ఆధ్వర్యంలో విశ్వగురువు బసవేశ్వరుల వారి విగ్రహావిష్కరణ మహోత్సవము.

లింగాయత్ సమాజ్, జహీరాబాద్ ఆధ్వర్యంలో విశ్వగురువు బసవేశ్వరుల వారి విగ్రహావిష్కరణ మహోత్సవము

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఆత్మీయ శరణ బంధువులకు శరణు శరణార్థి,
12వ శతాబ్దము నందు సమాజములో పాగావేసిన జాతి, వర్ణ, వర్గ మరియు లింగ వివక్షతలను రూపుమాపుటకై భక్తి ఉద్యమానికి నాంది పలికిన యుగపురుషుడు విశ్వగురు బసవేశ్వరుడు..సకల జీవాత్ముల సంక్షేమము కొరకు నిరంతరము పాటుపడిన మహామానవతావాది, అభ్యుదయ వాది మనందరికి ఆదర్శప్రాయుడు. అతడు బోధించిన తత్యాలు యావత్ మానవాళికి అనుసరణీయమైనవి. అందుకే బసవేశ్వరుల వారిని విశ్వగురువుగా, ప్రపంచమునందె మొట్టమొదటి పార్లమెంట్ వ్యవస్థాపకుడిగా మరియు సమసమాజ నిర్మాతగా విశ్వమంతటా కీర్తించబడుచున్నాడు. ముక్తిదాయకుడు, శరణరక్షకుడు, విశ్వగురువు బసవేశ్వరుల వారిని నిత్యం దర్శించి, స్పూర్తిని పొందాలనే సదుద్ధ్యేశంతో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు సమస్త బసవ భక్తుల ఆర్ధిక సహాయంతో జహీరాబాద్ లింగాయత్ సమాజ్ వారిచే హుగ్గెల్లి కూడలి (చౌరస్తా) వద్ద జాతీయ రహదారిపై “విశ్వగురు బసవేశ్వరుల వారి కాంస్య విగ్రహము” ప్రతిష్టింపబడినది.పరమ పూజ్యశ్రీ భాల్కి పట్టాధ్యక్షులు, మఠాధీశులు, రాష్ట్ర మంత్రి వర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, రాజకీయ ప్రముఖులు, ఆర్థిక సహాయ మందించిన పెద్దలు, ప్రజాప్రతినిధులు మరియు యావత్ బసవ భక్తుల సమక్షములో తేదీ : 23-05-2025 శుక్రవారం మధ్యాహ్నం 12-00 గం॥లకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తమ అమృత హస్తాలతో “ఐశ్వగురు బసవేశ్వరుల వారి విగ్రహావిశ్కరణ” గావించెదరు.
కావున సమస్త శరణ బంధువులు, బసవతత్వాభిమానులు మా ఆహ్వానమును మన్నించి పై కార్యక్రమములో పాల్గొన వలసినదిగా ప్రార్ధన,

శ్రీ సీత లక్ష్మణ హనుమత్ సమేత ఆలయ పునరుద్ధరణ.

శ్రీ సీత లక్ష్మణ హనుమత్ సమేత ఆలయ పునరుద్ధరణ

మందమర్రి నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా ఊరు మందమర్రిలో శ్రీ సీత లక్ష్మణ హనుమత్ సమేత ఆలయ పునరుద్ధరణ….. మంచిర్యాల జిల్లా విలేజ్ మందమర్రిలో 60 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రస్వామి ఆలయం గ్రామ ప్రజలందరి సహకారంతో పునర్ నిర్మింపబడి ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు మహా కుంభ సంప్రోక్షణ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని ఆలయ గౌరవ అధ్యక్షులు కల్వకుంట్ల రామ్మోహన్రావు అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ గౌరవాధ్యక్షులు రామ్మోహన్రావు మరియు ఆలయ పూజారి మాట్లాడుతూ ఊరు మందమరిలో 60 ఏళ్ల చరిత్ర కలిగిన శిథిలావస్థలో ఉన్నటువంటి సీతారామచంద్రస్వామి ఆలయాన్ని పునర్నిర్మించుకొని తిరిగి పూర్వ వైభవంతో ఈనెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు కల్యాణ మహోత్సవాలు మహాకుంభ అభిషేకం యజ్ఞాలు నిర్వహించబడతాయని తెలిపారు. ఐదు రోజుల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల్లో గ్రామ ప్రజలతో పాటు ఇతరులు పాల్గొని శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రులు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవాధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు రాఘవేంద్రరావు అధ్యక్షులు పెద్ద లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి ఉప్పలోష శంకర్ లింగం కోశాధికారి పెద్ద సత్తయ్య లింగం రాజయ్య చంద్రయ్య నాగోల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు

విద్య వైద్యంపై కాంగ్రెస్ దృష్టి.

— విద్య వైద్యంపై కాంగ్రెస్ దృష్టి
• ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మి
• ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

నిజాంపేట నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేసిందని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో 32 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించారు. అనంతరం రాంపూర్ గ్రామంలో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మునిరాజు ల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందివ్వడం జరిగిందన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుప్రభాతరావు, నిజాంపేట మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్, మండల తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో రాజిరెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ రమ్య శ్రీ, ఆర్ఐ ప్రీతీ, హిమాద్, ఎంపీవో ప్రవీణ్ నాయకులు అమర్సేనారెడ్డి, సిద్ధ రాములు, పంజా మహేందర్, నజీరుద్దీన్, సత్యనారాయణ, లక్ష్మా గౌడ్ , ఆకుల బాలయ్య,గుమ్ముల అజయ్, శ్యామల మహేష్ తదితరులు ఉన్నారు.

రెవెన్యూ శాఖ మంత్రికి ఘన స్వాగతం పలికిన.!

రెవెన్యూ శాఖ మంత్రికి ఘన స్వాగతం పలికిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

పేద ప్రజలకు అండగా నిలిచేది భూ భారతి చట్టం.. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఆలోచించి భూ భారతి చట్టాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో వారు పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ…

గత ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ధరణి లో ఉన్న లోపాలను, మిగిలి ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రతిష్టాత్మకంగా భూభారతి ఆర్ఓఆర్ 2025వ చట్టం తీసుకురావడం జరిగిందని అన్నారు.

Revenue Minister Ponguleti Srinivas Reddy

 

సుమారుగా లక్ష మందితో చర్చలు జరిపి పేద రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ధరణిలో పరిష్కారం కానీ మిస్సింగ్ సర్వేనెంబర్ రైతుల వివరాలలో తప్పులు,డిఎస్ పెండింగ్,అసైన్డ్ పట్టా,నిషేధిత జాబితా మార్పు,వారసత్వం, భూసేకరణ సమస్యలు, అటవీశాఖ రెవెన్యూ శాఖల మధ్య వివాదాస్పందంగా మారిన భూముల మార్పుల వివరాలు,తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆర్ఓఆర్ చట్టం వెలుగులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు.

భీమారం మండలంలో 2000 మంది రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు చేసుకోవడం జరిగిందని అందులో చాలావరకు సాదాబైనామాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని వాటిని కూడా అతి త్వరలో పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్,ప్రభుత్వ సలహాదారు హార్కరా వేణుగోపాల్,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నైన్ పాకలో హనుమాన్ స్వాముల శోభయాత్ర.

నైన్ పాకలో హనుమాన్ స్వాముల శోభయాత్ర.

చిట్యాల నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం లో నీ నైన్ పాక గ్రామంలో మంగళవారం రోజున హనుమాన్ మాలదారులు గ్రామం లో నగర సంకీర్తన కార్యక్రమం* ని అంగరంగ వైభవం గా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా హనుమాన్ స్వాములు గ్రామం లోని అన్ని పురావిధుల గుండా హనుమాన్ వేశాధారణలో రామనామా స్మరణ చేస్తు చప్పుళ్లతో అంజన్న స్వామి ల గంతులు వేస్తూ రామ నమా స్మరణ తో జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి స్వామి,దేవస్థాన హనుమాన్ స్వాములు,తదితరులు పాల్గొన్నారు.

నూతన గ్రామ కమిటీ ఎన్నిక అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక.

కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక గంగాధర్ రాజు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళపల్లి మండలం గుడి పహాడ్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కట్టంగూరి రవీందర్ రెడ్డి తెలిపారు భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు గుడి పహాడ్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా గంగాధర్ రాజు, ఉపాధ్యక్షులుగా మచ్చిక రమేష్, ప్రధాన కార్యదర్శిగా పాశం పర్వతాలు, కోశాధికారిగా బుర్ర సమ్మయ్య, ప్రచార కార్యదర్శి సమ్మోయి కొమురయ్య, కార్యదర్శి పాశం కిరణ్, సహాయ కార్యదర్శి ములుకోజు సదానందం, కార్యవర్గ సభ్యులు బుర్ర మొగిలి, కోడారి సంపత్, జనప నరసయ్య, బుర్ర కుమారస్వామి, వీరగోని రాజీరు, గంగాధర్ సాంబయ్య, కుమ్మరి కోటి, పాశం ఓదేలు, నకిర్త కుమారస్వామి, వీరగోని పద్మ, గోపు స్వప్న, ములుకోజు రాజమౌళి, బండారి సమ్మయ్య, పాశం రాజు లింగు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అనంతరం నూతన అధ్యక్షులు గంగాధర్ రాజు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు సర్వదా ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పార్టీ

ఏ ఆదేశాలు ఇచ్చిన అందరికీ అందుబాటులో ఉండి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని రాబోయే స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే దిశగా కృషి చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా తెలిపారు.

నాపై నమ్మకం ఉంచి నన్ను గ్రామ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు

ఒడిదల కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా గట్టు రాజు గౌడ్.

ఒడిదల కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా గట్టు రాజు గౌడ్.

చిట్యాల నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ఒడితల గ్రామంలో* రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్* భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా అధ్యక్షులు ఐత ప్రకాశ్ రెడ్డి* ఆదేశం మేరకు ఒడితల కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఒడితల ఇంచార్జ్ లు చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూల శంకర్ గౌడ్, గజ్జి రవి ఆధ్వర్యంలో కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
గ్రామ కమిటీ అధ్యక్షులుగా : గట్టు రాజు గౌడ్*
ఉపాధ్యక్షులుగా : జంజర్ల మారయ్య , పరకాల కృష్ణమూర్తి*
వర్కింగ్ ప్రెసిడెంట్ :పసునూటి రాజేందర్*
ప్రధాన కార్యదర్శిగా : నలభీమా ప్రభాకర్*
కోశాధికారిగా : ఎండీ అంకుషావలికార్యవర్గ సభ్యులు గా1 ఎండి యాకుబ్ పాషా*
2. పొడిశెట్టి మొండయ్య*
3. సట్ల కుమార్*
4. తెలకుంట్ల సమ్మయ్య*
5. దేవరకొండ రాజబాబు*
6. వల్లకొండ రాంరెడ్డి*
7. కంపెల్లి రాజు*
8.మాచరగణపతిఅనంతరంచిట్యాల మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ మాట్లాడుతూకార్యకర్తలే పునాదిరాళ్లని సంస్థగతంగా పార్టీని కాపాడి నిస్వార్ధంగా పార్టీ కొరకు ఎంతో కష్టపడి ప్రజా ప్రతినిధులను గెలిపించుటలో ముఖ్య భూమిక పోషిస్తారని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపగడపకు తీసుకువెళ్లి పార్టీ పటిష్టతను పెంపొందించి ఔనత్యాన్ని కాపాడుతారని కొనియాడారు. ఈ కార్యక్రమంలోబండి భగవాన్, ఎర్రబెల్లి భద్రయ్య, పట్టేమ్ శంకర్, ఒడిటెల గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు* పాల్గొన్నారు.

కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర చేస్తున్న కేంద్ర.!

కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొడదాం

సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపు

సిరిసిల్ల టౌన్ మే 20( నేటిధాత్రి ):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక , ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని , కార్మికులందరికీ కనీస వేతనం 26,000 అమలు చేయాలని తదితర డిమాండ్లతో సిఐటియు అఖిలభారత కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు బి.వై. నగర్ లో సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్లతో కూడిన ఫ్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు , హక్కులను తొలగించి పెట్టుబడిదారులు , యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికులను కట్టు బానిసలను చేసే కుట్ర పన్నుతున్నదని మండిపడ్డారు.కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మే 20 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని దేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణం , ప్రత్యేక పరిస్థితుల్లో నేపథ్యంలో సార్వత్రిక సమ్మెను జూలై 9 వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను మానుకొని కార్మిక వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని లేకుంటే రాబోయే రోజుల్లో కార్మిక వర్గ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడంలో , కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు , హక్కులను కాపాడుకోవడంలో భాగంగా జూలై 9న తలపెట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా సంఘటిత , అసంఘటిత అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ తప్పకుండా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అన్నల్డాస్ గణేష్ , సూరం పద్మ , నక్క దేవదాస్ , బెజుగం సురేష్ , జిందం కమలాకర్ , బింగి సంపత్ , సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

వ్రృద్దుల ఇంటిలోనికి చేరిన మురుగు నీరు.

భాగ్యనగర్ తాండా 4వ వార్డు లో వ్రృద్దుల ఇంటిలోనికి చేరిన మురుగు నీరు.

పట్టించుకోని నాయకులు ప్రభుత్వం అధికారులు.

కారేపల్లి నేటి ధాత్రి

 

 

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం భాగ్యనగర్ గ్రామపంచాయతీ పరిదిలో గల నాలుగోవ వార్డులో సందు రోడ్డులో గూగులోత్ సామిని బొజ్యా వ్రృద్దుల ఇంటి దగ్గర వర్షం నీరుతో వాగును తలపిస్తుంది గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇంటిదగ్గర వర్షపు నీరు నిలువ ఉండిపోయి మోకాళ్ళ లోతు వ్యర్దపు నీరు వచ్చి చెరడంవలన వారు బైటకు వెళ్ళలేని దుస్థితి లో బిక్కు బిక్కు మంటూ ఇంటిలో నె ఉండవలసి పరిస్థితి ఉందని వెనకాల ఉన్న సిమెంట్ రోడ్డుకు సైడ్ కాలువ లేక పోవడం కారణంగా నిలువ ఉన్న వర్షం నీరుతో పాటు మురుగు నీరు చేరుట వలన విషజ్వరాలు మలెరియ డెంగ్యూ బారిన పడె ప్రమాదం ఉన్నదని. కోంత మంది వర్షం నీళ్ళు వేళ్ళ కుండా అడ్డుగా మట్టిని పోయించినారని వారినిఅడ్డుగ ఉన్న మట్టిని తోలగించమని వెడుకున్న కానీ తోలగించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టూ పక్కన ఉన్న వారిని అడిగితే గొడవలకు దిగుతున్నారని ఈ సమస్యకు తగిన పరిష్కారాన్ని చూపాలని తెలిపారు.

Ward 4 of Bhagyanagar Tanda.

 

ఆ వ్రృద్ద దంపతులైన గుగులోత్ సామిని బొజ్యా మొకాళ్ళ లోతు వ్యర్దపు దుర్గందపు నీళ్ళ లో నుండె నడిచివేళ్ళె దుస్థితి లో ఉన్నారు వారి దినస్తితిని చూసిన స్థానిక నాయకులు పట్టించుకున్న నాథుడే లేడని సింగరేణి మండల ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి రోడ్డు వేంబడి ఉన్న మట్టిని తోలగించి సైడు కాలువలు తిపించి ఆ వ్రృద్దుల ఇంటిలోనికి వ్యర్థ పునీరు చేరకుండ చూడండి అంటూ వారు తమ ఆవెదన వ్యక్త పర్చారు.

కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు భూక్య సమ్మయ్య నాయక్.

కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు భూక్య సమ్మయ్య నాయక్

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం మైలారం గ్రామంలో భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ మాజీ జెడ్పిటిసి ముత్యాల రాజయ్య మాజీ సర్పంచులు ఎస్ వరుణ కుమారి పబ్బ సదయ్య వారి ఆధ్వర్యంలో మైలారం గ్రామంలో భూక్య సమ్మయ్య నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సమ్మయ్య నాయక్ మాట్లాడుతూ గ్రామ కమిటీ అధ్యక్షునిగా నాకు సహకరించిన పార్టీ నాయకులకు గ్రామ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు గ్రామ కమిటీ సభ్యులు ఉపాధ్యక్షులు మోరే మహిపాల్ ప్రధాన కార్యదర్శి కుసుమ మహేందర్ కోశాధికారి దౌడు రమేష్ కార్యదర్శి జంగా రవి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది

పాప పేరు మీద 25 వేలు ఫిక్స్ డిపాజిట్.

— పాప పేరు మీద
25 వేలు ఫిక్స్ డిపాజిట్

నిజాంపేట, నేటి ధాత్రి:

బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముస్తఫా అనారోగ్యంతో గత కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కంఠ రెడ్డి తిరుపతిరెడ్డి నిజాంపేట మండల కేంద్రం లో గల పార్టీ కార్యాలయంలో సొంతగా 25 వేల రూపాయలు ముస్తఫా కూతురు పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేసి వారి కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమం లో నాయకులు కొండల్ రెడ్డి, మవురం రాజు, రవి, నర్సీములు, బాల్ రెడ్డి,నాగరాజు,రాములు, చింతల స్వామి, ఎల్లం యాదవ్, దుర్గయ్య, నాని, మైసయ్య తదితరులు పాల్గొన్నారు తదితరులు ఉన్నారు.

నూతన ఫర్టిలైజర్స్ & పెస్టిసైడ్స్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్.

నూతన ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీని సన్మానించిన పాత్రికేయులు

 

పరకాల,నేటిధాత్రి

 

పరకాల ఎరువులు పురుగుమందులు మరియు విత్తనముల డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రైటర్ గందె వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శిగా నవత బ్రదర్స్ శివాజీని, కోశాధికారి గా మల్లికార్జున ట్రేడర్స్ ఎర్ర లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నుకోగా పరకాల విలేకరుల తరఫున మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరకాల పాత్రికేయులు ఘంటారామం రవీందర్,ఉదయం దినపత్రిక రిపోర్టర్ రాజు,నేడు సందీప్,నేటిదాత్రి రిపోర్టర్ అంబేద్కర్ ల్,వరంగల్ వాయిస్ రిపోర్టర్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం పర్యటన జయప్రదం చేయాలి జహీరాబాద్ ఎంపీ.

సీఎం పర్యటన జయప్రదం చేయాలి: జహీరాబాద్ ఎంపీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఈనెల 23న జహీరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన జయప్రదం చేయాలని కాంగ్రెస్ నాయకులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన ఈ సన్నాహక సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్, మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్, తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్, మండల అధ్యక్షులు హన్మంత్ రావ్, శ్రీనివాస్ రెడ్డి, రామలింగారెడ్డి, మాక్సూద్ అహ్మద్, నరసింహా రెడ్డి, కండేం నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం.

ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం

శిక్షణ అందించిన జిల్లా కలెక్టర్

సిరిసిల్ల టౌన్. మే 20:(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని గీతా నగర్ ప్రభుత్వ పాఠశాల నందు ఐదు రోజుల ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది.

Collector Sandeep Kumar

 

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈరోజు గీత నగర్ ప్రభుత్వ పాఠశాల నందు ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థిని, విద్యార్థులను గురించి ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది.

జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి బదిలీ.

జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి బదిలీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సోమవారం జరిగిన డీఎస్పీల బదిలీలో భాగంగా జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డిని బదిలీ చేస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నల్గొండ డీసీఆర్బీ డీఎస్పీగా పనిచేస్తున్న సైదాను జహీరాబాద్ డీఎస్పీగా బదిలీ చేశారు.

పుష్కరాల వద్ద ICDS ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు.

పుష్కరాల వద్ద ఐసిడిఎస్ ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు.

చిట్యాల నేటి దాత్రి

 

జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల సూపర్వైజర్ జయప్రద ఐసిడిఎస్ ఆధ్వర్యంలో
సరస్వతి పుష్కరాల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఇన్చార్జి డి డబ్ల్యూ ఓ మల్లేశ్వరి మూడు స్టాల్స్ ను పుష్కర ఘాటు వద్ద రెండు, టెంపుల్ వద్ద ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్స్ లో రెండు మిస్సింగ్ కేంద్రాలు ఒకటి క్రష్ ఏర్పాటు చేసి క్రష్ సెంటర్లో పిల్లలకు ఆటలు పాటలతో పాటు పోషకార పదార్థాలు అందించడం మిస్సింగ్ సెంటర్ల లొ తప్పిపోయిన పిల్లలు, వృద్దులు, మహిళలు మైకుల ద్వారా తెలిపి సేద తీర్చుటకు వసతి కల్పిస్తు పోషకాహార పదార్థాలు అందించి మళ్లీ పేరెంట్స్ కి అప్పగించడం, ఇందులో భాగంగా టోల్ ఫ్రీ నెంబర్ లన్ని సఖి సెంటర్ హెల్ప్ లైన్ మహిళా శక్తీ సేవలపై అవగాహన కల్పించడం. ప్రైవేట్ స్కూల్ కు దీటుగా అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నవని అందులో ఉన్న ఫ్రీ స్కూల్ మెటీరియల్ తో స్టాల్ పెట్టి మైకు ల ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందండి. ఇందులో భాగంగా సూపర్వైజర్స్ ముగ్గురు చొప్పున రెండు రోజుల ఒకసారి డ్యూటీ లు చేయడం జరిగిందండి. జయప్రద, సరోజ, అప్సర,సుల్తానా సూపర్వైజర్సు మహిళా శక్తి నుండి మమత సఖి నుండి మాధవి హాజరైనారు.ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ గ, అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి మేడం ,అశోక్ , సిడిపిఓ మల్లేశ్వరి , రాధిక విజిట్ చేస్తూ ఐసిడిఎస్ సేవలను చాలా  అభినందించారు.

గీతం యూనివర్సిటీ నుండి పిహెచ్‌డి పట్టా పొందిన.

గీతం యూనివర్సిటీ నుండి పిహెచ్‌డి పట్టా పొందిన డాక్టర్ దీప్తి..

వరంగల్ తూర్పు, నేటిధాత్రి.

 

 

వరంగల్ నగరానికి చెందిన స్కాలర్ ఆర్ దీప్తి, గీతం యూనివర్శిటీ విశాఖపట్నం లోని, స్కూల్ ఆఫ్ ఫార్మసీ నుండి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీకి అర్హత సాధించారు. ఈ విషయాన్ని ఇటీవల విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం రిజిస్టర్ ప్రకటించారు. గీతం యూనివర్సిటీ పరిశోధనా స్కాలర్ అయిన రయిల్లా దీప్తి “అడెనిన్-ప్రేరిత దీర్ఘకాలిక కిడ్నీ నష్టం మరియు కార్డియోవాస్కులర్ ఆల్టరేషన్స్-టార్గెటింగ్, టిజిఎఫ్, కాస్పేస్ 3, ఎంచుకున్న సహజ సమ్మేళనాల రక్షణ ప్రభావాల మూల్యాంకనం” అనే శీర్షికతో తన పిహెచ్‌డి పరిశోధనను సమర్పించింది.

Dr. Deepthi

 

ఆమె గీతం విశ్వవిద్యాలయంలో ఫార్మసీ డిపార్ట్మెంట్ లో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి సుహాసిన్ పర్యవేక్షణలో తన పరిశోధన చేశారు. వరంగల్ నగరానికి చెందిన డాక్టర్ దీప్తి, ప్రస్తుతం హనుమకొండ జిల్లా, ఓగ్లాపూర్‌లోని కేర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అంకిత భావంతో డాక్టర్ దీప్తి పిహెచ్‌డి పూర్తి చేయడం పట్ల తోటి స్కాలర్స్, ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులు దీప్తిని అభినందించారు.

శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం.!

గాంధీనగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం లో సిరిసిల్ల జడ్జి ప్రత్యేక పూజలు

సిరిసిల్ల టౌన్ మే 20 (నేటిధాత్రి):

ఈరోజు పట్టణ కేంద్రంలోని బహుళ అష్టమి సందర్భంగా సిరిసిల్లలోని గాంధీనగర్ శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విఠలేశ్వర కాలభైరవ స్వామి వారి ఆలయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ రాధికా జైస్వాల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వార్డు మాజీ కౌన్సిలర్ గుండ్లపెల్లి పూర్ణచందర్ , ఆలయ కార్యదర్శి కుడిక్యాల శంకర్ మేజిస్ట్రేట్ ని శాలువాతో సన్మానించారు. అలాగే ఆలయ పూజారి గోషికొండ సత్తయ్య పంతులు జడ్జి కి ఆశీర్వచనాలు అందించారు. వీరి వెంట ఆలయ కమిటీ సభ్యులు పంతం రవి, శ్రీపతి పరుశరాం, చిలగాని శ్రీనివాస్ ఉన్నారు.

అస్సాం స్థానిక ఎన్నికల్లో ఎన్డీయే అప్రతిహత విజయం

పెరిగిన ఎన్డీఏ ఓట్ల శాతం

గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లిన బీజేపీ

ప్రత్యక్ష పోటీలో కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడిరచిన బీజేపీ నేతలు

ముఖ్యమంత్రి హిమంత్‌ బిశ్వ శర్మపై ప్రజల్లో సడలని విశ్వాసం

సంస్థాగత లోపాలతో కునారిల్లుతున్న కాంగ్రెస్‌

డెస్క్‌ ,నేటిధాత్రి: 

అస్సాంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్‌డీఏకూటమి అప్రతిహత విజయాన్ని నమోదు చేసింది. దీంతో రాష్ట్రంలో తన రాజకీయ ఆధిపత్యాని కి తిరుగులేదని నిరూపించింది. రాష్ట్రంలోని మొత్తం 376 జిల్లాపరిషత్‌ స్థానాల్లో 301 గెలుచు కున్న ఎన్‌డీఏ కూటమి తన ఆధిపత్యాన్ని నిరూపించింది. వీటిల్లో కూటమికి 76శాతం ఓట్లు లభించడం విశేషం. ఈ అప్రతిహత విజయం ప్రజల్లో ఎన్డీఏ ప్రభుత్వ పాలనపై పెరిగిన విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. ఇక రాష్ట్రంలోని అంచలోక్‌ పంచాయతీ (ప్రాతినిధ్య పంచాయతీ ఎన్నికలు)ఎన్నిల్లో మొత్తం 2192 సీట్లలో 1445 సీట్లు సాధించి ఎన్డీఏ కూటమి తనకు తిరుగు లేదని నిరూపించింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 66శాతం ఓట్లు సాధించడంతో తనకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా తిరుగులేదన్న సత్యాన్ని వెల్లడిరచింది. 2018లో కూటమి సాధించిన ఓట్లకంటే ఇప్పుడు మరిన్ని ఓట్లు సంపాదించడం గమనార్హం. ఇదే సమయంలో గత ఎన్నికల్లో పోలయిన ఓట్లశాతంతో పోలిస్తే 25% వృద్ధి నమోదు చేయడం కూటమికి అస్సాంలో తిరుగులేద న్న సత్యం రుజువైంది. విచిత్రమేమంటే లోక్‌సభ ఎన్నికలు జరిగిన 2024 సంవత్సరానికి సరిగ్గా ఏడాది తర్వాత, 2026లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఈ ఎన్నికలు జరగ డం విశేషం. ఇక కాంగ్రెస్‌ పార్టీ జిల్లాపరిషత్‌ (జెడ్‌పీఎం)లో 72 స్థానాలు, అంచలోక్‌ పంచాయతీలో (ఏపీఎం)లో 481 స్థానాల్లో విజయం సాధించింది. అదేవిధంగా ఏఐయుడీఎఫ్‌ 8 జెడ్‌పీ ఎం స్థానాలను, ఏపీఎంలో 64 స్థానాలకు పరిమితమైంది. ఇక అఖిల్‌ గొగోయ్‌ నేతృత్వంలోని రాయ్‌జోర్‌ దళ్‌ మూడు జెడ్‌పీఎం మరియు 17 ఏపీఎం సీట్లను గెలుచుకుంది. అస్సాంలో పంచాయతీ ఎన్నికలు మే 2, 7 తేదీల్లో జరగ్గా 11వ తేదీన కౌంటింగ్‌ ప్రారంభమై 14వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. అస్సాంలో మొత్తం 14 మిలియన్లమంది ఓటర్లుండగా 74శా తం ఓటింగ్‌ నమోదైంది. 

అస్సాం పంచాయతీ చట్టరా1994 ప్రకారం రాష్ట్రంలో మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఏర్పడిరది. అయితే 2023లో తీసుకొచ్చిన పంచాయతీరాజ్‌ సవరణ చట్టం అభ్యర్థులకు రాజకీయ గుర్తుల కేటాయింపునకు అనుమతించింది. అయితే గోవన్‌ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థు లకు పార్టీ గుర్తులు కేటాయించలేదు. నిజానికి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు 2023లోనే జరగాల్సి వుంది. శ్రీభూమి జిల్లాలో డీలిమిటేషన్‌ ప్రక్రియపై హైకోర్టు ఇచ్చిన తీర్పు, హయ్యర్‌ సెకండరీ పరీక్షలు ఫిబ్రవరి/మార్చిలో నిర్వహించాల్సి రావడంతో, ఈ ఎన్నికలను మే నెలలో నిర్వ హించారు. 

ఈ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా ఆసక్తి ప్రదర్శించిన నియోజకవర్గం జోర్హాట్‌. ఎందుకంటే 2024 లోక్‌సభ ఎన్నికల్లో జోర్హాట్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. హిందువులు అత్యధికంగా వుండే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ గెలుపు విపక్షాల్లో ఆశలు పెంచింది. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక శాతం సీట్లు సాధించవచ్చునని కాంగ్రెస్‌ ఎంతో నమ్మకంతో వుంది. కానీ పార్టీ ఆశలను వమ్ము చేస్తూ కేవలం మూడు అంచలోక్‌ సీట్లు మాత్రమే గెలుచుకోగా, బీజేపీ ఏకంగా 73 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన విజయంతో గౌరవ్‌ గొగోయ్‌ (కాంగ్రెస్‌), అఖిల్‌ గొగోయ్‌ (రాజోరీదళ్‌), లూరింజ్యోతి గొగోయ్‌ (అస్సాం జాతీయ పరిషత్‌)లు ముగ్గురు ఏకమై ఈ సారి పంచాయతీ ఎ న్నికల్లో ప్రచారం నిర్వహించారు. విశేషమేంటంటే ఈ ముగ్గురిని పరిశీలకులు ‘‘ముగ్గురు గొగోయ్‌ల కూటమి’’ అంటూ వ్యవహరిస్తుంటారు. వీరిలో గౌరవ్‌ గొగోయ్‌ ప్రధాన స్రవంతికి చెందిన రాజకీయవేత్త కాగా, అఖిల్‌ గొగోయ్‌కి రైతు ఉద్యమాలు నిర్వహించినవాడిగా మంచి పేరుంది. ఇక లూరింజ్యోతి గొగోయ్‌ అస్సామీ మరియు అహోం భాషోద్యమాలు నిర్వహించిన చరిత్ర వుంది. నిజానికి జోర్హాట్‌ నియోజకవర్గంలో బీజేపీకి మంచి పట్టుండేది. కానీ గత లోక్‌సభ ఎన్నికల్లో అస్సామీ, అహోం హిందూ విద్యావంతుల్లో పెరిగిన వ్యతిరేకత బీజేపీ ఓటమికి కారణమైంది. అయితే ఈసారి పంచాయతీ ఎన్నికల్లో తిరిగి బీజేపీ పుంజుకోవడం విశేషం. 

గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన అంత్యలోక్‌ పంచాయతీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఓట్లశాతం, సీట్ల సంఖ్య గణనీయంగా పెరగడం గమనార్హం. 2018లో 55శాతం ఓట్లు సాధించిన ఎన్డీఏ, ఇప్పుడు ఏకంగా 75శాతం ఓట్లు సాధించింది. ఇదే కాంగ్రెస్‌కు గతంలో 35% ఓటు షేర్‌ వుండగా ఇప్పుడది 18%కు కుంచించుకుపోయింది. ఎగువ ఆస్సాం ప్రాంతంలో కూడా బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయితే కేవలం ఎగువ అస్సాం మాత్రమే కాదు, మొత్తం అస్సాంలో కాంగ్రెస్‌తో ప్రత్యక్షంగా పోటీపడిన దాదాపు ప్రతిచోట బీజేపీ విజయం నమోదు చేసింది. అయితే బార్పేట, దరాంగ్‌, ధుబ్రి, హోజాయ్‌ నియోజకవర్గాల్లో మైనారీటీల ఓటర్లు అధికం. ఇక్కడ కాంగ్రెస్‌ గెలుపు సాధించింది. 

మొత్తంమీద చెప్పాలంటే ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఓరునోదయ్‌’ నగదు బదిలీ పథకం, ప్రభుత్వానికి అనుకూల ఫలితాలనిచ్చిందనే చెప్పాలి. అదేవిధంగా రాష్ట్రంలో లక్ష ఉద్యోగాల కల్పన కోసం నిర్వహించిన డ్రైవ్‌ కూడా ప్రభుత్వం పట్ల సానుకూలతను పెంచింది. వీటితో పాటు కొన్ని సాంస్కృతిక అంశాలు కూడా అధికారంలో వున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సానుకూల వాతావరణం ఏర్పడటానికి కారణమయ్యాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ‘రaుమోయ్‌ బినందిని’’ పండుగను తోటపనుల్లో పాల్గనే స్థానిక ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ నిర్వహణలో ప్రభుత్వం పాల్గనడం ద్వారా స్థానిక ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది. అంతేకాదు ముఖ్య మంత్రి హిమంత్‌ బిశ్వ శర్మ అవినీతికి వ్యతిరేకంగా చేపడుతున్న చర్యలు ప్రజలను ఆకట్టుకుం టున్నాయి. 

ప్రస్తుతం జరిగిన ఈ ఎన్నికల్లో సాధించిన విజయం, అధికార ఎన్డీఏ కూటమిలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా 2026లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 104 స్థానాలున్న అసెంబ్లీలో మూడోసారి ముచ్చటగా అధికారంలోకి రావడానికి ఈ ఎన్నికలు మా ర్గం సుగమం చేశాయని కూటమి నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో విపక్ష కాంగ్రెస్‌లో సంస్థాగత లోపాలు స్పష్టంగా కనిపించాయి. వీటిని సరిదిద్దుకొని సరైన నాయకుల నేతృత్వంలో పార్టీని మరింత సమర్థవంతంగా నడపకపోతే రాబోయే ఎన్నికల్లో గెలుపు మాట అట్లా వుంచి ఉనికి కూడా కష్టమయ్యే ప్రమాదం వుంది.

ఆపరేషన్‌ సింధూర్‌: లాభనష్టాలు

పాక్‌ను తాత్కాలికంగా దెబ్బకొట్టగలిగాం

ఉగ్రవాదం సమసిపోదు

ఈసారి పాక్‌, చైనాలు మరింత జాగ్రత్తపడక మానవు

భవిష్యత్తులో ఆధునిక ఆయుధాలు, సాంకేతికత యుద్ధ ఫలితాలను నిర్ణయించలేవు

ఆపరేషన్‌ సింధూర్‌తో బలూచ్‌ ఉద్యమానికి ఊతం

పాక్‌ను లంగదీయడానికి సింధూజలాలే బ్రహ్మాస్త్రం

క్యాన్సర్‌లా తొలిచేస్తున్న అంతర్గత శత్రువులు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఏప్రిల్‌ 22న పహల్గామ్‌ దాడికి ప్రతీకారంగా మనదేశం పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలనుధ్వసం చేయడమే కాకుండా సుమారు వందమంది ఉగ్రవాదులను హతమార్చింది. ఇదే సమ యంలో పాకిస్తాన్‌కు చెందిన 11 వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడమే కాదు, దాని ఆణ్వస్త్ర ప్రాంతాలపై దాడిచేయగలమన్న సంకేతాన్ని స్పష్టంగా అందించింది. మరి ప్రపంచంలోనే అ త్యంత ధూర్త దేశమైన పాకిస్తాన్‌కు ఈశిక్ష సరిపోతుందా? అనేది ప్రధాన ప్రశ్న. ఎందుకంటే విధించే శిక్ష ఎదుటివాడిలో భయం కలగడానికి లేదా ఇకముందు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా వుండటానికి నిర్దేశించినదై వుంటుంది. కానీ ధూర్త దేశమైన పాకిస్తాన్‌ ఈ చర్యతో గుణపాఠం తెచ్చుకుంటుందని అనుకుంటే అంతకుమించిన అమాయకత్వం మరోటుండదు. ఆపరేషన్‌ సింధూర్‌ వల్ల పాకిస్తాన్‌ తాత్కాలికంగా దెబ్బతినుండవచ్చు, కానీ దాని బుద్ధి మార్చుకునేందటి స్థాయిలో గాయం కలిగించలేదన్నది మాత్రం వాస్తవం. అటువంటప్పుడు ఈ ఆపరేషన్‌ వల్ల మనం సాధించిందేంటి? కలిగిన లాభనష్టాలేంటనే ప్రశలు సహజంగానే ఉదయిస్తాయి. 

ఈ ఆపరేషన్‌ వల్ల అద్భుతమైన మన సాంకేతిక పరిజ్ఞానం, మన ఆయుధసంపత్తి పాటవం, త్రివిధ దళాల సమన్వయ సామర్థ్యం ప్రపంచానికి వెల్లడయ్యాయి. ఇది మనకు కలిగిన మొదటి ప్రయోజనం. పహల్గామ్‌ సంఘటనకు ప్రతీకారంగా భారత్‌ బహుశా బాలాకోట్‌ లేదా అంతకంటే కొంచెం ఎక్కువ స్థాయిలో ప్రతికారదాడులకు పాల్పడవచ్చునని పాకిస్తాన్‌ వ్యూహకర్తలు, సైన్యంఅంచనా వేసివుండవచ్చు. కానీ ఈ స్థాయిలో భారత్‌ దాడిచేస్తుందని వారు కల్లోకూడా ఊహించి వుండకపోవచ్చు. ఒకవేళ ఆవిధంగా అంచనావేసినట్లయితే పాకిస్తాన్‌ తప్పనిసరిగా తగిన జాగ్ర త్తలు తీసుకొని వుండేది. అందుకు చైనా దన్ను ఎలాగూ దానికి వుంది. ఈసారి మనం దాడులుతలపెడితే పాక్‌ స్పందన కచ్చితంగా భిన్నంగా మరింత సామర్థ్యంతో వుండితీరుతుంది. శత్రువు అజాగ్రత్తగా వున్నప్పుడు లేదా అంచనా సరిగ్గా వేయనప్పుడు మనం చేసిన దాడి ఉత్తమ ఫలితాలిచ్చిన మాట వాస్తవం. కానీ ఈసారి పరిస్థితి ఈవిధంగా వుండకపోవచ్చు. అదీకాకుండా ధ్వంసమైనవన్నీ చైనా ఆయుధాలు కనుక, చైనా అహంకారం పూర్తిగా దెబ్బతిన్నది. అంతేకాదు అంతర్జాతీయంగా దాని ఆయుధమార్కెట్‌ కుప్పకూలిపోయే పరిస్థితి ఏర్పడిరది. ఈ నేపథ్యంలో పాకి స్తాన్‌ను మరింత బలోపేతం చేసి భారత్‌ను మరింత దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమని భా వించిన తమవద్ద ఉన్న ఉత్తమ ఆయుధాలను దానికి సమకూర్చే అవకాశాలే ఎక్కువ. చేతిలో చిల్లిగవ్వలేని పాకిస్తాన్‌కు ఇదొక అయాచితవరంగా మారకూడదనేంలేదు. ఎందుకంటే ప్రస్తుతం భారత్‌ తన సామర్థ్యం విషయంలో చైనాను కూడా దాటిపోయిందన్న సందేశం ప్రపంచ దేశాల కు వెళ్లింది. ఇదే సమయంలో ఇప్పటివరకు ప్రపంచానికి వెల్లడికాని చైనా ఆయుధ పాటవంలోని డొల్లతనం ప్రస్ఫుటంగా తెలిసిపోయింది. పాకిస్తాన్‌కు ఇప్పటికే ఏవిధమైన పరువు లేదు కనుక ఈ ఓటమితో దానికి పోయిందేమీ లేదు. కానీ చైనా ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిన్నదన్న మాట వాస్తవం. పోయిన ప్రతిష్టను నిలుపుకునేందుకు చైనా అనుక్షణం అవకాశం కోసం ఎదురుచూ స్తుంటుంది. ఇప్పుడు చైనా తన ప్రతిష్ట కాపాడుకోవడం కోసం పాక్‌ను తన ఆయుధ సంపత్తితో మరింత బలోపేతం చేసి భారత్‌ తనకు సరిసమానంగా ప్రపంచం పరిగణించకుండా వుండటానికి ప్రయత్నించి తీరుతుంది. అమెరికాను మించిపోవాలని ప్రయత్నిస్తున్న చైనా, తనకు సవాలు విసిరే స్థాయిలో భారత్‌ను ఎంతమాత్రం చూడలేదు. దాని దౌర్భాగ్యమేంటంటే అమెరికాతో వాణిజ్య యుద్ధం, ఆపరేషన్‌ సింధూర్‌ పుణ్యమాని కుప్పకూలుతున్న డిఫెన్స్‌ మార్కెట్‌, మరోవైపు ప్ర పంచ తయారీ హబ్‌గా ఇప్పటివరకు సుస్థిరంగా కొనసాగిన తన పేరు క్రమంగా దెబ్బతింటుండటం, అంతర్గతంగా కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థ వంటివి చైనాను పట్టిపీడిస్తున్నాయి. అందువల్ల భారత్‌తో 1962 నాటి దుస్సాహసం ఇప్పుడు చేయడం సాధ్యంకాదు. కేవలం తన ప్రాక్సీ పాకిస్తాన్‌ ద్వారానే తన లక్ష్యాలు సాధించుకోవాలని చూస్తుంది. ఇక పాకిస్తాన్‌ జనరల్స్‌, ఆర్మీ చీఫ్‌ అసీమ్‌ మునీర్‌ వంటివారు జిహాదీ ఉద్యమం ద్వారానే తమ పదవులను సుస్థిరం చేసుకోవాలని చూస్తారు కనుక వారు ఉగ్రవాద నెగళ్లను ఎగదోస్తారు తప్ప విరమించుకోరు. ఇక జిహాదీ ఉగ్ర వాదులు తమ మనసుల్లో నాటుకుపోయిన ‘‘ఆత్మబలిదానం ద్వారా 72మంది అప్సరసలను చేరుకోవడం’’ అనే ఒక విచిత్ర విశ్వాసం నుంచి బయటకు రాలేరు. దీనివల్ల ఉగ్రవాదం సమసిపో దు. ఉగ్రవాదులు పుట్టుకొస్తూనే వుంటారనేదానికంటే మతఛాందసులు ఇటువంటి ప్రలోభాలతో ఉగ్రవాదుల ఉత్పత్తిని కొనసాగిస్తూనే వుంటారనుకోవడం సమంజసం. 

పరివర్తనశీలమైన ఈ ప్రపంచంలో అనుక్షణం యుద్ధతంత్రం మారిపోతున్నది. రాబోయే యుద్ధా లు భౌతికం కంటే సాంకేతికత, కృత్రిమమేథ ఆధారంగా జరుగుతాయని ఆపరేషన్‌ సింధూర్‌ చెప్పకనే చెప్పింది. రాబోయేకాలంలో ఎఫ్‌`16, ఎఫ్‌`35, ఎస్‌యు`57, సుఖోయ్‌, రాఫెల్‌ వంటి యుద్ధవిమానాల వల్ల పెద్దగా ప్రయోజనం వుండకపోవచ్చు. ఎందుకంటే యుద్ధరీతి డ్రోన్‌ల వినియోగంవైపు మళ్లింది. అజర్‌బైజాన్‌`అర్మీనియా యుద్ధం డ్రోన్ల ప్రాధాన్యతను తెలియజేస్తే, ఆపరేషన్‌ సింధూర్‌ డ్రోన్‌లను నిలువరించే రక్షణ సాంకేతికత ఆవశ్యకతను ప్రపంచానికి వెల్లడిరచింది. ఇంతగా సాంకేతికత మారిపోతున్నప్పటికీ, సంప్రదాయికంగా వస్తున్న జిహాదీ ఉగ్రవాదంలో కూడా ఇవేరకమైన సాంకేతిక పరిజ్ఞానాలు ఉపయోగించే కాలం రాకమానదు. అంటే సాంకేతిక ప్రగతి అనేది ఒక నిరంతర ప్రక్రియ. దానికి అంతుండదు!

ఇప్పటికి ఆపరేషన్‌ సింధూర్‌లో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం, సమన్వయం విలువ ప్ర పంచానికి వెల్లడైంది కనుక ఈ రెండు అంశాల్లో రాబోయేకాలంలో మరిన్ని కొత్త ఆవిష్కరణలు జరగవచ్చు. అందువల్ల భారత్‌ రాబోయేకాలంలో సరికొత్త వ్యూహాత్మక పద్ధతులు అనుసరించక తప్పదు. అయితే పాకిస్తాన్‌ను కట్టడిచేయడానికి ఈ సాయుధ పోరాటం లేదా సంఘర్షణ ఎంతమాత్రం పనిచేయవన్నది సుస్పుష్టం. ఈ నేపథ్యంలో భారత్‌ సాంకేతిక అభివృద్ధితో పాటు జిహాదీ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడానికి కొన్ని ‘ఉప`సంప్రదాయిక’ పద్ధతులు అనుసరించక తప్పదు. ప్రస్తుతం మనదేశం వీటిని అనుసరిస్తున్నది కూడా! 2030 నాటికి ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్న అంచనాల నేపథ్యంలో భారత్‌ ఈవిధంగా సైనిక సంఘర్షణలకు దిగడంఅభివృద్ధిపరంగా ఆత్మహత్యా సదృశమే అవుతుంది. అదీకాకుండా మనల్ని ఆర్థికంగా దెబ్బకొట్టా లనుకునే పాక్‌, చైనాలకు ఇది వరంలా మారుతుంది కూడా!

ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్‌కు నిద్రపట్టకుండా చేయాలంటే, అంతర్గత సంఘర్షణలను చల్లారకుం డా ఎగదోయడమే మార్గం. ఉదాహరణకు ఆపరేషన్‌ సింధూర్‌ వల్ల, బలూచ్‌ విమోచనోద్యమానికి ఎంతో ప్రోత్సాహం లభించింది. పాక్‌ రక్షణ వ్యవస్థలను, వాయుసేన స్థావరాలను ధ్వంసం చేయడంవల్ల దెబ్బతిన్న పాక్‌ సైన్యంపై బలూచ్‌ వీరులు మరింత విరుచుకుపడే అవకాశం లభిం చింది. ప్రస్తుతం ఇది జరుగుతున్నది కూడా. మూలిగే నక్కమీద తాటిపండు పడినట్టు స్వతంత్ర బలూచిస్తాన్‌ను బలూచ్‌ సాయుధులు ప్రకటించడం, పాకిస్తాన్‌కు కోలుకోలేని దెబ్బ. తన సైన్యాన్ని పూర్తి సాయుధ సంపత్తితో బలూచ్‌లపై దాడులకు ఉపయోగించలేని పరిస్థితి. ఇప్పటికే ఆర్థి కంగా దివాలాతీసిన స్థితిలో ఇంతటి ఖర్చును పాక్‌ భరించలేదు. పోనీ చావోరేవో అని బలూచ్‌ల పై సైనిక చర్య తీసుకుంటే, వాయువ్య ప్రాంతంలో తాలిబన్లు కాచుకు కూర్చున్నారు. పీఓకేలో ప్రజల నిరసనలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. అయితే వీటికి పెద్దగా మీడియా కవరేజీ రావడంలేదు. పంజాబ్‌ రాష్ట్రం తమకు నీళ్లు వదలడంలేదంటూ సింధూ రాష్ట్ర ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా సింధూ నదీ జలాలను భారత్‌ ఆపేయడంతో, అసలు మొత్తానికే పాక్‌ విలవిలలాడుతోంది. నీరు వదలక పోతే రక్తం పారుతుందని బీరాలు పలికిన నాయకులు ఇప్పుడు నోరు మెదపడంలేదు. మన జలశక్తి వనరుల శాఖకు పాకిస్తాన్‌ ఒక లేఖరాసింది. నీటి ఎద్దడి తీవ్రంగా వుంది…సిందూ జలాలను దిగువకు వదలమన్నది ఆ లేఖ సారాంశం. పాక్‌ వంటి ధూర్తదేశానికి తక్షణ మరియు శాశ్వత ఇబ్బందిని కలిగించేది సింధూనదీ జలాలు మాత్రమే నన్నది ప్రస్తుతం సుస్పష్టమైంది. భారత ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటివరకు కఠినవైఖరినే అనుసరిస్తోంది.

మరో ముఖ్య విషయమేంటంటే భారత్‌ాపాక్‌ల మధ్య యుద్ధాన్ని ఆపేసింది తానేనని ట్రంప్‌ ప్రచారం చేసుకుంటున్నారు. ఒబామాకు నోబెల్‌ ప్రైజ్‌ వచ్చినట్టుగానే తనకు కూడా శాంతి బహు మతి రావాలన్నది ఆయన ఆకాంక్ష కావచ్చు. అయితే చైనా విషయంలో ట్రంప్‌ అనుసరించినట్టు గా మనం కూడా పూర్తి శత్రుత్వ వైఖరితో వ్యవహరించే పరిస్థితి లేదు. ఇది చైనాకూ వర్తిస్తుంది. ఇప్పటికీ మనదేశంలోని చాలా పరిశ్రమలు ముఖ్యంగా ఔషధరంగానికి కావలసిన ముడిసరుకు చైనానుంచే సరఫరా అవుతుంది. రెండు దేశాల మధ్య వాణిజ్యలోటు చాలా అధికం. డోనాల్డ్‌ ట్రంప్‌ ఈ వాణిజ్యలోటును అధిగమించడానికి టారిఫ్‌ల యుద్ధానికి తెరతీశారు. ఇదేవిధానం నుసరిస్తే అంతకుమించిన మూర్ఖత్వం మరోటుండదు. ఇప్పటికీ వాణిజ్యం విషయంలో చైనాను మనం పక్కన పెట్టలేం. అందువల్ల ఈ లోటును పూడ్చుకోవడానికి ఇతర మార్గాలు ఎన్నుకోవ డం తప్ప ప్రస్తుతానికి మనం చేయగలిగిందేమీ లేదు. ముఖ్యంగా మనం కూడా ప్రపంచ తయారీ హబ్‌గా తయారవాలంటే ఇప్పటికప్పుడు సాధ్యమయ్యేదీ కాదు. అందువల్ల ఔనన్నా కాదన్నా చైనాతో మనకు ‘శత్రుామిత్ర’ మిశ్రమ వైఖరి అనుసరించక తప్పదు.

అన్నింటికన్నా మనదేశానికి అత్యంత ప్రమాదకరంగా మారిన అంశం మరోటుంది. అంతర్గతం గా పనిచేస్తున్న దేశవ్యతిరేకులు మరియు అతిచైతన్య దేశభక్తులతో ఇబ్బంది ఏర్పడుతోంది. ఉగ్రస్థావరాలపై దాడులు జరిపిన తర్వాత, పాక్‌ మనపై యుద్ధానికి ఉపక్రమిస్తే, మనదేశంలో శాంతి కాముకుల లాబీ ఒక్కసారిగా చైతన్యవంతమైంది. యుద్ధంవల్ల అంతా నష్టమే కాబట్టి మనం తక్షణం ఉపసంహరించుకోవాలంటూ ఈ శాంతికాముక లాబీ సుద్దులు చెప్పడం మొదలుపెట్టింది. అంతేకాదు ఉగ్రస్థావరాలను ధ్వంసంచేసి భారత్‌ తన సామర్థ్యాన్ని ప్రపంచానికి వెల్లడిస్తే, ఈ విజయాన్ని కూడా బలహీనపరచే స్థాయిలో వీరి కథనాలు వెలువడటం విచిత్రం. పహల్గాంలో అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల చర్యను మరుగునపడేసి, మనం చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌ వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని, యుద్ధం మంచిదికాదంటూ వీరి ప్రచారం కొనసా గింది. ఇక అతిచైతన్య దేశభక్తులు సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా పీఓకేను ఆక్రమించాల్సింది ప్రభుత్వం ఈ అవకాశాన్ని చేజేతులారా వదిలేసిందంటూ వీరి భావోద్వేగాలు! ప్రభుత్వంలో వి ధానకర్తలు, పటిష్ట నాయకత్వం అటువంటి అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుం టారు. అంతేకాని, తాత్కాలిక భావోద్వేగాలకు లేదా యుద్ధంవల్ల నష్టం వస్తుందని చెప్పే సుద్దులను వారు పట్టించుకోరు. ఆపరేషన్‌ సింధూర్‌ వల్ల మన ప్రతిష్ట పెరగడమే కాదు, డిఫెన్స్‌ రంగ ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో మనకు సానుకూల వాతావరణం ఏర్పడిరదన్నది సత్యం. ప్రపంచం మనల్ని చూసే విధానంలో సమూలంగా మార్పు తీసుకొచ్చింది. దీన్ని ఈ రెండు వర్గాలుగుర్తించాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version