ఇరాన్ పాలస్తీనాలపై ఇజ్రాయిల్ యుద్ధాన్ని తక్షణమే ఆపాలి.

ఇరాన్ పాలస్తీనాలపై ఇజ్రాయిల్ యుద్ధాన్ని తక్షణమే ఆపాలి…

వామపక్ష పార్టీల డిమాండ్

నేటి ధాత్ర:

మహబూబాబాద్ :గత 20 నెలలుగా గాజాలో పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ నిరంతర బాంబు,వైమానిక దాడులకు పాల్పడుతూ,మారణహోమాన్ని సృష్టిస్తూ యుద్ధానికి పూనుకున్నదని,ఇప్పుడు ఇరాన్ పై యుద్ధం ప్రకటించి జనావాసాలపై రాకెట్ దాడులతో విద్వంసం సృష్టిస్తున్నదని వామపక్ష పార్టీల జిల్లా కార్యదర్శులు గౌని ఐలయ్య, విజయసారధి, సాదుల శ్రీనివాస్, పాయం చంద్రన్నలు అన్నారు.10వామపక్ష పార్టీల పిలుపు మేరకు గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్ లో ఇజ్రాయిల్ యుద్దోన్మాదానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈధర్నా నుద్దేశించి సీపీఐ ఎం-ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య,సీపీఐ జిల్లా కార్యదర్శి బి విజయసారధి, సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్,సీపీఐ ఎం-ఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి పాయం చంద్రన్నలు ప్రసంగిస్తూ,ఇజ్రాయిల్ యుద్దోన్మాదానికి లస్తీనాలో ఇప్పటికే దాదాపు 50వేల మంది మరణించారని, మౌలిక సదుపాయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, మహిళలు, పిల్లలు మరియు శరణార్థుల ఆశ్రయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ వేలాదిమందిని పొట్టన పెట్టుకుంటున్నదని విమర్శించారు.పాలస్తీనాలో పుట్టిన పసిపిల్లలను కూడా చంపుతామని ఇజ్రాయిల్ మంత్రి ప్రకటించటం ఆ దేశం యొక్క అమానవీయ యుద్ధ పిపాసతకు నిదర్శనమని పేర్కొన్నారు. కనీసం ఆహారాన్ని అందించడానికి కూడా ఆటంకాలు కల్పిస్తున్నదని, ఐక్యరాజ్య సమితితో పాటు, ప్రపంచవ్యాపితంగా ఈ దుశ్చర్యను వ్యతిరేకిస్తున్నా, అమెరికా దాని కొన్ని మిత్రదేశాల మద్దతుతో ఇజ్రాయిల్ ఈదాడులు కొనసాగిస్తున్నదని అన్నారు.

ఇటీవల ఇరాన్ పై కూడా యుద్ధాన్ని ప్రకటించి భీభత్సం సృష్టిస్తున్నదని,అంతర్జాతీయ చట్టాలను, మానవహక్కులను కాలరాస్తున్నదని ఈదురహంకార మారణ హెూమ యుద్ధాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాలన్నారు.మోడీ ప్రభుత్వం ఇజ్రాయిల్ అనుకూల విధానాలను విడనాడాలని, పాలస్తీనా ప్రజలకు అండగా నిలవాలని, ఇజ్రాయిల్తో అన్ని రకాల సైనిక మరియు భద్రతా సహకారాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఇజ్రాయిల్ దాష్టీకానికి బలౌతున్న పాలస్తీనాకు సంఘీభావంగా నిలబడాలని వారు కోరారు.అనంతరం దురాక్రమణవాది,యుద్దోన్మాది ఇజ్రాయిల్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈకార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎం-ఎల్ న్యూడెమోక్రసీ, సీపీఐ ఎం-ఎల్ మాస్ లైన్ జిల్లా, డివిజన్ నాయకులు అజయ్ సారథి, పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, చింతకుంట వెంకన్న, ఎండీ ఫాతిమా, లింగ్యా నాయక్,చిరంజీవి, గునిగంటి రాజన్న, సమ్మెట రాజమౌళి, హేమా నాయక్, ముస్తఫా,రషీద్, నందగిరి వెంకటేశ్వర్లు, గుజ్జు దేవేందర్, హలావత్ లింగ్యా, యస్కే బాబు,తుడుం వీరభద్రం, బోనగిరి మధు,బట్టు చైతన్య,కొత్తపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

ట్రంప్ బర్త్‌డే రోజు పుతిన్ ఫోన్ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం గురించి చర్చలు.

ట్రంప్ బర్త్‌డే రోజు పుతిన్ ఫోన్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి చర్చలు…

Donald Trump: ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ స్పందించారు. తన బర్త్‌డే రోజున రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ తనకు ఫోన్ చేశాడని, యుద్ధంపై మాట్లాడామని చెప్పారు. యుద్ధం ఆపడానికి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. మిస్సైల్స్, డ్రోన్లతో పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగానే ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా, ఇరాన్.. ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ స్పందించారు. తన బర్త్‌డే రోజున రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ తనకు ఫోన్ చేశాడని, యుద్ధంపై మాట్లాడామని చెప్పారు. యుద్ధం ఆపడానికి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఈ విషయాలను సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించారు. ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో.. ‘అధ్యక్షుడు పుతిన్ ఈ రోజు ఉదయం నాకు ఫోన్ చేశారు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దాని కంటే ముఖ్యంగా ఇరాన్ దేశం గురించి మాట్లాడుకున్నాం. దాదాపు గంట సేపు మాట్లాడుకున్నాం. నేను అనుకుంటున్నట్లే ఆయన కూడా అనుకుంటున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ఆగాలని కోరుకుంటున్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం గురించి కొంచెంసేపు మాత్రమే మాట్లాడుకున్నాం.

సార్వత్రిక సమ్మెకు మద్దత్తుగా గ్రామీణ బంద్ ను జయప్రదం.!

ఈ నెల 20 న సార్వత్రిక సమ్మెకు మద్దత్తుగా గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్

కరీంనగర్ నేటిధాత్రి:

దేశంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, వ్యవసాయ, రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 20 తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దత్తుగా గ్రామాల్లో వ్యవసాయ కూలీలు గ్రామీణ బంద్ నిర్వహించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల సమావేశం జరిగింది. ఈసందర్బంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ చాయ్ వాలా పేరుతో దేశంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా నిర్లక్ష్యం చేస్తూ, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ, హక్కులను హరిస్తున్నారని, నలబై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తెచ్చారని, ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ దేశ సంపదను అధాని, అంబానిలకు కట్టబేడుతున్నారని ఆరోపించారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పెద బడుగు బలహీన వర్గాలకు చేతి నిండా పని కల్పించాలనే లక్ష్యంతో యుపిఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అమలు చేసి కోట్లాది మంది కూలీలకు పని కల్పిస్తుంటే నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపులో కోత విధిస్తున్నారని, పని రోజులు తగ్గిస్తున్నారని, పని ప్రదేశాల్లో పనికి ముందు పనికి తర్వాత కూలీలను ఫోటో అప్లోడ్ చేసే విదానాన్ని తెచ్చారని అన్నారు. ఉపాధి కూలీలకు రెండు వందల రోజుల పని కల్పించాలని, రోజు వారి కూలీ ఆరు వందలు చెల్లించాలని, వేసవి భృతి యధావిధిగా కొనసాగించాలని, పని ప్రదేశాల్లో కొలుతలు లేకుండా పని కల్పించి బిల్లులు చెల్లించాలని, ఆధార్, జాబ్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనుసంధానం చేయడం ఆపాలనే, ఉపాధి కూలీలకు ఇన్స్యూరెన్స్ అవకాశం కల్పించాలని, ఉపాధి హామీ పథకం రద్దు చేసే కుట్రలను మానుకోవాలని కోరుతూ 20 వ తేదీన కూలీలు ఉపాధి హామీ పనులను బంద్ చేసి దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్ ను జయప్రదం చేయాలని సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. ఈసమావేశంలో బికెయంయు జిల్లా అధ్యక్షులు బోయిని అశోక్, ఏఐఏడబ్లుయు జిల్లా ఉపాధ్యక్షులు రాయికంటి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి సుంకరి సంపత్, నాయకులు నల్లగొండ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version