తుది ఓటర్ల జాబితా పై అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం ఎంపీడీవో లక్ష్మి నారాయణ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలంలో ఓటర్ల తుది జాబితా పై సమావేశం నిర్వహించినట్లు తెలుపుతూ మండలంలో ప్రతి గ్రామంలో ఎలక్షన్ బూతులు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎవరైనా చెత్త వ్యతిరేక కార్యాపాలకు పాల్పడకూడదని ఎలక్షన్లు సజావుగా జరిగేందుకు తగిన సిబ్బంది ఏర్పాటు చేశామని ప్రతి గ్రామంలో పోలీసుల సంరక్షణలో ఎలక్షన్ జరుగుతాయని ఈ సందర్భంగాఎంపీడీవో లక్ష్మి నారాయణ తెలిపారు ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజన్న బిజెపి మండల అధ్యక్షులు శ్రీధర్ రావు సూపర్డెంట్ రమేష్ కార్యాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

భారతీయుల్లో పెరుగుతున్న విదేశీ పర్యటన మోజు

కరోనా పరిస్థితులు దాడిన తర్వాత భారతీయుల ఆలోచనా సరళిలో చాలా మార్పులు వచ్చాయి. ఇందుకు సంకేతమే ప్రపంచాన్ని చుట్టేసి రావాలనుకునేవారి సంఖ్య గణనీయంగా పెరగడం. విదేశీ పర్యటనలకు ఎంత ఖర్చు పెట్టడానికైనా మనవాళ్లు వెనకాడటం లేదట! అంతర్జాతీయ టూరిస్ట్‌ సంస్థల లెక్కల ప్రకారం విదేశీ పర్యటనకు సగటు భారతీయుడు చేసే ఖర్చు రూ.2లక్షలు! 2023లో 2.82 లక్షల మంది విదేశాలను చుట్టి వచ్చారు. ఇందుకోసం వీరు చేసిన ఖర్చు రూ.2.82లక్షలు! 2034 నాటికి ఈ ఖర్చు రూ.4.78 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా! అంతేకాదు విదేశీ పర్యటనలకు వెళ్లేవారి సంఖ్య 8కోట్లకు చేరగలదని భావిస్తున్నారు. మనవాళ్లు మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాల పట్ల అధిక మోజు కనబరుస్తున్నట్టు ట్రావెల్‌ సంస్థలు తెలుపు తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులను మరింతగా ఆకర్షించేందుకు వివిధ దేశాలు పలు కొత్త రాయితీలు ప్రకటిస్తున్నాయి.

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం విజయవంతం చేయాలి

భజన మండలికి పోటీ తోపాటు బహుమతి ప్రధానోత్సవం

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం పత్తిపా క గ్రామంలో శ్రీ సంజీవ ఆంజ నేయ స్వామి దేవాలయంలో 07-02-2025 శుక్రవారం రోజున అదిత్యాది నవగ్రహ పున:ప్రతిష్ట , శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది.ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. అదే రోజున ఉదయం 11 గంటలకు భజన మేళ కార్యక్రమాలు జరుపబడుచు న్నాయి.కావున పాల్గొనే ప్రతి భజన బృందం డ్రెస్ కోడ్ తో పదిమంది సభ్యులతో రావాలని ఎవరి వాయిద్య పరికరాలు వారే తెచ్చుకోగల రని కోరారు.ప్రతి బృందానికి సమయాన్ని బట్టి 15 నిమిషాలలో మూడు పాటలు పాడగలరు.పాల్గొన్న ప్రతి భజన మండలికి బహుమతి ప్రశంసాపత్రాలతో సత్కరించ బడునని సంజీవ ఆంజనేయ భజన మండలి మరియు శ్రీ రామాంజనేయ భజన మండలి పత్తిపాక భక్తులు తెలియజేశారు.భజన భక్తులు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7702264370, 8790773601.

సర్వే అంతా తప్పులు తడక. రాజ్యసభ సభ్యులు “వద్దిరాజు రవిచంద్ర”.

బీసీల పట్ల కాంగ్రెస్కు చులకన భావం ఉంది.

కులగరణ సర్వేలో తప్పులను వెంటనే సరిదిద్దాలి.

క్యాబినెట్ విస్తరణలో నలుగురు బీసీలకు స్థానం కల్పించాలి.

“నేటిధాత్రి” హైదరాబాద్, ప్రతినిధి.
రాష్ట్ర ప్రభుత్వం జరిపించిన కులగణన సర్వే తప్పులతడకగా,కాకి లెక్కలతో అశాస్త్రీయంగా ఉందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వం 2011లో జరిపించిన లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3 కోట్ల 50 లక్షల 3674కాగా,2014 సమగ్ర కుటుంబ సర్వే (SKS)ప్రకారం 3 కోట్ల 68లక్షల 76వేల 544, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన సర్వేలో జనాభా 3 కోట్ల 70 లక్షల 77 వేల 544 గా నమోదయ్యిందన్నారు.పదేళ్లలో తెలంగాణ జనాభా కేవలం 2లక్షలు మాత్రమే పెరిగిందని ఈ ద్వారా పేర్కొనడం విడ్డూరంగా ఉందని ఎంపీ రవిచంద్ర ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2014లో జరిపించిన SKS ప్రకారం బీసీలు (ముస్లింలలోని బీసీలు కాకుండా) 52% అని నిర్ధారణ కాగా,అదిప్పుడు 46%శాతమేనని ప్రభుత్వం వెల్లడించడం,6% తగ్గించి చూపడం దారుణమని ఆవేదన చెందారు.బీసీల జనాభాను తగ్గించి చూపడమే కాక,ఈ తప్పులతడక సర్వే నివేదికను మంత్రిమండలి ఆమోదించడం, చట్టసభల్లో ప్రవేశపెట్టి ప్రజలకు తప్పుడు సమాచారమిచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం తీవ్ర అభ్యంతరకరమన్నారు.రాజ్యాధికారంలో బీసీలను భాగస్వాములను చేయాలన్న చిత్తశుద్ధి అధికార పార్టీలో పూర్తిగా లోపించిందని ఎంపీ వద్దిరాజు మండిపడ్డారు.కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఏ కోశానా కూడా లేదనేది ఈ అశాస్త్రీయ కులగణన సర్వేతో తేటతెల్లమయ్యిందన్నారు.బీసీల పట్ల కాంగ్రెస్ పాలకులకు చాలా చులకన భావం నెలకొందని చెప్పడానికి మంత్రిమండలి కూర్పే ఒక ప్రబల నిదర్శనమని ఎంపీ రవిచంద్ర చెప్పారు.బీసీలలో అత్యధిక సంఖ్యలో ఉన్న మున్నూరుకాపు,యాదవ, ముదిరాజ్,కుర్మలకు మంత్రివర్గంలో చోటివ్వకపోవడం,రాజ్యాధికారంలో న్యాయమైన వాటా దక్కకపోవడం శోచనీయమని ఎంపీ రవిచంద్ర ఆవేదన వ్యక్తంచేశారు.కులగణన సర్వేలో చోటుచేసుకున్న తప్పులను వెంటనే సరిదిద్దాలని, ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ కల్పించాలని, కేబినెట్ విస్తరణలో 4 గురు బీసీలకు స్థానం కల్పించాలని ఎంపీ వద్దిరాజు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు.అన్ని రంగాలలో తీవ్ర అన్యాయానికి గురవుతున్న బీసీలను బీఆర్ఎస్ మరింత సంఘటితపరుస్తూ న్యాయమైన హక్కులు,వాటా కోసం నిరంతరం పోరాడుతుందని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు.

‘‘డాలర్‌’’ కలలు ‘‘ఢమాల్‌’’!

ఆవిరైన ఆశలు..కరిగిపోయిన కలలు.

-అమెరికా కలల్లో చేదు నిజాలను మిగిల్చుకున్నారు.

usa trump effect on Indians

-బరువెక్కిన గుండెలతో దేశం తిరిగి వస్తున్నారు.

-ఇష్టంగా కష్టాలు పడినా మిగిలిన కన్నీళ్లు.

-సప్త సముద్రాలు ఆవల సంపాదన.

-దూరపు కొండల నునుపు ఆలోచన.

-చెల్లా చెదురైన యువత భవిష్యత్తు.

-కడుపు కట్టుకొని తల్లిదండ్రులు రూపాయి రూపాయి పోగేసుకున్నారు.

-అప్పులు చేసి పిల్లలను అమెరికా పంపించారు.

-పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కలలుగన్నారు.

-మా పిల్లలు అమెరికాలో వున్నారని గొప్పగా చెప్పుకున్నారు.

-గంపెడాశలతో వెళ్ళిన పిల్లలు వట్టి చేతులతో వస్తున్నారు.

-అమెరికాలో జీవితం అని కలల్లో తేలియాడారు.

-ఒక్కసారిగా కలలు చెదిరి తిరిగి వస్తున్నారు.

-ట్రంప్‌ వస్తే మరింత మేలనుకున్నారు.

-మొదటికే మోసం తెచ్చాడు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

  ఓ మనిషి ఏమిటి నీ ఆలోచన. ఎక్కడికి నీ ప్రయాణం. అంటూ ఎవరి మనసైనా ఎప్పుడైనా అడుగుతూనే వుంటుంది. నా మనసలు అమెరిక చుట్టూ తిరుగుతుంది. నా ప్రయాణం అమెరికా వైపు వెళ్లమంటోందని సమాధానం చెప్పుకుంటూ జీవితం గడిపేవారు కొంత మంది. తమకు జీవితంలో దక్కని అవకాశం తన పిల్లల ద్వారా నైనా నెరవేర్చుకొని వారి సంతోషంలో తన ఆనందాన్ని చూసుకోవాలనుకునే ప్రతి తల్లిదండ్రులు అనుభవిస్తున్న సమస్యే. కాకపోతే ఒక దశలో తండ్రి ఆలోచన..చివరి దశలో అదే తండ్రి ఆవేదన ఎలా వుంటుందో కూడా అందరూ తెలుసుకోవాలి. గత ఓ ముప్పై సంవత్సరాల కాలంగా అమెరికా పిచ్చి అందరికీ పట్టుకున్నది. అది అన్ని వర్గాలకు పాకింది. ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి అంటే అమెరికా వెళ్లడానికి ప్రిపేర్‌ అవుతున్నాడు. ఇంజనీరింగ్‌ అయిపోయింది. ఎంఎస్‌ చేయాలనుకుంటున్నాడు. అమెరికాకు వెళ్లే ఏర్పాట్లుచేస్తున్నాం అని కొందరు. మా అబ్బాయిని ఎలాగైనా అమెరికా పంపించాలి. మా పక్కింటి వాళ్ల పిల్లలు ఇద్దరూ అమెరికాలోనే వుంటున్నారు. మా ముందు వాళ్లు ఫోజులు కొడుతున్నారు. మా పిల్లలను కూడా పంపించి వారికంటే మేమే గొప్ప అనిపించుకోవాలి అనుకుంటున్న తల్లిదండ్రులు. ఇక పిల్లల మందు బాగా చదువుకో…మన ఆ బంధువులు పిల్లలు అమెరికా వెళ్లారు. ఈ బంధువుల పిల్లలు అమెరికా వెళ్తున్నారు. వాళ్లను చూసైనా బుద్ది తెచ్చుకో..బాగా చదవుకో..నా పరువు నిలబెట్టు..అంటూ పిల్లలను చిన్నప్పటి నుంచే అమెరికా ఆశల పల్లకిని ఎక్కిస్తున్నాం. వాళ్లను చూసి మరి కొందరు…ఇలా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు అందరూ అమెరికా జపం తప్ప, ఇక్కడే వుంటాం..ఇక్కడే చదువుకుంటాం..ఇక్కడే గొప్పగా బతుకుతాం అనేవారు లేకుండాపోతున్నారు. ఇక్కడ ఎంత గొప్పగా బతుకున్నా అది బతుకు కాదన్నంతగా జనం మారిపోతున్నారు. అమెరికాలో అంట్లు తోముకుంటూ బతికినా సరే అంత బంగారమైన బతుకు మరొకటి లేదన్నంతగా గొప్పలకు పోతున్నారు. రూపాయిలకన్నా, డాలర్‌ కలలు గొప్పగా వుంటాయనుకుంటారు. కనిపించని దేశాల వెంట పరుగులు తీస్తున్నారు. ఓ నలభై సంవత్సరా క్రితం అమెరికా అంటే అబ్బో అనుకునేవారు. కాని ఇప్పుడు గ్లోబలైజేషన్‌ మూలంగా అమెరికా కూడా మన పక్క ఊరే అన్నంత మాటల దూరం తగ్గిపోయింది. ఇబ్బంది కర కాలం మళ్లీ వచ్చింది. ట్రంప్‌ రూపంలో మళ్లీ చిక్కులు ఎదురౌతున్నాయి. ఇప్పుడు మీ ఊరు మాకు ఎంత దూరమో..మా వూరు మీకు అంతే దూరం అన్న లాజిక్‌ మొదటికి వచ్చింది. మన దేశం నుంచి లక్షలాది మంది వెళ్లి అమెరికాలో చదువుకునే వారు చదువుకుంటున్నారు. వ్యాపారాలు చేసే వారు చేస్తున్నారు. ఉద్యోగాలు చేసేవారు వున్నారు. చిరు వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద కంపనీలు పెట్టిన వారున్నారు. కాని చదువుకోవడానికి వెళ్లినా ఇక్కడి నుంచి పంపే సొమ్ము సరిపోక, అమెరికాలో బారీ బతుకులు బతకాలంటే కూలీ పనులు చేసుకోవాల్సిందే. ఇంట్లో వున్నప్పుడు ఇటు పుల్ల తీసి అటు పెట్టని వాళ్లయినా సరే..అంట్లు కడిగైనా అక్కడ బతకాల్సిందే. ఆ పని కోసం బతిమిలాడుకొని ఆ పని చేసుకొని సంపాదించుకొని బతకాల్సిందే..ఇదే అమెరికా జీవితం కాని..దూరపు కొండలు నునుపు. అక్కడ సంపాదించి విదేశీ మారకద్రవ్యం చెల్లించి, పన్నుల మీద పన్నులు అటూ, ఇటు కట్టి చివరకు చేతిలో కనిపించేది ఎంతైనా సరే అమెరికాలోనే బతకాలనుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోవడమే ఇందుకు కారణం. ఇండియాలో తరతరాలు కూర్చొని సరిపడ ఆస్దులున్నా సరే అమెరికాకే వెళ్లాలి. అక్కడే బతకాలి. అక్కడే ఎంజాయ్‌ చేయాలని అనుకునే వారి కధ వేరు. కాని రెక్కాడితే గాని డొక్కాడని పేదలు కూడా అమెరికా వైపు చూసుకుంటూ మబ్బుల్లో నీరు ఒలకబోసుకుంటున్నారు. తమ పిల్లలను కూడా అమెరికా పంపాలన్న ఆలోచనలతో అందిన కాడికి అప్పులు చేస్తున్నారు. కడుపు కట్టుకొని కూడబెట్టుకుంటున్నారు. ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు కూడా మిగతా సమయాల్లో మరో పని చేస్తున్నారు. ప్రతి రూపాయిని ఆదా చేసుకుంటున్నారు. ఇలా రూపాయి రూపాయి కూడబెట్టి అమెరికా పంపిస్తే తమ తల్లిదండ్రుల మీద ప్రేమ వున్న పిల్లలు ఎంత మంది వున్నారు. అసలు తమను అమెరికా పంపించిన తల్లిదండ్రులను గుర్తుంచుకుంటున్న పిల్లలు ఎంత మంది వున్నారు. తల్లిదండ్రులు బతికి వున్నారా..లేదా అని తెలుసుకుంటున్న వాళ్లు ఎంత మంది వున్నారు. రోజూ కాకపోకపోయినా వారానికో..నెలకో తల్లిదండ్రులను పలకరిస్తున్నారా? అంటే అదీ లేదు. ఎప్పుడూ బీజీ..బిజీ..అన్న సమాదానలతో సరిపెట్టుకుంటున్నారు. తమ పిల్లలు అమెరికా వెళ్తే ప్రయోజకులౌతారు. గొప్పవాళ్లవుతారు. గొప్పగా బతుకుతారు. మమ్మల్ని కూడా గొప్పగా చూసుకుంటారని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. కాని తమను తల్లిదండ్రులను మర్చిపోతున్న పిల్లలు వున్నారని తెలిసినా తల్లిదండ్రులు అమెరికా కలలు కనకుండా వుండడం లేదు. తమ పిల్లలను అమెరికా పంపించకుండా వుండలేకపోతున్నారు. కష్టాలు కొని తెచ్చుకుంటూనే వున్నారు. కష్టాలు వస్తాయని తెసినా దైర్యం చేస్తున్నారు. సమస్య తమ దాకా వచ్చేవరకు తల్లిదండ్రులు బోరు మంటున్నారు. అమెరికా వెళ్లిన పిల్లల వల్ల ఎదురయ్యే సమస్యలపై సీతారామయ్య మనవరాలు అని ఓ సినిమా వచ్చింది. కంటే కూతుర్నే కనాలి అనే సినిమా తీశారు. ఇలాంటివి అనేకం వచ్చాయి. అయినా సినిమా చూస్తారు. కాసేపు కళ్ల నీళ్లు పెట్టుకుంటారు. మర్చిపోతారు. తమ పిల్లల్ని అమెరికా పంపేందుకు రకరకాల కష్టాలు పడుతూనే వుంటారు. అవసాన దశలో పదిహేను నిమిషాలు సినిమా చూస్తూ పెట్టుకున్న కన్నీళ్లు జీవితాంతం పెట్టుకుంటున్నారు. అయినా ఎవరూ ఆగడం లేదు. ఇప్పటికైనా మనలో మార్పు వస్తుందని ఆశించాద్దాం. విదేశాలలో గొప్ప గొప్ప చదవులు చదువుకొని దేశానికి సేవ చేయడం పక్కన పెడితే, కనీసం కన్న తల్లిదండ్రులకు అవసాన దశలో చూసుకునే దిక్కులేకుండాపోతోంది. కడసారి చూపులు చూడడానికి కూడా వీలు లేకుండాపోతోంది. అడ్డాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడు బిడ్డలు కాదన్న సామెతలు నిజం చేస్తున్నారు. అయినా ఫరవాలేదని, తమ పిల్లలుతమను చూసుకోకపోయినా సరే..ఆఖరి దశలో తమ వద్దకు రాకపోయినా సరే అని కూడా పిల్లల్ని అమెరికా పంపించాలనే తల్లిదండ్రులే పెరుగుతున్నారు. అందుకే ఈ పరిస్దితి వస్తోంది. ఇప్పుడు ట్రంప్‌ ఆమెరికాకు వెళ్లిన వారిని తిరిగి పంపించేస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టుకొని అమెరికా వెళ్లిన వారిని దోషులుగా చూస్తున్నారు. దొంగలుగా ముద్రలు వేసి పంపిస్తున్నారు. నిజానికి మన దేశం నుంచి వెళ్లిన వాళ్లెవరూ అక్రమ మార్గల ద్వారా వెళ్లిన వారు కాదు. కాకపోతే అక్కడికి వెళ్లిన తర్వాత అక్రమంగా అక్కడ నివాసముంటున్నారు. అది కూడా తప్పే..ఆ దేశ చట్టాల ప్రకారం నేరమే..అందుకే అమెరికా నుంచి తిరిగి పంపిస్తున్నారు. అమెరికాలో వుండడానికి వారికి అర్హత లేదని బలవంతంగా పంపిచేస్తున్నారు. ఇది మంచి పరిణామమేనా కాదా? అన్నది ఇప్పటికిప్పుడు తెలియపోయినా రేపటి తరం ఆశల ఆవిరయ్యాయనే చెప్పాలి.. కన్నకలలు కల్లలయ్యాయనే అనుకోవాలి. అమెరికా ఆశల మీద ఇంకెవరు మోజు పెంచుకోవద్దని కూడా గుణపాఠంగా తీసుకోవాలి. అమెరికా కలల్లో చేదు నిజాలున్నాయని గమనించాలి. ఆ చేదు గుళిక ఇప్పటికప్పుడు గొంతు దిగకపోయినా, ఇక్కడ సంపాదించి అమెరికా అప్పుడప్పుడూ చూసి వచ్చే కల నెరవేరేందుకు ఉపయోపడాలని కోరుకోవాలి. అక్కడే వుండాలి. అక్కడే బతకాలి. అక్కడే భవిష్యత్తు వెతుక్కొవాలి అనేది ఆశే అయినా, అత్యాశ కాకుండా చూసుకోవాలి. స్ధోతమను ఇక్కడ కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ కూడా అవకాశాలు వెతుక్కోవచ్చు. ఇక్కడ కూడా ఆదాయ వనరులను సృష్టించుకోవచ్చు. బరువెక్కిన గుండెలతో దేశం వస్తున్నామని అనుకోకండి. బరువు దించుకొని వస్తున్నామని సంతోషంగా రండి. లక్షలాది రూపాయలు వృధా అయ్యాయని అనుకోకండి. అంతకు మించి సంపాదించుకునేందుకు కూడా ఇక్కడ అవకాశాలు వెతుక్కొండి. లేకుంటే నిపుణులులైన విద్యావంతులుగా ఉన్నత చదువులు చదువుకున్న వాళ్లు అవకాశాలు సృష్టించండి. మీరే పది మందికి ఉపాది కల్పించేలా ముందుకు సాగండి. అందుకు బ్యాంకులు కూడా సహకారం అందించే అకాశాలున్నాయి. సంపద మీరే సృష్టించండి. ఎవరిమీదో ఆధారపడుకుండా మీ కాళ్ల మీద నిలబడి, దేశానికి ఆదాయం సమకూర్చండి. ఆల్‌దిబెస్ట్‌.

నర్సంపేట పట్టణంలో అగ్నిప్రమాదం.

ఇల్లు,బట్టలు గృహోపకాలు పూర్తిగా దగ్ధం

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం…రూ.ఐదు లక్షల ఆస్తి నష్టం.

బాధితురాలు జూలూరి రేణుక

నర్సంపేట నేటిధాత్రి:

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో నర్సంపేట పట్టణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది ఈ సంఘటన మున్సిపాలిటీ పరిధిలోని 18 వ వార్డులో మంగళవారం మధ్యాహ్నం సంభవించింది. బాధితురాలు, నర్సంపేట అగ్నిమాపక కేంద్రం అధికారి రాజేంద్రం తెలిపిన వివరాల ప్రకారం నర్సంపేట పట్టణంలోని 18 వ వార్డు మహిళా సమాఖ్య భవనానికి సమీపంలో గల మంచిగా రాజు అని వ్యక్తికి సంబంధించిన పెంకుటిల్లులో తన సోదరి జూలూరి రేణుక నివాసముంటున్నది. రేణుక నర్సంపేట కరెంటు ఆఫీస్ లో అటెండర్ గా పనిచేస్తున్నది. దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రేణుక తన తమ్ముడు ఇంట్లో ఉంటూ ఉద్యోగరీత్యా ఉదయం కార్యాలయానికి వెళ్ళింది. ఇంట్లో నుండి పొగలు రావడంతో దానిని గమనించిన చుట్టుపక్కల వారు రేణుకకు సమాచారం ఇచ్చారు అలాగే అగ్నిమాపక కేంద్రానికి చరవాణి ద్వారా సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సమంత అధికారులు సంఘటన స్థలానికి చేరుకునే లోపే భారీగా పూలతో పాటు ఇంట్లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక కేంద్రం అధికారులు ఫైర్ ఇంజన్ తో మంటలు అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే లోపల భారీ ఎత్తున బట్టలు, గృహోపకారాలు, బీరువా మంటలు అంటుకొని కాలి బూడిదయ్యాయి. పెంకుటిల్లు కావడంతో పైకప్పు మొత్తం ఖాళీ ఇల్లు ధ్వంసం అయింది. అగ్ని ప్రమాదం కరెంటు షార్ట్ సర్క్యూట్ తో జరిగినట్లు గుర్తించామని ఫైర్ అధికారి రాజేంద్రం తెలిపారు. సుమారు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితురాలు రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఫైర్ అధికారి రాజేంద్రం తెలియజేశారు. ఈ నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సహాకారం అందించారు.

ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి.. బాధితురాలు రేణుక..

నిరుపేద కుటుంబానికి చెందిన నేను భక్త చనిపోయిన నాటి నుండి తన సోదరుని ఇంట్లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నానని ఈ నేపథ్యంలో అగ్నిప్రదాయానికి గురై ఇంటితోపాటు సర్వం కోల్పోయానని బాధితురాలు జూలూరి రేణుక రోధిస్తూ తెలిపింది. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఆమె కోరింది.

సామాజిక న్యాయానికి ప్రతీక ప్రజాపాలన తోట దేవి ప్రసన్న

నేటిదాత్రి భద్రాద్రి జిల్లా:

కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు పదును పెట్టి దేశంలోనే ప్రాధాన్యతను సంతరించుకున్న తెలంగాణ రాష్ట్రం కుల జనగణ.
తెలంగాణ రాష్ట్రంలో కులజనగణకు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ మంత్రుత్వనికి ప్రత్యేక ధన్యవాదాలు
బిజెపి ప్రభుత్వం దేశవ్యాప్తంగా కుల జనగనన చేపట్టాలని కోరుతున్నము
10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ బీసీలను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు సవితి తల్లి ప్రేమను వలకబోస్తుంది రిజర్వేషన్కు 33 % ఉంటే దానిని 18% తగ్గించి కెసిఆర్ బీసీలపై వివక్ష చూపించి ఇప్పుడు కవితమ్మ ఏమో బీసీల కోసం ఒక దంపుడు ఉపన్యాసం ఇస్తా ఉన్నది
కానీ కుల జనగణ సర్వే చేయించి బీసీలకు 42% శాతానికి తగ్గొద్దు అని చెప్పినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది
మంత్రి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న
మహిళా కాంగ్రెస్ నాయకురాలు
రాజేశ్వరి, రాణి,జ్యోతి, పద్మ, సౌజన్య కృష్ణవేణి, శ్రీ లక్ష్మీ, సుశీల,, స్వరూప, రూప, పార్వతి, శాంత కుమారి, జయసుధ, తదితరులు పాల్గొన్నారు

లక్ష డప్పులు వెయ్యి గొంతుల గోడపత్రికల ఆవిష్కరణ

పరకాల నేటిధాత్రి
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం మండలం కామారెడ్డి పల్లె పోచారం, వెల్లంపల్లి గ్రామాలలో లక్ష డప్పులు వెయ్యి గొంతుల సంఘీభావ ప్రచార యాత్ర మరియు గోడ కరపత్రాలను కొయ్యడ కుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల నాయకుడు ఆధ్వర్యంలో విడుదల చేశారు.గ్రామ గ్రామాన మాదిగ పల్లెలో ప్రచారం నిర్వహిస్తూ మాదిగ జాతి ఆత్మగౌరవం నిలబెట్టేందుకు ప్రతి మాదిగ ఇంటి నుంచి కదలిరావాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ పిలుపునిచ్చారు.కార్యక్రమంలో డప్పు కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొయ్యడ విష్ణు మాదిగ,కామరెడ్డి పల్లె పోచారం గ్రామాల అధ్యక్షులు కొయ్యడ చిరంజీవి,ఇనుముల కృష్ణ మాదిగలు,ఎంఆర్పిఎస్,ఎంఎస్పి మాదిగ ఉద్యోగులు,కళాకారులు మాదిగ కుల పెద్దలు పాల్గొన్నారు.

సన్యాసం అంత తేలిక కాదబ్బా!

సన్యాసం అంత తేలిక కాదబ్బా! తనపై తనకు అదుపులేని వారికి, ప్రాపంచిక సుఖాల్లో ఓలలా డుతూ ఒక్కసారి సన్యాసంలోకి రావడం ముఖ్యంగా ఈ కలియుగంలో అందరికీ సాధ్యంకాదు. ‘
సన్యాసి సుఖీ సంసారి ద్ణుఖీ అనుకుంటూ గ్లామర్‌ ప్రపంచంలో ఓలలాడి ఒక్కసారి సన్యాసం స్వీకరిస్తే, ఏ గ్లామరూ వుండని సన్యాసానికి కూడా ఓ ప్రత్యేక గ్లామర్‌ వస్తుందనడానికి మమతాకులకర్ణి గొప్ప ఉదాహరణ. ఈమెను కిన్నార్‌ అఖాడాలోకి తీసుకోవడమే కాకుండా, ఏకంగా మహామండలేశ్వర్‌ స్థాయి కల్పించడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆమెను అఖాడాలోకి ఎట్లా చేర్చుకున్నారని మరో మహామండలేశ్వర్‌ ఆచార్య డాక్టర్‌ లక్ష్మీనారాయణ్‌ త్రిపాఠిపై ప్రశ్నలవర్షం వెల్లువెత్తింది. అఖాడాలోకి ఆమెను చేర్చుకోవడమే ఇబ్బందికరమనుకుంటే ఏకంగా మహామండలేశ్వర్‌ స్థాయి కట్టబెట్టడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ స్థాయికి ఎదగాలంటేఎన్నో ఏళ్లు కఠోర దీక్ష అవసరం. శ్రీయామై మమతానందగిరిగా మారిన ఈ గ్లామర్‌ హీరోయన్‌ తో పాటు ఆమెను అఖాడాలో చేర్చుకున్న ఆచార్య డాక్టర్‌ లక్ష్మీనారాయణ్‌ త్రిపాఠిని కూడా ఏకంగా బహిష్కరించారు. ఇప్పుడు గ్లామర్‌ హీరోయిన్‌ సన్యాసి ద్ణుఖీ సంసారి సుఖీ అనుకుంటూ గోడకు కొట్టిన బంతిలాగా తిరిగి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టక తప్పలేదు

ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి

ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి

– సుందరయ్య నగర్ అర్బన్ పీ హెచ్ సీ ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల(నేటి ధాత్రి):

ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఓపీ రిజిస్టర్, ల్యాబ్, ఫార్మసీ, ఇతర రిజిస్టర్లు పరిశీలించారు. ఫార్మసీ నిర్వహణ పై పలు సూచనలు చేశారు. రోజు ఓపీ, ఈ నెలలో అర్బన్ పీ హెచ్ సీ పరిధిలో ఎన్ని డెలివరీలు కావాల్సి ఉందో ఆరా తీశారు. ప్రతి రోజూ దవాఖానలో 40 నుంచి 50 మంది వరకు వస్తారని, ఈ నెల లో అర్బన్ పీ హెచ్ సీ పరిధిలో 22 కాన్పులు కావాల్సి ఉందని కలెక్టర్ దృష్టికి వైద్యురాలు సాహితి తీసుకెళ్లారు.
అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అన్ని కాన్పులు సర్కార్ ఆసుపత్రిల్లోనే అయ్యేలా చూడాలని సూచించారు. రోగులకు కావాల్సిన అన్ని మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఇందులో ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు.

ఆపన్న హస్తం కోసం.. ఇంటర్ స్టేట్ టాపర్.. ఎదురుచూపు

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి.

మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి ప్రియాంక బాలానగర్ ఓ గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతుంది. ప్రియాంక ఇటీవల అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించల క్యాన్సర్ గా నిర్ధారణ అయింది. వైద్య ఖర్చుల కోసం రూ.30 లక్షలు అవసరమని డాక్టర్లు తేల్చారు. తల్లిదండ్రులు దినసరి కూలీలు కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో 440- 435 మార్కులు సాధించి స్టేట్ టాపర్ గా నిలిచింది. నిరుపేద కుటుంబం కావడంతో కుటుంబ సభ్యులు ప్రియాంక ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. చికిత్స కోసం డబ్బులు లేకపోవడంతో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తుంది. దాతలు ఎవరైనా.. 99510 82091, 96185 42334 ఫోన్ నెంబర్లకు గూగుల్ పే.. ఫోన్ పే చేసి, తన ప్రాణాన్ని కాపాడాలని ప్రియాంక కోరింది.

ఏకు మేకైతే..’’పికే’’ యడం కష్టం!

`‘‘పికే’’ బలపడితే బలహీన పడేది టిడిపియే.

`‘‘పికే’’ బలం.. ‘‘లోకేష్‌’’కు రాజకీయ సంకటం.

`‘‘పికే’’ చాణక్యం… చంద్రబాబు రాజకీయానికి చెలగాటం.

`‘‘పికే’’కు ఓ లెక్కుంది..సమయమొస్తే చంద్రబాబును కూడా లెక్క చేయడు.

 

`‘‘పికే’’ లెక్క వేరు..టిడిపికి చాపకింద నీరు!

`‘‘పికే’’కు ఓ లెక్కుంది…ఆ లెక్క తేలేందుకే టిడిపి పక్కన చేరింది.

`‘‘పికే’’తో దోస్తీ..పులిమీద స్వారీ!

`చిరులా జెండా పీకేసుకునే రకం కాదు!

`పొత్తు జెండాను ఎలా పీకేయాలో ఆలోచిస్తున్నారు.

`ఎలా ‘‘పీకేస్తే’’ మేలు కలుగుతుందని మంతనాలు సాగిస్తున్నారు.

`‘‘పీకేస్తే’’ ఎలాంటి సమాధానాలు చెప్పాలో కూడా కసరత్తు చేస్తున్నారు.

`అభిమానుల చేత ‘‘పికే’’ సత్తా ప్రచారం చేయించాలని చూస్తున్నారు.

`ప్లీనరీతో ‘‘పికే’’ పవర్‌ ఏమిటో కూడా చూపించాలకుంటున్నారు.

`గెలిచిన మరునాడే ‘‘పికే’’ పలికిన పలుకులు మర్చిపోడు.

`పవర్‌ పంచుకున్నంత మాత్రాన ‘‘పికే’’ సర్థకు పోడు.

`ప్రతిపక్ష పాత్రను కూడా ‘‘పికే’’ పాలనలోనే చూపిస్తున్నాడు.

`ఎక్కడ తగ్గాలో కూడా ‘‘పికే’’కు తెలుసు.

`సమయమొస్తే ఎలా పీక పట్టుకోవాలో కూడా తెలిసిందే ‘‘పికే’’ మనసు.

`అంతా బాగుంటే ‘‘పికే’’ ఎల్లకాలం దోస్తీ అంటాడు.

`జనం కోసం తప్పుకుంటున్నానని చెప్పడానికి ఎప్పుడైనా వెనుకాడడు.

`ఒక్కసారి పవర్‌ చూసిన తర్వాత ‘‘పికే’’ తన పవర్‌ వదులుకోవాలనుకోడు

 

రాజకీయాల్లో ప్రతి దానికి ఒక లెక్కుంటుది. కూడికలు కొన్సిసార్లు మైనస్‌లుకావొచ్చు. కొన్ని సార్లు మైనస్‌లే ప్లస్‌ కావొచ్చు. ఏ ఈక్వేషన్‌కు సరైన లెక్క వుండకపోవచ్చు. అవే రాజకీయాలు. అందువల్ల డిప్యూటీసిఎం. పవన్‌ కళ్యాణ్‌కు ఒక లెక్కుంది. ఆ లెక్కను ఎంత ఒద్దికగా సరిదిద్దుకుంటూ పోతున్నారో చాలా మందికి అర్దం కావడం లేదు. పైకి పవన్‌ కళ్యాణ్‌ ఆవేశాన్నే చూస్తున్నారు. కాని ఆ ఆవేశంలో కూడా లోతైన ఆలోచన వుంది. అది నెరవేరుతుందా? లేదా? అన్నది ఇప్పటికిప్పుడు సమాదానం దొరక్కపోయినా, ఖచ్చితంగా భవిష్యత్తులో లాభమే జరుగుతుంది. నిజానికి పవన్‌ కల్యాణ్‌ సీజనల్‌ నాయకుడు అని అందరూ అనుకున్నారు. కాని ఆయన సీరియస్‌ రాజకీయాలు చాలా భిన్నంగా చేస్తూ వచ్చారు. ఆ భిన్నమే వైసిపి ప్రభుత్వాన్ని నిండా ముంచేదాక తెచ్చింది. పాలు ఎన్ని వున్నా పెరుగు కావాలంటే పెరుగు చుక్క కావాల్సిందే. అదే పాలు చెడిపోవాలంటే ఒక్క ఉప్పురాయి చాలు. రాజకీయాల్లో లెక్కలు కూడా సరిగ్గా ఇలాగే వుంటాయి. ప్రతి క్షణం అప్రమత్తంగా వుండడమే రాజకీయం. ఏమర పాటు ఎవరికీ మంచిది కాదు. అందువల్ల పవన్‌ చెప్పే మాటలన్నీ నిజం కాదు. అందులో అబద్దాలు వెతికినా దొరక్కపోవచ్చు. అంత పకడ్భందీగా రాజకీయాలు చేస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు. ఈ విషయం అపర చాణక్యుడైన చంద్రబాబుకు తెలియదా? అంటే తెలుసు. కాని కొన్ని సార్లు ఎంత చాణక్యుడైనా ఏం చేయలేని రాజకీయాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు ఆవేపూరితమైన రాజకీయాలు చేసే వ్యక్తి కాదు. ఆలోచనాపూర్వకమైన రాజకీయాలు మాత్రమే చేస్తుంటారు. ఈ తరం రాజకీయాలు అందుకు భిన్నంగా సాగుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వారు కూడా ఆలోచనాపూర్వకమైన రాజకీయాల్లో ఆవేశపూరితమైన అంశాలను మేలవిస్తున్నారు. ప్రతి అంశానికి రాజకీయాన్ని జోడిస్తుంటారు. ప్రతి సారి సెంటిమెంటు రాజేయకుండా రాజకీయం చేయరు. ఎంతటి విపత్కరమైనపరిస్దితుల్లో నైనా కూల్‌గానే వుంటారు. అంతే కూల్‌గా మాట్లాడుతూ నిప్పు రాజేస్తారు. అందుకే బిజేపి ఇప్పుడు ఆ స్ధానంలో వుంది. ప్రధాని మోడీ రాజకీయం తిరుగులేని శక్తిగా మారింది. తన సమకాలీకుడైన మోడీ రాజకీయాన్నే చంద్రబాబు అంచనా వేయలేకపోతున్నారు. ఆయన దూకుడును అందుకోలేకపోతున్నారు. అదే జరిగితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయేదే కాదు. నిజానికి చంద్రబాబు అంచనాలు గతం తాలూకు చరిత్రకు సాక్ష్యాలు. అంతే కాని ఆయన విజయాలు చరిత్రకు పాఠాలుగా ఎప్పుడూ మారలేదు. అందుకే ప్రస్తుతం ఏపి రాజకీయాల్లో పాలనాపరమైన కీలక భూమికలో తెలుగుదేశం పార్టీ వున్నా, జనసేన మాత్రమే దూసుకుపోతోంది. పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలకే ప్రాదాన్యత కనిపిస్తోంది. ఇది ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కరమే. ఇప్పటికిప్పుడు సమస్యలు ఎదురుకాకపోయినా, భవిష్యత్తులో జగన్‌ కంటే పవన్‌ వల్లనే తెలుగుదేశం కొంప మునుగుతుందని చెప్పడంలో సందేహంలేదు. ఇక్కడ చంద్రబాబు ఒక్కొ మెట్టు ఎక్కిన నాయకుడు కాదు. ఒక్కసారిగా కాలం కలిసి వచ్చి అధికారం అందుకున్న నాయకుడు. కాని ఆయన రాజకీయ పరిణతి వల్ల అందలం చూశారు. ముఖ్యమంత్రి అయ్యారు. జగన్‌ కూడా ఇంచు మించి అలాంటి రాజకీయాల వల్లనే ఎదిగారు. జగన్‌ పాదయాత్ర చేసినా, ఇంకేది చేసినా ఆయన వారసత్వ రాజకీయాలను ముందు పెట్టి రాజకీయం చేసిన నాయకుడే. చెట్టుపేరు చెప్పుకొని ముఖ్యమంత్రి అయిన నాయకుడే. కాని పవన్‌ అలా కాదు. సినిమా రంగంలో వారసత్వంగా పైకి వచ్చినా, రాజకీయ రంగంలో ఆయన స్వశక్తి మీదనే ఆదారపడి వచ్చారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడంలో కూడా ఆయన స్వంత నిర్ణయాల మీదనే ఆదారపడి రాజకీయాలు చేస్తూ వచ్చారు. 2014లో తెలుగుదేశం, బజేపిలతో కలిసి రాజకీయం చేశారు. కాని రాజకీయంగా ఎదగాలనుకున్నా కాలం కలిసి రాలేదు. ప్రజా సమస్యలే తన రాజకీయ ఎజెండా అనుకున్నారు. కాని రాజకీయ ఎజెండా వేరు, ప్రజా సమస్యలు వేరు అని తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌కు పూర్తిగా క్లారిటీ వచ్చింది. ఎలాంటి అడుగులు వేస్తే రాజకీయాల్లో ఒక్కొ ఇటుక పేర్చుకుంటూ వెళ్లాలో దారి కనుక్కున్నాడు. ఆ దారినే ఎంచుకున్నాడు. ఎందుకంటే 2019లో ఆయన ఒంటరి పయనం అనేక పాఠాలే, కాదు గుణపాఠాలు,అనుభవాలు నేర్చుకునే అవకాశం ఏర్పడిరది. వ్యక్తిగతంగా రాజకీయాల్లో తనస్దానమేమిటో తెలిసింది. అభిమానులతోనే రాజకీయాలు సాద్యం కాదని పూర్తిగా తెలుసుకున్నాడు. నిజానికి ప్రజారాజ్యమప్పుడే ఆ విషయం అర్ధమైనా అప్పటి ఉమ్మడి రాజకీయాలను అంచనా వేయలేకపోయారు. అందుకే చిరంజీవి రాజకీయాలు జెండా పీకేసేదాకా తెచ్చుకున్నారు. కాని పవన్‌ అలా కాదు. తన జెండాను ఎవరూ పీకేంత శక్తి వంతులు ఎదురుగా లేకుండా చేసే రాజకీయాలు చేయాలనుకున్నారు. అది ఆయనకు ఎంత మేలు చేస్తుందో..అంతే నష్టం తెలుగుదేశం పార్టీకి జరుగుతుంది. ఒక ఒరలో రెండు ప్రాంతీయ పార్టీలు ఇమడలేదు. ఇమిడినా ఎంతో కాలం కలిసి రాజకీయాలు చేయలేరు. ఎన్నికల సమయం వచ్చినప్పుడు వాటి రంగులు బైట పడిపోతాయి. ఎందుకంటే పవన్‌ ఎళ్లకాలం తెలుగుదేశం పార్టీకి గొడుగు పట్టే రాజకీయాలు చేస్తారనుకోవద్దు. ఆయన రాజకీయ లక్ష్యం ఆయనకు వుంది. ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలన్న కోరిక కూడా పవన్‌కు బలంగా వుంది. కాకపోతే ఆ అవకాశం కోసం ఎంత కాలమైనా ఎదురుచూడొచ్చు. చూడకపోవచ్చు. రాజకీయాల్లో అవకాశం వచ్చినప్పుడు గద్దలా అధికారాన్ని తన్నుకుపోయే రాజకీయాలకే విలవెక్కువ. లేకుంటే మరో పార్టీ పాగా వేస్తుంది. ఇక ఏపిలో రెండు భిన్న దృవాలే ప్రత్యర్ది రాజకీయాలు భవిష్యత్తులో చేసే ఆస్కారం వుంది. ఎవరు ఔనాన్నా, ఎవరు కాదన్నా చంద్రబాబు ఆరోగ్యంగా వున్నంత కాలమే తెలుగుదేశం పార్టీ ఆధిపత్య రాజకీయాలు చేసే అవకాశం వుంటుంది. ఎందుకంటే మర్రి చెట్టు లాంటి చంద్రబాబు నాయకత్వంలో లోకేష్‌ లాంటి నాయకత్వం కూడా ఎదుగుతుందని అనుకోలేం. ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్‌కు పూర్తి స్వేచ్చనిప్పుడే తెలుగుదేశంలో కొత్త తరం రాజకీయాలు ఆవిషృతమౌతాయి. తాను వేలు ఎల్లకాలం వేలు పట్టుకొని నడిపిస్తానని అనుకుంటే లోకేష్‌ రాటు దేలలేరు. ఏ రాజైనా ఆరోగ్యంగా వున్నప్పుడే వారసులకు యువరాజు పట్టాభిషేం చేస్తారు. దాంతో ఆటోమెటిక్‌గా రాజు వున్నా, యువరాజు మాటలే చెల్లుతాయి. మహాభారతం మనకు గొప్ప రాజనీతిని అందిస్తుంది. దృతారాష్ట్రుడు రాజైనప్పటికీ దుర్యోధనుడే రాజ్యబారం మోశాడు. రాజకీయం నెరిపాడు. అందుకే ఇప్పుడు చంద్రబాబు ఆ పాత్రను పోషిస్తేనే లోకేష్‌ రారాజౌతారు. లేకుంటే రాజకీయాల్లో తండ్రి చాటు బిడ్డగానే మిగిలిపోతారు. ఎప్పుడైనా స్వయం ప్రకాశానికే విలువ ఎక్కువగా వుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు స్వయం ప్రకాశమే. లోకేష్‌ కూడా అదే స్వయం ప్రకాశాన్ని అందుకోవాలి. అప్పుడే పార్టీకి మరో అర్ధ దశాబ్దమైన మనుగడలో వుంటుంది. లేకుంటే పవన్‌ ముందుకొస్తారు. తెలుగుదేశం రాజకీయాలను హైజాక్‌ చేస్తాడు. ఎన్నటికైనా పవన్‌ కళ్యాణ్‌ చీల్చగలిగేది తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకునే తప్ప, వైసిపి ఓట్లను టచ్‌ చేయలేరు. కూమిటి ఓట్లనే పవన్‌ తన వైపు తిప్పుకుంటారు. ఇది ముఖ్యంగా లోకేష్‌ గమనించాలి. లేకుంటే పికే ఏకు మేకౌతాడు. తెలుగుదేశం పార్టీకి ఎర్తవుతాడు. పవన్‌ కల్యాన్‌ ఇంకా పదేళ్లయినా తెలుగుదేశంతో వున్నా, చంద్రబాబు నాయకత్వంలో కలిసి పని చేయడానికి ఇష్టపడతాడే గాని, లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కలలో కూడా అనుకోడు. అందువల్ల లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయకపోతే, పవన్‌ ఏనాటికైనా ఏపికి ముఖ్యమంత్రి అవుతారు. పవన్‌ ముఖ్యమంత్రి కావొద్దంటే ముందు లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలి. ఎందుకంటే ఎల్ల కాలం మంత్రిగానో, ఉప ముఖ్యమంత్రిగా వుండడం పవన్‌ లక్ష్యంకాదు. రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు కాదు. ఎవరూ శాశ్వత శత్రువులు కాదు. అందరూ అవకాశవాదులే. అందరిదారి అధికారం సొంతం చేసుకోవడమే.. పార్టీ పెట్టి, పదిహేనేళ్లు కొట్లాడిన పవన్‌ పవర్‌ కావాలని కోరుకోవడంలో తప్పు లేదు. తెలిసి,తెలిసి తెలుగుదేశం మేలుకోకపోతే తప్పు.

డ్రగ్స్ కేసులో అరెస్టయిన తెలుగు సినీ నిర్మాత గోవాలో ఆత్మహత్య

NETIDHATHRI HYDERABAD: తెలుగు సినీ నిర్మాత డ్రగ్స్ వ్యాపారిగా మారిన కేపీ చౌదరి అలియాస్ సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి గోవాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, చౌదరి మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ అయినప్పటి నుండి గోవాలో ఆత్మహత్య చేసుకోవడంతో పాటు ఆర్థిక సమస్యలతో కలత చెందాడని ఫిల్మ్ సర్కిల్స్‌లోని అతని స్నేహితులు చెప్పారు.

ఖమ్మం జిల్లాకు చెందిన కె.పి.చౌదరి 2016లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.తెలుగు సినిమా కబాలికి నిర్మాతగా వ్యవహరించారు. 2023లో 93 గ్రాముల కొకైన్‌తో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

చౌదరి ఖాతాదారులు తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటులు మరియు నటీమణులతో సహా సినీ సర్కిల్‌లలో మరియు వ్యాపార వర్గాల్లో కూడా విస్తరించి ఉన్నారని పోలీసులు కనుగొన్నారు.

అతను నైజీరియన్ జాతీయుడైన పెటిట్ ఎబుజర్ నుండి గంజాయిని సేకరించాడని మరియు దానిని తన సర్కిల్‌లలో స్వీయ వినియోగం మరియు సరఫరా కోసం ఉపయోగిస్తున్నాడని నివేదించబడింది. అతను గతంలో HNEW చేత అరెస్టు చేయబడిన డ్రగ్ కింగ్‌పిన్ ఎడ్విన్ నూన్స్‌తో కూడా సంబంధం కలిగి ఉన్నాడు.

గోవాకు మకాం మార్చిన చౌదరి అక్కడ క్లబ్‌ను ప్రారంభించాడు. అయితే, అతని వ్యాపారం మునిగిపోయింది. అతను ఇతర సినిమాలకు పంపిణీదారుడు కూడా. అతను నష్టాల్లో కూరుకుపోయినప్పటికీ, చౌదరి పరిశ్రమలోని ప్రముఖులతో మంచి సంబంధాలను ఏర్పరచుకున్నాడు.

బార్ సీజ్ ఎత్తివేయాలని కమిషనర్ కు వినతి 

– హైకోర్టు నుండి మధ్యంతర ఉత్తర్వులు జారీ

– బార్ యజమాని జిందం మహేందర్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చిత్రబార్ అండ్ రెస్టారెంట్ ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ బకాయి ఉన్నందున ఇటీవలే మున్సిపల్ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బార్ యజమాని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో బార్ ని ఓపెన్ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కాగా బార్ అండ్ రెస్టారెంట్ యజమాని జిందం మహేందర్ తమ వ్యాపారాన్ని ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ బకాయిలు ఉన్నాయని తాత్కాలికంగా కమిషనర్ సీజ్ చేశారని, అదే రోజు బకాయి వెంటనే చెల్లించి సంబంధిత రసీదు మున్సిపల్ కార్యాలయంలో అందించామని అయినప్పటికీ ఇప్పటివరకు బార్ సీజ్ ఉత్తర్వులను ఎత్తివేయలేదని, కోర్టు ఉత్తర్వులను తీసుకొని బార్ ను యధావిధిగా కొనసాగించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఇది ఇలా ఉండగా శనివారం రాత్రి 8 గంటలు అవుతున్న కూడా బార్ సీజ్ ను ఎత్తివేయలేదని జిందం మహేందర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసారు 

– కాళేశ్వరం మీ అవినీతికి నిదర్శనం 

– కేకే మహేందర్ రెడ్డి 

సిరిసిల్ల(నేటి ధాత్రి):

సిరిసిల్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం 

ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ 

 నేను కొడితే మాములుగుండదని అంటున్న కెసిఆర్, నువ్వు ఫామ్ హౌస్ లో మందు కొట్టుకుంటూనే ఉంటున్నది ప్రజలందరికి తెలుసన్నారు. సంతకం పెట్టక పోతే తన నౌకరి పోతుందని, అసెంబ్లీ కి వచ్చాడని ఏద్దేవా చేశారు.16 వేల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని అన్నారు.కాళేశ్వరం మీ అవినీతికి నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లు పాలించిన, ఒక్క పార్టీ భవనాన్ని నిర్మించలేదని అన్నారు. అన్ని అద్దె భావనాలేనని, మీ పార్టీ ఫండ్ 1160 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నంచారు. నీ ఉనికి కాపాడుకోవడం కోసం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవద్దని అన్నారు.ఈ కార్యకమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చక్రధర్ రెడ్డి,గడ్డం నర్సయ్య, సూర దేవరాజ్,ఆకునూరి బాలరాజు, మహిళా నాయకురాళ్లు కల్లూరి చందన, శరణ్య తదితరులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా సాగిన పోలీస్ ,జర్నలిస్ట్ ల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్

*గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా), నేటిధాత్రి :*

గుండాల మండల కేంద్రం నిట్ట వారి మైదానం లో శనివారం నాడు వ్యాపారవేత్తలు పట్వారి వెంకన్న, మాడె మంగయ్య సహకారంతో పోలీస్ ,జర్నలిస్టుల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. గుండాల సీఐ రవీందర్ వారి సిబ్బంది, జర్నలిస్టులు మొత్తం మూడు మ్యాచుల్లో ఉత్సాహంగా పాల్గొనగా చెరొక మ్యాచ్ను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని నిత్యం బిజీగా ఉండే పోలీసులు, జర్నలిస్టులు ఆహ్లాదకరంగా గడిపినట్లు తెలిపారు. జర్నలిస్టులు పోలీసుల మధ్య మంచి కోఆర్డినేషన్ ఉండడానికి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగిందని అన్నారు. అనంతరం గెలుపొందిన రెండు జట్లకు వ్యాపారవేత్త మానాల వెంకన్న షీల్డ్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, జర్నలిస్టులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

బీసీలకోసం గళమెత్తుతున్న తీన్మార్‌ మల్లన్న

నేడు వరంగల్‌లో బీసీల సభ

కులాల మధ్య పొత్తులుంటేనే బీసీల ఐక్యత సాధ్యం

జనం వుంటే ఏం లాభం? పదవులకు దూరం!

అధికారం ఒకరిచ్చేది కాదు…సాధించుకునేది

బీసీలు తమ సామర్థ్యం తెలుసుకోవాలి

సామర్థ్యం, వనరులు పెంచుకుంటే రాజ్యాధికారం బీసీలదే

వెనుకబడిన తరగతుల వారికే రాజ్యాధికారం రావాలన్న లక్ష్యంతో తన రాజకీయ పోరాటాన్ని తీన్మార్‌ మల్లన్న తాను ఏ పార్టీలో వున్నా బీసీల వాణిని వినిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే వరంగల్‌లో ఫిబ్రవరి 2న బీసీల సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు రెండు నుంచి మూడులక్షలమంది హాజరు కాగలరని నిర్వాహకుల అంచనా. బీసీల ఐక్యత కోసం తీన్మార్‌ మల్లన్న మొదట్నుంచీ కృషి చేస్తున్నారు. బీసీలు కలిసిపోతే రాజ్యాధికారం సాధించవచ్చునన్నది ఆయన దృఢ విశ్వాసం. ఈదిశగానే ఆయన బీసీల్లో వున్న అనేక కులాలవారిని ఒక్కతాటి మీదకు చేర్చి రాజ్యాధికారాన్ని ఈ వర్గాలకు వచ్చేలా చేయాలన్నది ఆయన ఆకాంక్ష. ఇందుకోసంఆయన అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని సేకరించి బీసీల సాధికారతో కోసం అలుపెరుగ కుండా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన బీసీల కులాలవారీగా జనసంఖ్యను వివరిస్తూ వారి బలమెంతో తెలియజేసేందుకు యత్నిస్తున్నారు. కులాలుగా విడిపోవడం కాదు, అంతా ఒక్కటై పోరాటం చేయాలని తెలంగాణలో నిర్వహించే సభల్లో ఆయన బీసీలకు పిలుపునిస్తున్నారు. బలమైన వర్గంగా వున్న బీసీలు, ఓసీల్లోని పేదలను కూడా ఆదుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడం ఆయనలోని విశాల భావాన్ని తెలియజేస్తోంది.

ఇక తెలంగాణ జనాభా విషయానికి వస్తే 2024 జులై 1 నాటికి మొత్తం తెలంగాణ జనాభా 3.83 కోట్లు. 2016 సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం బీసీల మొత్తం జనాభా 18159732 మంది. వీరిలో బీసీ(ఎ) గ్రూపు మొత్తం జనాభా 3040376 కాగా బీసీ(బి) గ్రూపుకు చెందినవారు 5602786, బీసీ(డి) గ్రూపు 6635939 మంది వున్నారు. ఈవిధంగా జనాభా పరంగా బలీయంగా వున్న బీసీలకు తమ సొంత బలాన్ని తెలియజేస్తూ, రాజకీయాలను శాసించాలని ఆయన గట్టి పిలుపునిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ఆయన ప్రధాన డిమాండ్‌ బి.సి.లకు 42శాతం రిజర్వేషన్‌ వర్తింపచేయాలని. ఎప్పటికైనా బీసీలకే రాజ్యాధికారం దక్కు తుందన్న ప్రగాఢ విశ్వాసం ఆయనది. జనాభాలో అంతపెద్ద సంఖ్యలో బీసీలున్నప్పుడు వారికి రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించేది కేవలం రూ.50 కోట్లంటే ఇదేమైనా ముష్టి వేస్తున్నట్టా? అని ఆగ్ర హంగా ప్రశ్నిస్తారు. బీసీలకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.9వేల కోట్లు కేటాయించాలనేది ఆయన ప్రధాన డిమాండ్‌. గత ఏడాది కాజీపేటలో జరిగిన బి.సి.ల శంఖారావం సభల్లో ఆయన మాట్లాడు తూ 42శాతం రిజర్వేషన్‌ సదుపాయాన్ని కల్పించకపోతే వెనుకబడిన వర్గాల వారి ఆధ్వర్యంలో పెద్ద భూకంపమే సృష్టిస్తానని హెచ్చరించారు. కేవలం బీసీల ఓట్లతోనే తాను గెలిచానన్న సంగతి గుర్తుచేశారు. అంతేకాదు బలమైన వర్గాలుగా వున్న బీసీలు, ఓసీల్లోని నిరుపేదలపై కూడా దృష్టిపెట్టాలని ఆయన ఉద్దేశం. కులాలవారీగా బీసీల ఓట్లు చీలిపోయిన నేపథ్యంలో, ఈ కులాలమ ధ్య పొత్తులు కుదరాలి. ఆవిధంగా పొత్తు కుదిరిన తర్వాత బీసీ కులాలన్నింటిలో ఉన్న వివిధ నిపుణులతో కలిసి ఒక జేఏసీ ఏర్పాటు చేయాలని తీన్మార్‌ మల్లన్న ఆకాంక్ష. ముఖ్యంగా వెనుకబడిన అన్ని కులాల మధ్య పొత్తు కుదిరితే అవి బలమైన వర్గంగా మారి రాజకీయాలను శాసించగలు గుతాయి. ఇప్పటివరకు ‘మేమెంతో మాకంత’ అనే దశనుంచి ‘మీరెంతో మీకంత’ అని ఓసీలకు చెప్పే స్థాయికి బీసీలు ఎదగాలి. అంటే జనాభా లెక్కల ప్రకారం బీసీల జనాభా ఎంతో స్పష్టమైంది. ఓసీలు, ఎస్సీలు, ఎస్సీలు కలిసి పావు షేరు వుంటే, మిగిలినవారంతా బీసీలే. అందుకనే ‘మీరెంతో మీకంత’ అనేది! బీసీల ఉద్యమంపై ఏ ఒక్క రాజకీయపార్టీ నోరు మెదపడానికి భయపడుతున్నదంటే, ఈ ఉద్యమం ఎంత బలంగా ఉన్నదో అర్థం చేసుకోవాలని మల్లన్న అంటా రు. ఉద్యమం బలంగా వుంటేనే ఎవ్వరూ నోరెత్తరనేది ఆయన అభిప్రాయం.

బీసీలకు ఏవిధంగా అన్యాయం జరుగుతున్నదో ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఉదాహరణగా తీసుకొని వివరించిన విధం విశ్లేషణాత్మకంగా వుండటం గమనార్హం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9,42,312 మంది బి.సి. జనాభా వుంటే ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేడు. అదే 2,97,659 ఓసీలుంటే వారికి మూడు సీట్లు ఇవ్వడం ఎంతవరకు న్యాయం? అసలు ఇంతమంది బీసీ జనాభా ఉన్నప్పటికీ వారికి సీట్లెందుకు కేటాయించలేదు? గెలవడం గెలవకపోవడం తర్వాతి ముచ్చట. ఇది అన్యాయం కదా. అంటే రాజకీయ పార్టీలు కొంతమంది తమకోసం పెట్టుకున్నారు కనుక బీసీలకు సీట్లు ఇవ్వలేదు. అసలు వీరి సంగతే వాళ్లకు పట్టదు. అదీకా కుండా మనం ఎన్నికల్లో పార్టీ గుర్తులకు మాత్రమే ఓటేస్తాం. అందువల్ల మనకు బీసీల సంఖ్య, బలం, జనాభా అనే సంగతులు మనకు తెలియవు. ఇదీ ఆయన విశ్లేషణ.

నాయీ బ్రాహ్మణుల చరిత్ర

1947ా2024 మధ్యకాలంలో నాయీ బ్రాహ్మణుల (మంగలి)కు చెందిన వారు ఎవ్వరూ మండలి, అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఎన్నికవలేదు! అసలు వాళ్లకు అవకాశం కల్పిస్తేనే కదా? సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణుల జనాభా 309798. వీరిజనాభాలో సగం కంటే తక్కువ జనాభా వున్న వెలమ సామాజిక వర్గం నుంచి 14 మంది అసెంబ్లీకి వెళ్లారు. ఇ దేం విచిత్రం! తక్కువ జనాభా ఉన్న జాతులు క్రమంగా అంతరించి పోతాయన్నది అంబేద్కర్‌ సి ద్ధాంతం. కానీ ఇక్కడ అందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. నిజానికి నాయీ బ్రాహ్మణుల రాజ్యపాలన చరిత్ర క్రీ.పూ.362నాటిది. అదే సంవత్సరంలో మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తి నాయీ బ్రాహ్మణుడే. ఆయన పేరు మహాపద్మానందుడు. ఆయన చక్రవర్తి ఎట్లా అయ్యాడంటే శిశునాగులు పరిపాలిస్తున్న కాలంలో వారికి క్షవరం, వైద్యపరమైన సపర్యలు చేయడానికి ఈ మహాపద్మనందుడు వుండేవాడు. ఈయన్ను శిశునాగులు ప్రతిరోజు అవమానించారు. చివరకు ఈ అవమానం భరించలేక తనవద్దనున్న కత్తితో ఆ కుటుంబాన్ని మొత్తాన్ని చంపేస్తాడు. తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకొని, చుట్టుపక్కల రాజులను ఓడిరచి చక్రవర్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నా డు. ఆయన వద్ద లక్షకోట్ల కిలోల బంగారం వుండేదట. దాన్ని గంగానది గర్భంలో దాచిపెట్టాడన్నది చారిత్రక కథనం. కరీంనగర్‌ జిల్లా రామడుగు వద్ద ఇటీవల ఒక పు రాతన విగ్రహం బయటపడిరది. ఇది మహాపద్మనందుడి కాలం నాటిది. అటువంటి చరిత్ర నా యీ బ్రాహ్మణులది. స్వాతంత్య్రానికి పూర్వం వీరిని ఎస్సీ వర్గంగా నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం గు ర్తించింది. స్వాతంత్య్రానంతరం వీరిని జనరల్‌ కేటగిరీలోకి చేరిస్తే, అనంతరామన్‌ కమిషన్‌ సిఫారసు మేరకు వీరిని బీసీాఎ గ్రూపులో కలిపారు. ఇదీ వారి చరిత్ర. తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిది ఒక నాయీ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన నాయీబ్రాహ్మణుడు. మరి మన తెలంగాణలో మంగలివారి పరిస్థితేంటి?

ప్రతి కులంలో ప్రతిభ అనేది దాగివుంటుంది. అటువంటి వారిని వెలికి తీసి ప్రాధన్యత ఇస్తే త ప్పక పైకొస్తారు. కానీ అగ్రకులాలు బీసీలను ఎదగనీయకుండా చేయడంతో వీరిలోని ప్రతిభ అణగారిపోయింది. తమ సామర్థ్యం తాము తెలుసుకోలేని దుస్థితికి దిగజారారు. ఈ దీన స్థితినుం చి బయటపడి, రాజ్యాధికారం కోసం పోరాటం చేయడం, అందుకు అవసరమైన సామర్థ్యాన్ని, వనరులను పెంపొందింపజేసుకోవడం బీసీల తక్షణ కర్తవ్యమని తీన్మార్‌ మల్లన్న వారిలో చైతన్యాన్ని ఉద్దీప్తం చేస్తున్నారు. ఒక గట్టి బీసీ నేతగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తు న్నారు. మరి బీసీల రాజ్యాధికార సాధనలో ఆయన ఎంతవరకు కృతకృత్యులవుతారన్నది కాలమే నిర్ణయించగలదు.

ప్రచారంలో దూసుకుపోతున్న నరేందర్‌ రెడ్డి

`కాంగ్రెస్‌ అభ్యర్థిగా పార్టీ అధికారిక ప్రకటన

`ఇతర పార్టీల అభ్యర్థులు ఎవరూ నరేందర్‌ రెడ్డికి పోటీ అసలే కాదు

`ఆరు నెలల నుంచే నరేందర్‌ రెడ్డి విసృత ప్రయత్నాలు

`పార్టీ అధిష్టానంతో గతంలోనే చర్చలు

`అధిష్టానం సూచన మేరకే రంగంలోకి దిగిన నరేందర్‌ రెడ్డి

`పట్టభద్రుల ఎన్‌రోల్‌ మెంట్‌లో అందరికంటే ముందున్నారు

`ఈ ఏడాదిలోనే ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు నరేందర్‌ రెడ్డికి కలిసి వచ్చే అంశం

`ప్రభుత్వం మీద పట్టభద్రులలో మరింత నమ్మకం

`నరేందర్‌ రెడ్డి కి ఉద్యోగాల కల్పన బాగా కలిసొచ్చే అంశం

`నరేందర్‌ రెడ్డి విద్యా సంస్థల విద్యార్థులే లక్షల్లో వుంటారు

`వాళ్లంతా నరేందర్‌ రెడ్డి నాయత్వాన్నే బలపరుస్తారు

`నాలుగు ఉమ్మడి జిల్లాలలో అత్యధిక శాతం పట్టభద్రులు కరీంనగర్‌ జిల్లాలోనే వున్నారు

`తెలంగాణలో విద్యా సంస్థల అధినేతగా గుర్తింపు

`కరీంనగర్‌లో అందరికీ సుపరిచితులు

`విద్యా వ్యవస్థపై పూర్తిగా పట్టున్న విద్యా వేత్త

`నిరుద్యోగ సమస్యలపై పూర్తి అవగాహన వున్న వ్యక్తి

`ఏ రకంగా చూసినా గెలిచేందుకు అన్ని రకాల దారులున్న నాయకుడు

`పార్టీలకతీతంగా వ్యక్తిగతంగా అందరివాడు

`ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు

`ఇతర అభ్యర్థుల కన్నా ముందున్నారు

`ఇతర పార్టీల అభ్యర్థుల ఎవరూ నరేందర్‌ రెడ్డికి సమీపంలో వున్నట్లు కూడా లేదు

`నరేందర్‌ రెడ్డి విజయం ముందే నిర్ణయం జరిగినట్లే అని చర్చించుకుంటున్నారు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్దిని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఆల్‌ఫోర్స్‌ విద్యా సంస్దల అదినేత డాక్టర్‌. వి. నరేందర్‌రెడ్డి పేరును కాంగ్రెస్‌ పాఈ్ట అధిష్టానం ఖరారు చేసింది. కాంగ్రెస్‌ పార్టీలో అన్ని వర్గాలకు అనువైన, అనుకూల వ్యక్తిగా నరేందర్‌ రెడ్డికి పేరుంది. వ్యక్తిగా అందరి తలలో నాలుకలా వుండే నాయకుడు నరేందర్‌ రెడ్డి. అందుకే కాంగ్రెస్‌ పార్టీ నరేందర్‌ రెడ్డిని ఎంపిక చేస్తే పట్టభద్రులు ఎమ్మెల్సీ గెలుపు మరింత సునాయాసమౌతుందని నిర్ణయం తీసుకున్నది. అయితే నరేందర్‌ రెడ్డి పేరు ఇప్పుడు ప్రకటించినా గతంలోనే ఆయనను పార్టీ అధిష్టానం పిలిపించుకొని వివరాలు కనుగొన్నది. ఆయనతో అనేక విషయాలు చర్చించింది. విద్యా రంగం, యువత, నిరుద్యోగ, ఉపాది వంటి అనేక అంశాలపై నరేందర్‌ రెడ్డికి వున్న అవగాహన చూసి అదిష్టానం మెచ్చి ఎట్టకేలకు ఆయనను ఖరారు చేసింది. విద్యారంగంలో సుమారు 40 సంవత్సరాల విశేష అనుభవం నరేందర్‌రెడ్డికి వుంది. నరేందర్‌ రెడ్డిని పిలిపించుకున్నప్పుడే గ్రౌండ్‌ వర్క్‌ చేయమని అధిష్టానం ఆదేశించింది. దాంతో ఆయన గత ఆరు నెలలుగా విశేషమౌన కృషి చేస్తూ వస్తున్నారు. పార్టీలో ఎలాంటి చర్చలు జరుగుతున్నా పార్టీ అదిష్టానంపై నమ్మకంతో, అంకితబావంతో పెద్దఎత్తున పట్టభద్రుల ఎన్‌రోల్‌ మెంట్‌ నాలుగు జిల్లాలో చేపట్టారు. అందరింటే ముందున్నారు. అంతే కాకుండా నరేందర్‌రెడ్డికి పార్టీపై వున్న అపారం నమ్మకంతో తన ప్రచారాన్ని కూడా ఎప్పుడో ప్రారంభించారు. నాలుగు జిల్లాలకు చెందిన కాంగ్రెస్‌ పార్టీపెద్దలు, నాయకులు, ఆయా జిల్లాలో వున్న పట్టభద్రులను కలిసి తనను గెలిపించాలని కోరడం జరిగింది. వాళ్లందరికీ రెగ్యులర్‌గా టచ్‌లో వుంటూ వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. తాను ఎమ్మెల్సీ అయితే సమాజానికి ఎలాంటి మేలు జరుగుతుందో కూడా వారిని ఒప్పించే ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. దాంతో ప్రచారంలో అందరికన్నా నరేందర్‌ రెడ్డి ముందున్నారని చెప్పడంలో సందేహం లేదు. పైగా పట్టభద్రుల సంఖ్య ఎక్కువగా వున్న కరీంనగర్‌ జిల్లాలో పట్టున్న ఏకైక నాయకుడు నరేందర్‌ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలో ఆయన పేరు తెలియని వారు, ఆయన పరిచయం లేని వారంటూ ఎవరూ వుండరు. అంతలా ఆయన పేరు సుపరిచితం. కొన్ని లక్షల మంది ఇప్పటికే ఆయన విద్యా సంస్ధలలో చదువుకొని జీవితాల్లో స్ధిరపడిన వారున్నారు. వాళ్లంతా అనేక రంగాలలో గొప్ప గొప్ప స్ధాయిలో వున్నారు. వాళ్లు ఆయన విద్యార్ధులే. సమాజానికి సేవ చేస్తున్నవారే. అందువల్ల నరేందర్‌ రెడ్డికి ఆ ఓట్లు ఎంతో కీలకం. ఆ ఓట్లే ఆయన గెలుపును సునాయాసం చేస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఇతర పార్టీల నుంచి పోటీ చేసే ఏ అభ్యర్ది నరేందర్‌కు పోటీ కాలేదు. సాటి రాలేరని చెప్పొచ్చు. ఎందుకంట సుధీర్ఘమైన అనుభవం నరేందర్‌రెడ్డికి విద్యారంగంలోనే వుంది. అంటే సమాజమంతా విద్యారంగంతోనే ముడిపడి వుంటుంది. విద్యా రంగ నిపుణులకు సామాజిక సమస్యల మీద వున్నంత అవగాహన ఇతర రంగాలలో వుండేవారికి వుండదు. అందువల్ల రేపటి తరానికి ఏం కావాలి? ఇప్పుడు మన దేశంలో విద్యారంగం ఎలా వుంది? ప్రపంచ దేశాలలో విద్యా రంగ పరిస్దితులు ఎలా వున్నాయన్నదానిపై సంపూర్ణమైన అవగాహన వున్న ఏకైక నాయకుడు నరేందర్‌ రెడ్డి. అందువల్ల ఆయనకు తెలంగాణ నిరుద్యోగుల సమస్యలను ఎలా పరిష్కరించాలన్నదానిపై అనేక మార్గాలను అన్వేషించగలిగే ఆలోచనలు, ఆచరణలు చూపించగల నాయకుడు నరేందర్‌రెడ్డి. ఎందుకంటే ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలలో నిరుద్యోగం ఒక పెద్ద విపత్తు అని చెప్పాలి. ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకున్న వారికి కూడా ఉపాది అవకాశాలు తగ్గుతున్నాయి. కారణం మన విద్యా వ్యవస్ధలో వున్న లోపం. మన విద్యా విధానంలో అనేక రకాల, రూపాలలో రకరకాల కోర్సులు వున్నాయి. కాని వాటిపై రాజకీయ నాయకులకు పూర్తి అవగాహన వుండదు. పాలకులతో చర్చించేందుకు వారికి వెసులుబాటు వుండదు. వాటిపై పట్టు వుండదు. కాని విద్యా రంగంలో వున్న నిపుణులైన నరేందర్‌రెడ్డి లాంటి వారికే విద్యా రంగ సమస్యలు, తీసుకురావాల్సిన మార్పులు, ఇప్పటి తరానికి అవసరమైన మార్పులపై సమగ్రమైన అవగాహన ఆ రంగంలో వుండేవారికి మాత్రమే వుంటుంది. విద్యా రంగంలో ఎంతో నిష్ణాతుడైన నరేందర్‌ రెడ్డిని పట్టభద్రులు ఎన్నుకుంటే పెద్దల సభలో అర్ధవంతమైన చర్చ జరిగే అవకాశం వుంటుంది. ప్రభుత్వానికి విలువైన సూచనలు చేసే అవకాశం ఏర్పతుంది. ప్రభుత్వానికి మార్గదర్శనం చేసే వెసులుబాటు ఏర్పడుతుంది. విద్యా రంగ నిపుణుడైన నరేందర్‌ రెడ్డి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వడానికి వీలౌతుంది. ఇక ఎన్నికల ప్రచారం విషయానికి వస్తే ఆయన ఒకటి రెండు దఫాల ప్రచారం కూడా పూర్తిచేసుకున్నారు. తాను ఎమ్మెల్సీ అయితే విద్యా రంగంలో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చేందుకు కృషిచేస్తానని చెబుతున్నారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారాలు వెతికే ప్రయత్నం చేస్తానన్నారు. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేలా, ఎలాంటి వాయిదాల లేకుండ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడేలా చేస్తానని నరేందర్‌ రెడ్డి మాట ఇస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే సుమారు 55వేలకు పైగా ఉద్యోగాలను ఈ ఏడాది కాలంలోనూ భర్తీ చేసింది. కొత్తగా అనేక నోటిపికేషన్లు కూడా విడుదల చేసింది. ఎంతో మంది యువకులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హాయంలో పదేళ్లపాటు ఉద్యోగాలు లేక ఎంతో మంది యువతకు ఉపాది కరువైపోయింది. వారి జీవితంలో పదేళ్ల విలువైన సమయం వృధా అయ్యింది. కాంగ్రెస్‌ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ కల్పనపై దృష్టిపెట్టింది. వెంట వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అన్ని రంగాలలో పెండిరగ్‌లో వున్న ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి వెంటనే ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుంది. అందువల్ల తెలంగాణలో వున్న మొత్తం నిరుద్యోగులు, యువత కాంగ్రెస్‌ వైపే వున్నారని చెప్పడంలో సందేహం లేదని నరేందర్‌ రెడ్డి బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల నిరుద్యోగులకు ఎప్పుడూ అందుబాటులో వుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయగల సమర్దుడు నరేందర్‌రెడ్డే అని నిరుద్యోగులు బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిసిన వెంటనే నిరుద్యోగ సమస్యపై తాను నిరంతరం కృషి చేస్తానని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రైవేటు విద్యా సంస్ధలలేవైనా వాటిలో పనిచేసే ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు కోసం ప్రయత్నం చేస్తానంటున్నారు. ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే అద్యాపకుల సమస్యలే కాదు, వారికి ఆరోగ్య భీమా అందిస్తానంటున్నారు. ప్రైవేటు రంగాలలో ఉద్యోగ కల్పన కోసం కృషి చేస్తామంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలతో కంపనీలు స్ధాపించే పారిశ్రామిక వెత్తలతో మాట్లాడి తెలంగాణ యువతకు ఉద్యోగాలు అందేందుకు ప్రయత్నం చేస్తానంటున్నారు. ఇలా తెలంగాణ విద్యారంగంలో మరింత ముందుకు సాగేందుకు కృషి చేస్తానని నరేందర్‌ రెడ్డి చెబుతున్నారు. దాంతో పెద్దఎత్తున యువత నరేందర్‌ రెడ్డి అభ్యర్దిత్వాన్ని బలపర్చుతున్నారు. నరేందర్‌ రెడ్డిని గెలిపించుకుంటామని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఇప్పటి వరకైతే ఇతర పార్టీలకు చెందిన ఏ అభ్యర్ది నరేందర్‌ రెడ్డితో సమానమైన సామాజిక సృహ వున్నవారు కాదు. అందుకే నరేందర్‌ రెడ్డి ఎక్కడికి ప్రచారానికి వెళ్లినా పట్టభద్రులు బ్రహ్మరథం పడుతున్నారు. తాము దగ్గరుండి గెలిపించుకుంటామని భరోసా ఇస్తున్నారు. ఇక ప్రచారం విషయంలో కూడా అందరికంటే నరేందర్‌ రెడ్డే ముందున్నారు. నాలుగు జిల్లాలు కలియ చుట్టేశారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. పట్టభద్రులతో ప్రత్యేకమైన సమావేశాలు ఇప్పటికే అనేకం ఏర్పాటు చేశారు. వారి సమస్యలను సావదానంగా విన్నారు. తాను గెలిస్తే ఎలాంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారో కూడా చెప్పి, పట్టభద్రులల్లో నమ్మకం నింపారు. అందుకే ఎవరి నోట విన్నా ఒకటే మాట..నరేందర్‌ రెడ్డిదే గెలుపన్నదే వినిపిస్తున్న చర్చ.

ప్రజలకుఇచ్చిన హామీలను వెంటనేఅమలు చేయాలి*: *సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుబండశ్రీశైలం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకుఇచ్చిన ప్రతి హామీని వెంటనేఅమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలంఅన్నారు.శనివారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం చిట్టి మల్ల లింగయ్య అధ్యక్షతనసమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లు భూమిలేని ప్రతి పేదవానికి, ఇండ్లు లేని వారికి ఇండ్ల స్థలాలు, ఇండ్లునిర్మించి ఇవ్వాలనిఆయన అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల గ్రామకమిటీలో అన్ని రాజకీయ పార్టీల ను అనుమతించాలని,సంక్షేమ పథకాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో గ్రామాలలో పారదర్శకంగా అర్హులైన పేదలని గుర్తించాలనిఆయన కోరారు. అర్హులైన పేదలను గుర్తించకుండా ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంపిక చేస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీలు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని నిరుపేదలకి ఇండ్లు వచ్చే విధంగా చొరవ తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇవ్వాలని, వ్యవసాయ కూలీల 12 వేల రూపాయలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఏ కకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయకుండా పెండింగ్లో ఉన్న రుణమాపిని వెంటనే రైతు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. గత మూడు దపాలుగా ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వకుండా కాలయాపన చేయడం దారుణమని అన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ , రైతు భరోసా రాక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తక్షణమే రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారాలు మోపుతూ సంపన్నులకు, బడా కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. . ఈ సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ, సిపిఎం సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, గౌసియా బేగం, వెంకటేశం, నరసింహ, ఈరటి వెంకటయ్య, అంజయ్య,బల్లెం స్వామి, ఈరగట్ల నరసింహ,తదితరులు ఉన్నారు.

కేతకిలో ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం.

కేతకిలో ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

– భారీగా తరలి వచ్చిన భక్తులు – ప్రశాంతంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

Shiva Parvathi

మహాశివరాత్రి సందర్భంగా ఝరాసంగం మండల కేంద్రంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం అగ్నిగుండం ప్రవేశం, స్వామివారికి అభిషేకం, కుంకుమార్చన, రుద్రస్వాహకార హెూమము, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం భక్తజనుల మధ్య స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కనీసం స్వామివారి కళ్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించలేదు. ఇవన్నీ ఆలయం తరపున సమకూర్చుకున్నారు. కళ్యాణంలో పాల్గోన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రత్యేకంగా మహిళలకు వాయినాలు అందజేశారు. రాత్రికి స్వామిఅమ్మవారల ఉత్సవ మూర్తులను విమానరథంలో బసవేశ్వర మందిరం వరకు ఊరేగించారు. కళ్యాణోత్సవంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ సులోచన, ఆలయ ఈఓ శివరుద్రప్పస్వామి, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version