యోగాతో ఆయుషు పెరగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.

యోగాతో ఆయుషు పెరగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు

యువత వ్యసనాలకు బానిస కావద్దు….

ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

ములుగు జిల్లా నేటిధాత్రి:
ప్రతి ఒక్కరూ యోగ చేయడం వలన వారి ఆయుషు పెరగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యకరంగా ఉంటారని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని డి బ్ల్యూ సి డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో నిర్వహించిన యోగ కార్యక్రమంలో అదనం కలెక్టర్ మహేందర్ జి, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి గోపాల్ రావు తో కలిసి జ్యోతి ప్రజ్వల చేసి కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మానసిక, శారీరక, ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు యోగా చేయాలని సూచించారు. యువతీ యువకులు వ్యసనాలకు బానిస కాకుండా మంచి ఆరోగ్యం కోసం యోగా చేయాలని అన్నారు.
ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం వేళలా కొంత సమయాన్ని కేటాయిస్తూ యోగా కార్యక్రమాలు నిర్వహించాలని, యోగ చేయడం వలన పలు రకాల వ్యాధులు దరి చేరకుండానే ఆరోగ్యకరంగా ఉంటారని అన్నారు.
అనంతరం యోగ ఆసనాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు,
జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ లీ చంద్ర, డాక్టర్ సంధ్య (జిల్లా ఇన్చార్జ్) యోగ ఇన్స్ట్రక్టర్ శ్రీ గురు శివ కృష్ణ, హరిత, మానస, లయ, ప్రియాంక, గిరివర్ధన్ లు పాల్గొన్నారు.

పొగాకు వాడటం వలన త్రోట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం వుంది.

పొగాకు వాడటం వలన త్రోట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం వుంది

మండల వైద్యాధికారి అమరేందర్ రావు

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

 

 

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న ఆదేశానుసారంతో మండల వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ రావు పొగాకు వ్యతిరేకత దినోత్సవం గురించి మండల ప్రజలు మరియు పేషంట్లతోని పొగాకు వాడడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను ప్రజలకు తెలియజేయుచు దీనిని వాడకూడదని వాడిన వారిని వాడకుండా చూడాలని చెప్పుచు అందరి చేత పొగాకు వాడకం నిరోధించుటకు ప్రతిజ్ఞ చేపించారు ఈ సందర్బంగా వైద్యాధికారి అమరేందర్ రావు మాట్లాడుతూ పొగాకుతో అనుసంధానం అయినా పాన్ మసాలాలు తంబాకులు సిగరెట్లు వాడడం వల్ల త్రోట్ క్యాన్సర్ గాని లంగ్ క్యాన్సర్ గాని వివిధ రకములైన జబ్బులు వచ్చే అవకాశం ఉండడం వల్ల ఇలాంటివి వాడకూడదని తెలియజేసి అందరికీ ఆరోగ్య విద్యా బోధన చేయడం జరిగింది. అందరితోని పొగాకు వాడమని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమం లో పి ఎచ్ ఎన్ గ్రేసీ వన్ సూపర్వైజర్స్ రమాదేవి ఎమ్ ఎల్ ఎచ్ పి లావణ్య దీప్తి మరియు ఏఎన్ఎంలు రమాదేవి స్రవంతి సునీత కళావతి దుర్గమ్మ పుష్పలత మరియు ఆశా వర్కర్స్ స్టాఫ్ నర్స్ రవళి ఝాన్సీ ల్యాబ్ టెక్నీషియన్ అనిల్ ఫార్మసిస్ట్ జగదీశ్వర్ మరియు భూపెల్లి మొగిలి పాల్గొన్నారు

మద్యం సహా ఎరువుల ధరలు పెంచిన ప్రభుత్వం.

మద్యం సహా ఎరువుల ధరలు పెంచిన ప్రభుత్వం : ఎమ్మెల్యే హరీష్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని
నెరవేర్చకపోగా కేసీఆర్ అమలు చేసిన పథకాలను కూడా నిలిపివేసిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. మొగుడంపల్లి మండలం జాడి మల్కాపూర్ గ్రామంలో జరుగుతున్న దుర్గమ్మ మాత జాతర ఉత్సవాలలో పాల్గొనేందుకు వచ్చిన హరీష్ రావు స్థానిక క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నోట్ల రద్దు చేసినా, కరోనా వచ్చిన కేసీఆర్ ఎప్పుడూ రైతుబంధు ఆపలేదని వానకాలం రైతుబంధు ఎగ్గొట్టి యాసంగిని మూడెకరాలకు పరిమితం చేశారున్నారు.
కేసీఆర్ పది వేలు ఇస్తే మేం రూ.12 వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు మళ్ళీ వానాకాలం వచ్చినా ఇప్పటివరకు రైతుబంధు ఊసే లేదు. జహీరాబాద్, నారాయణఖేడ్ లకు కేసీఆర్ హయాంలో అత్యధికంగా 100 కోట్ల రూపాయల రైతుబంధు వచ్చేది. ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు బీమా ప్రీమియం చెల్లించక పోవడంతో గత నాలుగు నెలలుగా చనిపోయిన రైతులకు బీమా సొమ్ము రావడం లేదని ఆరోపించారు. మెదక్, సిద్దిపేటకు నేషనల్ సీడ్ కార్పొరేషన్ విత్తనాలు సప్లై చేయాలని, మరికొన్ని జిల్లాలు స్టేట్ సీడ్ కార్పొరేషన్ సీడ్ పంపిణీ బాధ్యతలు అప్పగించారన్నారు.ఇద్దరు కలిసి స్టేట్ కు, ఉమ్మడి జిల్లాకు అన్యాయం చేస్తున్నారు..బీరు విస్కీ ధరలు పెంచి చివరకు విత్తనాల ధరలు పెంచిన రేవంత్ రెడ్డి ప్రజలకు మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్ర ఆదాయం పెంచి రైతులకు పంచాడని అదే మీరేం చేస్తున్నారని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. వైన్స్ ధరలు పెంచావు, జనుము, జీలుగ తదితర పచ్చిరొట్టె ఎరువుల ధరలు పెంచి రైతులకు ఇచ్చే రైతుబంధు, రైతు బీమాలు ఇస్తలేవని ధ్వజమెత్తారు. ఇచ్చేది ఎగవేస్తున్నావ్ ఉల్ట రైతుల వద్ద గుంజేస్తున్నావ్ వంటూ ..ఈ వైఖరిని ఏమనుకోవాలన్నారు. ధాన్యానికి బోనస్ బోనస్ అని బోగస్ చేసేస్తున్నావని, యాసంగిలో సన్న వడ్లకు ఇచ్చే బోనస్ రూ.850 కోట్ల బకాయిల్లో ఒక్క పైసా కూడా రైతులకు చెల్లించ లేదని ఆరోపించారు.బోనస్ పైసలు, రైతు బంధు డబ్బులు, యాసంగిలో ఒక్క పైసా ఇవ్వని రైతులను మోసం, దగా చేసిన రేవంత్ రెడ్డి ఏం మొహం పెట్టుకుని సంగారెడ్డికి వస్తున్నాడనిప్రశ్నించారు. యూరియా బఫర్ స్టాక్ తగ్గిపోయిందని, గత ప్రభుత్వం వేసవిలోనే ఎరువులు కొరత లేకుండా చూసేదన్నారు. 25 శాతం ధాన్యం ఇంకా కల్లాలోనే ఉందని కరీంనగర్ మెదక్, నల్గొండ వరంగల్ ఇతర జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసి ధాన్యం తడిసిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ లో బస్తాల్లోని ధాన్యం మొలకెత్తి రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. మెదక్ జిల్లాలో రైతులు రాస్తారోకోలు చేస్తున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదని, మంత్రులు దున్నపోతు మీద వాన పడ్డట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.అన్ని సెంటర్లలో అదే పరిస్థితి ఉందంటూ.. అధికారులు నీ మాట వినడం లేదా అని ఎద్దేవాచేశారు. అప్పుల విషయంలో తప్పుగా మాట్లాడుతూ నీ పరువునే కాక రాష్ట్రం పరువును తీయడం అది కాదని, నీ పరువు నీవు తీసుకున్న పర్వాలేదు కానీ రాష్ట్రం పరువు తీయకని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మా పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు నా సొంత నిధులని కలిపి కోటి రూపాయలతో బసవేశ్వర విగ్రహాన్ని కడితే ఈ ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారా?జహీరాబాద్ నియోజకవర్గానికి రేవంత్ ఏం ఇచ్చిండు? ఇవ్వకపోగా కేసీఆర్ ఇచ్చిన రూ.25కోట్లను వాపస్ తీసుకున్నడు. జహీరాబాద్ మున్సిపాలిటీకి కేసీఆర్ రూ.30 కోట్లు ఇస్తే వాటిని కూడా వాపస్ తీసుకున్నాడు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్ రావు వినతి మేరకు గ్రామీణ రోడ్లకు కేసీఆర్ రూ.50 కోట్లు మంజూరు చేస్తే అవి కూడా గుంజుకున్నడని ఆరోపించారు.జహీరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి కి నిజంగా ప్రేమ ఉంటే వాపస్ తీసుకున్న నిధులని వెంటనే ఇవ్వాలి. పాతవి ఇచ్చి కొత్తగా వంద కోట్ల రూపాయలని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నా. బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించడం కాదు. సంగారెడ్డి జిల్లాని సస్యశ్యామలం చేసే బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టుని పునరుద్దరించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నా. సర్పంచులు, మండల, జిల్లా పరిషత్ లకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల తరపున డిమాండ్ చేస్తున్నా. ఇక్కడి నుంచి నేరుగా జాడి మల్కాపూర్ బయలుదేరి వెళ్లి దుర్గమ్మ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయా కార్యక్రమాలలో హరీష్ రావు తో పాటు ఎమ్మెల్యే కొనేంటి మాణిక్యరావు, స్థానిక నేతలు ఎం.శివకుమార్, మాణిక్యం, గుండప్ప, రాజేందర్, విజయ్ కుమార్, శ్రీనివాస్ ఇతర జిల్లా, స్థానిక నేతలు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version