నయాబ్ తహశీల్దార్గా కరుణాకర్ రావు…

నయాబ్ తహశీల్దార్గా కరుణాకర్ రావు…

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఝరాసంగం నూతన నయాబ్ తహశీల్దార్ గా జి.కరుణాకర్ రావు గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఝరాసం గంలో ఇప్పటివరకు విధులు నిర్వహించిన నయాబ్ తహశీల్దార్ యాసిన్ ఖాన్ నిజాంపేట్ మండలానికి బదిలీపై వెళ్లడంతో గుమ్మడిదల తహశీల్దార్ కార్యాల యంలో నయాబ్ తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న జి.కరుణాకర్ రావు నూతన నయా తహశీల్దారుగా నియమితులయ్యారు. బుధవారం మండల కేం ద్రంలోని సంగమేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తహశీల్దార్ తిరుమలరావు,ఆర్.ఐ రామారావు కార్యాలయ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజ లకు మెరుగైన సేవలు అందేలా తన వంతు సహకారం అందిస్తానని నయాబ్ తహశీల్దార్ పేర్కొన్నారు.

వివాహా వేడుకల్లో పాల్గొన్న TSSCDS మాజీ చెర్మెన్.

వివాహా వేడుకల్లో పాల్గొన్న టీఎస్ఎస్సీసీడీసీ మాజీ చెర్మెన్ వై.నరోత్తం

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని పి.వి.ఆర్. గార్డెన్ ఫంక్షన్ హాల్ లో బుధవారం జరిగిన చిన్న హైదరాబాద్ గ్రామం పి. లక్ష్మణ్ కుమారుని వివాహా వేడుకల్లో, హోతి. కె. గదక్ తాండలో జరిగిన కిషన్ చౌహాన్ కుమార్తె వివాహా వేడుకల్లో టీఎస్ఎస్సీసీడీసీ మాజీ చెర్మెన్ వై. నరోత్తం పాల్గొని నూతన వదువరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ వివాహా వేడుకల్లో మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మెగా జాబ్ మేళా పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ లో.

యువతి యువకులకు 26 మెగా జాబ్ మేళా పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ లో

గణపురం ఎంపీడీవో ఎల్ భాస్కర్

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో రైతు వేదికలో
భూపాలపల్లి నియోజక వర్గం లోని యువతీ యువకులకు ఉన్నత స్థాయి అర్హతకు తగ్గట్టుగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వ,ప్రవేట్, కార్పొరేట్ వివిధ శిక్షణ సంస్థల భాగస్వామ్యం తో దీవి.26/4/2025 రోజున ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు
భూపాలపల్లి లోని పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ నందు మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందిఈ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు తగ్గట్టుగా వివిధ కంపెనీలతో ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ మాట్లాడి 6వ తరగతి నుండి పీజీ వరకు, టెక్నికల్ విద్య ఇతర రంగాలలో శిక్షణ పొందిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే వివిధ సెక్టార్, ఐటీ సెక్టర్, నెట్వర్క్ ఇంజనీరింగ్ సెక్టార్, బ్యాంకింగ్ సెక్టార్ ,ఫార్మసీ, మెకానికల్ ఇంజనీర్, క్వాలిటీ ఇంజనీర్, క్వాలిటీ మెకానికల్ ఇంజనీర్, ఫైనాన్సు రంగంలో, ఆడిట్ రంగంలో, సేల్స్ ఎగ్జిక్యూటివ్ రంగంలో, టెలికాలర్ రంగంలో, సెక్యూరిటీ రంగంలో, డెలివరీ బాయ్స్ తదితర సంస్థలు ఈ కార్యక్రమంలో హాజరవుతున్నందున యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది.

జాబ్ మేళా విజయవంతం చేయుటకు గాను ఈరోజు గణపురం మండల కేంద్రంలోని రైతు వేదిక లో(10/4/2025) రోజున సన్నహాక సమావేశం వివిధ ప్రభుత్వ శాఖల గ్రామస్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులతో ఏర్పాటు చేయడం జరిగింది.

MPDO L Bhaskar

 

ఇట్టి సమావేశమున కు ఆర్డీవో ఎన్ రవి మాట్లాడుతూ, గ్రామాల్లో నిరుద్యోగ యువత సరియైన ఉద్యోగ అవకాశాలు లేక చాలా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి మంచి అవకాశం కల్పించినట్లు అయితే సమాజంలో ఉన్నతమైన స్థాయికి ఎదగ గలరని, గ్రామస్థాయిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మీ గ్రామాల్లోని యువతకు ఇట్టి సమాచారం చేరవేసి మెగా జాబ్ మేళాలో పాల్గొనేటట్లు చేయాలని కోరినారు.
మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎల్ భాస్కర్ మాట్లాడుతూ 100 కి పైగా కంపెనీలు మన ప్రాంతానికి రావడం యువతీ యువకుల అదృష్టమని, ప్రతి గ్రామం లోని యువతకు తెలియజేసి అత్యధిక సంఖ్యలో మండలం నుండి జాబ్ మేళాలో పాల్గొనేటట్లు చేయాలని కోరినారు, ఈ కార్యక్రమం లో మండల తహసిల్దార్ ఏం సత్యనారాయణ , వ్యవసాయ అధికారి ఐలయ్య , మండల విద్యాశాఖ అధికారి ఉప్పలయ్య గ్రామస్థాయి ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడీ సూపర్వైజర్లు ఆశా వర్కర్లు, గ్రామీణ ఉపాధి హామీ ఉద్యోగులు ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

టీజీ గురుకుల సెట్ లో మెరిసిన దోరవారివేంపల్లి పాఠశాల

టీజీ గురుకుల సెట్ లో మెరిసిన దోరవారివేంపల్లి పాఠశాల ఆణిముత్యాలు..

కొత్తగూడ, నేటిధాత్రి:

 

 

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని దోరువారివేంపల్లి ప్రభుత్వం పాఠశాల విద్యార్థులు 100%శాతం ఫలితాలు , సత్తా చాటిన పాఠశాల విద్యార్థులు
ఫిబ్రవరి 23 వ తారీఖున జరిగిన టీజీ గురుకుల సెట్ లో హనుమకొండ జిల్లా నడికుడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాల నుంచి 10 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయగా అందులో నుండి పోయిన వారం వెల్లడించిన ప్రవేశ ఫలితాల వెల్లడిలో 10/10 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు దొరవారివేంపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సువర్ణ పాక క్రిష్ణ తెలిపారు… ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మా యొక్క పాఠశాలలో ప్రాథమిక తరగతి వరకే ఉండడం వలన విద్యార్థులు ఈ గ్రామం మంచి పాఠశాలలో విద్యార్థులు చదువుకోవాలని పాఠశాల విద్యార్థులకు గురుకుల ప్రవేశ పరీక్ష కోసం స్పెషల్ క్లాస్ నిర్వహించము అందుకే విద్యార్థులకు ఈ రోజున పదికి పది మంది విద్యార్థులు వివిధ గురుకుల పాఠశాలలో సీట్ రావడం జరిగిందని చెప్పారు ఈసందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.. విద్యార్థులు తల్లిదండ్రులు సందర్భంగా చాలా సంతోషం పడ్డారు ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అండెం కృష్ణ గారు అంగన్వాడీ టీచర్ భారతి గారు పాల్గొన్నారు…

చలివేంద్రం ప్రారంభించిన ఎస్సై శివకృష్ణ.

చలివేంద్రం ప్రారంభించిన ఎస్సై శివకృష్ణ

పరకాల నేటిధాత్రి

పరకాల మండలం అలియాబాద్ గ్రామంలో గురువారం రోజు మాజీ పోలీస్ అధికారి శాతరాశి సుధాకర్ రావు జ్ఞాపకార్థం వారి కుమారుడు బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు శాతరాశి సనత్ కుమార్ పటేల్ ఆధ్వర్యంలో ప్రజల సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఈ చలివేంద్రాన్ని పరకాల సబ్ ఇన్స్పెక్టర్ శివకృష్ణ ప్రారంభించారు.ఈ సందర్భంగా సనత్ కుమార్ మాట్లాడుతూ బాటసారుల సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అలియాబాద్ తాజా మాజీ సర్పంచ్ శాతరాశి రమాదేవి సుధాకర్ రావు,మాజీ ఉప సర్పంచ్ డ్యాగ శ్రీనివాసరావు,యూత్ నాయకులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

జైపూర్ పిఎస్ కి రెండవ ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టిన.

జైపూర్ పిఎస్ కి రెండవ ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టిన రామలక్ష్మి

జైపూర్,నేటి ధాత్రి:

 

ప్రభుత్వం చేపట్టిన సబ్ ఇన్స్పెక్టర్ బదిలీల ప్రక్రియలో జైపూర్ పోలీస్‌ స్టేషన్‌ కి నూతన రెండవ ఎస్సైగా రామలక్ష్మి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ముందు నుండి పోస్ట్ ఖాళీగా ఉండడంతో రెండవ ఎస్సై గా ఎస్సై నాగరాజును స్థానిక పిఎస్ కు ఉన్నతాధికారులు నియమించారు.దీనితో ఈ పోస్ట్ కు గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఏ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న రామలక్ష్మి పదోన్నతి పై జైపూర్ పిఎస్ కి బదిలీ అయ్యారు.బాధ్యతలు చేపట్టిన రెండవ ఎస్సై రామలక్ష్మి కి ఏసీపి వెంకటేశ్వర్లు అభినందనలు తెలిపారు.పదోన్నతులతో బాధ్యతలు మరింత పెరుగుతాయని సూచించి,విధి నిర్వహణలో రాజీ పడకుండా పని చేయాలన్నారు.ఫిర్యాది దారుల సమస్యలను మర్యాదపూర్వకం గా తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.అదే క్రమంలో నూతన రెండవ ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన రామలక్ష్మి కి పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై రామలక్ష్మి మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు.మండల పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.జూదం,అక్రమ మద్యం,మాదకద్రవ్యాలు తదితర వాటిపై పోలీస్ వారి ప్రత్యేక నిఘా ఉంటుందని పేర్కొన్నారు.

బహుజన సమాజ్ పార్టీలో చేరికలు.

బహుజన సమాజ్ పార్టీలో చేరికలు

బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీలో చేరికలు
ఈ కార్యక్రమానికి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా జిల్లాఇన్చార్జి వేల్పుగొండ మహేందర్ హాజరయ్యారు చేరికలను ఉద్దేశించి పొన్నం బిక్షపతి గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఏకం అయ్యి బహుజన రాజ్యాధికారానికి అడుగులు వేయాలని అగ్రవర్ణాల పార్టీలు చేస్తున్న రాజకీయ కుట్రలను తిప్పి కొట్టాలని సమాజంలో గౌరవం సమానత్వం పొందాలంటే రాజ్యాధికారమే మార్గమని అన్నారు అదే విధంగా భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా మురారి సదానందం భూపాలపల్లి నియోజకవర్గ కోశాధికారిగా జీడి సునీల్ గణపురం మండల అధ్యక్షునిగా ఈర్ల చిన్న మండల ప్రధాన కార్యదర్శిగా జీడి రాజేందర్ ని ఎన్నుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ తదితరులు పాల్గొన్నారు

విద్యుత్ శాఖ ఇంచార్జ్ ఏఈ సంజయ్ మొగుళ్ళపల్లి.

నేటి విద్యుత్ వినియోగదారుల లోకల్ కోర్టును సద్వినియోగం చేసుకోండి

విద్యుత్ శాఖ ఇంచార్జ్ ఏఈ సంజయ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

నేడు విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని చిట్యాల, మొగుళ్ళపల్లి, టేకుమట్ల మండలాల విద్యుత్ వినియోగదారుల లోకల్ కోర్టును గురువారం చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో టీజీ ఎన్పీడీసీఎల్ సిజిఆర్ఎఫ్ -1 చైర్ పర్సన్ వేణుగోపాల చారి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఇంచార్జ్ ఏఈ సంజయ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ, విద్యుత్ నియంత్రికల మార్పు, లోపాలు ఉన్న మీటర్లు మార్చడం, నూతన సర్వీసుల మంజూరు తదితర సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కోర్టును నిర్వహిస్తామన్నారు. కావున మండలంలోని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

BRS పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష భక్తులకు భిక్ష.

బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష భక్తులకు భిక్ష

ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్

సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవనంలో ఈరోజు

సిరిసిల్ల నేటి ధాత్రి:

 

బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష భక్తులకు భిక్ష కార్యక్రమం చేపట్టడం జరిగినది.
ముఖ్య అతిథిగా బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది.

BRS & KTR

అనంతరం మాట్లాడుతూ శ్రీ ఆంజనేయ స్వామి కృప, కటాక్షం సుఖ:సంతోషాలతో ఎల్లవేళలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కే.టీ.ఆర్ కోరాతు, స్వామి వారి చిత్రపటాన్ని స్వీకరిస్తూ, అనంతరం హనుమాన్ దీక్ష స్వాములతో బిక్ష కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు హనుమాన్ దీక్ష పరులు పాల్గొన్నారు.

రాజీవ్ యువ వికాస్ పథకానికి ఈనెల 14 చివరి గడువు.

రాజీవ్ యువ వికాస్ పథకానికి ఈనెల 14 చివరి గడువు

ముగుస్తున్న గడువు,పెరుగుతున్న దరఖాస్తుల సంఖ్య

జైపూర్,నేటి ధాత్రి:

 

రాజీవ్ యువ వికాస్ పథకం దరఖాస్తుల చివరి తేదీ ఈ నెల 14 వరకు ముగుస్తుందని మండల పరిషత్ అధికారులు ప్రకటించారు.దరఖాస్తు సమయం ముగుస్తున్న కొలది, దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నట్లు బుధవారం ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించుటకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది.ఈ పథకం ద్వారా ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన యువతకు రాయితీ రుణాలు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించే ప్రత్యేక చర్యలు చేపట్టింది.ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా దరఖాస్తు గడువు దగ్గర పడుతున్నట్లుగా గమనించి, లబ్ధిదారులు ఇప్పటివరకు దరఖాస్తు చేయకపోతే త్వరగా దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ ఈ సందర్భంగా  తెలిపారు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి.

పలు కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

చిట్యాల మండలం లోని నైన్ పాక గ్రామంలో నల్లబెల్లి మల్లమ్మ చనిపోగా వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపినారు.. జూకల్ గ్రామంలోని అన్నం కొమురయ్య చనిపోగా వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు అనంతరం తాడిశెట్టి లక్ష్మి మరణించగా వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ఆమె ఇవ్వడం జరిగినది..నవాబుపేట గ్రామ కరోబార్ జిల్లాల కుమార్ ప్రమాదవశత్తు బైక్ నుండి పడి చనిపోగా చిట్యాల ప్రభుత్వ హాస్పటల్ కి వెళ్లి వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగినది.ఈ కార్యక్రమంలో నైన్ పాక గ్రామ శాఖ అధ్యక్షుడు తొట్ల రాజయ్య , కంకనాల శంకర్ , పాలడుగుల రఘుపతి , బిక్కనూరి విజయ్ జూకల్ గ్రామ శాఖ అధ్యక్షుడు సూర నరేందర్ , మండల ఉపాధ్యక్షుడు దొంతి రాంరెడ్డి , రేగురి స్వామి రెడ్డి , మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్ , నాగరాజు , అందుగుల రాజు , మధుకర్ , రాము , మధు , సదనందం , చింతల సుమన్ , మేకల రాజయ్య తదితరులు పాల్గొన్నారు…

కాషాయ సైనికులే పార్టీకి కీలకం..కార్యకర్తలే వెన్నెముక

కాషాయ సైనికులే పార్టీకి కీలకం..కార్యకర్తలే వెన్నెముక

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చదువు రాంచంద్రాడ్డిరె
-బిజెపి భూపాలపల్లి నియోజకవర్గం కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

భారతీయ జనతా పార్టీ విజయాల్లో పార్టీకి కాషాయ సైనికులే కీలకం..కార్యకర్తలే వెన్నెముక అని, వారి శక్తి, ఉత్సాహం ప్రేరణాదాయకమని, కొన్ని సంవత్సరాలుగా పార్టీ బలోపేతం కోసం తమ జీవితాలను అంకితం చేసిన వారి సేవలు మరువలేనివని భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని అమ్మ గార్డెన్ లో భాజపా 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బిజెపి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి మండల అధ్యక్షుడు మోరే వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి చదువు రామచంద్ర రెడ్డి&మోరే రవీందర్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలోని ప్రజలంతా బిజెపి సుపరిపాలనను చూస్తున్నారని, ఇటీవల పార్టీ సాధించిన అనేక చారిత్రాత్మక విజయాల్లో ఇది ప్రతిబింబిస్తోందన్నారు. బిజెపి 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ పురోగతికి “వికసిత్ భారత్” స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమాజ సర్వతోముఖాభివృద్ధి దిశగా ఎన్డీఏ ప్రభుత్వం సేవ చేస్తుందన్నారు. 1980లో స్థాపించిన భారతీయ జనతా పార్టీ 1984లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రెండు లోక్ సభ స్థానాలను మాత్రమే గెలుచుకొని ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్ పేయ్, ఎల్ కె అద్వానీ నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదిగి..1990లో మిత్రపక్షాలతో కలిసి బిజెపి అధికారాన్ని చేజిక్కించుకుందన్నారు. అనంతరం 2014 నుంచి ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి కేంద్రంలో కొలువు తీరిందన్నారు. దేశ ప్రజల రక్షణే లక్ష్యంగా..ప్రజల అభివృద్దే ధ్యేయంగా..వారికి సుపరిపాలనను అందిస్తున్న..నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా..తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండాను ఎగురవేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కంకణ బద్ధుడై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుభి మోగించేలా కష్టపడాలన్నారు. 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ..ప్రజా సమస్యలపై పోరాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఉద్యమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి దళిత మోర్చా రాష్ట్ర నాయకులు కుమ్మరి సారయ్య జమలాపురం సాంబశివరావు దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు పుల్యాల రాజు పార్లమెంట్ ఫుల్ టైమర్ మంద రాజేష్ మండల ప్రధాన కార్యదర్శి బండారి శ్రీనివాస్ అరికాంతపు కృష్ణారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ పెళ్లి మల్లారెడ్డి మండల ఉపాధ్యక్షులు బలుగూరి కిషన్ రావు రాస బిక్షపతి జిల్లా నాయకులు అనుముల శ్రీనివాస్ పులి వెంకట్ రెడ్డి మునిగంటి మల్లారెడ్డి వైనాల ప్రియాంక శివకుమార్ Stomach రాజేశ్వరరావు బల్గూరి తిరుపతిరావు వంగ రవి పొన్నాల మల్లారెడ్డి జమలాపురం రాజు యారా జయపాల్ రెడ్డి పెళ్లి మల్లారెడ్డి మండల నాయకులు రేపాల శ్రీనివాస్ బండారి తిరుపతి చిలకమర్రి రాజేంద్రప్రసాద్ బోయిని తిరుపతి కక్కర్ల వీరన్న పొడిసెట్టి రవి దేశిని భూమయ్య తదితరులు పాల్గొన్నారు

వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండండి.

*వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండండి…

*సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోండి..

*ఆరోగ్య సూత్రాలను పాటించండి..

*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..

చిత్తూరు(నేటి ధాత్రి) ఏప్రిల్ 10:

 

ఎండలు మండుతున్న దరిమిలా. వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండి.ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ
తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు ప్రజలకు సూచించారు.
పెరికే ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం చిత్తూరులోని సి.యస్.ఐ.
చర్చిలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపును చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మెడికల్ క్యాంపు నిర్వహించిన పెరికే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పెరికే వరప్రసాద్ ను ఈ సందర్భంగా ఎంపి దగ్గుమళ్ళ ప్రసాదరావు అభినందించారు. ఉచితంగా పరీక్షల నిర్వహించుకున్న రోగులకు ఆయన మందులను పంపిణీ చేశారు. మారుతున్న కాలానుగుణంగా ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షల నిర్వహించుకొని, తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అశోక్, సి.యస్.ఐ.చర్చ్ మత పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు..

BJP ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో.

BJP ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో.

నేటి ధాత్రి కథలాపూర్

 

 

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మండల అధ్యక్షులు మల్యాల మారుతి ఆధ్వర్యంలో కథలాపూర్ BJP పార్టీ కార్యాలయంలో పార్టీ క్రియాశీల సభ్యుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఇంచార్జ్ గా రాజన్న సిరిసిల్ల జిల్లా OBC మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్ రావడం జరిగింది వారు మాట్లాడుతూ BJP పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు క్రియాశీల సభ్యులు ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన విషయాల్నింటిని క్లుప్తంగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు రాచమడుగు వెంకటేశ్వర్రావు,జిల్లా కౌన్సిల్ సభ్యులు కథలాపూర్ మహేష్, పిడుగు ఆనంద్ రెడ్డి,నరెడ్ల రవి,దయ్యా లక్ష్మి నర్సయ్య,జిల్లా సత్యం, అల్లకొండ నవీన్,పాలేపు, రాజేష్,నరేష్,గంగామల్లయ్య, శ్రీధర్,శివ,వినయ్, నరేందర్,మహేష్,సంతారం, సాయిరెడ్డి,వినయ్,రాజేష్,రాజరెడ్డి శ్రీకాంత్ పాల్గొన్నారు.

బైకు ప్రమాదంలో గ్రామపంచాయతీ కారోబార్ మృతి.

బైకు ప్రమాదంలో గ్రామపంచాయతీ కారోబార్ మృతి.

చిట్యాల, నేటిధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని నవాబుపేట గ్రామానికి చెందిన జిల్లేల కుమార్(42) తన పనులు ముగించుకొని ఇంటికి వెళుతున్న క్రమంలో మంగళవారం రాత్రి చిట్యాల మండల కేంద్రంలోని ఎఫ్ సి ఐ గోదాం సమీపంలో బైక్ అదుపుతప్పి అక్కడికక్కడే మృతి చెందాడు బుధవారం ఉదయం స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు, అనంతరం పోలీసులు పోస్టుమార్టం కోసం చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు, ప్రమాదం ఎలా జరిగింది అనే పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది, కుమారు మృదుస్వభావి అందరితో కలుపుకుపోయే మంచి వ్యక్తి అని అకారణంగా దూరమైనందుకు గ్రామ ప్రజలే కాకుండా మిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు, కుమారు ఉన్నత విద్యావంతుడు పీజీ వరకు చదివి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సర్వ శిక్ష అభియాన్ లో అకౌంటెంట్గా పనిచేసినాడు, తర్వాత కైలాపూర్ గ్రామ కారోబార్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుండేవాడు.అతనికి భార్య ఇద్దరు కుమారులున్నారు.చిట్యాల నుండి నవాబుపేటకి తన ఇంటికి వెళ్తుండగా చిట్యాల చెరువు సమీపంలో తాడి చెట్టుకు డీ కొనడంతో రాత్రి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సాంప్రదాయాలకు ప్రతీక పండుగలు.

సాంప్రదాయాలకు ప్రతీక పండుగలు

గంగాధర మండలం ఇస్లాంపూర్ లో రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట, ఉప్పరమల్యాలలో పోచమ్మ బోనాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

గంగాధర నేటిధాత్రి:

 

 

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా పండుగలు నిలుస్తాయని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు.
గంగాధర మండలం ఇస్లాంపూర్ లో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఎమ్మెల్యేను సన్మానించారు.అనంతరం ఉప్పరమల్యాల లో నిర్వహించిన పోచమ్మ బోనాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.నెత్తిన బోనమెత్తి గ్రామస్తులతో కలిసి పోచమ్మ ఆలయానికి తరలి వెళ్లారు.
పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్,ముద్దం జమున నగేష్ ,వంగ శ్రీధర్ గౌడ్, దోమకొండ మహేష్,కర్ర బాపు రెడ్డి, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, వేముల అంజి,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దీకొండ మధు, పెంచాల చందు, ముచ్చె శంకర్, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నిక ఏదైనా ఎగిరేది బిఆర్ఎస్ జెండా.

ఎన్నిక ఏదైనా ఎగిరేది బిఆర్ఎస్ జెండా…

రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ బిఆర్ఎస్…

రాష్ట్రం కోసం పదవులను త్యాగం చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులది…

నీళ్ళివ్వకుండ చెక్ డ్యామ్ కులగొట్టిన ఘనత మన ప్రస్తుత ఎమ్మెల్యే ది..

ఏప్రిల్ 27న జరగబోయే మన సభా రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులను తీసుకు రానుంది…

:-మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

ఈ నెల 27న జరగనున్న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను జయప్రదం చేసే దిశగా ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో భాగంగా నేడు మొగుళ్ళపల్లి మండలంలోని ఆకినపల్లి, ఇప్పలపల్లి, పోతుగల్,కొరికిశాల ముఖ్య కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

ఈ సందర్భంగా ఆకినపల్లి మాజీ సర్పంచ్ దూడపాక భద్రయ్య,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దూడపాక సమ్మయ్య మరియు యువత అబద్దాల కాంగ్రెస్ పార్టీని వీడి మాజీ ఎమ్మెల్యే రమణన్న సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.

మాజీ ఎమ్మెల్యే రమణన్న మాట్లాడుతూ…

2001 ఏప్రిల్ 27 వ తారీఖు నాడు కెసిఆర్ గారు ఆ రోజు తన పదవికి రాజీనామా చేసి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను చూసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉంటే లాభం లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతున్నటువంటి ఒక లక్ష్యం తోటి కేసిఆర్ ఆరోజు పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టి 24 సంవత్సరాలు పూర్తయి 25వ సంవత్సరాల్లో అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ రజతోత్సవ సభను నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేసి, అది కూడా మనం నా భూతో నా భవిష్యత్ అనేలా పెద్ద సభను నిర్వహిస్తున్నాం. భవిష్యత్ లో ఇంత పెద్ద మొత్తంలో ఎవరూ నిర్వహించలేరు. మరి ప్రజలు కూడా ఆవిర్బవా సభకు రావడానికి ఉత్సాహంగా ఉన్నారు.

BRS party

 

 

ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకతను చవిచూసినటువంటి ప్రభుత్వాలు ఉండవు,దానికి కారణమేంటంటే అమలు కానీ హామీలు ఇచ్చి, హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం.

ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పని చేస్తున్నటువంటి తీరు ప్రజలలో అసహనానికి గురిచేస్తుంది.కేసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏ స్కీమ్స్ అయితే అమలు అయినవో వాటినే అమలు చేస్తున్నారు.

ఈరోజు ఎట్లా ఉన్నది పరిపాలన అంటే మరి అనుభవం లేని పరిపాలన, అసమర్ధ పరిపాలన, చేతగాని వ్యవహారం ఇవన్నీ చేసుకుంటు ఈరోజు ప్రజల దగ్గరికి వస్తే అర్థం చేసుకున్నారు.

ప్రజలు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రకంగా మా యొక్క జీవితాలు అద్భుతంగా ఉన్నాయి. ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగింది అని నేడు పునరాలోచించుకుంటున్నారు. ఎప్పుడైనా సామెత ఉంటాది పాలు ఇచ్చే గేదెను కాదని దున్నపోతును తెచ్చుకున్నట్టు ఉంది అన్న చందనంగా ప్రజలు చర్చించుకుంటున్నారు.

రేపు ఎన్నిక ఏదైనా ఎగిరేది బిఆర్ఎస్ జెండానే, గెలిచేది బిఆర్ఎస్ అభ్యర్దులే…

ఈ ఏప్రిల్ 27న జరగబోయే మన సభా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయి.

కాబట్టి మిత్రులారా కథం కథం తొక్కి బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు.

రజతోత్సవ సభను పల్లె పల్లె కదలాలి.

రజతోత్సవ సభను పల్లె పల్లె కదలాలి

బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూధన్ రెడ్డి

పరకాల నేటిధాత్రి

 

మంగళవారం రోజున బిఆర్ఎస్ పరకాల మండల పార్టీ అధ్యక్షులు చింతిరెడ్డి మధుసుధన్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలనీ ఈ మహోత్తర కార్యక్రమానికి పల్లెలు పట్టణాల ప్రజలు కదిలిరావాలని ఈ సభతో రాష్ట్రంలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందనే సత్త చూపించాలని కోరారు.

కాంగ్రెస్ పరిపాలన ప్రజాపాలననే..!

కాంగ్రెస్ పరిపాలన ప్రజాపాలననే..! ప్రతీకార పరిపాలన కాదు…!

చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

Congress rule is people’s rule..!

కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజాపాలనే తప్ప ప్రతీకార పరిపాలన కాదని,ఎన్నికలవేళ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం రాజ్యాంగంలోని భాగమేనని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డ్ అమరవాది గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో కార్యకర్తలు, నాయకులు, కార్యక్రమ సమన్వయకర్త అంజన్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే వివేక్ భారీ ర్యాలీ నిర్వహించారు. భారత రాజ్యాంగ పీఠిక చిత్రపటాలకు ఎమ్మెల్యే పూలమాలవేసి రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు.

Congress rule is people’s rule..!

 

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వివేక్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బాపు అడుగుజాడల్లో నడుస్తూ రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని, ఆవశ్యకతను తెలుసుకోవాలని అన్నారు. రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. బిఆర్ఎస్ హయాంలో దాచుకోవడం, దోచుకోవడమే తప్ప అభివృద్ధి ఎక్కడ చేయలేదని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయించారని దుయ్యబట్టారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని తెలిపారు.

 

బిజెపి పాలకులు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, హక్కులను కాలరాస్తు, మహాత్మా గాంధీ చూపిన అహింస, శాంతి సిద్ధాంతాలను విస్మరిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పలువురు కాలనీవాసులు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, త్వరితగతిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ జంగం కళ, పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టీపిసిసి ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, యాకుబ్ ఆలీ, శ్రీనివాస్, పలిగిరి కనకరాజు, కుర్మ సురేందర్, బత్తుల వేణు, సంఘ రవి, మహిళా నాయకురాలు పుష్పా, శారద, రాజేశ్వరి, సునిత ,కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

విద్యారంగంలో మనువాద భావాజాలానికి వ్యతిరేకంగా.!

విద్యారంగంలో మనువాద భావాజాలానికి వ్యతిరేకంగా పోరాడుదాం…PDSU

పి డి ఎస్ యు ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ

చెన్నూర్:: నేటి ధాత్రి

 

 

చెన్నూర్ కేంద్రంలో కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు ఆధ్వర్యంలో ఉస్మానియా క్రాంతి ధార కామ్రేడ్ జార్జ్ రెడ్డి 53 వ వర్ధంతి సభలను విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా PDSU జిల్లా ఉపాధ్యక్షుడు పి.సికిందర్ మాట్లాడుతూ…ఉస్మానియా యూనివర్సిటీలోమతోన్మాదానికి ,మహిళలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా పిడికిలి బిగించి పోరాడిన విప్లవ, విద్యార్థి నాయకులు కామ్రేడ్ జార్జి రెడ్డి క్యాంపస్ లో జరుగుతున్న అన్యాయాలను లంపెన్ గుండాల దాడులను ఎదిరించాడు అన్నారు.
సమసమాజ స్థాపనకు ఉద్యమిస్తున్న జార్జి రెడ్డి ఎదుగుదలని జీర్ణించుకోలేని మతోన్మాద గుండాలు హత్య చేశారన్నారు.ఆయన ఆశయాల సాధనకై పోరాడాలని,అమరత్వాన్ని స్మరించుకుంటూ,జరుగు వర్ధంతి సభలను జయప్రదం చేయాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాహుల్, రవికిరణ్, స్నేహ, రవళి, లక్ష్మి, పూజ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version