తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి- ఎంపీడీవో.
రామడుగు, నేటిధాత్రి:
వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కరీంనగర్ జిల్లా రామడుగు మండల ఎంపీడీవో రాజేశ్వరి అన్నారు. రామడుగు మండల కేంద్రంలో ఆమె మిషన్ భగీరథ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ తాగునీటి సమస్య ఉంటే గుర్తించి వెంటనే తగిన పరిష్కారం చూపాలని సూచించారు. ఈకార్యక్రమంలో డిఈ అజీముద్దీన్, ఏఈ షారోన్, ఎంపిఓ శ్రావణ్ కుమార్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ బండి సంజయ్ ని మర్యాదపూర్వకముగా కలిసిన గల్ఫ్ జేఏసీ అధ్యక్షులు చిలుముల రమేష్
రామడుగు, నేటిధాత్రి:
కేంద్ర హోమ్ శాఖ సహాయక మంత్రి వర్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్ బిజెపి పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన గల్ఫ్ జెఎసి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చిలుముల రమేష్. ఈసందర్భంగా రమేష్ మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల సమస్యలు మరియు గల్ఫ్ దేశాల్లో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వ పథకాలలో ప్రత్యేక కోట ఇవ్వాలని, గల్ఫ్ లో ప్రమాదంలో అవయవాలు కోల్పోయి ఉపాధి లేక ఉన్న కుటుంబాలకు బ్యాంక్ ద్వారా జీవన ఉపాధి కల్పించాలని, నకిలీ ఏజంట్లపై చేర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈకార్యక్రమంలో బిజెపి రామడుగు మండల అధ్యక్షులు మోడీ రవీందర్, చిలుముల సంజయ్, తదితరులు పాల్గొన్నారు.
వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులదే గెలుపు-బీజేపీ నాయకులు.
కరీంనగర్, నేటిధాత్రి:
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వారోత్సవాలలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో క్రియశిలా సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి నరేంద్రమోది నిధులతోనే జరుగుతుందని, రేషన్ బియ్యం పంపిణీ కేంద్రమే ఇస్తుందని వారన్నారు. ఈజిఎస్ నిధుల ద్వారా గ్రామాలలో సిసి రోడ్లు కేంద్ర ప్రభుత్వం మే ఇస్తుందని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరని వారు తెలిపారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయానికి నాయకులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలని వారు దిశానిర్దేశం చేశారు. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, జిల్లా కోశాధికారి వైద రామానుజం, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఉప్పు శ్రీనివాస్ పటేల్, జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సెంటి జితేందర్, మండల ఉపాధ్యక్షులు వేముండ్ల కుమార్, కాడే నర్సింగం, కారుపాకల అంజిబాబు, మండల కార్యదర్శి కడారి స్వామి, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, బద్ధం లక్ష్మారెడ్డి, మునిగంటి శ్రీనివాస్, బూత్ కమిటీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని.
జహీరాబాద్. నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయలో ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ,డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ , పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఈనెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే బిఆర్ఎస్ రచోత్సవ సభకు సంబంధించిన గొడ పత్రిక ను బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.ఈనెల 27న ఎల్కతుర్తి బిఆర్ఎస్ రచోత్సవ సభకు జహీరాబాద్ నియోజకవర్గం నుండి సుమారు 5 వేలకు పైగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళుతున్నారని అన్నారు. తెలంగాణ ను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ దేనని, పదేళ్ల కేసీఆర్ పాలన దేశంలో నంబర్ వన్ గా మారిందని పేర్కొన్నారు.
BRS
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి గెలిపించి పెద్ద తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఎల్కతుర్తిలో జరుగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్ తెలంగాణ ప్రజల భవిష్యత్ గురించి దిశా నిర్దేశం చేయనున్నారని, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,మాజి జడ్పిటిసి స్వప్న భాస్కర్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,పాక్స్ చైర్మన్ మచ్చెందర్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహిద్దీన్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,మాజి సర్పంచ్ శేఖర్ రెడ్డి,యువ నాయకులు మిథున్ రాజ్,నాయకులు గణేష్ , చంద్రయ్య,దీపక్ తదితరులు పాల్గొన్నారు.
చేనేత కార్మికుడి ఇంటిలో సన్న బియ్యం భోజనం చేసిన కాంగ్రెస్ మహిళలు
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలో బి.వై నగర్ లోని చేనేత కార్మికుడి ఇంటిలో సన్న బియ్యం భోజనం చేసిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి మరియు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత -నలినీకాంత్ మాట్లాడుతు గత ప్రభుత్వహయాంలో దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంతన్న హయాంలో పేద, ప్రజలందరికీ సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగినది.
నేడు సిరిసిల్ల జిల్లాలోని మహిళలందరూ కూడా వాళ్ల పిల్లలకి వాళ్ళ కుటుంబ సభ్యుల అందరికీ కూడా కడుపునిండా భోజనం తింటున్నారని పేద ప్రజలందరి కళ్ళలో సంతోషం వ్యక్తం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు మడుపు శ్రీదేవి, మరియు జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కోడం అరుణ, జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్ సామల రోజా సుధ, సిరిసిల్ల మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి కాజా పాల్గొన్నారు.
తెలుగు విభాగంలో కుమ్మరి ఓదేలుకు డాక్టరేట్ హైదరాబాద్ నేటిధాత్రి:
ఉస్మానియా విశ్వ విద్యాలయం, హైదరాబాద్ తెలుగు విభాగంలో వరంగల్ జిల్లా కథా సాహిత్యం పరిశీలన అనే అంశం పైన డాక్టర్ పూర్ణ ప్రజ్ఞ చంద్రశేఖర రావు పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసినందున పీహెచ్డీ పట్టాను ఉస్మానియా విశ్వవిద్యాలయం అందజేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా మొగుళ్ళపల్లి మండలం గుడిపహాడ్ అనే గ్రామానికి చెందిన కుమ్మరి చిన్న సమ్మయ్య సారమ్మ అనే దంపతులకు జన్మించిన చివరి సంతానం ఓదేలు శారీర వైకల్యం కలిగిన ఓదేలు తన కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో అన్నత విద్యనభ్యసించి డాక్టర్ పట్టాను పొందారు.ప్రాథమిక విద్యను స్వగ్రామంలో పూర్తిచేసి, హై స్కూల్ విద్యను మొగుళ్లపల్లి మండలం లో ఉన్న జెడ్ పి పి ఎస్ ఎస్ మొగుల్లపల్లి హైస్కూల్లో చదివి, ఇంటర్ ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల స్టేషను ఘన్ పూర్ లో, కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బిఎ స్పెషల్ తెలుగు చదివి ఉన్నత విద్యను ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని ఎం. ఎ తెలుగులో, ఎం.ఎ అర్థశాస్త్రంలో పూర్తిచేసి, టీచర్ ట్రైనింగ్ చేసి పీహెచ్డీ లో ప్రవేశం పొంది వరంగల్ జిల్లా కథా -సాహిత్యం పరిశీలన అంపశయ్య నవీన్ రామచంద్రమౌళి గారి కథల పైన పరిశోధన చేసి పీహెచ్డీ పట్టానుపొందారు. పీహెచ్డీ పట్టాను పొందిన ఓదేలును మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల సంస్థాన్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు ,వ్యాఖ్యాత, డా బి. వెంకట్ కవి, కుటుంబసభ్యులు, గురుకుల అధ్యాపకులు, మిత్రులు, కవులు, కళాకారులు, తదితరులు, అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూములు ఇండ్లు వెంటనే ఇవ్వాలి
సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి
కరీంనగర్, నేటిధాత్రి:
భారతదేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన ఏకైక పార్టీ సిపిఐ అని, పేద ప్రజల హక్కుల కోసం సమస్యల కోసం ఉద్యమిస్తున్న సిపిఐ పార్టీని రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు గెలిపించాలని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే ఇవ్వాలని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం సీతారాంపూర్ శాఖ మహాసభ కటికారెడ్డి బుచ్చన్న యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ భారత దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని సుదీర్ఘ చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి ఉందని, సిపిఐ శతజయంతి ఉత్సవాలను సిపిఐ శ్రేణులు ప్రతి శాఖలో ఘనంగా నిర్వహించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో గ్యాస్ సబ్సిడీ, ఉచిత కరెంట్ అర్హులైన వారిలో కొందరికి ఇంకా అందడం లేదనీ, గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో నగర శివారు చింతకుంటలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు వెంటనే ఇవ్వాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆరులైన పేదల చేత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్దకు వెళ్తామని, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లను మంజూరు చేయాలని, నగరంలో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయి ఉన్నాయని ప్రభుత్వం వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈసమావేశంలో సిపిఐ నాయకులు ఎర్రం యాదగిరి, కంపెళ్ళి కొమురయ్య, కాల్వల శ్రీనివాస్, రాకం భాస్కర్, నందమల్ల యేసు బాబు, కాల్వ మల్లేశం, జే.బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి ఏలేటి రామయ్య పల్లి గ్రామ వాస్తవ్యులు కీర్తి శేషులు ఏలేటి నర్సయ్య, లింగమ్మ, ముత్తమ్మ గార్ల జ్ఞాపకార్థం కొత్తూరు వెంకటమ్మ – స్వామీరెడ్డి మరియు కొత్తూరు మల్లారెడ్డి – హేమ, కొత్తూరు నర్సింహా రెడ్డి(డాక్టర్) – శిరీష , కొత్తూరు విజందర్ రెడ్డి – సుష్మ దంపతులు కలిసి శివాలయానికి విరాళంగా 216000/- రూపాయలు అక్షరాల (రెండు లక్షల పదహారు వేల రూపాయలు) ఇవ్వడం జరిగింది… ఈ కార్యక్రమం లో శివాలయ కమిటీ సభ్యులు ఆలయ కమిటీ అధ్యక్షులు కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి,ఉపాధ్యక్షులు మోతుకూరి నరేష్,బిళ్ళ సత్యనారాయణ రెడ్డి, మందల రాఘవరెడ్డి,కాల్వ సమ్మిరెడ్డి,బొమ్మ శంకర్, కొక్కుల సారంగం, మోతుకూరి రాజు,చెక్క నర్సయ్య,సర్వ శరత్, తీగల నాగరాజు,అనగాని రాజయ్య,తిప్పణవేణి రవి, ప్రధాన అర్చకులు రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.
వక్ఫ్ బిల్లును రద్దు చేయాలి -ఈనెల 13న హైదరాబాదులో ధర్నా విజయవంతం చేయాలి -మర్కజీ ఇంతేజామీ మిల్లాతే ఇస్లామియా కమిటీ మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా మెట్ పల్లి ఏప్రిల్ 10 నేటి ధాత్రి
మెట్ పల్లి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని మెట్ పల్లి మర్కజీ ఇంతేజామీ మిల్లాతే ఇస్లామియా కమిటీ మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా డిమాండ్ చేశారు. గురువారం ఆయన మెట్ పల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 13న కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం దగ్గర మధ్యాహ్నం రెండు గంటలకు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీ సోదరులు, అనుబంధ సంఘ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవుడికి అంకితం చేస్తూ ముస్లిం దాతలు ఇచ్చిన భూములు వక్ఫ్‌బోర్డు పరిధిలో అనాదిగా ఉన్నాయన్నారు. ఈ ఆస్తులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలపై ద్వేషంతో బడాబాబులకు అంటగట్టడానికి చట్టంలో మార్పులు తీసుకొని వచ్చిందన్నారు. పేదలకు చెందాల్సిన భూములను లాక్కోవడం ద్వారా ముస్లింలను ఆర్థికంగా బలహీనులను చేసి రాజకీయంగా, సామాజికంగా ఎదగకుండా చేయాలన్నది బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీల ఆస్తులకు రక్షణగా ప్రత్యేక వక్ఫ్ చట్టాన్ని రాజ్యాంగం అమలు చేసిందని, మోదీ ప్రభుత్వం ముస్లింలను అణగదొకేందుకు ఈ చట్టాలను సవరణలు చేయాలని చూస్తున్నదని, దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా అధిక సంఖ్యలో ధర్నా కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మైనారిటీ నాయకులు సల్మాన్ ఖాన్ షేక్ షాహిద్ హుస్సేన్ సయ్యద్ సిరాజుద్దీన్ మహమ్మద్ రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.
ఇష్టానుసారంగా మందమర్రి మున్సిపాలిటీ కాంట్రాక్టర్ పనులు
మందమర్రి నేటి ధాత్రి
మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో బస్టాండ్ ఫ్లైఓవర్ నుండి రైల్వే ట్రాక్ వరకు మున్సిపాలిటీ నుంచి రెండు కోట్ల 20 లక్షల రూపాయల సైడ్ డ్రైన్ మంజూర్ అయింది టెండర్ రూపకంగా రావికంటి వెంకటేశం టెండర్ ద్వారా వర్కులు స్వాధీనం చేసుకొని పని మొదలు పెట్టిన తర్వాత ఇప్పటికీ మూడు నుంచి నాలుగు నెలల అయినప్పటికీ పని పూర్తి చేయలేదు సైడ్ డ్రైన్ కూడా ఒక కాడ ఎత్తు కట్టడం మరో కాడ తక్కువ డౌన్ గా కట్టడం వంకలు వంకలు కట్టుకుంటూ విరుద్ధంగా కట్టడం జరుగుతున్నది వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇలా ఎందుకు కడుతున్న వనీ అడిగితే దురుసుగా సమాధానం చెప్పడం జరిగిందీ గత మూడు నెలల నుంచి పని పూర్తి చేయలేకపోవడం వల్ల చిరు వ్యాపారులు ఎంతో నష్టపోయారు కిరాయిలు కట్టని పరిస్థితిలో ఉన్నారు , ఎంత మొరపెట్టుకున్నా కూడా పని పూర్తి చేయలేక డ్రైయిన్లు డౌన్ కట్టారని అది తీసుకుపోయి ఏఈ డిఈ కమిషనర్ * *టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు నలుగురు కూడా వచ్చి అవి చూసిన తర్వాత ఈ డ్రైన్ తప్పుగా కట్టావు అనీ వ్యాపారస్తులు ఫిర్యాదు చేశారు కాబట్టి వాటిని సరి చేయాలని ఆఫీసర్ చెప్పిన తర్వాత కూడా పట్టించుకోవడం లేదు వ్యాపారస్తులు ఎన్నిసార్లు అడిగినా నీ దిక్కున కడ చెప్పుకో పొమ్మంటూ వల్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ అసలు వర్క్ దగ్గరికి రావట్లేదు గుమస్తాలను పెట్టి పని నడిపించడం వల్ల నాణ్యతలేని పని చేస్తున్నాడని దీని విషయంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేస్తామని చెప్పినప్పుడు కూడా వల్ల మాటలను పెడచెవినబెట్టి వెళ్తా ఉన్నాడు పని మాత్రం చేయడం లేదు వర్షాలు పడితే ఆ నీళ్లు డ్రైన్ లో పోకుండా నీళ్లు మొత్తంగా నిలిచే అటువంటి అవకాశం ఉంది కాబట్టి దీని విషయంలో ఆఫీసర్లు కానీ జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ఎగుడుదిగుడుగా కట్టినటువంటి డ్రైన్ ను పైకి లేపించాలని లేనియెడల షాపులోలకి నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి గనుక దీన్ని అధికారులు చొరవ తీసుకొని చేపించాలని ఈ డ్రైన్ చేయకపోతే వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు నష్టపోతారని తెలియజేస్తున్నారు.
Ravikanti Venkatesham.
అలాగే డ్రైన్ పక్కన ఎలక్ట్రిక్ పోల్స్ ఇష్టానుసారంగా పెట్టడం జరిగినది పాత బస్టాండ్ దగ్గర నుండి ఎలక్ట్రిక్ పోల్స్ డ్రైన్ పక్కన పెట్టడం జరిగినది క్రమేనా కిందికి వస్తున్న కొద్దీ డ్రైన్ పక్కన కాకుండా డ్రైన్ కి ఎలక్ట్రిక్ ఫోలికి మధ్యల మూడు మీటర్ల దూరం వరకు వచ్చేలాగా పెట్టడం జరిగినది ఎలా పెట్టడం వలన ఆ యొక్క గల్లీలోకి వాహనాలు ఫోర్ వీలర్ వాహనాలు తిరగడం ఇబ్బందిగా మారినది కావున ఇది సంబంధిత అధికారులు గమనించి ఎలక్ట్రిక్ ఏఈ మున్సిపల్ కమిషనర్ గమనించి ఆ ఎలక్ట్రిక్ పోల్స్ ఇప్పుడు పెట్టిన స్థలం నుండి తీసి డ్రైన్ పక్కన పెట్టి బస్తి వాసులకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ఎలక్ట్రిక్ పోల్స్ రోడ్ మధ్యలోకి తీసుకురావడం వల్ల మునుముందు భవిష్యత్తులో ఫోర్ వీలర్స్ గాని ట్రాక్టర్స్ గాని బోర్వెల్ లారీస్ కానీ గల్లిలో తిరగడం కష్టంగా ఉంటది కాబట్టి సంబంధిత అధికారులు దీనిని గమనించి ఇప్పుడు పెట్టిన ఎలక్ట్రిక్ పోల్స్ స్థలం నుండి మళ్ళీ దానిని డ్రైన్ పక్కనికి మార్చాల్సిందిగా బస్తివాసులు అందరు కోరుతున్నాము. *ఎలక్ట్రిక్ పోల్స్ ను డ్రైన్ కి దూరంగా జరపడం వల్ల రామన్ కాలనీ ఫ్లైఓవర్ మీద నుండి ఏదైనా పెద్ద వెహికల్ స్పీడ్ గా వస్తే అదే సమయంలో గల్లీలో నుండి ఫోర్ వీలర్ వస్తే అక్కడ ప్రమాదం జరిగే అవకాశాలుంటాయి కాబట్టి ఇది గమనించి ఆ ఎలక్ట్రిక్ పోల్స్ ని డ్రైన్ కి దగ్గరగా వేయాలని వ్యాపారస్తులు బస్తీ వసూలు మందమర్రి ప్రజలు కోరుతున్నాము.
మెట్ పల్లి లో బీఆర్ఎస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం వెల్లుల్ల రోడ్డు ఫంక్షన్ హాల్ లో జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మార్క్ ఫండ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి ముఖ్య కార్తి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. మల్లాపూర్ మండల్ ముత్యంపేట ఆటో యూనియన్ వారు బీఆర్ఎస్ పార్టీ రజోత్సవం వరంగల్ లో జరిగే చలో వరంగల్ కార్యక్రమానికి పార్టీ నిధులు కింద 5000 రూపాయలు జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కి అందజేశారు. ఈ సమావేశంలో ముఖ్య కార్యకర్తలు వారి సలహాలు సూచనలు మాట్లాడిన అనంతరం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కార్యకర్తలు పార్టీ బలోపేత నికి కృషి చేయాలని కెసిఆర్ అడుగుజాడల్లో నడిచి పూర్వ వైభవం పార్టీకి తేవాలని నియోజకవర్గంలో మన పార్టీకి బెంచి పట్టు ఉందని దానికి ప్రతి కార్యకర్త వచ్చే సర్పంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని అన్నారు. జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ వరంగల్ లో జరిగే టిఆర్ఎస్ రజతోత్సవాలు పురస్కరించుకొని చలో వరంగల్ సభను ఘన జరుపుకుందామని దానికి ప్రతి బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు మన నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రజలను కలిసి మనం చేసిన అభివృద్ధి పనులు గురించి తెలిపి వరంగల్ సభకు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మారు సాయి రెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ , మాజీ జడ్పిటిసిలు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను ఈనెల 27న నిర్వహించడం జరుగుతుందని కార్యకర్తలందరూ వేడుకను జయప్రదం చేయాలని భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలలో. కార్యకర్తలతో కలసి బైక్ ర్యాలీని నిర్వహించగా ఆయా గ్రామాలన్నీ పండుగ వాతావరణాన్ని సంచరించుకునేలా గులాబీమయంగా. మారింది. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఘనంగా స్వాగతం పలికిన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు. రంగాపురం గ్రామం నుండి ఆకినపల్లి గ్రామం వరకు దాదాపు 15 కిలోమీటర్లు 200 బైకులతో మొగుళ్ళపల్లి మండల గ్రామాల్లో ర్యాలీ తీస్తూ పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ బి ఆర్ఎస్ పార్టీ పైన ప్రజలుకు ఎంతగానో ఆదరణ ఉందన్నారు
స్వరాష్ట్రాన్ని సాధించి దేశంలో నెంబర్ 1 గా నిలిపాం
-అభివృద్ధి అంటేనే తెలంగాణ రాష్ట్రం అనే స్థాయిలో ప్రగతి సాధించాం
-కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన జనాలు కేసీఆర్ పాలనను మరువ లేకపోతున్నారు.
-సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
తెలంగాణ ప్రజల కలను నెరవేర్చడంతో పాటు రాష్ట్ర అభివృద్ధిని కనులారా చూపించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కే దక్కిందని, స్వరాష్ట్రాన్ని సాధించి దేశంలోనే నెంబర్ 1 అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దింది బీఆర్ఎస్ పాలనని సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి అన్నారు.
గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు గర్వపడేలా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, ప్రజల మన్ననలను పొందిన ప్రభుత్వం బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. రైతు బంధు, రైతు భీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు, ఆసరా పెన్షన్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు కేసీఆర్ అండగా నిలిచారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేటికీ కేసీఆర్ పాలనను ప్రజలు మర్చిపోలేకపోతున్నారని, మరో మారు కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.
గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలకు నిరసనగా సి.పి.ఎం ఆధ్వర్యంలో ధర్నా
సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని న్యూ బస్టాండ్ సమీపాన తెలంగాణ తల్లి చౌక్ లో పెంచిన వంటగ్యాస్,పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే ఉపశమరించుకోవాలని సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ తో నిరసన తెలిపడం జరిగినది.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముషం రమేష్ సీపీఎం పార్టీ సిరిసిల్ల పట్టణ కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ లు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా వంట గ్యాస్ డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచడం దారుణమని విమర్శించారు దీనివల్ల ఉజ్వల పథకం లబ్ధిదారులు సాధారణ వినియోగదారుల తోపాటు మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై కూడా పెద్ద భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరను ఉపశమరించుకోవాలని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. నిత్యవసర సరుకుల ధరలపై నియంత్రణ చేస్తామని చెప్పిన బిజెపి ప్రభుత్వం అన్ని రకాల సరుకులు వస్తువుల ధరలను విపరీతంగా పెంచిందని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెంచారు. 2014 బిజెపి అధికారంలోకి రాకముందు గ్యాస్ సిలిండర్ 450 రూపాయలు ఉండేదని కానీ ఇప్పుడు బిజెపి వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలకి గ్యాస్ సిలిండర్ పెంచడం చాలా దారుణమైన విషయం,ప్రజలు పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఏగమంటి ఎల్లారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, గురిజాల శ్రీధర్, సిపిఎం నాయకులు నక్క దేవదాస్, సిరిమల్ల సత్యం బెజుగం సురేష్, గుండు రమేష్, గోవిందు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
పోత్కపల్లి హై స్కూల్ ను తనిఖీ చేసిన ఎం ఇ ఓ ఎర్ర రమేష్
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం పోత్కపల్లి లో గల zphs పాఠశాలలో మధ్యాహ్న భోజనం గురించి మధ్యాహ్నం బోజన పథకం లో విద్యార్థులకు భోజనం లేదని ఆవేదన అని నెటిధాత్రి లో ప్రచురితమైన వార్త కథనానికి స్పందించిన ఎం ఈ ఓ బుధవారం జెడ్, పి హెచ్,ఎస్ పాఠశాల ను సందర్శించి విద్యార్థులను అడిగి తెలుసుకుని ఉపాధ్యాయులతో మరియు యం డి యం వంట వారితో మాట్లాడడం జరిగింది విద్యార్థులకు సరిపడ బియ్యం ఉపాద్యాయులు ఇచ్చినప్పటికీ తమ వైపు తప్పిదం జరిగినదని వంట వారు ఒప్పుకున్నారని ఏం ఈ ఓ ఎర్ర రమేష్ తెలిపారు.మళ్ళీ ఎప్పుడు ఇలాంటి తప్పిదం జరగకుండా చూసుకుంటామని తెలియా జేశారు. ఈ సందర్భంగా ఏం ఈ ఓ మాట్లాడుతూ విద్యార్థులకు సరిపడ అన్నం అందజేయాలని అలాగే ఇలాంటి సంఘటనలు పునరవృతం కాకుండా చూసుకోవాలని, మళ్ళీ ఇలానే జరిగితే తగు చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులకు వంట వారికి సూచించడం జరిగింది.
తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( ఐ.జే.యు ) వరంగల్ జిల్లా కమిటిలో ఎన్నికైన నర్సంపేట డివిజన్ కు చెందిన జర్నలిస్టు ప్రతినిధులకు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ సన్మానించారు. బుధవారం వరంగల్ జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా మహాసభ జరిగింది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా నూతన కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించారు. నర్సంపేట డివిజన్ నుండి జిల్లా కోశాధికారి కోదాటి గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులు మహాదేవుని జగదీష్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కందుల శ్రీనివాస్ గౌడ్, శీలం రమేష్,కంచర్ల కుమార్, మహమ్మద్ చాంద్ పాషా, పల్లెల్ల సోమేశ్వర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గురువారం నర్సంపేట మార్కెట్ కమిటి చైర్మన్ పాలాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబులు నూతనంగా ఎన్నికైన టీయూడబ్ల్యూజే ఐజేయు నర్సంపేట డివిజన్ ప్రతినిధులను మార్కెట్ కమిటి కార్యాలయంలో శాలవాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ కొనసాగాలన్నారు.
తెలంగాణ ఉద్యమకారుడు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తొట్టి సత్యంగారి కుటుంబాన్ని పరామర్శించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కొత్తగూడ మండలం పొగల్లపల్లి గ్రామ బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు తొట్టి సత్యం ఈరోజు అనారోగ్యంతో మృతి చెందగా వారి భౌతిక ఖా యాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు తొట్టి సత్యం తెలంగాణ ఉద్యమాకారుడుగా రాష్ట్ర సాధనలో మరియు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు ఈరోజు వారి మృతి పార్టీకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని అన్నారు ఆయన వెంట లో మండల పార్టీ అధ్యక్షులు కొమ్మనబోయిన వేణు, మల్లయ్య మాజీ సర్పంచ్, భానోత్ వీరన్న, అజ్మీర రవి, మాజీ పడాల నాగేశ్వరరావు, ఎంపిటిసిలు బంగారు నారాయణ, ననుబోతుల స్వప్న లింగన్నయాదవ్,దానం నారాయణ, గుల్లపల్లి శీను , మండల్ నాయకులు కొనకంచి నాగమల్లేశ్వరరావు, నామోజు కనకాచారి, కావట్టి సతీష్ మల్లేష్ యాదవ్, కొలిపాక సదానందం, కత్తుల కుమారస్వామి, సంఘీ కుమారస్వామి ,భూక్య సంతోష్, నామోజు కనకాచారి గుంటుక యాకయ్య పల్లె శివ భైరబోయిన చిరంజీవి బోయిని భద్రయ్య ఆగబోయిన రాజయ్య మల్లేష్ యాదవ్ బండి లింగయ్య భైరబోయిన బుచ్చి రాములు బత్తుల ఉత్తరయ్య , పోతుగంటి రామాచారి, వేణు వంక కొమ్మలు, బోళ్ల యాకయ్యతో ,పాటు మండల నాయకులు పాల్గొన్నారు…
పొన్నారం గ్రామంలో పైలెట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ
మందమర్రి నేటి ధాత్రి
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని పొన్నారం గ్రామంలో, పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన ఇళ్ల నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే శ్రీ వివేక్ వెంకటస్వామి గారు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రజలకు వసతి హక్కు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మొదటి దశగా పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మాణం ప్రారంభమవుతుందని వారు తెలిపారు.
Sri Vivek Venkataswamy
నిరుపేద కుటుంబాలకు విశ్వసనీయంగా, నాణ్యమైన నివాస వసతులు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే, ఎంపీలు పేర్కొన్నారు.
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం రోజున ఎంపీడీవో జయ శ్రీ అధ్యక్షతన జాబ్ మేళపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 26న భూపాల పెళ్లిలో పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ లో నిర్వహించే జాబ్ మేళను మండలంలోని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని వారికి మండలంలో ఉన్న అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి నిరుద్యోగులను అధిక సంఖ్యలో 26న జరిగే జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేయాలని మండల గ్రామ అధికారులను కోరినారు ,ఈ కార్యక్రమంలో తాసిల్దార్ హేమ, ఎంపీ ఓ ,రామకృష్ణ, ఎస్సై, ఏపీఓ, పంచాయితీ కార్యదర్శులు ఐకెపి ఏపిఎం, సీసీలు ,వివోఏలు, అగ్రికల్చర్ అధికారులు అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు టెక్నికల్ అసిస్టెంట్లు పంచాయతీరాజ్ ఏఈ మండల గ్రామ అధికారులు పాల్గొన్నారు.
శ్మశాన వాటిక గురించి తప్పుడు నివేదిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దీనిని ప్రభుత్వ అధికారులు ఖండించారు.
జహీరాబాద్. నేటి ధాత్రి:
సోషల్ మీడియాలో కోహిర్ నుండి వచ్చిన యువకుడిని నిజం చేయడం చాలా ఖరీదైన పని. వివరాల ప్రకారం, దివంగత భండారీ అబ్దుల్ రషీద్ కుమారుడు ముహమ్మద్ సలీముద్దీన్ భండారీ నిన్న హీర్‌లోని అతిపెద్ద శ్మశానవాటిక అయిన హజ్రత్ మౌలానా ముయిజుద్దీన్ తుర్కీ శ్మశానవాటికలో వక్ఫ్ సవరణ బిల్లు యొక్క మొదటి ప్రభావాన్ని కోహిర్లో చూడవచ్చని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేయడం ద్వారా వైరల్‌గా మారింది. కానీ అది అబద్ధాల ఆధారంగా జరిగింది. వివరాల ప్రకారం, కోహిర్ స్మశానవాటికలో ఒక కుటుంబం తమ పాత సమాధుల దగ్గర ఉన్న ముళ్ల పొదలను శుభ్రం చేయడానికి జెసిబిని ఉపయోగిస్తుండగా, వారు అకస్మాత్తుగా అక్కడికి వెళ్లి తమ మొబైల్ ఫోన్‌తో ఒక వీడియో తీశారు, అందులో వారు సెంట్రల్ బ్యాంక్ మరియు బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు అని చెప్పారు. దానికి ఒక ప్రభావం ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.