వాణిజ్య ఒప్పందాన్ని ప్ర‌క‌టించిన ట్రంప్‌..

వాణిజ్య ఒప్పందాన్ని ప్ర‌క‌టించిన ట్రంప్‌.. ఆ డీల్‌ను ఆహ్వానించిన జ‌పాన్ ప్ర‌ధాని

జ‌పాన్‌తో భారీ వాణిజ్య ఒప్పందం జ‌రిగిన‌ట్లు ట్రంప్ వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో జ‌పాన్ ప్ర‌ధాని షిగేరు ఇసిబా స్పందించారు. ట్రంప్ ప్ర‌క‌ట‌న‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

జ‌పాన్‌తో భారీ వాణిజ్య ఒప్పందం(Trade Deal) జ‌రిగిన‌ట్లు ట్రంప్ వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో జ‌పాన్ ప్ర‌ధాని షిగేరు ఇసిబా స్పందించారు. ట్రంప్ ప్ర‌క‌ట‌న‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఫిలిప్పీన్స్‌తో జ‌రిగిన వాణిజ్య ఒప్పందాన్ని కూడా ట్రంప్ ప్ర‌క‌టించారు. జ‌పాన్ టారిఫ్ రేట్‌ను 15 శాతానికే ఫిక్స్ చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న దేశాల్లో ఈ రేట్ అత్యంత క‌నిష్ట‌మైంది. జ‌పాన్ వాహ‌నాల‌పై విధిస్తున్న రేట్‌ను 25 శాతానికి పెంచాల‌నుకున్నారు, కానీ దాన్ని 15 శాతానికే కుదించిన‌ట్లు జ‌పాన్ ప్ర‌ధాని ఇషిబా తెలిపారు. జ‌ప‌నీస్ వైపు ప‌న్ను శాతం త‌గ్గిన‌ట్లు ఎటువంటి ప్ర‌క‌ట‌న జ‌ర‌గ‌లేదు. బ‌ల‌మైన రీతిలో లాబీయింగ్ చేయ‌డం వ‌ల్లే అమెరికా త‌మ‌పై ప‌న్నుల‌ను భారీగా వ‌సూల్ చేయ‌డం లేద‌ని జ‌పాన్ ప్ర‌ధాని వెల్ల‌డించారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో వైట్‌హౌజ్‌లో ట్రంప్‌తో జ‌రిగిన స‌మావేశంలో టారిఫ్‌ల క‌న్నా ఇన్వెస్ట్‌మెంట్‌ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని చెప్పిన‌ట్లు తెలిపారు. ఆగ‌స్టు ఒక‌టో తేదీ వ‌ర‌కు డీల్ కుదుర్చుకోకుంటే, వాణిజ్య ప‌న్నులను పెంచ‌నున్న‌ట్లు ట్రంప్ హెచ్చ‌రిక ఇచ్చిన నేప‌థ్యంలో కొన్ని దేశాలు ఆ ఒప్పందానికి రెఢీ అయ్యాయి. డీల్‌కు చెందిన వివ‌రాల‌ను శ్వేత‌సౌధం ఇంకా రిలీజ్ చేయ‌లేదు.

చ‌రిత్ర‌లో అతిపెద్ద వాణిజ్యం ఒప్పందం కుదిరిన‌ట్లు ట్రంప్ ప్ర‌క‌టించారు. జ‌పాన్‌తో జ‌రిగిన అతిపెద్ద డీల్ ఇదే అని ఆయ‌న వెల్ల‌డించారు. ట్రుత్ సోష‌ల్‌లో ఆయ‌న దీనికి సంబంధించిన ఓ వీడియోను పోస్టు చేశారు. అమెరికాలో సుమారు 550 బిలియ‌న్ల డాల‌ర్లు ఇన్వెస్ట్ చేయ‌డానికి జ‌పాన్ సిద్ధంగా ఉంది. అలాగే 15 శాతం దిగుమ‌తి సుంకాన్ని కూడా చెల్లించేందుకు జ‌పాన్ అంగీక‌రించింది.

ఫిలిప్పీన్స్ ఉత్ప‌త్తుల‌పై 19 శాతం ప‌న్ను విధించ‌నున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ తెలిపారు. ఆ దేశ అధ్య‌క్షుడితో జ‌రిగిన భేటీ త‌ర్వాత ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేశారు. కొత్త టారిఫ్ విధానంపై ట్రంప్ త‌న సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించారు. అయితే అమెరికా వ‌స్తువుల‌పై విధించే సుంకాన్ని త‌గ్గించ‌నున్న‌ట్లు ఫిలిప్పీన్స్ తెలిపింది. ఇండోనేషియాకు చెందిన వ‌స్తువుల‌పై కూడా 19 శాతం ప‌న్ను విధించ‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు.

ట్రంప్ ప్ర‌క‌ట‌న‌తో.. జ‌పాన్‌లోని కార్ల కంపెనీల షేర్లు పెరిగిపోయాయి. జ‌పాన్ కార్ల‌పై దిగుమ‌తి సుంకాన్ని 25 శాతం నుంచి 15 శాతానికి త‌గ్గించారు. దీంతో నిస్సాన్ షేర్లు పెరిగిపోయాయి. 8.5 శాతం షేర్లు పెరిగాయి. హోండా షేర్లు 11 శాతం, టొయోటా షేర్లు 14 శాతం వృద్ధి చూపించాయి. కొత్త అగ్రిమెంట్ ప్ర‌కారం అమెరికా వాహ‌నాల‌కు జ‌పాన్‌లో ఎంట్రీ ల‌భించ‌నున్న‌ది.

 

నర్సంపేటలో భారీఎత్తున కార్మిక సంఘాల ర్యాలీ

నర్సంపేటలో భారీఎత్తున కార్మిక సంఘాల ర్యాలీ.

నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి

కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి

అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నర్సంపేట పట్టణంలో ఆల్ ట్రేడ్ యూనియన్, సిఐటియు, బిఆర్టియు ఎఐటియుసి,ఏఐఎఫ్టియున్యూ, ఐఎఫ్టియు, టియుసిఐ సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ రోడ్డు కూడలి నుండి జయలక్ష్మి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర అధ్యక్షుడు మోడం మల్లేశం, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఇసంపెల్లి బాబు, ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి గుంపెల్లి మునీశ్వర్,సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పంజాల రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నో త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను కార్పొరేట్ శక్తులకు బడా పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా కార్మిక చట్టాల సవరణ చేయడం సరికాదన్నారు.రోజుకు ఎనిమిది గంటల పని విధానానికి స్వస్తి పలికి 10 గంటలు పని చేయాలని చెప్పడం కార్మిక వర్గాన్ని శ్రమదోపిడికి గురి చేయడమని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

 

 

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని రైతులపై బలవంతంగా రుద్దుతున్న నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.సమ్మెకు మద్దతుగా సిపిఎం, సిపిఐ పార్టీలు మద్దతు తెలిపి ప్రదర్శనలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేష్ ,ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు లలిత, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు గడ్డం సమ్మయ్య, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు హనుమకొండ శ్రీధర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి బాలకృష్ణ,సిఐటియు పట్టణ కార్యదర్శి రాజు, మున్సిపల్ యూనియన్ యశోద,ఆశా యూనియన్ సుజాత, ఏఎఫ్టీయు నాయకులు జనార్ధన్ రమేష్,ఏఐటీయూసీ నాయకులు గోవర్ధన చారి, ఎడ్ల నాగులు, కొత్తగట్టు నరసింహం, కిషోర్, కనకమల్లు, సిపిఐ కార్యవర్గ సభ్యుడు అక్క పెళ్లి రమేష్, ఐ ఎఫ్ టి యు నాయకులు సుమన్ మొగిలి బాలు కృష్ణ మల్లయ్య స్వరూప పివైఎల్ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి,టియుసిఐ జిల్లా కార్యదర్శి అడ్డురి రాజు,జిల్లా నాయకులు కట్టన్న తదితరులు పాల్గొన్నారు.

జోరుగా ఎర్రరాయి అక్రమ దందా

జోరుగా ఎర్రరాయి అక్రమ దందా

◆ గుంతలమయంగా గనుల ప్రాంతం

◆ జరిమానాలు విధించినా మారని తీరు

◆ గనుల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండల పరిధిలోని గణేష్ పూర్ గ్రామ శివారులో అక్రమంగా ఎర్రరాయి తవ్వకాల దందా జోరుగా కొనసాగుతుంది. ఎర్రరాయి తవ్వకాల ను కట్టడి చేసేందుకు అధికారులు పలుమార్లు దాడులు చేసి అకక్రమార్కు లకు జరిమానాలు విధించినా గనుల్లో తవ్వకాలు మాత్రం ఆగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. పట్టుబడి నప్పుడు అక్రమార్కు లు జరిమానాలు కడుతూ మళ్లీ యధావిధిగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అక్రమంగా ఎర్రరాయిని తరలించే మాఫియా తమ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. నిమ్స్ అసైన్మెంట్ భూముల్లో సైతం ఎర్రరాయి తవ్వకాలు తమ ఇష్టారాజ్యంగ జరుగుతున్నా. రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని మండల ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. నిత్యం గనుల్లో ఎర్రరాయిని తీసి ట్రాక్టర్లలో వందల సంఖ్యలో రాష్ట్ర సరిహద్దులను దాటిస్తున్నారే ఆరోపణలు కూడా ఉన్నాయి. గణేష్ పూర్ ఎర్రరాయిని అక్రమార్కులు అడ్డు అదుపు లేకుండా ఇక్కడి నుంచి దూరప్రాంతాలైన అందోల్, నారాయణ ఖేడ్, వట్టిపల్లి మండ లాలకు లారీల్లో అధిక లోడ్లతో తరలిస్తున్నా అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. భారీ ఎత్తున లారీల్లో ఎర్రరాయిని దూర ప్రాంతాలకు తరలిస్తుండడంతో రోడ్లు సైతం దెబ్బతిని వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మైనింగ్ అధికారులు చుట్టపు చూపుగా వచ్చి నామ మాత్రంగా దాడులు చేసి అసలైన నిందితులను వదిలేస్తూ తూతూ మంత్రంగా తనిఖీలు జరిపి నామ మాత్రానికి జరిమానాలు విధిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా ఎర్రరాయి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్టవేయ గలుగుతారా? లేదా యధావిధంగా కొనసాగుతుందా అనేది వేచి చూడాల్సిందే.

ఈనెల 25న జరిగే కార్మిక సంఘాల జిల్లా సదస్సును.!

ఈనెల 25న జరిగే కార్మిక సంఘాల జిల్లా సదస్సును జయప్రదం చేయండి – ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ పిలుపు

కరీంనగర్, నేటిధాత్రి:

నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని మే 20వ తేదీన కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈనెల 25వ తేదీన బద్దం ఎల్లారెడ్డి భవన్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా సన్నాహక సదస్సు జరుగుతుందని కావున జిల్లాలోని కార్మిక లోకం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ లోని బైపాస్ రోడులో గల సిమెంట్ గోదాం హమాలీ కార్మికుల సమావేశం జంగం తిరుపతి అధ్యక్షతన గోదాం వద్ద జరిగింది. ఈసందర్భంగా బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకోండు సంవత్సరాలైనా శ్రమిస్తున్న ప్రజల జీవితాలు మరియు జీవన ఉపాధిపై తన కార్పోరేట్ కుతంత్రాలు అమలు చేయాలని ప్రయత్నిస్తుందని దీనివల్ల దేశంలో పేదరికం, ఆకలి, పోషకాహార లోపం, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ కోడులు అనేవి శ్రామిక ప్రజలపై బానిసత్వం విధించే బ్లూప్రింట్ లాంటివని సంఘంలోని కార్మికులకు సంబంధించిన అన్ని హక్కులు కార్మికుల నుండి లాక్కుంటున్నారని పని గంటలు, కనీస వేతనాలు, సామాజిక భద్రత పని పరిస్థితులకు సంబంధించిన అన్ని ప్రాథమిక హక్కులను తీవ్రమైన సవాలుగా పరిగణించబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. యూనియన్ హక్కులు గుర్తింపు సమిష్టి నిరసనల హక్కు బావ వ్యవస్థీకరణ హక్కు తీవ్రమైన సవాలుగా మారాయని కార్పొరేట్ యజమానుల ప్రయోజనాల కోసం శ్రామిక ప్రజలపై బానిసత్వం యొక్క షరతులను విధించే బ్లూప్రింట్ లాంటివని కార్మికులు యూనియన్ నాయకులను నాన్ బెలబుల్ జైలు శిక్షలతో సహా కఠినమైన పోలీస్ చర్యలకు దారితీస్తుందని యజమాన్యానికి లేదా కార్మిక శాఖకు సమిష్టి ఫిర్యాదులను నిరాకరిస్తుందని ఇలాంటి చట్టాలను కార్మిక లోకం వ్యతిరేకించాలన్నారు. అసంఘటిత కార్మికుల జీవన ఉపాధికి సంబంధించిన ప్రాథమిక హక్కులను దూరం చేస్తుందని అందుకని కేంద్ర కార్మిక సంఘాల ఫెడరేషన్లు దేశవ్యాప్త సమ్మెను చేస్తున్నాయని దీని విజయవంతం చేయాలని చార్టర్ ఆఫ్ డిమాండ్స్ తయారుచేసి మే20న దేశవ్యాప్త నిరవధిక సమ్మె చేయాలని అందుకోసమే సదస్సు నిర్వహించడo జరుగుతుందని దీనిలో కార్మికలోకం జిల్లా వ్యాప్తంగా భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఈసమావేశంలో సిమెంట్ గోదాంహమాలీ అధ్యక్షులు జంగం తిరుపతి ఉపాధ్యక్షులు బాగోతం వీరయ్య, నాయకులు ననవేని కొమరయ్య ననవేని శ్రీనివాస్, పల్లెర్ల రాములు గౌడ్, ముత్యాల శ్రీనివాస్, దానవేని కొమరయ్య, ఉప్పారం శ్రీనివాస్, జక్కుల ఐలయ్య, దొంగల శ్రీనివాస్, బోయిని ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version