సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పాత బస్టాండ్ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద, తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మరియు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలోజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప తిరుపతిరెడ్డి,తదితరులు నివాళులు అర్పించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా న్యాల్కల్ మండల్ మల్లీ గ్రామ పంచాయతీ కార్యాలయం & అంగన్వాడి కేంద్రం జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జట్గొండ మారుతీ మాజీ సర్పంచ్ బాబురావు మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి మాజీ వార్డు సభ్యులు సిద్ధారెడ్డి తాత్కాలిక పంచాయత్ కార్యదర్శి జై సింగ్ సిఏ నర్సారెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ అంబిక అంగన్వాడీ టీచర్లు వసంత సుకుమారి ఆశ వర్కర్లు జగదేవి శివలీల పంచత్ కార్మికులు చంద్రయ్య డేవిడ్ గణపతి సంగమ్మ చిన్నమ్మ కన్నమ్మ మైనార్టీ నాయకులు అఖిల్ స్వామి దాస్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలలు మొదలవుతుంది అంటే తల్లిదండ్రులకు టెన్షన్ మొదలయ్యే సందర్భాలు ఎదురవుతున్నాయి.
ముఖ్యంగా పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు అప్పులు చేయడానికి కూడా వెనకాడరు.
అందుకే జూన్ మాసం వచ్చిందంటే వారిలో టెన్షన్ మొదలవుతుంది.
ఒకటో తారీఖు అంటే ప్రతినెలా సామాన్య కుటుంబాలకు ఇబ్బందిగానే ఉంటున్నా జూన్ మాసంలో మాత్రం ఇంకాస్తా భయాన్ని కలిగిస్తుంది.
ఇంటి బడ్జెట్కు తల్లిదండ్రుల కసరత్తు మొదలైంది.
జూన్ మాసం వస్తుందంటేనే తల్లిదండ్రులు హడలిపోతారు.
ప్రతి కుటుంబంపై జూన్ మాసంలో రూ. 50 వేల నుంచి రూ లక్ష వరకు బడి ఖర్చులు ఉంటాయి.
మరో 15 రోజులు మాత్రమే పాఠశాలలకు సెలవులు మిగిలి ఉన్నాయి.
పాఠశాలలు తెరుచుకోవడానికి ముందే విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, యూనిఫాంలు, షూస్ సహా కొనుగోలు చేయడంతో పాటు ఫీజుల మోతను ఎదుర్కోవడానికి తల్లిదండ్రుల్లో దడ మొదలైంది.
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల మోత మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ను తలకిందులు చేస్తుంది.
కళాశాలలు, పాఠశాలల్లో ఫీజులు కూడా భారీగా పెంచారు.
జూన్ మాసంలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందటేనే ప్రతి ఇంటిలో ఎల్ కేజీ నుంచి పదో తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్కు టర్మ్ ఫీజులు, రవాణా, ఇతర ఖర్చులు కలిపితే రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు అవుతుంది.
School Holidays.
కార్పొరేట్ స్థాయికి వెళ్తే రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోకి కార్పొరేట్ పాఠశాలలు కూడా రావడంతో పిల్లల చదువుల కోసం మధ్య తరగతి కుటుంభాలు కూడా మొగ్గు చూపుతున్నారు.
ఇంజనీరింగ్ చదువాలంటే కూడా కళాశాలల్లో ఫీజు రీయింబర్స్మెంట్ మినహాయించిన కళాశాలల ఫీజులు లక్షల్లోనే ఉ న్నాయి.
మరోవైపు హాస్టల్ ఫీజులు అదనపు భారం ఉంటాయి.
ప్రైవేటు పాఠశాలల్లో స్కూల్ ఫీజులు వేలల్లో ఉ న్నాయి.
దీనికి తోడు ఈవెంట్స్ పేరుతో అదనపు వసూళ్లు కూడా ఉన్నాయి.
పుస్తకాలతో పాటు బ్యాగ్లు టిఫిన్ బాక్సుల రేట్లు కూడా మండిపోతున్నాయి.
ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు బస్సు, యూనిఫాం, బెల్ట్, బ్యాడ్జి, టై, ఐడీ కార్డు, డైరీ, పుస్తకాలు, పెన్నులు, పరీక్ష ఫీజులు..
ఇలా అన్నింటికి వేలల్లోనే ఖర్చు చేయాల్సి ఉ ంటుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కేవలం పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు ఇస్తుండగా, మిగతా నోటు బుక్కులు, ఇతర వాటికి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది.
నాలగోసారి సిపిఐ పట్టణ కార్యదర్శిగా మిట్టపల్లి శ్రీనివాస్…
రామకృష్ణాపూర్ నేటిధాత్రి:
సిపిఐ పార్టీ రామకృష్ణాపూర్ పట్టణ మూడవ మహాసభలు పట్టణంలో ఘనంగా జరిగాయి.రాజీవ్ చౌక్ చౌరస్తా నుండి సూపర్ బజార్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి, రైల్వే స్టేషన్ సమీపంలోని కమ్యూనిటీ హాల్ లో సిపిఐ కమిటీ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. మహాసభలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. నాలుగోసారి పట్టణ కార్యదర్శిగా మిట్టపల్లి శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ తెల
అనంతరం వారు మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అంతమొందిస్తుందని, ఏకపక్ష దాడులు చేస్తూ మావోయిస్టులు లేకుండా చేస్తామనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం విడనాడాలని బిజెపి ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిలో విఫలమవుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంఆరు గ్యారెంటీ పథకాల హామీలు నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు.గతంలో రామకృష్ణాపూర్ పట్టణ అభివృద్ధిలో సిపిఐ పార్టీ పాత్ర కీలకమైందని, ప్రస్తుతం అప్పటి అభివృద్ధి పనులే ఇంకా ఉన్నాయని, నేటి పాలకుల అభివృద్ధి శూన్యమని అన్నారు. సిపిఐ పార్టీ అంటేనే పేద ప్రజలకు కొండంత బలం అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా పోరాల్సిన సమయం ఆసన్నమైందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేకల దాస్, వనం సత్యనారాయణ, ఇప్పకాయల లింగయ్య, రేగుంట చంద్రశేఖర్, లింగం రవి, దాగం మల్లేష్, మిట్టపల్లి పౌల్, మామిడి గోపి, గోపు సారయ్య, కాదండి సాంబయ్య, మణెమ్మ, రాములు రాజేశ్వర్, ఏఐటియూసీ ఫిట్ కార్యదర్శులు గాండ్ల సంపత్, హరి రామకృష్ణ, ముకుంద రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
◆ విధుల్లో నిర్లక్ష్యం.. కరెంట్ పోయినప్పుడు టార్చ్ లైట్లతో వైద్యం
జహీరాబాద్ నేటి ధాత్రి,:
జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో భద్రత లోపాలు, ఆధునిక వసతుల వినియోగంలో నిర్లక్ష్యం ఆరోపణలతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ను అదికారికంగా సస్పెండ్ చేశారు. గత శుక్రవారం రాత్రి ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా ఆగిపోయిన సమయంలో జన రేటర్ ఉన్న వాడకపోవడంతో పేషెంట్లకు టార్చ్ లైట్ల ద్వారా వైద్యం అందిం చిన దారుణ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పత్రికల్లో కథనాలు వెలువడిన వెంటనే సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రశే ఖర్ స్వయంగా ఆస్పత్రిని తనిఖీ చేసి విచారణ ప్రారంభించారు. విచారణలో డాక్టర్ శ్రీదర్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు నిర్ధారణ కావడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. గతంలోను డాక్టర్ శ్రీధర్పై పలు ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. కొంతమంది ఉద్యో గులు ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉంటూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గుసగుసలాడుతున్నారు. ప్రజల ప్రాణాలు దోహదంగా ఉండాల్సిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇటువంటి పరిస్థితులు చోటుచేసుకోవడంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నాయి. ఈ ఘటనపై మెరుగైన వైద్య సేవల కోసం జిల్లా ఆరోగ్య శాఖ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మైసమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామంలో జరిగిన మైసమ్మ తల్లి జాతర మహోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ మైసమ్మ తల్లి దయతో ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు…. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, విఠల్ రెడ్డి, రాజశేఖర్ ,మ్యతారి ఆనంద్ ,వినోద్,మహేష్,శంకర్, రియాజ్, పరమేశ్ పాటిల్,శ్రీనివాస్ మేడపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పటేల్ , మైసమ్మ ఆలయ కమిటీ, గ్రామస్థుల తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణం లోని క్యాంప్ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా ను ఆవిష్కరించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు గా ఈ సంద్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగం అజరామరమైనది.ఉద్యమానికి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ స్పూర్తిగా నిలిచింది స్వరాష్ట్రంలో సగర్వంగా జీవిస్తున్నామంటే. అందుకు అమర వీరుల త్యాగాలే కారణం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ. ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప , మాజి మున్సిపల్ చైర్మన్ అల్లాడి నర్సింలు , సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,యువ నాయకులు మిథున్ రాజ్,మాజి మొగుడంపల్లి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు సురేష్ ,నాయకులు బరూర్ దత్తత్రి,వెంకట్, సాగర్,దీపక్ ,సందీప్,నిఖిల్,ప్రశాంత్ రెడ్డి,బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
‘సీతారామం’లో సీతగా, ‘హాయ్ నాన్న’లో యష్నగా, ‘ఫ్యామిలీస్టార్’లో ఇందూగా తెలుగు ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టింది మృణాల్ ఠాకూర్.
‘సీతారామం’(Sitaramam)లో సీతగా, ‘హాయ్ నాన్న’లో (Hi Nanna) యష్నగా, ‘ఫ్యామిలీస్టార్’లో ఇందూగా తెలుగు ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టింది మృణాల్ ఠాకూర్ (mrunal Thakur). ప్రస్తుతం తెలుగులో ‘డెకాయిట్’తో పాటు, బాలీవుడ్‌లోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తన గురించి పంచుకున్న తాజా కబుర్లివి…
వాటిపైనే పెట్టుబడి
నేను ఈవెంట్ల కోసం వేసుకునే డ్రెస్సులన్నీ ఫ్యాషన్ డిజైనర్లు ఇచ్చేవే.
నిజానికి దుస్తుల కోసం నేను ఎక్కువ డబ్బులు ఖర్చు చేయను.
ఇప్పటివరకు నేను కొన్నవాటిల్లో ఖరీదైన డ్రెస్ ధర రూ. 2 వేలు మాత్రమే అంటే నమ్ముతారా? లక్షలు పోసి దుస్తులు కొని, వాటిని బీరువాలో దాచుకోవడం వల్ల ఉపయోగమేమీ ఉండదు.
బ్రాండెడ్ దుస్తుల మోజులో పడి డబ్బులు వృథా చేయడం నాకు అస్సలు నచ్చదు. అందుకే ఇళ్లు, భూమిపై పెట్టుబడి పెడతా.
అవమానంగా ఫీలయ్యా…
ఇటీవల నేనొక అవార్డు ఫంక్షన్‌కి హాజరయ్యా.
అక్కడకి అడుగుపెట్టానో లేదో..
మీడియా వాళ్లంతా చుట్టిముట్టి, ప్రశ్నలు సంధించారు.
అన్నింటికీ ఓపిగ్గా సమాధానాలిస్తున్నా.
ఇంతలో జాన్వీ కపూర్ అక్కడకు వచ్చింది. అంతే… నన్ను వదిలేసి అంతా జాన్వీ దగ్గరకు పరుగెత్తారు.
ఊహించని ఆ సంఘటన నన్ను ఎంతో బాధించింది.
అవమానంగా ఫీలయ్యా. పరిశ్రమలో వారసత్వానికి ఉన్న ప్రాధాన్యత నాలా కష్టపడి పైకొచ్చిన వాళ్లకు ఉండదనిపించింది.
వాళ్లతో పనిచేయాలనుంది
ఇప్పటికే తెలుగు, హిందీ, మరాఠీ భాషల్లో నటించాను. తమిళ, మలయాళ, ఇంగ్లీషు, స్పానిష్ చిత్రాల్లో కూడా నటించి నన్ను నేను సరికొత్తగా ఆవిష్కరించుకోవాలని అనుకుంటున్నా.
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి నన్ను ప్రేరేపించిన దర్శకులందరితోనూ కలిసి పనిచేయాలనుంది.
సంజయ్‌లీలా భనాల్సీ, ఇంతియాజ్ అలీ, అనురాగ్ కశ్యప్ వంటి నా అభిమాన దర్శకుల సినిమాల్లో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.
మొట్టమొదటి అమ్మాయిని…
నాకు కార్లు అంటే పిచ్చి.
చిన్నప్పుడు మా బంధువుల కారు చూడగానే, ఎక్కి కూర్చోవాలని అత్యుత్సాహం చూపా.
అందుకు మా అమ్మ ఒప్పుకోలేదు.
అనుమతి లేకుండా వేరే వాళ్ల కారు ఎక్కితే, వాళ్లు తప్పుగా భావిస్తారని నాకు సర్ది చెప్పింది.
ఆ క్షణమే నిర్ణయించుకున్నా..
నా కష్టార్జితంతో కొన్న కారే ఎక్కాలని.
మా ఫ్యామిలీలో మెర్సిడెస్ కొన్న మొట్టమొదటి అమ్మాయిని నేనే అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది.
నటి విద్యాబాలన్ నాకు స్ఫూర్తి.
సినిమాల్లో ఆమె పాత్రల ఎంపిక నన్ను అడుగడుగునా ప్రేరేపిస్తుంది.
సవాలుతో కూడిన పాత్రల్ని ఎంచుకున్నప్పుడే ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాం.
ఆమె అలాంటి ఛాలెంజింగ్ పాత్రల్నే ఎంచుకుంటారు. నా గ్రాఫ్ కూడా అలాగే దూసుకెళ్లాలని ఆశిస్తున్నా.
Branded Clothes.
ఆమెతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.
అందుకే బ్రేకప్ గురించి చెప్పా
గతంలో చాలామంది నటీనటులు వ్యక్తిగత విషయాల గురించి చెప్పడానికి సంకోచించేవారు.
కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఇప్పుడు తారలు రిలేషన్‌షిప్ గురించి ఓపెన్‌గా మాట్లాడుతున్నారు.
నేనూ ఇంతకుముందు నా ప్రేమ, బ్రేకప్ గురించి చాలా సందర్భాల్లో బయటపెట్టాను. ఎందుకంటే…
వాటిని అందరితో పంచుకుంటేనే, మన నుంచి ఇతరులు ఏదో ఒకటి నేర్చుకుంటారు.
అందుకే ధైర్యంగా చెప్పేశా.
సాదాసీదాగా జీవిస్తే…
ఒక సెలబ్రిటీగా ఉంటే ఈ ప్రపంచం నిన్ను ప్రేమిస్తుంది.
నీ వర్క్‌తో సమాజంలో మార్పు తీసుకురావచ్చు.
ఇక ఇబ్బందులు గురించి చెప్పాలంటే..
కుటుంబానికి దూరంగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది.
అవసరమైనప్పుడు కుటుంబసభ్యుల పక్కన ఉండలేం.
కొన్నిసార్లు నాకు కూడా సాధారణ జీవితాన్ని గడపాలనిపిస్తుంది.
ఇరవై ఏళ్లకే పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనేసి, భర్తతో కలసి చక్కగా వారానికోసారి రెస్టారెంట్‌కి వెళ్లి, జీవితాన్ని సరదాగా గడిపేయొచ్చు కదా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది.
శేఖర్ కమ్ముల సినీ పరిశ్రమలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. చిరంజీవిని తన స్ఫూర్తిగా పేర్కొంటూ శేఖర్ కమ్ముల సోషల్ మీడియా ద్వారా భావోద్వేగాలను పంచుకున్నారు.
చిరంజీవిని కలసిన శేఖర్ కమ్ముల
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్ర పరిశ్రమలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఆయన మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ‘25 ఇయర్స్ ఆఫ్ శేఖర్ కమ్ముల’ సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనే పోస్టర్‌ని చిరంజీవి ఆవిష్కరించి, అభినందించారు. ఈ విషయాన్ని శేఖర్ కమ్ముల సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ‘టీనేజ్‌లో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవిని ఒకసారి దగ్గర నుంచి చూశాను. ఈయనతో సినిమా చేయాలనే భావన కలిగింది. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు అవుతోంది. దీనిని సెలెబ్రేట్ చేసుకుందామని మా టీమ్ అనగానే వెంటనే నాకు గుర్తొచ్చింది చిరంజీవి గారే. కొన్ని తరాల వారిలో స్ఫూర్తి నింపిన వ్యక్తి ఆయన. కలలను వెంటాడితే విజయం తప్పకుండా మనల్ని అనుసరిస్తుందని నమ్మకం కలిగించింది ఆయనే. నా ఈ 25 ఏళ్ల వేడుకను ఆయన సమక్షంలో చేసుకోవాలనిపించింది. థాంక్యూ సర్. ఈ క్షణంలోనే కాదు నా టీనేజ్ నుంచి మీరు నా ముందు ఇలాగే ఉన్నారు’ అని శేఖర్ కమ్ముల ఆ పోస్టులో పేర్కొన్నారు. చిరంజీవితో కలసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) శనివారం చేసిన ఓ పోస్ట్ ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే!
నేతిధాత్రి:
టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) శనివారం చేసిన ఓ పోస్ట్ ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే! ఆ ఫొటోలు చూసి తను త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి.
అవి నిశ్చితార్థం (Sreeleela engegment rumours) ఫొటోలని ప్రచారం జరిగింది.
Heroine Sreeleela.
దీనిపై శ్రీలీల క్లారిటీ ఇచ్చారు. తన ఇంట్లో జరిగిన ఓ వేడుక గురించి ఆమె వివరించారు.
‘‘నా ప్రీ బర్త్‌డే వేడుకలను ఇంట్లోనే మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం.
దీనికి సంబంధించిన ప్ల్లానింగ్ అంతా మా అమ్మ చూసుకున్నారు’’ అని ఆమె రాసుకొచ్చారు. ఈ వేడుకల్లో రానా సతీమణి మిహిక కూడా పాల్గొన్నారు.
(Sreeleela Pre birthday Celebs)
ప్రస్తుతం శ్రీలీల దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ కెరీర్‌లో బిజీగా ఉంది.
Heroine Sreeleela.
సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం ఇన్‌స్టా స్టోరీస్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ఇందులో కుటుంబ సభ్యులు ఆమెకు నలుగు పెడుతూ కనిపించారు.
ఆయా ఫొటోలకు ‘బిగ్ డే’, ‘కమింగ్ సూన్’ అనే క్యాప్షన్ రాసుకొచ్చారు శ్రీలీల.
వాటిని చూసిన నెటిజన్లు ఆమెకు నిశ్చితార్థం జరిగిందంటూ కామెంట్లు చేయగా ఆ ఫొటోలు హల్‌చల్ చేశాయి.
జూన్ 14న ఆమె 24వ పుట్టినరోజు చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కథనాలపై ఆమె తాజాగా స్పందించారు.
అగ్ర కథానాయకుడు చిరంజీవి మంచి జోరు మీదున్నారు. తన తాజా చిత్రం అప్పుడే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) మంచి జోరు మీదున్నారు. తన తాజా చిత్రం అప్పుడే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నయనతార (Nayanatara) కథానాయిక. ఇటీవలే హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవితోపాటు ప్రధాన తారాగణంపై కీలక టాకీ పార్ట్‌ను పూర్తి చేశారు. తదుపరి షెడ్యూల్ ఈ వారాంతంలోనే మొదలు కానుందని తెలిసింది.
ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రమిది. చిరంజీవి ఇందులో తన సొంత పేరైన శివ శంకర్ వరప్రసాద్ అనే పాత్రలో కనిపించనున్నారు. వెంకటేశ్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
7 గంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా ఈ వ్యాధులు తప్పవు…
చాలా మంది 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతుంటారు. అయితే, ఇలాంటి వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే..
Sleeping Disorder: నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇది శరీరం, మెదడు రెండింటికీ విశ్రాంతినిస్తుంది. కణాలను పునరుద్ధరిస్తుంది. వివిధ శారీరక, మానసిక విధులను మెరుగుపరుస్తుంది. తగినంత నిద్రపోవడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు. మానసిక స్థితిని మెరుగుపరచవచ్చు. హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. సాధారణంగా 7-8 గంటల నిద్ర అవసరమని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే, కొంత మంది మాత్రం 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతారు. అయితే, ఇలాంటి వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గుండె జబ్బుల ప్రమాదం:
నిద్ర లేమి వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్‌కు దారితీస్తుంది. నిద్ర లేమి ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్‌ను పెంచుతుంది. ఇది ధమనులలో వాపుకు కారణమవుతుంది. కాబట్టి, ప్రతిరోజూ 7 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
డయాబెటిస్ ప్రమాదం
తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుంది. నిద్రలేమి ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. అంటే మీ కణాలు ఇన్సులిన్‌కు తక్కువ ప్రతిస్పందిస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి, ప్రతిరోజూ 7-8 గంటలు నిద్రపోండి.
మానసిక ఆరోగ్యంపై ప్రభావం
నిద్ర లేమి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చిరాకు, ఒత్తిడి పెరగడం, ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలిక నిద్రలేమి మానసిక ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. అలాగే, భావోద్వేగాలను నియంత్రించడంలో ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి, ఎన్ని పనులున్నా 7-8 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకుని ఆరోగ్యంగా ఉండండి.
బలహీనమైన రోగనిరోధక శక్తి, ఊబకాయం
నిద్రలేమి కారణంగా రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయదు. ఇది ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే, నిద్రలేమి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది, ఇది బరువు పెరగడానికి, ఊబకాయానికి కారణమవుతుంది. కాబట్టి, రోజు 7-8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది.
`28`90 నానోమీటర్ టెక్నాలజీలో స్వావలంబన దిశగా అడుగులు
`దిగుమతులపై ఇక ఆధారపడాల్సిన అవసరంలేదు
`దేశ అవసరాలతో పాటు గ్లోబల్ మార్కెట్‌లోకి ప్రవేశించే యత్నాలు
`వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్న ప్రభుత్వం
హైదరాబాద్,నేటిధాత్రి:
సెమికండక్టర్ రంగంలో స్వావలంబన దిశగా ప్రయాణిస్తున్న భారత్ ఈ ఏడాదిలోగా ఈ లక్ష్యా న్ని సాధించనున్నది. కేంద్ర ఐ.టి.శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఈ విషయాన్ని తెలియజేశారు. సెమికండక్టర్ చిప్ టెక్నాలజీలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైందిగా పరిగణించే 28`90 నానోమీటర్ టెక్నాలజీకి సంబంధించిన స్వదేశీ తయారీ చిప్ ఈ ఏడాది చివరల్లో మార్కెట్‌లోకి రానుంది. మే 29న జరిగిన కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వార్షిక వాణిజ్య సదస్సులో ఈ అద్భుత విషయాన్ని ప్రకటించారు. 2022లో భారత్ ఈ చిప్ తయారీ రంగంలోకి భారత్ ప్రవేశించింది. కేవలం మూడేళ్ల కాలంలోనే ఈ అద్భుతాన్ని సాధించడం విశేషం. ఈ ప్రకటనతో భారత్ అంతర్జాతీయ చిప్ మార్కెట్‌లో తన వంతు వాటాను సాధించేందుకు వ్యూహాత్మకంగా చేస్తున్న ప్రయత్నంలో మరో ముందడుగు పడినట్లయింది. ముఖ్యంగా చిప్ తయారీలో టెక్నాలజీ నోడ్‌కు ప్రపంచ వ్యాప్తంగా పెద్దఎత్తున డిమాండ్ వుంది. మొత్తం చిప్ మార్కెట్‌లో 60శాతం టెక్నాలజీ నోడ్ ఆక్రమిస్తోంది. ప్రస్తుతం భారత్ ఈ రంగంలో పట్టును సాధించేందుకు వ్యూహా త్మకంగా గట్టి ప్రయ్నతం చేయనుంది. ఆటోమోటివ్, టెలికమ్యూనికేషన్, విద్యుత్ వ్యవస్థలు, రై ల్వే సాంకేతిక పరిజ్ఞానం వంటి రంగాల్లో టెక్నాలజీ నోడ్ చిప్‌లకు అత్యధిక డిమాండ్ వుంది. ప్రస్తుతం మనదేశంలో ఆరు ఫ్యాబ్రికేషన్ యూనిట్లు నిర్మాణంలో వున్నాయి. ఇదేసమయంలో దేశంలో రూ.76వేల కోట్లతో సెమికండక్టర్ ఎకోసిస్టమ్ రూపకల్పన జరుగుతోంది. దీన్ని సెమికండక్టర్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా సెమికండక్టర్ చిప్‌ల దిగుమతిపై మనదేశం పూర్తిగా ఆధారపడాల్సి వస్తున్నది. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచ వ్యాప్తం గా చిప్‌తయారీ దెబ్బతిన్న ప్రభావం మనదేశంపై బలీయంగా పడినమాట వాస్తవం. ఈ నేపథ్యంలో చిప్‌లు ప్రతి రంగానికి అత్యంత అవసరమైన నేటి కాలంలో, వీటిపై పూర్తిగా దిగుమతులపై ఆధారపడటం అంత శ్రేయస్కరం కాదని అప్పుడే భారత్ గుర్తించి, వీటి తయారీలో స్వావలంబన సాధించేందుకు అవసరమైన కృషిని ప్రారంభించింది. ఆ ప్రయత్నాల ఫలితం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చి ఈ ఏడాది చివరినాటికి మన దేశంలో తయారైన చిప్‌లు మార్కెట్‌లోకి రంగ ప్రవేశం చేయనున్నాయి. దీంతో పాటు మనదేశం ప్రపంచ చిప్ మార్కెట్‌లో వాటా సంపాదించడం తో పాటు మరింత విస్తరించేందుకు కూడా ప్రణాళికలు రచించి అమలు చేస్తోంది.
వ్యూహాత్మక ప్రకటన
దేశంలో తొలి సెమికండక్టర్ చిప్ తయారీ ప్రకటన వెనుక ఎంతో జాగరూకత, వ్యూహాత్మకత ఇమిడి వున్నాయి. చిప్‌లను స్వదేశంలో తయారుచేయడం వల్ల మనకు దిగుమతుల భారం తగ్గ డంతో పాటు గ్లోబల్ మార్కెట్‌లో ప్రవేశించడం ద్వారా దేశ ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఇదే సమయంలో సాంకేతిక రంగంలో మన సార్వభౌమాధికారాన్ని సుస్థాపితం చేయడంతో పాటు ఆర్థికపరంగా ఇతరదేశాలతో మరింత పోటీ పడేస్థితికి ఎదగవచ్చు. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ`2వ సదస్సులో మంత్రి అశ్వనీ వైష్ణవ్ చేసిన ప్రకటనలోని సారాంశం ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత డిమాండ్ వుండటంతో పాటు 60% డిమాండ్ వున్న టెక్నాలజీ నోడ్ మార్కెట్‌లోకి ప్రవేశించి సుస్థిరత సాధించడమే ప్రధాన లక్ష్యమన్నది స్పష్టం చేస్తున్నది. ఈరంగంలో మార్కెట్ గతిశీలతపై ఇప్పటికే మనదేశం ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చింది. ఈ నేపథ్యంలో దేశీయ సెమికండక్టర్ పరిశ్రమకు వాణిజ్యపరంగా బలమైన పునాది వేసేందుకు మన ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
2030 నాటికి గ్లోబల్ సెమికండక్టర్ చిప్‌ల మార్కెట్ ఒక ట్రిలియన్ డాలర్లను మించిపోనున్నదన్న అంచనాలు వెలువడుతున్న తరుణంలో మనదేశం చిప్ మార్కెట్‌లోకి త్వరలో ప్రవేశిస్తుందన్న ప్రకటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిరది. ఇప్పుడు మనదేశం ప్రధానంగా చిప్‌లకు సంబం ధించి దేశీయ అవసరాలను పూర్తిచేస్తూనే, ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశించే రీతిలో వ్యూహాలను రూపొందించి అమలు చేయాల్సి వుంటుంది. మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పిన విధంగా మనం కేవలం ఫ్యాబ్రికేషన్‌పై మాత్రమే దృష్టిపెట్టడం కాదు మొత్తం ఎకోసిస్టమ్‌ను పరిపూర్ణంగా నిర్మించా ల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఈ రంగంలో భారత్ సంపూర్ణ దృక్కోణం ఏవిధంగా వున్నదీ అర్థమవుతోంది. అంటే తయారీతో పాటు దేశీయంగా మేధోఆస్తుల అభివృద్ధి, ఉత్పత్తి డిజైన్, ప్రామాణీకరించడం వంటి అంశాలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
ప్రస్తుతం 28ా90 నానోమీటర్ సెగ్మెంట్ టెక్నాలజీపైనే మనదేశం ప్రధానంగా దృష్టిపెట్టడానికి కారణం, ప్రపంచంలో ఈ సెగ్మెంట్‌కున్న డిమాండ్ మాత్రమే! అతి చిన్న నానోమీటర్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం వెనుక ప్రధాన కారణం కేవలం దీనికున్న ప్రాసెసింగ్ శక్తి మరియు తక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకునే సామర్థ్యం. అదీకాకుండా 28ా90 నానోమీటర్ సెగ్మెంట్ ప్రస్తుతం పారిశ్రామిక రంగం, దాంతో మమేకమై పనిచేసే వ్యవస్థలకు అత్యంత కీలకం. ఇది భారత్‌లో వినియోగానికి తక్షణం అవసరం. ఇదే సమయంలో ప్రపంచ మార్కెట్‌కు కూడా దీని అవస రం చాలా అధికంగా వుంది. ఈ సెగ్మెంట్‌లో తయారీని కొనసాగించాలని నిర్ణయించడానికి మరో కారణం తయారీ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడంతో పాటు భవిష్యత్తులో మరింత ఆధునిక టెక్నాలజీ నోడ్స్ రూపకల్పనకు మార్గాన్ని సుగమం చేసుకోవడం.
సాంకేతిక ప్రత్యేకతలు మరియు అనువర్తనాలు
28`90 నానోమీటర్ సాంకేతిక పరిజ్ఞానం కేవలం ఏవో కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం కాదు. విభిన్న రంగాలకు చెందిన అనేక పరిశ్రమలకు కావలసిన సంక్లిష్ట అనువర్తనాలకు ఈ నానోమీటర్ టెక్నాలజీ ఒక వేదికగా నిలుస్తుంది. ఈ నానోమీటర్ పరిమాణంలోని అతిచిన్న చిప్‌ల కారణంగా, తయారు చేసే సెమికండక్టర్ల పరిమాణం గణనీయంగా తగ్గుతుంది. 28ా90 నానోమీటర్ రేంజ్ పనితీరు, తక్కువఖర్చు మరియు తయారీ సంక్లిష్టతల మధ్య అద్భుతమైన సమ న్వయం సాధించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ సాంకేతిక పరిజ్ఞానానికి మార్కెట్ పరంగా అత్యంత స్థితిస్థాపక లక్షణం వుంటుంది. ఫౌండ్రీ మార్కెట్ షేర్ 7.5%ను సుస్థిరంగా వుండేలా చూడగలదు. అంటే ఫ్రౌండ్రీ స్థాయిలో 15బిలియన్ యు.ఎస్. డాలర్ల మార్కెట్ అన్న మాట. ఇదే స్థితి కొనసాగితే 2030 నాటికి 200 బిలియన్ డాలర్ల మార్కెట్‌ను తేలిగ్గా సాధించవచ్చు.
దేశీయ పరిశ్రమలకు ఉపయోగం
28ా90 నానోమీటర్ రేంజ్ దేశీయ పరిశ్రమలకు ఎంతగానో ఉపయోగకరం. అంతేకాదు దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చడమే కాకుండా ఆర్థికపరంగా దేశానికి ఎంతో ప్రయోజనం చే కూరుస్తుంది. ఉదాహరణకు ఆటోమోటివ్ రంగాన్ని తీసుకుంటే ఈ చిప్‌లు ఇంజిన్ నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, ఉద్గమిస్తున్న విద్యుత్ వాహనాలకు అవసరమైన సాంకేతిక అవసరాలను ఈ 28ా90 నానోమీటర్ రేంజ్ తీర్చగలుగుతుంది. ఇక టెలికమ్యూనికేషన్ రంగం గురించి చె ప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే ఈ రంగానికి చిప్ సాంకేతిక పరిజ్ఞానం ఒకరకంగా ప్రాణం వంటిదనే చెప్పాలి. నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలు, బేస్ స్టేషన్లు, వినియోగదారుల ఉపకరణాలు, విద్యుత్ వ్యవస్థలు ఈ చిప్ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తాయి. అంతేకాదు విద్యుత్ నిర్వహణ మరియు గ్రిడ్ గరిష్టంగా పనిచేయడంలో ఇవి చాలా అవసరం. రైల్వేల్లో ఆ ధునిక సిగ్నలింగ్ వ్యవస్థల్లో ఈ చిప్స్‌ను విస్తృతంగా వాడతారు. అంతేకాదు రైలు నియంత్రణకు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాల్లో, లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్‌లో కూడా చిప్‌లు బాగా అవసర మవుతాయి.
దేశభద్రత మరింత పటిష్టం
28`90 ఎన్‌ఎం నానో టెక్నాలజీని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లు, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, హోం ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్‌లు ఈ చిప్స్ విస్తృతంగా ఉప యోగపడతాయి. ప్రస్తుతం మనదేశ ప్రాథమిక దశలో వున్న సెమికండక్టర్ పరిశ్రమ దేశంలోని బహుళ మార్కెట్ వ్యవస్థల అవసరాలను తీర్చగలుగుతుంది. కాగా మనదేశంలో సెమికండక్టర్ చిప్‌లు ఈ ఏడాది సెప్టెంబర్‌ాఆక్టోబర్ మధ్యకాలంలో మార్కెట్‌లోకి ప్రవేశిస్తాయని అంచనా వే స్తున్నారు. ఈ చిప్‌లు అందుబాటులోకి వస్తే ఆర్థికంగానే కాదు, దేశభద్రత కూడా మరింత పటిష్టమవుతుంది. ఈ నానో చిప్‌ల తయారీలో పరిణితి సాధించిన తర్వాత 14ా7 ఎన్‌ఎం చిప్‌ల తయారీకి ముందడుగు వేయవచ్చు.
శుక్రవారం అర్ధరాత్రి నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలోని పెద్దమ్మ గుడిలో గుర్తు తెలియని దుండగులు హుండీ పగలగొట్టి అందులోనీ డబ్బులు దొంగిలించినట్టు ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. అలాగే వెంకటాపూర్, నార్లపూర్ గ్రామాల్లోనీ ఆలయాలలో చోరీకి ప్రయత్నం జరిగిందని కానీ ఏలాంటి నష్టం జరగలేదని పోలీసులు పేర్కొన్నారు.
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి (సివిల్ రైట్స్ డే) ఆర్ ఐ శివరామకృష్ణ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:
చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మొగుళ్ళపల్లి రెవిన్యూ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ సూచించారు. మొగుళ్ళపల్లి మండలం కొరికి శాల గ్రామంలో శనివారం జరిగిన సివిల్ రైట్స్ డే కార్యక్రమంలో వారు మాట్లాడారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండటంతోపాటు సమస్యలపై స్పందించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను తెలుసుకోవాలని, సక్రమంగా అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్ ఐ శివ రామకృష్ణ ఏఎస్ఐ రాజేశం గ్రామాకార్య దర్శి రాజాశేఖర్ గ్రామస్థులు పాల్గొన్నారు.
వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా బచ్చురాం
వనపర్తి నేటిధాత్రి:
వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా బచ్చు రామ్ నియామక పత్రము తీసుకున్నారు పత్రం తీసుకున్నట్లు తెలిసింది వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల సందర్భంగా అధ్యక్షులుగా పోటీ చేయుటకు కోనూరు వెంకటయ్య బచ్చురాం నామినేషన్ దాఖలు చేశారు ఈ మేరకు గోనూరు వెంకటయ్య వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంగంఅధ్యక్షులుగా ఏకగ్రీవం చేయనందుకు పోటీ నుoడి తప్పుకున్నట్లు తెలిసింది
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గుండెపూడి గ్రామంలో ముత్యాలమ్మ దేవాలయం వాళ్ల నాన్న తాత గడ్డం ఆబి రెడ్డి గారు నిర్మించిన ముత్యాలమ్మ గుడి ఇప్పుడు శిథిలావస్థకు చేరుకోగా వారి వారసులు ముత్యాలమ్మ గుడి కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గడ్డం వెంకటరెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, దామోదర్ రెడ్డిలు మాట్లాడుతూ వారి తాతగారు కట్టిన గుడి శిథిలావస్థలో ఉన్న ముత్యాలమ్మ ఆలయం చూసి జిర్గించుకోలేకపోయారు. గత సంవత్సరం లో మూడాలు ఉన్నందువలన ముత్యాలమ్మ దేవాలయానికి శంకుస్థాపన చేయలేదు. దీంతో శనివారం మూల సామ్రాట్ విగ్రహాన్ని ప్రతిష్టింప చేశారు. అనంతరం త్వరలోనే ముత్యాలమ్మ దేవాలయం పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో గ్రామ ప్రజలందరికీ ముత్యాలమ్మ పండగను ఘనంగా నిర్వహించుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
గుండెపోటుతో బిల్ కలెక్టర్ ఇటీవల మరణం కుటుంబాన్ని పరామర్శించిన జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజేశ్వరరావు జమ్మికుంట :నేటిధాత్రి
జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తూ గత అయిదు రోజుల క్రితం గుండెపోటుతో చనిపోయిన పులాల కుమార్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర రావు, కుమార్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు కుమార్ చనిపోవటం చాలా బాధాకరం అని తెలిపారు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దయ్యాల శ్రీనివాస్, BRS నాయకులు బోగం వెంకటేష్ మరియు నాయకులు ఉన్నారు
ప్రభుత్వం ఏదైనా ఆలోచన మాత్రమే చేస్తుందని ఆచరణలో పెట్టాల్సింది అధికారులేనని, మీలాంటి అధికారులు సమగ్ర కార్యాచరణతో నిర్విరామంగా కృషి చేయడం వల్ల సరస్వతి పుష్కరాలు విజయవంతం అయ్యాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దిద్దుళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
శనివారం జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన జరిగిన సరస్వతి పుష్కరాలు డే ఆఫ్ థాంక్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబుపాల్గొన్నారు.
ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పుష్కరాలు ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి అలోచన మేరకు జిల్లా యంత్రాంగం 12 రోజులు 24 గంటలు నిర్విరామంగా కష్ట పడ్డారని తెలిపారు.
క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేస్తేనే అది అమలు అవుతుందని నిరూపించారని, పుష్కరాలు వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినట్లు తెలిపారు.
రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని సరస్వతి పుష్కరాల’ నిర్వహణను ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుని నిర్బహించినట్లు తెలిపారు.
పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 40 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
నిజానికి పుష్కరాల నిర్వహణ అంత తేలిక కాదని, ఏ చిన్న పొరపాటు జరిగినా, నిర్లక్ష్యంగా ఉన్నా జరిగే నష్టం అంతా ఇంతా కాదని పేర్కొన్నారు.
శాసనమండలి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది పనులు చేయడానికి ఆటంకం ఏర్పడింది, అయినా ఇంజినీరింగ్ అధికారులు పనులను.పూర్తి చేశారని అభినందించారు.
మనకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది అయినా మీరంతా కష్టపడి ఒకరికొకరు సమన్వయం చేసుకుని… ఒక టీం వర్క్ లా పనిచేసి పుష్కరాలను అత్యంత విజయవంతంగా నిర్వహించారని హర్షం వ్యక్తం చేశారు.
సుమారు 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి… ఆ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శించుకున్నారంటే అందుకు కారణం మీరేనని, మీరు పడిన శ్రమ మీరు చూపిన చొరవ విజయానికి కారణం అయ్యాయన్నారు.
జిల్లా కలెక్టర్, ఎస్పీ మార్గ నిర్దేశనంలో 33 శాఖలకు చెందిన అటెండర్ నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారి వరకూ ప్రతి ఒక్కరూ మూడు నెలలు చాలా కష్టపడ్డారని, పుష్కరాలను విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారని.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
భద్రత, నీటి సరఫరా, అన్నదానం, మెడికల్ సౌకర్యాలు, శౌచాలయాలు, విద్యుత్, పారిశుధ్యం, మీడియా కవరేజి ఇలా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేశారన్నారు.
యంత్రాంగం కృషి వల్లే తెలంగాణలో తొలిసారిగా కాశీ పండితుల చేతుల మీదుగా ప్రతి రోజు సాయంత్రం నిర్వహించిన ‘‘సరస్వతి నవరత్న మాలా హారతి‘‘ కార్యక్రమం మొత్తం పుష్కరాలకే ప్రధాన ఆకర్షణగా నిలిచిందన్నారు.
ఈ పుష్కరాల ద్వారా ఆర్టీసీకి సుమారు 10 కోట్ల ఆదాయం వచ్చిందని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశాన్ని వినియోగించుకొని లక్షలాది మంది సోదరీమణులు పుష్కరాలకు విచ్చేశారని అన్నారు.
12 రోజుల పాటు దాదాపు 9 వేల ట్రిప్పులు బస్సులు నడిచాయని తెలిపారు. కొందరు సరస్వతి పుష్కరాలు విజయవంతం కాకుండా చేయాలని కుట్రలు పన్నారని, చిన్న చిన్న అంశాలను భూతద్దంలో చూపించే ప్రయత్నం చేశారని, అయినా భక్తులు అవన్నీ ఏమి పట్టించుకోకుండా లక్షలలో పుష్కర స్నానాలు చేశారని అన్నారు. మీడియా మిత్రుల సహకారం గురించి.
ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోవాలని, ఎప్పటి కప్పుడు పుష్కరాలకు సంబంధించిన సమాచారాన్ని భక్తులకు తెలియజేసి విజయవంతంగా కావడంలో కీలక పాత్ర పోషించారని అభినందించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా మిత్రులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
మీ సహకారం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని మంత్రి తెలిపారు. స్వచ్ఛంద సంస్థల కృషి ప్రశంసనీయం. వారికి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు.
ఇది మొదటి అడుగు మాత్రమేనని రానున్న గోదావరి పుష్కరాలను మరింత వైభవంగా నిర్వహించాలన్నదే మా ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.
ఈ విషయంలో అసలు రాజీ పడబోమని, ఈ పుష్కరాల్లోని లోటుపాట్లను గుర్తించి అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన గురుతర బాధ్యత మనపై ఉందని అన్నారు.
ముఖ్యంగా యంత్రాంగం యొక్క పాత్ర చాలా కీలకమని ప్రభుత్వం మీ వెంట ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తరపున అభినందించారు
కాళేశ్వరానికి వెళ్లే జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో కాళేశ్వరం, ఇతర ప్రాంతాల్లో కొత్త బస్సు డిపోల నిర్మాణానికి శ్రీకారం చుడతామని అన్నారు.
ఓవైపు అభివృద్ధి… మరోవైపు సంక్షేమంలో తెలంగాణను దేశంలోనే తొలిస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
అందులో భాగంగానే ఉచిత బస్సు, 200 లోపు యునిట్లు ఉచిత విద్యుత్, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి లాంటి అనేక ప్రతిష్ఠాత్మక పథకాలకు శ్రీకారం చుట్టామని, అయినా…
కొందరు పనిగట్టుకొని మేం ఏమి చేయడం లేదంటూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
ఈ పుష్కరాల స్ఫూర్తితో అధికారులు మరింత జోష్ తో… టీం వర్క్ తో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆలోచనలు, ప్రాధాన్యాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అభినందించారు.
ప్రమాదంలో మరణించిన కొమరవెల్లి గ్రామస్థులకు లక్ష రూపాయలు ఎక్సగ్రేషియా ప్రకటించారు. అలాగే వడదెబ్బకు గురై మరణించిన పారిశుద్ధ్య కార్మికుని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ జిల్లా యంత్రంగా ఆశాంతం కష్టపడి పనిచేసి సరస్వతి పుష్కరాలను విజయవంతం చేసినట్లు తెలిపారు.
సరస్వతి పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహించిన యంత్రాంగం యొక్క కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి విజయానికి తోడ్పడ్డారని తెలిపారు.
ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో మంత్రి శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ పుష్కరాలు విజయవంతంగా కావడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు.
కొమరపల్లి గ్రామస్తులు ఇద్దరు వ్యక్తులు ప్రమాదంలో చనిపోయారని ప్రభుత్వం తరఫున పరిహారం అందజేయాలని సూచించారు. కనువిప్పు కలిగి విధంగా విజయవంతం చేశారని జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర మంత్రివర్యులు సిబ్బందిని అధికారులను ఆయన అభినందించారు.
రానున్న గోదావరి పుష్కరాలకు ఈ అనుభవం ఉపయోగపడుతుందని గోదావరి పుష్కరాలకు కుంభమేళాలను మైమరిపించే విధంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఏలాంటి లోటుపాట్లు రాకుండా చేసేందుకు సరస్వతి పుష్కరాల అనుభవం దోహదపడుతుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ యంత్రాంగమంతా ఒకతాటిపై నిలబడి అహర్నిశలు శ్రమించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు.
సమగ్ర ప్రణాళికలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. 12 రోజులపాటు సరస్వతి పుష్కరాలను అత్యంత విజయవంతంగా నిర్వహించామని ప్రతి ఒక్కరిని అభినందించారు.
మూడు నెలల ముందు నుంచి సమగ్ర ప్రణాళికలు చేశామని 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలను ప్రణాళికలు ప్రకారం నిర్వహించామని తెలిపారు.
రోజురోజుకు భక్తులు రద్దీ పెరిగిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించామన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు తెలిపారు.
కాళేశ్వరం చిన్న గ్రామమైనప్పటికీ 30 లక్షలు కంటే ఎక్కువ మంది భక్తులు భక్తులు వచ్చిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ 12 రోజులు రేయింబవళ్ళు విధులు నిర్వహించారని అన్నారు.
పుష్కరాలు ముందు పుష్కరాలు తర్వాత పారిశుధ్య కార్యక్రమాలు ఎంతో ప్రాధాన్యమని ఆయన తెలిపారు. విద్యుత్ శాఖ ఎలాంటి అంతరాయం లేకుండా 24*7 నిరంతరం విద్యుత్ అందించారని అభినందించారు.
వర్షాలు వచ్చి రాత్రి సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడిన 30 నిమిషాల్లో విద్యుత్ సేవలు పునరుద్ధరించారని అభినందించారు. సింగరేణి రెస్క్యూ సిబ్బంది, ఎన్డిఆర్ ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మెడికల్ సిబ్బంది వడదెబ్బ నుండి భక్తులను కాపాడారని తెలిపారు.
పోలీస్ శాఖ వాహన రద్దీ పెరుగుతున్న క్రమంలో రాత్రికి రాత్తే పార్కింగ్ ఏర్పాటు చేసి ఉచిత షటిల్ బస్సులు ఏర్పాటు చేసి భక్తులను తరలించారని తెలిపారు.
ఆర్డబ్ల్యూఎస్ నిరంతరాయ మంచినీరు సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారని అన్నారు. 45 డిగ్రీలు కంటే ఎండ తీవ్రత అధికంగా ఉన్నది, అనుకోకుండా అధిక వర్షపాతం వచ్చినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తూ ముందుకెళ్లామని తెలిపారు.
దేవాదాయ ధర్మదాయ శాఖ పనితీరును ఆయన అభినందించారు.
దేవాలయంలో భక్తులు నియంత్రణ చర్యలు రెడ్డిని చాలా బాగా మేనేజ్ చేశారని అభినందించారు.
ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి ఆదేశాల మేరకు కార్యాచరణలతో ముందుకు వెళ్ళామని సీఎస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, డైరెక్టర్ తదితరులు సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆయన తెలిపారు.
హైదరాబాద్ నుండి ప్రతిరోజు పర్యవేక్షణ చేశారని వారి సూచనలు విజయవంతానికి ఎంతగానో దోహదపడ్డాయని తెలిపారు.
అనంతరం పుష్కరాల విధులు నిర్వహించిన జిల్లా అధికారులను, సిబ్బందిని శాలువా, మెమెంటో తో అభినందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి, ఆర్టీసీ వరంగల్ ఆర్ ఎం విజయభాను, ఆర్డిఓ రవి, ఎస్పి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
** వావిలాలలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన ర్యాలీ జమ్మికుంట: నేటిధాత్రి
ఈ రోజు పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డాక్టర్ చందు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ హుజురాబాద్ పర్యవేక్షణలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల వైద్య సిబ్బంది పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ సిబ్బంది ధూమపానం చేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను సిగరెట్ వినియోగం వల్ల వచ్చే నష్టాలను పొగాకు ఒక జీవితమే కాకుండా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుందని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది భారత ప్రభుత్వం పొగాకును కొన్ని బహిరంగ ప్రదేశాల్లో వినియోగించడం నిషేధికరించింది. అందుకే ప్రతి సంవత్సరం పొగాకు, ధూమపానం చేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించేందుకు మే 31 తేదీన పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. పొగాకు వినియోగాన్ని తగ్గించుకుంటూ పోవడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యమని పొగాకును వినియోగించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో అంతేకాకుండా పొగాకును వాడడం వల్ల భవిష్యత్తు తరాలకు ఎలాంటి నష్టాలు జరుగుతాయో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవగాహన ర్యాలీలో ఎం ఎల్ హెచ్ పి డాక్టర్స్ డాక్టర్ సంధ్యారాణి,డాక్టర్ చందన, డాక్టర్ మహోన్నత పటేల్, డాక్టర్ పరహానుద్దీన్,డాక్టర్ హిమబిందు,డాక్టర్ సంధ్య, మోహన్ రెడ్డి హెల్త్ ఎడ్యుకేటర్ సూపర్వైజర్స్ రత్నకుమారి, అరుణ,కుసుమ కుమారి, సదానందం మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది నరేందర్ ,సరళ, వనజ, సావిత్రి ,సాజిదా పర్వీన్, రాధా మరియు ఆశాలు తదితరులు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.