గుండెపోటుతో యువకుడు మృతి.

గుండెపోటుతో యువకుడు మృతి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రానికి చెందిన పసునూటి రాజు కొమురమ్మ దంపతుల కుమారుడు పసునూటి వెంకటేష్ వయస్సు 30 సంవత్సరాలుఈరోజు వంద పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించాడు వెంకటేష్ మరణంతో ఘనపురం మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ఎస్సై రేఖ అశోక్ పోస్టుమార్టం నిమిత్తం పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వనపర్తిఎమ్మెల్యే మెఘారెడ్డికి చీఫ్ విప్ ఇవ్వాలి.

వనపర్తిఎమ్మెల్యే మెఘారెడ్డికి చీఫ్ విప్ ఇవ్వాలి

ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శికాంగ్రెస్ నేత మండ్ల దేవన్ననాయుడు

వనపర్తి నేటిధాత్రి:

 

వనపర్తి ఎమ్మెల్యే మె గారెడ్డి కి
రాష్ట్రప్రభుత్వ చీఫ్ విప్ కాంగ్రెస్ పార్టీ టి పి సీసీ ప్రధాన కార్యదర్శి ఇవ్వాలని ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి,కాంగ్రెస్ నేత మండ్ల దేవన్ననాయుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సి ఎం రేవంత్ రెడ్డిని ఒక ప్రకటనలో కోరారు .తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్యలు చేపట్టిందని ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ నేత మండ్ల దేవన్న నాయుడు తెలిపారు
నియోజకవర్గంలో బడా నాయకులమని చెప్పుకునే నాయకులను మట్టి కరిపించిన చిన్న మారుమూల గ్రామం
సర్పంచ్ .ఎంపీటీసీ. ఎంపీపీ ఎమ్మెల్యే గా గెలిచిన తూడి మేఘా రెడ్డి కి ప్రభుత్వ చీఫ్ విప్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి కేటాయిస్తే వనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మార్గం సుగమం అవుతుందని మండ్లదేవన్న నాయుడు తెలిపారు

ధాన్యం కొనుగోలు లో ప్రభుత్వం విఫలo.

ధాన్యం కొనుగోలు లో ప్రభుత్వం విఫలo

ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇ పరిస్థితి

ధాన్యం కటింగ్ లపై ఎమ్మెల్యే మాట్లాడాలి

వేరే జిల్లాలకు ధాన్యం సరఫరా చేయాలి

గణపురం మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం లో ధాన్యం సేకరణ లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గణపురం మాజీ పిఎసిఎస్ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు గణపురం మండలంలోని వివిధ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన అనంతరం జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే ఇ పరిస్థితి ఏర్పడిందని, ప్రతిసారి వేరే జిల్లాలకు ధాన్యం సరఫరా చేసేవారని, ఇసారి మాత్రం అలా జరగలేదని, మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్, పి పి సి ఇంచార్జి లకు మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని అన్నారు, గత ప్రభుత్వంలో కటింగ్ లపై మాట్లాడిన ప్రస్తుత ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరితో కుమ్మక్కయ్యారో ప్రజలకు చెప్పాలని, కటింగ్ లపై స్పందించాలని పూర్ణచంద్రారెడ్డి అన్నారు
వెంటనే ప్రభుత్వ గోదాములు తీసుకొని ధాన్యం నిలువ చెయ్యాలని,
ఇప్పటికైనా జిల్లా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే , జిల్లా మంత్రి చొరవ తీసుకొని ధాన్యం సరఫరా వేగవంతం చేయాలని, ప్రభుత్వం మాటలు చెప్పకుండా తడిసిన ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు

న్యాయ సేవాధికార సంస్థల ఆధ్యర్యంలో ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం.

న్యాయ సేవాధికార సంస్థల ఆధ్యర్యంలో ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం

హాజరైన వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి

హన్మకొండ వరంగల్ నేటిధాత్రి (లీగల్):

శనివారం నాడు వరంగల్ మరియు హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థలు సంయుక్తంగా పొగాకు నిరోధక అవగాహన కార్యక్రమాన్ని న్యాయ సేవా సదన్ బిల్డింగ్ లో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ హనుమకొండ జిల్లా ఇంచార్జ్ ప్రధాన న్యాయమూర్తి బి.అపర్ణాదేవి పాల్గొన్నారు.

ఇట్టి కార్యక్రమంలో వరంగల్ ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ “పొగాకు ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా పర్యావరణాన్ని కూడా అనేక విధాలుగా చెడుగా ప్రభావితం చేస్తుంది అని తెలిపారు. పొగాకు వినియోగ దారులలో అవగాహన కల్పించడం మరియు దానిని మానేయడానికి తగిన కారణాలను అందించేందుకు కృషి చేయాలన్నారు. పొగాకు కోరికను అధిగమించడానికి తన దృష్టి మరల్చుకొని పొగ రహిత ప్రాంతానికి వెళ్లడం, వ్యాయామం, ఒత్తిడిని తగ్గించడానికి యోగా మరియు సంగీతం వంటి ప్రత్యామ్నాయ సడలింపు పద్ధతులను ప్రయత్నించాలని సూచించారు.

legal services

హనుమకొండ ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ “పొగాకు వినియోగం వలన కలిగే చెడు ప్రభావాలను వివరించారు. పొగాకు వాడకం గుండె మరియు ఊపిరితిత్తులను ప్రభావితం చేసే వ్యాధులకు దారితీస్తుంది, ధూమపానం గుండెపోటు లకు ప్రధాన ప్రమాద కారకంగా ఉంటుంది కనుక పొగాకు కు దూరంగా ఉండటం మంచిదని సూచించారు.ఈ సందర్భంగా ఈ సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరితో న్యాయమూర్తులు పొగాకు రహిత ప్రతిజ్ఞ ను చేయించారు.

ఈ కార్యక్రమంలో ట్రిబ్యునల్ కోర్ట్ న్యాయమూర్తి నారాయణ బాబు, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయికుమార్, క్షమాదేశ్ పాండే, ఇతర న్యాయమూర్తులు, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుదీర్, హనుమకొండ జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా.ఏ.అప్పయ్య, మెడికల్ ఆఫీసర్ డా.మోహన్ సింగ్, డా. శ్రీనివాస్, పల్మనాలజిస్ట్ డా.పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు

శ్రీవీరాంజనేయరెడ్డి సంఘ నూతన భవనాన్ని ప్రారంభించిన.

శ్రీవీరాంజనేయరెడ్డి సంఘ నూతన భవనాన్ని ప్రారంభించిన జిల్లా రెడ్డి సంఘ అధ్యక్షులు నరహరి జగ్గారెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీ వీరాంజనేయ రెడ్డి సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన కరీంనగర్ జిల్లా రెడ్డి సంఘ అధ్యక్షులు (ఆర్బివివిఆర్) నరహరి జగ్గారెడ్డి. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. అనంతరం శ్రీ వీరాంజనేయ రెడ్డి సంఘ భవన నిర్మాణానికి సహకరించిన దాతలను సన్మానించడం జరిగింది. ఈకార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్, రెడ్డి సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రిని పరామర్శించిన మరిపెడ విలేకరులు.

మాజీ మంత్రిని పరామర్శించిన మరిపెడ విలేకరులు

మరిపెడ నేటిధాత్రి:

మోకాలి నొప్పితో కొద్ది రోజులుగా బాధపడుతు ఆపరేషన్ చేపించుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ను హైదరాబాద్ సోమాజిగూడలో వారి స్వగృహంలో డోర్నకల్ నియోజకవర్గ,మరిపెడ మండల విలేకరులు కలిసి పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలో అడుగు పెట్టాలని కోరారు.ఈ పరామర్శ కార్యక్రమంలో విలేకరులు గండి విష్ణు, అనంత రాములు,మూడవత్ రవి, కారంపూరి వెంకటేశ్వర్లు,సతీష్, కపిల్ గౌడ్ ,శ్రీశైలం,ఉప్పలయ,రవి నాయక్ పాల్గొన్నారు.

ఎన్నికైన పంజాల శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలియజేసిన.

సిపిఐ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన పంజాల శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలియజేసిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి, సిపిఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి వేణు

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన పంజాల శ్రీనివాస్ ను శనివారం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వుట్కూరి నరేందర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సిపిఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గుంటి వేణులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తితో ఏఐఎస్ఎఫ్ లో చేరి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం విద్యారంగంలో మార్పుల కోసం అనేక పోరాటాలు శ్రీనివాస్ చేశాడని, ఏఐవైఎఫ్ నాయకుడిగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, వారి సమస్యలపై కూడా ఎన్నో ఉద్యమాలు నిర్మించాడని, అనంతరం సిపిఐలో జిల్లా కౌన్సిల్ సభ్యులుగా, కార్యవర్గ సభ్యులుగా, కరీంనగర్ నగర కార్యదర్శిగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసి నేడు జిల్లా కార్యదర్శి స్థాయికి అతి చిన్న వయస్సులో ఎదగడం అభినందనీయమని, భవిష్యత్తులో ప్రజలకు మరింత చేరువై వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని వారు సూచించారు. ఈకార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు పాల్గొన్నారు.

సీఐ రఘుపతి రెడ్డిని సన్మానించిన రెడ్డి వేమన సంఘం.

సీఐ రఘుపతి రెడ్డిని సన్మానించిన రెడ్డి వేమన సంఘం.

నర్సంపేట నేటిధాత్రి:

ఇటీవల నూతనంగా నర్సంపేట పట్టణ సీఐగా బాధ్యతలు చేపట్టిన సీఐ రఘుపతి రెడ్డిని
నర్సంపేట డివిజన్ వేమనరెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లో ఘనంగా సన్మానించారు.అధ్యక్షులు చింతల కమలాకర్ రెడ్డి,గౌరవ అధ్యక్షులు లెక్కల విద్యాసాగర్ రెడ్డి, వీరమల్ల మాధవ రెడ్డి,బైరి తిరుపతి రెడ్డి,కే విజేందర్ రెడ్డి,కోమల్ల గోపాల్ రెడ్డి,గోలి శ్రీనివాస్ రెడ్డి,వీరమల్ల సంజీవరెడ్డి,ఉపేందర్ రెడ్డి,బిల్లా ఇంద్రా రెడ్డి,మాడుగుల మల్లారెడ్డి,పెద్ది శ్రీనివాస్ రెడ్డి,పెరుమళ్ళ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చేనేత కార్మికుల కోసం ఎంతో కృషి చేసింది.

చేనేత కార్మికుల కోసం ఎంతో కృషి చేసింది

అహల్య భాయ్ హోల్కర్

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

 

శాయంపేట మండల కేంద్రం లోని చేనేత సహకార సంఘం లో పుణ్య శ్లోకలోకమాత రాణి అహల్య భాయ్ హోల్కర్ 300 జయంతి ఉత్సవాన్ని బిజెపి మండల అధ్యక్షుడు నరహరి శెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మిఠాయిలు పంచి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రామకృష్ణ మరియు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగిలి ఇరువురు మాట్లాడు తూ మహిళల సాధికారత కోసం వారి యొక్క ఉపాధి కోసం అదేవిధంగా చేనేత కార్మికుల కోసం అహల్యబాయి ఎంతో కృషి చేశారని అన్నారు.

 

మహేశ్వర్‌లో చేనేత పరిశ్రమ స్థాపన

అహిల్యాబాయి హోల్కర్ తన పాలనలో మహేశ్వర్‌ను చేనేత పరిశ్రమ కేంద్రంగా అభివృద్ధి చేశారు.

మహేశ్వర్‌లోని రాజవాడా గోడల డిజైన్లను ఆధారంగా తీసుకుని ప్రత్యేక మైన మహేశ్వరి సారీలను తయారు చేయాలని ఆమె ప్రేరణ ఇచ్చారు.

ఈ సారీల తయారీలో సూరత్, మండవ వంటి ప్రాంతాల నుండి నైపు ణ్యమైన చేనేత కార్మికులను మహేశ్వర్‌కు ఆహ్వానించారు.

ఈ విధంగా చేనేత పరిశ్రమకు ప్రోత్సాహం ఇచ్చి, స్థానిక మహిళలకు ఉపాధి అవకా శాలు కల్పించారు.

 

మహిళల కోసం ఉపాధి అవకాశాలు

మహేశ్వర్‌లోని రెహ్వా సొసైటీ 1978లో స్థాపించబడింది, ఇది అహిల్యాబాయి హోల్కర్ వారసురాలైన రిచర్డ్ హోల్కర్ మరియు ఆయన భార్య సాలీ హోల్కర్ ఆధ్వర్యంలో ప్రారంభించబడింది.

ఈ సొసైటీ ద్వారా మహిళలకు చేనేత శిక్షణ, ఉపాధి అవకాశాలు మరియు ఆరోగ్య సేవలు అందించబడు తున్నాయి. ప్రస్తుతం, ఈ సొసైటీ 250 మంది చేనేత కార్మికులతో కలిసి 110 లూమ్స్‌లో పనిచేస్తోంది.

 

చేనేత పరిశ్రమకు ప్రోత్సా హం

అహిల్యాబాయి హోల్కర్ చేనేత పరిశ్రమను ప్రోత్సహిం చడానికి వివిధ చర్యలు తీసు కున్నారు.

మహేశ్వర్‌లో చేనేత పరిశ్రమను అభివృద్ధి చేయడం ద్వారా, ఆమె స్థానిక మహిళ లకు ఉపాధి అవకాశాలు కల్పించారు.

ఈ విధంగా ఆమె చేనేత కార్మికుల సంక్షే మం కోసం కృషి చేశారు.

అహిల్యా బాయి హోల్కర్ చేనేత పరిశ్రమ అభివృద్ధి, మహిళల కోసం ఉపాధి అవకాశాలు కల్పించ డం మరియు చేనేత పరిశ్రమ కు ప్రోత్సాహం ఇవ్వ డం ద్వా రా చేనేత కార్మికుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నారు.

ఈ కార్యక్ర మంలో భూత అధ్యక్షులు బాసాని నవీన్, కోమటి రాజశేఖర్, బత్తుల రాజేష్, మునుకుంట్ల రాజశేఖర్, మరియు మహిళ లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఎంపీ నిధులతో ప్రారంభించిన కార్యక్రమంలో.

ఎంపీ నిధులతో ప్రారంభించిన కార్యక్రమంలో మాజీ మేయర్ల పాత్ర ఏంటి?

అధికారిక కార్యక్రమాల్లో వేదికపై మాజీలను పిలిచినమున్సిపల్ కమిషనర్ పైచర్యలు తీసుకోవాలి

బిజెపికి తొత్తుగా వ్యవహరిస్తున్న కమిషనర్

_సిపిఐ

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

 

 

 

కరీంనగర్ నగరంలో ఎంపీ బండి సంజయ్ నిధులతో మున్సిపల్ కార్యాలయంలో డ్రిల్లింగ్ మిషన్ల పంపిణీ అధికారిక కార్యక్రమంలో వేదికపై బిజెపి పార్టీకి చెందిన మాజీ మేయర్ సునీల్ రావు,
డి.శంకర్ కొంతమంది మాజీ కార్పొరేటర్లూ వేదికపై ఉండటం వేదికపై సీట్లలో కూర్చోవడానికి ఆహ్వానించిన నగరపాలక కమిషనర్ పైచర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, నగర సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు డిమాండ్ చేశారు. ఇష్టారాజ్యంగా బిజెపికి చెందిన నాయకులు వేదిక పై కూర్చున్న కమిషనర్ మౌనంగా ఉండటం ఉండి ప్రజలను అవమానపరుస్తున్నారని బిజెపి కార్యక్రమాల్లాగా అధికార కార్యక్రమాలు కమిషనర్ నిర్వహించడం సిగ్గుచేటన్నారు.

Municipal Commissioner

 

 

పదవి కాలం పూర్తయిన ఇంకా మాజీ మేయర్, కొందరు కార్పొరేటర్లు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో వేదికలపై పాల్గొనకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ కార్యాలయంలో అరవై మంది కార్పొరేటర్ల పదవి కాలం పూర్తయిన బోర్డుపై ఉన్న వారి పేర్లు ఇంకా తొలగించడం లేదని వెంటనే వాటిని తీసేయాలని సురేందర్ రెడ్డి,రాజు ఈసందర్భంగా ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

విత్తన దుకాణాలపై పోలీసులు.

విత్తన దుకాణాలపై
పోలీసులు,వ్యవసాయ శాఖ అధికారుల సంయుక్త దాడులు

మరిపెడ నేటిధాత్రి.

 

 

 

మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని పలు విత్తన దుకాణాలపై పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. శనివారం వారు మండల కేంద్రంలోని సూర్య తేజ విత్తన దుకాణంపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి బి వీరసింగ్, ఎస్సై సంతోష్ కుమార్ మాట్లాడుతు నాణ్యమైన విత్తనాలు రైతులకు అందియాలని కోరారు. రైతులకు పలు సూచనలు చేశారు.లైసెన్స్ ఉన్న దుకాణాలలోనే విత్తనాలు కొనుగోలు చేయాలని విత్తనాలు అవునో కాదు నిర్ధారించాలి. లూజ్ విత్తనాలు ఎవరు కూడా తీసుకోవద్దని హెచ్చరించారు. ప్రతి విత్తనానికి డీలర్లు వద్ద బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. విత్తన ప్యాకెట్టు కూడా పంట చివరి వరకు దాచుకోవాలని తెలిపారు. ఈ దారులలో మండల వ్యవసాయ శాఖ అధికారి బి వీరా సింగ్,ఎస్సై సంతోష్ పాల్గొన్నారు.

స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి.

స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి

అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్) రాష్ట్ర సహాయ కార్యదర్శి చంద్రన్న

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

భారత వ్యవసాయ రంగలో ఎం.ఎస్. స్వామినాథన్ సూచించిన సిఫారసులను అమలు చేసి, రైతాంగ, మరియు వ్యవసాయ రంగ పురోభివృద్ధికి కృషి చేయటంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఈ నేపథ్యంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని ఎఐయుకెఎస్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి చంద్రన్న డిమాండ్ చేశారు.

శనివారం నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం నర్సంపేట డివిజన్ ప్రధమ మహాసభ కత్తుల కొమురయ్య అధ్యక్షతన జరిగింది.

మహాసభలను జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్ర సూరి ప్రారంభించగా,
టియుసిఐ జిల్లా కార్యదర్శి అడ్డూరి రాజు, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నరసింహ రావు,జిల్లా అధ్యక్షులు ఆలువాల నరేష్ లు మాట్లాడారు.

ఈ సందర్భంగా చంద్రన్న మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయని తెలిపారు.

వ్యవసాయ రంగాన్ని ఆదాని, అంబానీ లాంటి బడా కార్పొరేట్, పెట్టుబడిదారులకు కట్టబెడుతూ, దేశ వ్యవసాయంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారని తీవ్రంగా ఆక్షేపించారు.

దేశంలోని రైతులు 100 రకాల పంటలు పండిస్తుంటే కేంద్ర ప్రభుత్వం 2025-2026 సంవత్సరానికి కేవలం 14 రకాల పంటలకే అరకొర

దేశంలో అత్యధిక మంది రైతులు పండించే వరి ధాన్యానికి గత రేటు కంటే కేవలం 69 రూపాయలే పెంచి మద్దతు ధరలు పెంచామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించిన వరి ధాన్యాన్ని సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు వరి ధాన్యం తడిసి, మొలకలొచ్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తడిసిన వరి ధాన్యాన్ని ఎలాంటి కటింగులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, నకిలీ ఎరువులు, పురుగుమందులు తయారు చేస్తున్న కంపెనీలను , అవి అమ్ముతున్న షాపులను సీజ్ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలకు స్వస్తి పలికి వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రత్యేక యంత్రంగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుత రబీ సీజన్ ప్రారంభంలో రైతాంగానికి ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయాలని, సకాలంలో బ్యాంకులు రైతులకు వడ్డీ లేని రుణాలను అందించాలని కోరారు.

రైతు పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని తీసుకురావాలని, భారత వ్యవసాయ రంగంలో ఎమ్.ఎస్. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మహాసభ ప్రారంభానికి ముందు ఎ.ఐ.యు.కె.ఎస్. జెండాను చంద్రన్న ఆవిష్కరించారు.

డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నిక.

డివిజన్ స్థాయి నూతన కమిటీని ఎన్నుకోగా 9 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.డివిజన్
అధ్యక్షులుగా కత్తుల కొమురయ్య, ఉపాధ్యక్షులు ధార లింగన్న , ప్రధానకార్యదర్శిగా గట్టి కొప్పు రవి,
సహాయ కార్యదర్శిగా మల్లేష్,
కోశాధికారిగా బాబురావు, సభ్యులుగా చొప్పరి పైడి, గణపాక సుదాకర్, సింగన బోయిన కట్టయ్య, కోళ్ల రాజులు ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో గోపాల్, ఆలోచన, సమ్మన్న,రాధ, కోమల, మంజుల, స్వప్న, రాధిక ,సంజీవ, తిరుపతి, నర్సయ్య, వెంకన్న, రాజు, మల్లయ్య, కొమురయ్య, ఓం ప్రకాష్, శివలింగం, జంపయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు.

పచ్చి రొట్ట విత్తనాల ధర పెంచడం రైతులపై భారమే.

పచ్చి రొట్ట విత్తనాల ధర పెంచడం రైతులపై భారమే

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

కేసముద్రం మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం అల్పుగొండ సావిత్రి అధ్యక్షత జరిగింది.

జిల్లా కమిటీ సభ్యులు మార్తినేని. పాపారావు మాట్లాడుతూ, పచ్చిరొట్ట ఎరువుల కోసం, జీలుగులు గతంలో 1000 రూపాయలు లోపు ఉండే, వాటి ని రెండు వెల వందచిల్లర రెట్టింపు కంటే ఎక్కువ శాతం పెంచారు.

ఇది రైతులపై భారం పడుతుంది.

వ్యవసాయ అధికారుల దాడుల్లో క్వింటాళ్లకొద్ది నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడుతున్నాయి, వాటిని కొనుగోలు చేసిన రైతులు దిగుబడి రాక తీవ్రంగా నష్టపోతారు, అప్పులు తెచ్చి పెట్టుబడిపెట్టి పంటలు పండక, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయని, నకిలీ విత్తనాలను విక్రయించే దళారులను అధినేయంగా శిక్షించాలని, ధాన్యం సేకరించిన రైతులకు కింటాకు 500బోనస్, రైతుల ఖాతాల్లో జమ చేయాలని, ఇందిరమ్మ రైతు భరోసా అమలు చేయాలని, సకాలంలో పెట్టుబడుల కోసం సాయం అందించాలని అన్నారు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు పంట రుణాలు ఇవ్వాలన్నారు.

కౌలు రైతులను గుర్తించి కార్డులు ఇవ్వాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు పెట్టుబడులకు కూడా సరిపోవని స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని సీటు ప్లస్ అదనంగా 50% మద్దతు ధర చట్టం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గొడిశాల. వెంకన్న, మోడీ వెంకటేశ్వర్లు, జల్లే జయరాజు, నీరుటి.

జలంధర్, చందా వెంకన్న, సోమవరపు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

 

కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టానున్న ఎంపీ మల్లు రవి.

కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టానున్న ఎంపీ మల్లు రవి.

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

 

 

 

 

నేడు రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుండి సాయంత్రం 3 గంటలకు భారీ ర్యాలీగా గాంధీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ (డిసిప్లేనరి) కమిటీ చైర్మన్గా నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి ని ఏఐసీసీ నియమించిన సందర్బంగా నేడు సాయంత్రం గాంధీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ (డిసిప్లేనరి) కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టానున్నారు. కావున ఈ సందర్బంగా 119 నియోజకవర్గల నుండి మరియు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోనీ 7 అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు,మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని కోరారు.

స్థానిక యువతకు ఉపాధి కల్పించని పరిశ్రమలు అవరమా.

స్థానిక యువతకు ఉపాధి కల్పించని పరిశ్రమలు అవరమా?..టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం 50వరకు పరిశ్రమలు ఉన్నాయి అందులో ముఖ్యమైనవి మహీంద్రా&మహీంద్రా,దిగ్వాల్ పిరామిల్,రాక్ వూల్,విఎస్టీ,గిరిధర్ ఎక్స్ ప్లోజెస్,హాట్ సన్, మరియు కొత్తగా వచ్చేవి నీమ్జ్,ఇండస్ట్రీరియాల్ పార్క్,చాలా ఉన్నాయి.ఒక ప్రాంతానికి పరిశ్రమలు వస్తున్నాయంటే అక్కడ ఉన్న భూముల ధరలు,ఆ ప్రాంతంలో ప్రజా జీవనానికి అవసరమయ్యే కనీస ఖర్చులు పెరిగిపోతాయి,నియోజకవర్గంలో యువతకు ఉపాధి,ఉద్యోగాలు అయితే రాలేదు కానీ అన్నిటి ధరలు పెరిగిపోయాయి.ఒక ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం చాలా రాయితీలు ఇస్తుంది అవి తక్కువ ధరలకు భూములు,నీరు,విద్యుత్,పెట్టుబడిపై రాయితీలు,ట్యాక్స్ మినహాయింపు,రోడ్డు రవాణా సౌకర్యం మొదలైనవి కల్పిస్తారు,అందుకు స్థానిక పరిశ్రమలలో నైపుణ్యం లేని యువతకు 70% నుండి 80% మరియు నైపుణ్యం ఉన్న యువతకు 50% నుండి 60% స్థానికులనే భర్తీ చేయాల్సి ఉంటుంది కానీ నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలలో ఎక్కడా కూడా స్థానికులకు ప్రాధాన్యత నిచ్చింది మాత్రం అంతంత మాత్రమే స్థానిక యువత ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు,దిగ్వాల్ రసాయన కర్మాగారం వల్ల ప్రజలకు ఉపాధి లేదు కానీ త్రాగడానికి నీరు దొరికే పరిస్థితి లేదు,చిలమామిడి శివారులో గల గిరిధర్ ఎక్స్ పోర్ట్ వల్ల చుట్టు ప్రక్కల ఇండ్లు కూలిపోయే పరిస్థితి, గోవిందపూర్ లో గల హాట్ సన్ పరిశ్రమలో డైరీకి సంబంధించి ఉత్పత్తి అవుతాయి కానీ దానికి కావాల్సిన పాలను ఎక్కడో బయటి నుండి తెప్పించుకుంటున్నారు ఉద్యోగాలు చూస్తే నైపుణ్యం గల వారు అంతా తమిళనాడు వారే నైపుణ్యం లేని వారిని యుపి,బీహార్,వారిని తీసుకున్నారు దీనిపై ఆరా తీసుకుందామంటే అక్కడ అధికారులు కనీసం మాట్లాడాటానికి కూడా సిద్ధంగా లేరు, నియోజకవర్గంలో సుమారు 2లక్షల 80 వేల మంది యువత ఉన్నారు వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది కానీ అది మర్చిపోయారు.వీటన్నిటిని బట్టి చూస్తే ఈ పరిశ్రమల వల్ల స్థానిక యువతకు ఉపాధి దొరకాలేదు కాని కాలుష్యం,కనీస వసతుల ధరలు పెరిగిపోయాయి మరియు ఇక్కడి సంపదను ఇతరులు కొల్లగొట్టుకుపోతున్నారు దీనిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు/ ప్రభుత్వంపై ఉన్నది కానీ ప్రభుత్వం అది మర్చిపోయింది.పరిశ్రమల యాజమాన్యాలు ఇప్పటికైనా స్పందించి స్థానిక యువతకు పెద్దపీట వేస్తూ ఉద్యోగాలు కల్పించాలి లేనిచో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం, స్థానిక యువత మొత్తం దీన్ని అర్థం చేసుకొని ప్రతిఘటించాల్సిన బాధ్యత యువతపై ఉన్నది త్వరలో ఉద్యమించి ఈ అన్యాయాన్ని అరికట్టాలని కోరారు,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్,శికారి గోపాల్,శ్రీనివాస్, లు ఉన్నారు.

హత్య చేసిన నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు.

హత్య చేసిన నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

ఆన్ లైన్ బెట్టింగ్ ఆడేందుకు న్యాల్కల్ మండలం రుక్మాపూర్ లో రాణేమ్మ అనే మహిళను ప్రశాంత్ (21) హత్య చేసినట్లు జహీరాబాద్ డిఎస్పీ సైదా తెలిపారు. పోలీస్ స్టేషన్ లో శనివారం వివరాలను వెల్లడించారు. ఈనెల 26వ తేదీన రాణెమ్మ (48) హత్య చేసి ఆభరణాలు నగదుతో ప్రశాంత్ పరారైనట్లు చెప్పారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.

అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు.

అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

 

 

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి భూమి పూజ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టేయడం జరుగుతుందని. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని. మండలంలో పాపాయి పల్లె. రామన్నపల్లి. బస్వాపూర్. నేరెళ్ల. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గుపోసి భూమి పూజ చేసిన మని. ప్రజలకు అండగా ఉండి ప్రజా పాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి అని ఆయన పాలనలో రాష్ట్రకాంగ్రెస్ ప్రజా పరిపాలన సాగిస్తుందని. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలు నెరవేస్తూ ఆరోగ్యారంటీలు అమలు చేస్తున్నామని. ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలకు పాలభిషేకం చేయడం జరిగిందని . ఇట్టి ఇందిరమ్మ ఇండ్లురావడానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి. పొన్నం ప్రభాకర్ కి. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కే కే మహేందర్ రెడ్డికి మండల అధ్యక్షుడు ప్రవీణ్ కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ లింగాల భూపతి. జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ సత్తు శ్రీనివాస్ రెడ్డి. యూత్ కాంగ్రెస్ నాయకులు మునిగల రాజు. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్. అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపల్లి రాజేశ్వరరావు కిషన్ లక్కీ గారు తదితరులు పాల్గొన్నారు

మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ…

మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. ఈరోజు ఏడుగురికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో ప్రజలందరూ ఇల్లు లేని వారు ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన వారు అందరూ లబ్ధి పొందాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలే కాకుండా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతున్నారని. ఇకనైనా లబ్ధిదారులందరూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్గం గౌడు. గ్రామపంచాయతీ సెక్రెటరీ సమీర్. జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి. జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ సత్తు శ్రీనివాస్ రెడ్డి. మాజీ ఎంపీటీసీ మచ్చ శ్రీనివాస్. మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గుగ్గిళ్ళ శ్రీకాంత్ గౌడ్. కాంగ్రెస్ నాయకులు సుద్దాల కరుణాకర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అరెపల్లి బాలు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాపల్లి ఆనందం. సుద్దాల శ్రీనివాస్. హరీష్ రెడ్డి. మాజీ సర్పంచ్ ఆసాని సత్యనారాయణ రెడ్డి. ప్రతాప్ రెడ్డి మండల ఫిషరీస్ అధ్యక్షుడు ఇటికల మహేందర్ కాంగ్రెస్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్.

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్

సిరిసిల్ల టౌన్ : ( నేటిధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చంద్రం పేటలో దాడిచేసి ఓ సర్వేయర్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు.
15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్ నాగరాజు.
ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి నుండి 15000 లంచం తీసుకుంటుండగా పెట్టుకున్న ఎసిబి అధికారులు.
నాగరాజు ను ఎల్లారెడ్డి పేట తహసీల్దార్ కార్యాలయం కు తరలించి విచారిస్తున్న అవిశా అధికారులు.జక్కాపురం మల్లేశం స్థలం కొలిసినందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేసి 80 వేలకు డీల్ కుదుర్చుకున్న సర్వేయర్.గతంలో 21 వేలు ఇవ్వగా, నేడు 15 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సర్వేయర్ గురించి ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.

పొగాకు వాడటం వలన త్రోట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం వుంది.

పొగాకు వాడటం వలన త్రోట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం వుంది

మండల వైద్యాధికారి అమరేందర్ రావు

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

 

 

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న ఆదేశానుసారంతో మండల వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ రావు పొగాకు వ్యతిరేకత దినోత్సవం గురించి మండల ప్రజలు మరియు పేషంట్లతోని పొగాకు వాడడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను ప్రజలకు తెలియజేయుచు దీనిని వాడకూడదని వాడిన వారిని వాడకుండా చూడాలని చెప్పుచు అందరి చేత పొగాకు వాడకం నిరోధించుటకు ప్రతిజ్ఞ చేపించారు ఈ సందర్బంగా వైద్యాధికారి అమరేందర్ రావు మాట్లాడుతూ పొగాకుతో అనుసంధానం అయినా పాన్ మసాలాలు తంబాకులు సిగరెట్లు వాడడం వల్ల త్రోట్ క్యాన్సర్ గాని లంగ్ క్యాన్సర్ గాని వివిధ రకములైన జబ్బులు వచ్చే అవకాశం ఉండడం వల్ల ఇలాంటివి వాడకూడదని తెలియజేసి అందరికీ ఆరోగ్య విద్యా బోధన చేయడం జరిగింది. అందరితోని పొగాకు వాడమని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమం లో పి ఎచ్ ఎన్ గ్రేసీ వన్ సూపర్వైజర్స్ రమాదేవి ఎమ్ ఎల్ ఎచ్ పి లావణ్య దీప్తి మరియు ఏఎన్ఎంలు రమాదేవి స్రవంతి సునీత కళావతి దుర్గమ్మ పుష్పలత మరియు ఆశా వర్కర్స్ స్టాఫ్ నర్స్ రవళి ఝాన్సీ ల్యాబ్ టెక్నీషియన్ అనిల్ ఫార్మసిస్ట్ జగదీశ్వర్ మరియు భూపెల్లి మొగిలి పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version