వక్ఫ్ బిల్లును రద్దు చేయాలి.

వక్ఫ్ బిల్లును రద్దు చేయాలి
-ఈనెల 13న హైదరాబాదులో ధర్నా విజయవంతం చేయాలి
-మర్కజీ ఇంతేజామీ మిల్లాతే ఇస్లామియా కమిటీ మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా
మెట్ పల్లి ఏప్రిల్ 10 నేటి ధాత్రి

 

మెట్ పల్లి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని మెట్ పల్లి మర్కజీ ఇంతేజామీ మిల్లాతే ఇస్లామియా కమిటీ మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా డిమాండ్ చేశారు. గురువారం ఆయన మెట్ పల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వక్ఫ్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 13న కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం దగ్గర మధ్యాహ్నం రెండు గంటలకు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీ సోదరులు, అనుబంధ సంఘ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవుడికి అంకితం చేస్తూ ముస్లిం దాతలు ఇచ్చిన భూములు వక్ఫ్‌బోర్డు పరిధిలో అనాదిగా ఉన్నాయన్నారు. ఈ ఆస్తులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలపై ద్వేషంతో బడాబాబులకు అంటగట్టడానికి చట్టంలో మార్పులు తీసుకొని వచ్చిందన్నారు. పేదలకు చెందాల్సిన భూములను లాక్కోవడం ద్వారా ముస్లింలను ఆర్థికంగా బలహీనులను చేసి రాజకీయంగా, సామాజికంగా ఎదగకుండా చేయాలన్నది బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీల ఆస్తులకు రక్షణగా ప్రత్యేక వక్ఫ్‌ చట్టాన్ని రాజ్యాంగం అమలు చేసిందని, మోదీ ప్రభుత్వం ముస్లింలను అణగదొకేందుకు ఈ చట్టాలను సవరణలు చేయాలని చూస్తున్నదని, దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా అధిక సంఖ్యలో ధర్నా కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మైనారిటీ నాయకులు సల్మాన్ ఖాన్ షేక్ షాహిద్ హుస్సేన్ సయ్యద్ సిరాజుద్దీన్ మహమ్మద్ రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version