ఆర్వెస్టర్ యజమానులతో ఎంఎఓ సమావేశం
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:
మండల కేంద్రంలోని రైతు వేదికలో. మొగుళ్ళపల్లి మండల ఆర్వెస్టర్ యాజమాన్యంతో. మండల వ్యవసాయ అధికారి సురేందర్ రెడ్డి, సమావేశం నిర్వహించారు. అనంతరం ఎంఎఓ మాట్లాడుతూ. వరి కోతలు కోసే సమయంలో ఆర్వెస్టర్ 18 ఆర్పిఎం పెట్టాలని తద్వారా వడ్లనుండి తాలు వేరుచేయబడి వడ్లు మాత్రమే బయటకు వస్తాయని ధాన్యం కోసేటప్పుడు 18 ఆర్పీ ఎం కంటే తక్కువ పెట్టడం వలన తాలు మట్టిపెల్లలు గడ్డి లాంటివి వస్తాయని అందువల్ల వరి ధాన్యం నాణ్యత ప్రామాణాలు దెబ్బతింటాయని. ధాన్యం అమ్మేటప్పుడు నాణ్యత ప్రామాణాలు ఉండకపోవడంతో రైతులు నష్టపోయే అవకాశం ఉందని. అందువల్ల వరి పైరు కోసేటప్పుడు హార్వెస్టర్ యాజమాన్యం తప్పనిసరిగా 18 ఆర్ పి ఎం ఉండేవిధంగా చూసుకోవాలని. దీనివల్ల రైతులు నష్టపోకుండా మేలు జరుగుతుందని. బ్లోయర్ నిర్ణిత పరిధిలో తిరుగునట్లు చూసుకోవాలని. అదేవిధంగా వరిపైరు 85% ఎండిన తర్వాతనే కోతలు కోయాలని పచ్చగా ఉన్న ధాన్యాన్ని కోయరాదని హార్వెస్టర్ యజమానులకు సూచించారు. ఈ సమావేశంలో మండలంలోని ఏఈవోలు, హార్వెస్టర్ యజమానులు పాల్గొన్నారు.