాల్లో సహజ సిద్ధంగా దొరికే ఇప్పపువ్వుతో
కొంతమంది ఆదివాసీ గిరిజనులు సేకరించి అందులో ఇప్పపువ్వు. బెల్లం. నువ్వులు. పల్లీలు. యాలకుల పొడి కలిపి లడ్డులుగా తయారు చేస్తున్నారు గంగారం మండలంలోని మహదేవుని గూడెం గ్రామం లో మద్దెల పద్మ కుటుంబ సభ్యులు ఇప్పపువ్వు లడ్డు తయారు చేసి విక్రయిస్తున్నారు
ఇప్ప పువ్వు లడ్డు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పపువ్వు లడ్డు తినడం వల్ల రక్తహీనత ఉన్న వారికి దాదాపు 45 రోజులలో శరీరంలో రక్తం శాతం పెంచడంతో పాటు రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుందని
ఇది జాయింట్ల నొప్పులు, మోకాలి నొప్పులు, కండరాల నొప్పులను తగ్గిస్తుంది.

Health benefits

అంతేకాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, చర్మ ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది మరియు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తుంది మహిళల్లో రక్తహీనత తగ్గిస్తుంది. కొలెస్ట్రాలను తగ్గించి రోగనిరోధక శక్తినీ పెంచుతుంది
ఇప్పటికీ కొంతమంది గిరిజనులు ఇప్పగింజలు ఏరి తీసుకువచ్చి నూనె తయారు చేసి వంటల్లో వాడుతున్నారు.. ప్రభుత్వం స్పందించి సంబంధిత యంత్రాలు ఇప్పించి ఆదివాసీ గిరిజన ప్రజలకు ఉపాధి కల్పించాలని పలువురు ప్రభుత్వం న్ని వేడుకుంటున్నారు….

సురేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ.!

కుర్మ సురేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ కుర్మ సురేందర్, పార్టీ నాయకులు కుర్మ సుగుణాకర్ ల యొక్క నాన్న కుర్మ రామయ్య ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను సోమవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని అందించారు.కుటుంబానికి అండగా ఉంటామని,అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు.పరామర్శ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, పలిగిరి కనకరాజు, పల్లె దినేష్, కనకం వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం .

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

రామడుగు, నేటిధాత్రి:

 

 

ఇరవై తోమ్మిది సం.ల క్రితం పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు ఒకే వేదికపై కలిసి చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995-96లో ఎస్ఎస్సి చదివిన విద్యార్థులు చదువుకున్న పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈకార్యక్రమానికి అప్పటి ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి, ఒకేషనల్ ఉపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి, రాంబ్రహ్మంలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించిన విద్యార్థులు వారిని ఘనంగా శాలువాతో సన్మానించి వారి నుండి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఈసందర్భంగా పూర్వ విద్యార్థులు తమ జీవనశైలిని, పాఠశాలలో చదువుకున్న జ్ఞాపకాలను, అనుభవాలను ఒక్కొక్కటిగా గురువుల ముందుంచారు. ఈకార్యక్రమంలో బొమ్మరవేణి తిరుపతి, ఆడెపు మనోజ్ కుమార్, శ్రీనివాస్, సంతోష్, మునిందర్, శ్వేతా, సుజాత, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి .

సిపిఐ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకండి

సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

గ్రామాల్లో సిపిఐ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి పిలుపునిచ్చారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట . గ్రామంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేష్ అధ్యక్షతన మండల మహాసభ జరిగింది. ఈమండల మహాసభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి వెంకటస్వామి హాజరై మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సిపిఐ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని, పార్టీ అభ్యర్థులుగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలని, అందులో భాగంగానే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కేంద్రంలో, రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న వారిని హామీలను అమలు పరుచాలని సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలని ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని కలిగించాలన్నారు. సిపిఐ పార్టీ ఆవిర్బవించి వంద సంవత్సరాలు అవుతుందని, మార్కిసిజం, లేనినిజం సిద్ధాంతాలతో సమ సమాజ స్థాపనే లక్ష్యంగా దోపిడీ లేని సమాజం కోసం అంతరాలు లేని వ్యవస్థ కోసం దేశంలోనే మొట్టమొదటి రాజకీయ పార్టీ సిపిఐ పార్టీ అని నాటి నుండి నేటి వరకు కార్మిక, కర్షకుల సమస్యలతో పాటు దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతూ హక్కుల సాధన కోసం, సమస్యల పరిష్కారం పోరాడుతున్న ఏకైక పార్టీ అని అన్నారు. దేశాన్ని పాలిస్తున్న నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి, ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి కేవలం కార్పొరేట్ బహుళజాతి సంస్థలకు సంపన్న వర్గాలకు అనూకూల నిర్ణయాలు చేస్తూ దేశ సంపదను కోళ్లగొడుతూ కాలయాపన చేస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఆలస్యం అవుతుందని, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, పెన్షన్స్ పెంపు, రైతుల ఋణమాఫీ తదితర హామీలను వెంటనే నేరవేర్చాలని లేకుంటే ప్రజా ఉద్యమాలు తప్పవని వెంకటస్వామి హెచ్చరించారు. ఈసమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి గోడిశాల తిరుపతి గౌడ్, ఉమ్మెంతుల రవీందర్ రెడ్డి, మండల నాయకులు ఎగుర్ల మల్లేశం, శంకరయ్య, లక్ష్మి, నర్సయ్య, ఐలయ్య, రాజేష్, అజీమ్, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ సమావేశం.!

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంలోని మీనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం రోజున మధ్యాహ్నం రెండున్నర గంటలకు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతింది అని. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మరియు రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి మరియు ఇతర రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారు.అని కావున మండలంలోని మాజీ ప్రజాప్రతినిధులు జడ్పిటిసిలు , ఎంపీపీలు , సర్పంచులు , ఎంపీటీసీలు , వార్డ్ మెంబర్స్ జిల్లాస్థాయి మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనార్టీ సెల్ విభాగ నాయకులు కార్యకర్తలు మండలంలోని బూత్ ఎన్రోలర్స్ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి కోరినారు.

గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.

గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.

హైదారాబాద్ నేటిధాత్రి:

రాష్ట్ర గవర్నర్ తో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌లో గవర్నర్ ను కలిసి రాష్ట్రంలో పరిస్థితులను వివరించారు.

మత్స్యగిరిస్వామి దేవాల యానికి బహు కరణ .!

మత్స్యగిరిస్వామి దేవాల యానికి జనరేటర్ బహు కరణ

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రంలో ని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయా నికి శాయంపేట గ్రామానికి చెందిన క్రీస్తు శేషులు మామిడి సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వారి కుమారులు మామిడి ప్రమోద్ త్రిశూల్ ,సాయి కృష్ణులు కలిసి సుమారు 35 వేల రూపాయల విలువ కలిగిన జనరేటర్ ను . సోమవారం దేవాలయ చైర్మన్ సామల బిక్షపతికి అందజేసి నారు ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్య లు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో దాసరి వేణు, కల్పన పాల్గొన్నారు.

లబ్ధిదారుల ఎంపికలో కమిటీల నిర్ణయం భేష్.

లబ్ధిదారుల ఎంపికలో కమిటీల నిర్ణయం భేష్.

అన్ని పేద అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపు.

కమిటీ ఎంపిక పై కక్షసాధింపు,కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం.

గతంలో డబుల్ బెడ్రమ్ ఇండ్లు కేటాయింపులో 50 వేలు తీసుకున్నారు,

డబల్ బెడ్ రూమ్, కలగా మిగిలిన వారికి ఇందిరమ్మ ఇల్లు అందించి చేయూత.

నెత్తిపై గూడు లేకున్నా గాంధీభవన్ పై కాంగ్రెస్ జెండా ఎగరడమే, లక్ష్యంగా సాగిన కాంగ్రెస్ వాది అర్హుడు కదా.

దుష్ప్రచారాల తో ల్యాండ్ ఆర్డర్ ను విఘాతం కలిగించే ప్రయత్నం.

మహాదేవపూర్ నేటి ధాత్రి:

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద బడుగు బలహీన వర్గాల కు సొంతింటి కల నెరవేర్చుటకు శ్రీకారం చుట్టి, స్థానిక వ్యక్తులచే కమిటీలుగా ఏర్పాటుచేసి వారి పర్యవేక్షణ తో, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నేడు కమిటీలు అందించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలు వారి నిర్ణయం శభాష్ అనిపించేలా అందించడం జరిగింది అని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని 24 గ్రామాల్లో ఇంద్రమ్మ ఇల్లు మంజూరు కావడం, ప్రభుత్వ అధికారులు ఇండ్ల మంజూరి కై నిష్పక్షంగా సర్వే నిర్వహించడం, అధికారులు సర్వే నిర్వహించిన అనంతరం వంద శాతం అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నియామక కమిటీ, అధికారుల జాబితా నుండి అర్హులకు ఎంపిక చేయడం తో లబ్ధిదారుల, ఆనందానికి అంతులేకుండా పోయింది. మండలంలో 321 ఇండ్లను మంజూరు చేయగా, ప్రభుత్వ ఆదేశాల అనుసారం గూడు లేని నిరుపేద కుటుంబానికి ఇంద్రమ్మ ఇల్లు అందించడమే లక్ష్యంగా ఇంటింటికి అధికారుల సర్వే, కుటుంబాల వివరాలు నేరుగా అధికారులు పరిశీలించి నమోదు చేయడం జరిగింది.తిరిగి ఇందిరమ్మ గృహాల మంజూరు కమిటీలు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ నిర్ణయం మండలంలోని అన్ని వర్గాలకు చెందిన అర్హులైన నిరుపేద కుటుంబానికి ఇంద్రమ్మ ఇల్లు అనర్హులకు చెందకుండా పటిష్టమైన విచారణ,విధి విధానాలతో, ముందుకు సాగడమే కమిటీ లక్ష్యంగా, అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇంటి కల త్వరలో ఆ పేద కుటుంబాలకు తీరనుంది.

కమిటీ ఎంపిక పై కక్షసాధింపు,కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం.

ఇందిరమ్మ సొంతింటి కల నిర్మాణంపై స్థానిక కమిటీల ఎంపిక 100% నిరుపేద గూడు లేని అర్హులకు కేటాయించడం జరిగిందని లబ్ధిదారులు చెప్తున్నప్పటికీ, నిరుపేద కుటుంబాల గూడును కొల్లగొట్టే ప్రయత్నంలో, కమిటీల పై కక్ష సాధింపు చర్యగా, దుష్ప్రచారాలు చేయడానికి లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో కమిటీల ఎంపిక అధికారుల జాబితాలోని అర్హులకు ఎంపిక చేయడం జరిగిందని, లబ్ధిదారులు చెప్తున్న క్రమంలో, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై, బురద జల్లి పబ్బం గడుపుకోవాలని కొందరు, లబ్ధిదారుల ఎంపికను తప్పుడు ప్రచారం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మండలంలో 321 ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు లబ్ధిదారుల ఎంపికై అధికారుల సర్వే ఆధారంగా,,ఇంద్రమ్మ ఇండ్ల కమేటి, నిష్పక్ష పర్యవేక్షణతో లబ్ధిదారుల పేర్లను అందించడం జరిగింది, గతంలో డబుల్ బెడ్ రూమ్ కేటాయింపులో పేరుతో 50వేల రూపాయలు తీసుకొని, అర్హులకు కాకుండా ధనవంతులకు కేటాయించడం జరిగిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల పర్యవేక్షణ ఇందిరమ్మ ఇండ్ల ఎంపికకు స్థానికుల కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన పేద కుటుంబాలకు ఇండ్ల మంజూరుకు ప్రతిపాదించడం జరిగిందని,కానీ స్వలాభాల కోసం నిరుపేద గూడు లేని కుటుంబాలకు ఇల్లు లేకుండా చేసే ప్రయత్నం జరగడంతో, లబ్ధిదారులు తమ ఇండ్లు ఏక్కడ కోలిపోతామని ఆవేదనతో, ప్రభుత్వం మరియు రాష్ట్ర మంత్రివర్యులు మేము పేద అర్హులము మాపై కరుణించాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు.

డబల్ బెడ్ రూమ్, కలగా మిగిలిన వారికి ఇందిరమ్మ ఇల్లు అందించి చేయూత.

పది సంవత్సరాలపాటు డబుల్ బెడ్ రూమ్ కొరకు తమ కండ్లు కాయలు కాసి వేల దరఖాస్తులను ఇవ్వడం జరిగింది కానీ, అర్హులుగా ఉన్న పేదలకు గూడు లేకుండా డబుల్ బెడ్ రూమ్ పేరుతో వేల రూపాయలు వసూలు చేసి ధనవంతులకు కేటాయించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో స్థానికుల పర్యవేక్షణలో అధికారులు అందించిన జాబితాల ఆధారంగా 100% అర్హులుగా ఉన్న లబ్ధిదారులను ఎంపిక చేసి డబుల్ బెడ్ రూమ్ కలగాలనే మిగిలిన, ఆ గూడు లేని కుటుంబాలకు ఇందిరమ్మ ఇంటి భరోసా కలిగించడం, సంవత్సరాల తరబడి జెండా వాననక పెంకుటిల్లు గుడిసెల్లో తమ పిల్లలతో జీవితాన్ని కొనసాగిస్తున్న మాకు, ఇందిరమ్మ ఇల్లు కేటాయించి ప్రభుత్వం ఆదుకోవడం, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని లబ్ధిదారులు చెప్తున్నారు.

తన నెత్తిపై గూడు లేకున్నా గాంధీభవన్ పై కాంగ్రెస్ జెండా లక్ష్యంగా సాగిన కాంగ్రెస్ వాది అర్హుడు కదా.

ఆ అర్హులు గూడు లేని నిరుపేదవారు, కూలి నాలి చేసుకోవడంతో పాటు కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు కూడా, మండలంలో లబ్ధిదారుల జాబితాలో నిరుపేద లబ్ధిదారులు అయినప్పటికీ, సుమారు 50 సంవత్సరాలుగా వ్యవసాయ కూలీతోపాటు కాంగ్రెస్ జెండా నెత్తిన మోయడం, తమకు ప్రభుత్వ పథకం అనర్హుడుగా చేస్తుందా, తమ ఇంటిపై పెంకలు లేకున్నా పరవాలేదు, వర్షాకాలం ప్లాస్టిక్ కవర్ లేకున్నా పరవాలేదు, కానీ తమ లక్ష్యం గాంధీభవన్ పై జెండా ఎగరడంతోపాటు తమ ఇంటి పైన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు జెండా సంవత్సరాల కాలం పాటు తగిలి ఉండాల్సిందే, అనే ఏకైక లక్ష్యంతో ఉన్న ఆ నిరుపేద కాంగ్రెస్ కార్యకర్త వంద శాతం అర్హుడే కదా, పేద వ్యవసాయ కూలీ మా కుటుంబాన్ని పోషిస్తుంది, కాంగ్రెస్ పార్టీ జెండా నా హృదయంలో ప్రాణం పోస్తుంది, అని పేద లబ్ధిదారులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండడం, తో వారి పేర్లు తలుచుకుంటూ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరి విషయంలో, విషపచారాలు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. ప్రజలు ఎవరైనా, ఏ పార్టీ అభిమాని అయిన ప్రభుత్వ పథకాలకు, పార్టీలను ప్రేమించే కార్యకర్తలకు పథకం వర్తించదని, రాజ్యాంగం లో ఏమైనా రాసి ఉందా, కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా, వ్యవహారించడం జరుగుతుందని, లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇండ్లు కేటాయిస్తే, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనే ఒక ఉద్దేశంతోనే, లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని పొంతన లేని మాటలతో దుష్ప్రచారాలు చేయడాన్ని లబ్ధిదారులు తీవ్రంగా ఖండిస్తున్నారు.

దుష్ప్రచారాల తో ల్యాండ్ ఆర్డర్ ను విఘాతం కలిగించే ప్రయత్నం.

మండలంలో ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు కమిటీల పర్యవేక్షణ అనంతరం లబ్ధిదారుల పేర్లు ఎంపిక చేసి లిస్టును అందించడం జరిగింది. లబ్ధిదారుల ఎంపిక విషయంపై, ప్రభుత్వ ఆదేశాల అనుసారం అర్హులుగా అధికారులు గుర్తించి తిరిగి ఇందిరమ్మ ఇండ్ల కమిటీల పర్యవేక్షణలో నిష్పక్షంగా ఎంపిక ప్రక్రియ జరిగినప్పటికీ, అమాయకులను రెచ్చగొట్టి, వారి పేర్లు నమోదు చేయలేదని, కమిటీలపై బురద జల్లుతూ, అమాయక ప్రజలను రెచ్చగొట్టి, మండలంలోని కమిటీ సభ్యులపై అసభ్యకర పదజాలాలతో, అవమానించేలా ప్రయత్నించడం, సమాచార సాంకేతిక మాధ్యమాల్లో మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, స్వలాభం కోసం అమాయకులను ప్రభుత్వ పథకం నుండి మిక్ కావాలని దూరం చేశారని రెచ్చగొడుతూ, దౌర్జన్యానికి దిగేలా ప్రోత్సహించడం, ల్యాండ్ అడర్ ను విఘాతం కలిగించే, విధంగా ప్రవర్తించడం జరుగుతుందని, లబ్ధిదారులు చెప్పుకొస్తున్నారు, జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ ఉన్నత అధికారులు, ఇలాంటి వారిపై దృష్టి సాధించి, శాంతి భద్రతకు భంగం కలగకుండా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని, మండల ప్రజలు అలాగే లబ్ధిదారులు కోరుతున్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత .

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

కొత్తగూడ,నేటిధాత్రి:

 

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి
చంద్రు తండా గ్రామానికి చెందిన బోడరాజు కుమారుడు శివగణేష్ ఇటీవల అనారోగ్యం తో ఆసుపత్రి పాలైనాడు. బోడ రాజు కుటుంబ పరిస్థితిని చూసిన ఓటాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు
ధనసరి అనసూయ సీతక్క తెలియజేయడం జరిగినది వెంటనే స్పందించిన మంత్రి సీతక్క గారు బోడరాజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంజూరు చేపించారు అట్టి చెక్కును సోమవారం రోజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య గారి ఆధ్వర్యంలో బోడరాజుకు అందివ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు చల్ల నారాయణరెడ్డి డిసిసి జనరల్ సెక్రెటరీ బానోత్ రూప్ సింగ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులుబీట్ల శ్రీను, ముస్కు వెంకన్న, వల్లెపు రంజిత్, ఇరుప కొమ్మయ్య. ఉపేంద్ర చారి. యాదగిరి కిరణ్. మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జెడ్పిహెచ్ఎస్ లో విద్యార్థుల కోసం వేసవి శిక్షణా .!

జెడ్పిహెచ్ఎస్ లో విద్యార్థుల కోసం వేసవి శిక్షణా శిబిరం ప్రారంభం.

మండల విద్యాధికారి కోడెపాక రఘుపతి.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

జడ్.పి.హెచ్.ఎస్ చిట్యాల పాఠశాల ఆవరణలో 6-9 తరగతుల విద్యార్థులను ఉద్దేశించి వేసవి శిక్షణా శిబిరాన్ని ఎంఈఓ కొడపాక రఘుపతి , సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. ఇందులో గ్రామంలో గ్రామం తో పాటు చుట్టుపక్కల గ్రామాల పిల్లలు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో విద్యార్థుల శారీరక, మానసిక,వికాసం కొరకు ఆటలు, పాటలు, బొమ్మలు గీయడం, యోగ, కథల పుస్తకాలు చదవడం మొదలగు వినోద కార్యక్రమాలు నేర్చుకోవడానికి ఈ శిక్షణా శిబిరం ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు,పోషక విలువలు కలిగిన స్నాక్స్ మరియు మంచినీటి సదుపాయం అందుబాటులో ఉంచామని వీటిని విద్యార్థిని విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతిరోజు విద్యార్థులందరూ ఉదయం8గం నుండి 11వరకు హాజరయ్యేలా చూడాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీరామ్ రఘుపతి, బొమ్మ రాజమౌళి , బుర్రసదయ్య గోపగాని భాస్కర్,సిఆర్పి రాజు, కనకం భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ కూలి మృతి.

ఉపాధి హామీ కూలి మృతి…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రాయిపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలి మహిళ గుండెపోటుతో మృతి చెందిందని తోటి ఉపాధి కూలీలు తెలిపారు. సోమవారం ఉదయం ఆమె ఉపాధి హామీ కూలి వెళ్లడంతో పని స్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గ్రామ శాఖ ఎన్నిక.

గ్రామ శాఖ ఎన్నిక….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండలంలోని కేటీఆర్ సేన గ్రామ శాఖ అధ్యక్షుడిగా బాల సాని వెంకటేష్ గౌడ్ ను నియమించారు. ఈ సందర్భంగా కేటీఆర్ సేన మండల అధ్యక్షులు భాస్కర్ గారు మాట్లాడుతూ గ్రామ గ్రామాన కేటీఆర్ సేన ను బలోపేతం చేస్తూ యువతలో చైతన్యాన్ని నింపే విధంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని నూతనంగా ఎన్నికైన కేటీఆర్ సేన గ్రామ శాఖ అధ్యక్షులు బాలసాని వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ అధికార పార్టీ చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టి గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయివరకు. B.R.S. పార్టీ చేసిన అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరోసారి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు నిరంతరం పనిచేస్తామన్నారు. అలాగే ఉపాధ్యక్షుడిగా బోనీ ఘన మహిపాల్ యాదవ్. ప్రధాన కార్యదర్శిగా చిట్యాల రాజశేఖర్. సోషల్ మీడియా ఇన్ఛార్జి బడ్క్.అజయ్ యాదవ్. కార్యదర్శిగా మిడిదొడ్డి శ్రీకాంత్. కోశాధికారిగా రేగుల నరేందర్ రెడ్డిని. నియమించడం జరిగిందని. ఇట్టి కార్యక్రమంలో B.R.S. గ్రామ శాఖ అధ్యక్షులు తుమ్మల కనకయ్య. సీనియర్ నాయకులు. కురుమ రాజయ్య. మాజీ సర్పంచ్ అట్లగట్ట భాస్కర్. తాజా మాజీ ఎంపీటీసీ కరికవేని . కుంటయ్య. సీనియర్ నాయకులు సవన పెళ్లి బాలయ్య. ఎం శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

హనుమాన్ మహాయాగంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే.

హనుమాన్ మహాయాగంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో గల
సర్వపురం శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో జరుగుతున్న హనుమాన్ మహా యాగం మహోత్సవానికి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా
ఆలయ అర్చకులు,కమిటీ సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పూర్ణాహుతితో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో తాంత్రిక పూజారి ప్రదీప్ కుమార్ గురుస్వామి,పట్టణ పార్టీ అధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి వెనుముద్దల శ్రీధర్ రెడ్డి, ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

శంకుస్థాపనలకే పరిమితం.

శంకుస్థాపనలకే పరిమితం

కార్యరూపం దాల్చని అభివృద్ధి పనులు

పట్టించుకోని అధికారులు ప్రజాప్రతినిధులు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో అభివృద్ధి పనులు శంకుస్థాపనలకే పరిమిత మయ్యాయి. గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా శంకుస్థాపనలు చేయగా కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టకుండా కాలయాపన చేస్తున్నారు. కొన్ని సంవత్సరా లుగా లక్షల రూపాయలు అభివృద్ధి పనులు పెండింగ్ లో నే ఉన్నాయి ఎన్నికల ముందు కొప్పుల గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టి ఆపడంతో గ్రామ ప్రజలు అయోమయంలో పడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అభి వృద్ధి పనులు పూర్తిచేసేనా!

Foundation stones

అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని చందంగా ఉన్నది కొప్పుల గ్రామంలో పశువైద్యశాల, రజక, పద్మశాలి సంఘ నిర్మాణంలో శంకుస్థాపనలు చేసి మరిచారు శంకుస్థాపనలు చేసి సంవత్సరాలు గడిచిపో యిన నేటికీ నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడo గమ నార్ధం. ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం అధికారులు కావచ్చు అని గ్రామ ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి గత ప్రభుత్వం అధికారుల సమక్షంలో ఎన్ని కల ముందు శంకుస్థాపనలు చేసి మొదలు చేసి సంవత్స రాలు గడుస్తున్న పనులు ప్రారంభానికి మాత్రమే అడుగు ముందుకు పడడం లేదు. కొన్ని భవనాలకు శంకుస్థాపనలు చేసి మరిచారు. కాంట్రాక్టర్ ఎవరికి కేటాయించారో!లేదో! తెలియక ప్రజలు అయోమ యంలో పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయడం ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ఆయుధం కాబట్టి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసు కొని, అధికారులు ప్రజా ప్రతిని ధులు సకాలంలో పనులుపూర్తి చేసేలా చర్యలు తీసు కోవాలని ప్రజలు కోరుతున్నారు.

క్రికెట్ టోర్నమెంట్ 2025 విన్నర్ గా ఈగల్ టీం .!

పరకాల క్రికెట్ టోర్నమెంట్ 2025 విన్నర్ గా ఈగల్ వారియర్స్ టీం

విజేతలకు బహుమతులు అందజేసిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రాజిరెడ్డి

పరకాల నేటిధాత్రి:

 

ఎల్తూరి సమృత వర్ధన్ చిన్ను ఆధ్వర్యంలో చింతల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పరకాల క్రికెట్ టోర్నమెంట్ 2025 ఆదివారం రోజు ఫైనల్ కు చేరుకుంది.ఫైనల్ లో పరకాల ఈగల్ వారియర్స్ టీం విన్నర్ గా పైడిపల్లి టీం రన్నర్ ఆఫ్ గా నిలిచారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి హాజరై ఫైనల్ లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతుల ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో పరకాల కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,వినాయక హాస్పిటల్ యజమాని సతీష్,ఎన్ఎస్ఆర్ పవన్ కుమార్,మంద టునిట్,టాటా ఏఐజి పరకాల టీం మామిడి చక్రపాని,దారా సతీష్,పిట్టా సునీల్,అఖిల్,సిద్దు,ఏకు బాబు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీ మత్స్య గిరి స్వామి కళ్యా ణోత్సవం.!

అంగరంగ వైభవంగా శ్రీ మత్స్య గిరి స్వామి కళ్యా ణోత్సవం

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరిస్వామి దేవాల యంలో తిరు కళ్యాణ బ్రహ్మో త్సవాలలో భాగంగా భూదేవి శ్రీదేవిలతో శ్రీ మత్స్యగిరి స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.గుడి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి దంపతులు తమ ఇంటి నుంచి పట్టు వస్త్రాలను తలంబ్రాలను మంగళ వాయి ద్యాల మధ్య తీసుకువచ్చి స్వామివారికి సమర్పించినారు వేదమంత్రాల మధ్య దేవాల య అర్చకులు ఆరుట్ల కృష్ణ మాచారి యాగ్నీకులు వీరవెల్లి వేణుగోపాల చారి  .స్వామివారి కల్యాణాన్ని ఘనంగా జరుపుకున్నారు.గట్లజయపా ల్ రెడ్డి సరోజన దంపతులు కళ్యాణదాతగా నిర్వహించి.  నారు కళ్యాణ అనంతరం దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి రాజమణి దంపతులు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జిన్నా ప్రతాపసేనారెడ్డి, గట్ల భగవాన్ రెడ్డి, జిన్నా కృపాకర్ రెడ్డి, శివరామకృష్ణరెడ్డి ,మనీష్ రెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కందగట్ల కోటేశ్వరరావు , చిందం రవి, బాసని మార్కండేయ, వినుకొం డ శంకరాచారి,సుమన్, వనం దేవరాజు, మార్త సుమన్,దిండి గాల వంశీ , బాసని బాలకృష్ణ, గిద్దెమారు సురేష్, రామ్ గోపాల్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

టిడిపి నూతన కమిటీ ఎన్నిక.

టిడిపి నూతన కమిటీ ఎన్నిక

పట్టణ అధ్యక్షునిగా చిరురాల రామన్న

పరకాల నేటిధాత్రి:

 

తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు,అరవింద్ కుమార్ గౌడ్,తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త నన్నూరి నర్సిరెడ్డి ఆదేశాల మేరకు పరకాల పట్టణ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.పరకాల పట్టణ కమిటీ అధ్యక్షులుగా చిదురాల రామన్న,ఉపాధ్యక్షులుగా కొత్తపల్లి శంకర్,ప్రధాన కార్యదర్శిగా బోయిని రాజశేఖర్,క్రిస్టఫర్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా మహారాజ్,బేగం,రవీందర్,స్వామి,మంజుల లక్ష్మీలను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంటు అడా కమిటీ కన్వీనర్ అర్షనపల్లి విద్యాసాగర్ రావు,రాష్ట్ర పరిశీలకులు ముంజ వెంకట రాజ్యం గౌడ్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్మీర రాజు నాయక్,అడా కమిటీ సభ్యులు కందుకూరి నరేష్, లు పాల్గొన్నారు.

పేదల వైద్యానికి భరోసా .!

పేదల వైద్యానికి భరోసా

◆౼ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్
యన్. గిరిధర్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సీఎంఆర్ఎఫ్ పేదల వైద్యానికి భరోసా కల్పిస్తుందని తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి అన్నారు.ఆదివారం రోజున జహీరాబాద్ టౌన్ ఆదర్శనగర్ కాలనీ వారి గెస్ట్ హౌస్ లో జహీరాబాద్ మండలం హుగ్గెల్లి గ్రామానికి చెందిన యం.బస్వరాజు (లబ్ధిదారుడు) గారి తనయుడు కి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  .ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పి.నాగిరెడ్డి,రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి,యూత్ న్యాల్కల్ మండల అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్ గౌడ్,రంగా అరుణ్,నాగు చౌహన్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదాలకు స్వాగతం పలుకుతున్న మూలమలుపులు.

ప్రమాదాలకు స్వాగతం పలుకుతున్న మూలమలుపులు

హెచ్చరిక బోర్డులు స్టిక్కర్లు ఏర్పాటు చేయాలి

రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లకు కొమ్ములను తొలగించాలి

పరకాల నేటిధాత్ర:

మండలంలో పలుచోట్ల మూల మలుపులతో రోడ్లపై ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.హన్మకొండ జిల్లా పరకాల నుండి మొగుళ్లపల్లికి వెళ్లే రహదారి డిపో సమీపం నుండి మొదలుకొని నాగారం గ్రామ ప్రారంభం నుండి లక్ష్మీపురం వరకు మూలమలుపుల వద్ద కనీసం ప్రమాద సూచిక బోర్డులు లేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.మూలమలుపుల వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలు దగ్గరకు వచ్చే వరకు కనిపించకపోవడంతో సూచిక బోర్డులు లేకపోవడంతోనే పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు.రాత్రి సమయంలో ప్రయాణం ఇబ్బందికరంగా మారుతున్నాదని ఎదురుగ వచ్చే వాహనాలు కనిపించక ఇప్పటికే చాలామంది ప్రమాదాలకు గురికావడం,ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయని,కొన్ని స్థలాలలో ప్రమాద సూచిక బోర్డులు ఉన్నప్పటికీ చెట్లకొమ్మలు పెరగడంతో బోర్డులు కనిపించడం లేదని,రోడ్లకు ఇరువైపులా పెరిగిన చెట్లకొమ్మలను తొలగించాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు.సంబంధిత అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించి ప్రమాదాల శాతం తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని రహదారుల మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు రేడియం స్టిక్కర్స్ ఏర్పాటు చేయాలని ప్రజలు,వాహనదారులు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version