దుర్గమ్మ తల్లి తిరుగు పండుగ ఉత్సవం సందర్భంగా మాజీ కౌన్సిలర్ గూగుల్ శంకర్ నివాసంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సందడి
తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి:
తొర్రూర్ డివిజన్ పరిధిలోని టీక్యా తండా , ఎర్రసోమ్లా తండా లో మాజీ కౌన్సిలర్ గూగుల్ శంకర్ నివాసంలో బిఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, వద్దిరాజు రవిచంద్ర సందడి చేశారు.
గ్రామీణ ప్రాంతంలో గిరిజనులు ఎంతో ఉత్సాహంగా, సాంప్రదాయమైన పద్ధతులల్లో జరుపుకొనే ఈలాంటి పండుగలు మనుషుల మధ్య మానవ సంబంధాన్ని, ఆచార సాంప్రదాయాన్ని ప్రేమను పంచే విలువైన పండుగలుగా వర్ణించారు. గిరిజన మిత్రుడు శంకర్ నివాసంలో పండుగ సంబరాలు పాల్గొనడం ఎంతో ఆనందంగా అందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ తోరూర్ మండల పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, మాజీ జడ్పిటిసి & మహబూబాబాద్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ మంగళ పెల్లి శ్రీనివాస్, పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు రామిని శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నలవాస ప్రమోద్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్ , మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్స్ ఎన్నమ నేని శ్రీనివాసరావు, నాయకులు కర్నే నాగరాజు, పేర్ల జంపా సింగిల్ విండో డైరెక్టర్ జనార్దన్ రాజు , మాజీ సర్పంచ్ విజయకుమార్ నాయకులు, గుంజి రవి యాకూబ్, బానోత్ అశోక్ తండావాసులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.